
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్గొండ: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బావ బామ్మర్దులు వాగునీటిలో పడి చనిపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో బావ బామ్మర్దులు సరదాగా ఈత కోసమని సమీపంలోని కృష్ణా నది బ్యాక్ వాటర్ వాగులోకి వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఈత కొట్టే సమయంలో రమావత్ రగేష్ నాయక్(25), శీను నాయక్(22) నీటిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు.
అటు వైపు వెళ్తున్న స్థానికులు గమనించి వాగులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అయితే చనిపోయిన రమావత్ రాగేశ్ నాయక్ స్వగ్రామం నెహ్రూ నగర్ తండ గుంటూరు జిల్లా. మరో మృతుడు శీను నాయక్ది దుర్గి మండలం గండిగనుమల స్వస్థలం. తన బంధువుల ఊరు అయిన బాలెంపల్లికి ఓ శుభకార్యానికి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చదవండి: ఆ నాలుగూ.. ఇవేనా!
Comments
Please login to add a commentAdd a comment