‘‘గతంలో నేను నిర్మించిన ‘బట్టల రామస్వామి బయోపిక్’, ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం గౌతమ్ కృష్ణ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నాను. యువత, కుటుంబ ప్రేక్షకులతో పాటు అందరూ మెచ్చే చిత్రాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్నారు. గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోంది.
సెవెన్ హిల్స్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం) తన పుట్టినరోజు సందర్భంగా సతీష్ కుమార్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. గౌతమ్ కృష్ణ ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 షోలో ఉన్నారు. ఆ షో నుంచి తిరిగి రాగానే మా సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్దు, సంగీతం: జుడా శాండీ.
Comments
Please login to add a commentAdd a comment