కుటుంబ కలహాలతో సతమతమైన ఓ యువకుడికి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమనిపించింది. ఆత్మహత్య చేసుకోవడానికి అతగాడు సులువైన దారుల కోసం అన్వేషించాడు. చివరకు ఆ యవకుడు యూట్యూబ్ను ఎన్నుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడం ఎలా? అని యూట్యూబ్లో శోధించి మరీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. హస్టల్ గదిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎక్కడో కాదు. నగరంలోని ఎస్సార్ నగర్ అనుపమ హాస్టల్‌లో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. నల్లగొండ జిల్లాకు చెందిన నవీన్ కుమార్ బీటెక్ పూర్తి చేసి ఎస్సార్ నగర్‌లోని అనుపమ వసతి గృహంలో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు.