
ప్రతీకాత్మక చిత్రం
కృష్ణా జిల్లా : నందిగామ సమీపంలో జాతీయరహదారిపై కంచికచర్లలోని చెరువు కట్ట వద్ద మార్నింగ్ ట్రావెల్స్ బస్సు, పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పల్టీ కొట్టింది. పాల వ్యానును వేగంగా ఢీకొట్టడంతో వ్యాను డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుతోంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.