Milk Van
-
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం(జులై 10) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో- ఆగ్రా హైవేపై ఉన్నావో వద్ద ట్రావెల్ డబుల్ డెక్కర్ బస్సు, పాల ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టింది. #BreakingNews 🚨Major accident happened in Unnao, Uttar Pradesh18 Died & many injured. Double decker Bus collided with Tanker truck 🚛Road Safety must be taken seriously 🙁#Unnao #UP #उन्नाव #UttarPradesh pic.twitter.com/vMjfWHOk7T— Veena Jain (@DrJain21) July 10, 2024 ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. ఒకే కుటుంబంలో 9 మంది దుర్మరణం!
బెంగళూరు: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. టెంపో ట్రావెలర్‌ను ఓ పాల వ్యాన్ ఢీకొట్టటంతో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జయింది. మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. జిల్లాలోని అర్సికేరే తాలుకాలోని గాంధీనగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ధర్మస్థల, సుబ్రమణ్య, హసనాంబ ఆలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణమైనట్లు చెప్పారు. ‘గాంధీనగర్ సమీపంలో టెంపో ట్రావెలర్, కేఎంఎఫ్ పాల వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.’ అని పేర్కొన్నారు. Hassan, Karnataka | 9 people died in an accident involving a head-on collision between a Tempo traveller vehicle and a KMF milk vehicle near Gandhinagar in Arsikere taluka while returning home after visiting Dharmasthala, Subramanya, Hasanamba temples: Police pic.twitter.com/DTbMkbWnWI — ANI (@ANI) October 16, 2022 ఇదీ చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్ కీలక ప్రకటన -
కూలీ బతుకులు ఛిద్రం
సంగం: తెల్లవారకముందే కూలి పని కోసం బయలుదేరిన వారిని పాల వ్యాన్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కబళించింది. పనుల కోసం వ్యాన్‌లో బయలుదేరిన వారు.. రక్తపుమడుగులో రోడ్డుపైనే విగతజీవులయ్యారు. రక్తసిక్తమైన రోడ్డు, చెల్లాచెదురుగా పడిన వారితో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఈ దుర్ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం జరిగింది. సంగం మండలం దువ్వూరు వద్ద నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఉదయం 5 గంటల సమయంలో కూలీలు ఉన్న వ్యాన్‌ను పాల వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. పెద్దశబ్దం రావడంతో చుట్టపక్కలవారు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. అప్పటికే నలుగురు కూలీలు విగతజీవులయ్యారు. కొందరు రక్తమోడుతున్న గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి కన్నుమూశాడు. ఏడుగురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన 18 మంది, మక్తాపురానికి చెందిన నలుగురు కూలీలు విడవలూరు మండలంలో చేపలు పట్టేందుకు వెళ్లాల్సి ఉంది. మక్తాపురానికి చెందిన నలుగురు ముందే వ్యానులో ఎక్కారు. దువ్వూరుకు చెందిన వారు వచ్చి వ్యాను ఎక్కుతుండగా.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నుంచి నెల్లూరు వెళుతున్న పాల వ్యాను వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో దువ్వూరుకు చెందిన గాలి శీనయ్య (55), కోటపూరి మాలకొండయ్య (61), తువ్వర రమణయ్య (57), కంచర్ల బాబు (60).. అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మోచర్ల శీనయ్యను నెల్లూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలొదిలాడు. వ్యాను డ్రైవర్ విక్రం నాగరాజ్, ఆటో ఎక్కుతున్న గంగపట్నం శ్రీనివాసులు, గడ్డం నందా, వెంకయ్య, కె వెంకటేష్, సూడం రమణయ్య, జి.శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురిని బుచ్చిరెడ్డిపాళెం ఆస్పత్రికి, నలుగురిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. చెల్లాచెదురైన అన్నం.. ఈ ప్రమాదంలో మరణించినవారంతా దువ్వూరు ఎస్సీ కాలనీ వారే. చీకటితోనే బయలుదేరి వెళ్లి పని మొదలుపెట్టే ముందు తినేందుకు బాక్సుల్లో అన్నం పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో బాక్సులు రోడ్డుపై పడి అన్నం చెల్లాచెదురైంది. తెచ్చుకున్న అన్నం తినే అవకాశం కూడా లేకుండానే మరణించారంటూ.. కాలనీవాసులు విలపిస్తున్నారు. కూటికోసం కూలికెళుతుంటే.. బతుకులే పోయాయంటూ ఆయా కుటుంబాలు రోదిస్తున్న తీరు అందరికంట కన్నీరు పెట్టించింది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాద స్థలాన్ని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సంగం తహసీల్దారు రవికుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంగం ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. గవర్నర్, మంత్రి మేకపాటి సంతాపం నెల్లూరు జిల్లా దువ్వూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదం తనను కలచివేసిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. గాయపడినవారికి అత్యవసర వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల్లో కొందరికి ఫోన్‌చేసి పరామర్శించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు కూలీలు మృతి
