రామన్నపేట మండలం వెల్లంకిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.
రామన్నపేట మండలం వెల్లంకిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. సరినేనిగూడెం గ్రామానికి చెందిన నవీన్ కుమార్(14) అనే బాలుడు స్నేహితులతో కలిసి వెల్లంకి గ్రామశివారులో ఉన్న చిన్న కొలనులో ఈత నేర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.