
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ మధ్య వివాదం చెలరేగుతోంది. ఐపీఎస్ నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ గతంలో సిసిఎస్ పోలీసులకు బన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి తన నివాసాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు అంటూ ఆరోపణలు చేశారు. దీంతో గతంలో నవీన్ కుమార్ ను విచారణ చేసిన సిసిఎస్ పోలీసులు.. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ ప్రశాసననగర్ లో ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ కుమార్ ని కూడా మరికొద్ది సేపట్లో అదుపులోకి తీసుకొని విచారించనున్నామని తెలిపారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదినలను అరెస్ట్ చేశారు. గతంలో 41ఏ నోటీసులు జారీ చేసి నవీన్ కుమార్ ను విచారించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ అధికారి నవీన్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: చింతమనేని సీట్ సిరిగిపోయిందా ?
Comments
Please login to add a commentAdd a comment