సాక్షి, హైదరాబాద్: IPS అధికారి నవీన్ కుమార్‌ను సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు (CCS) అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి పోలీసులు IPS అధికారి నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కేసు వివరాలు ఏంటంటే.?
IAS అధికారిగా సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ భవంతి ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో అద్దె ఒప్పందం చేసుకున్నారు. దీని కాల పరిధి అయిదు సంవత్సరాలు. ఈ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం భన్వర్‌లాల్ జూబ్లిహిల్స్‌లోని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్ల కోసం అద్దెకు ఇచ్చారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్ లాల్ ఆరోపణ.
భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు ఏం ఆరోపిస్తున్నారు?
2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్‌కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. ఈ డాక్యుమెంట్లు తమ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ తరహాలో రూపొందించిన నకిలీ పత్రాలని భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి IPS అధికారి నవీన్‌కుమార్ సహకరించారన్నది భన్వర్ లాల్ ఆరోపణ.
పోలీసులు ఏం చేశారు?
భన్వర్‌లాల్ ఆరోపణలతో రంగంలోకి దిగిన CCS పోలీసులు.. డాక్యుమెంట్లను విచారించి అవి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన IPS అధికారి నవీన్‌కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను రూపొందించి భన్వర్‌లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. IPS అధికారి నవీన్‌కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీలో గత ఆరేళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్.. గతంలో వికారాబాద్‌లో SPగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో DCPగా విధులు నిర్వహించారు. ఆయన ఆచూకీని తెలుసుకున్న పోలీసులు ఇవ్వాళ అదుపులోకి తీసుకున్నారు.
గత నెల 17 న భన్వర్ లాల్ భార్య మనీలాల్ CCS పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్టులు ఈ నెలలో జరిగాయి.
నన్ను టార్గెట్ చేసి కేసు పెట్టారు: నవీన్‌కుమార్
తనను టార్గెట్ చేసి కేసు పెట్టారని, 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చారని నవీన్‌కుమార్ తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ వివాదంలో పోలీసులు కలుగ జేసుకుంటున్నారని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని నవీన్‌కుమార్ అన్నారు.
ఇదీ చదవండి: ప్రజాభవన్: ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. సీఐ సస్పెండ్
Comments
Please login to add a commentAdd a comment