సాక్షి, నెల్లూరు: సంగం మండలం దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక వైపు నుంచి పాల వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమచారం. దువ్వూరు నుంచి విడవలూరుకు చేపల వేట కోసం వెళ్తున్న కూలీలు దువ్వూరు వద్ద టాటా ఏస్ వాహనం ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుచ్చి, నెల్లూరు ఆసుపత్రులకు తరలించినట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని వెల్లడించారు. ఘటనపై మంత్రి గౌతమ్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో కూలీలు మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తెలిపారు. -
అన్నదమ్ముల ఉసురు తీసిన పాలవ్యాన్
సాక్షి, చిన్నంబావి: ఓ వ్యాన్ డ్రైవర్ అతివేగం.. నిద్రమత్తు.. రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఉదయం తోట నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరు బాటసారులను పాలవ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి శివారు లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా.. అమ్మాయిపల్లికి చెందిన గంగిరెడ్డికి ఏడుగురు కుమారులు ఉండగా.. అందులో పెద్దకుమారుడు సాయిరెడ్డి(52), మూడవ కుమారుడు రాజశేఖర్‌రెడ్డి(47)తో కలిసి గ్రామానికి సమీపన ఉన్న తమ మామిడి తోటను చూసేందుకు ఉదయం 7గంటల ప్రాంతంలో వెళ్లారు. తిరిగి 8గంటల ప్రాంతలో రోడ్డు నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా చిన్నంబావి నుంచి నుంచి మహబూబునగర్‌కు వెళ్లే పాల వ్యాను డ్రైవర్ అతివేగంతో వెళ్తూ.. నిద్రమత్తులో ఉండడంతో వాహనాన్ని అదుపుచేయలేక రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వీరిరువురిని ఢీకొట్టాడు. దీంతో అన్నదమ్ములిద్దరికీ తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. సాయిరెడ్డి కురుమూర్తి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈయనకు భార్య సుధారాణి, ఇద్ధరు కుమా రులు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి వృత్తిరిత్యా ప్రవేటు కాలేజీలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య నవరాగిణి, కుమారుడు ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కురుమూర్తి ఆలయ సిబ్బంది దిగ్బ్రాంతి చిన్నంతకుంట: కురుమూర్తిస్వామి ఆలయ అకౌంటెంట్ సాయిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 2004లో ఆయన అకౌంటెంట్‌గా విధులు చేపట్టాడని, 17ఏళ్లపాటు సేవలం దించాడని, ఆలయ బ్రహ్మోత్సవాలు, స్వామివారిసేవల్లో సాయిరెడ్డి చేసిన సేవలు మరువలేనివని వారు గుర్తు చేసుకున్నారు. చదవండి: మిడ్‌మానేరులో ఇద్దరు గల్లంతు.. ఆచూకీ లేదు -
టీడీపీ నేత పాల వ్యాన్‌లో అక్రమ మద్యం
సాక్షి, ఉయ్యూరు(పెనమలూరు): టీడీపీ నేతకు చెందిన విజయ పాల వ్యాన్‌లో అక్రమ మద్యం పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో మద్యం సీసాలు దొరకడంతో పాల వ్యాపారం మాటున అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. పట్టుబడిన వ్యాన్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సన్నిహితుడైన కంకిపాడు మండలం తెన్నేరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు యార్లగడ్డ రాజాది కావడం, ఆయన విజయ పాల సరఫరాకు కాంట్రాక్ట్ పద్ధతిపై వ్యాన్ తిప్పుతుండంతో అక్రమ మద్యం వ్యాపారం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీడపీ నేత పాలవ్యాన్‌లో లిక్కర్ బాటిళ్లు తరలిస్తున్నారు మద్యం సీజ్.. ముగ్గురు అరెస్ట్ విజయ పాల డెయిరీలో అక్రమ మద్యం సీసాలు పట్టుబడిన వైనం సంచలనమైంది. అవనిగడ్డ నుంచి వస్తున్న పాల వ్యాన్‌లో 50 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 5 ఫుల్ బాటిళ్లు సంచిలో మూటగట్టి ఉన్నాయి. ఆదివారం ఉయ్యూరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేసే క్రమంలో పాల వ్యాన్‌లో మద్యం ఇవి బయటపడ్డాయి. సీఐ నాగప్రసాద్, ఎస్ఐ గురుప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది మద్యం బాటిళ్లను స్వా«దీనం చేసుకుని పాల వ్యాన్‌ను సీజ్ చేసి క్యాషియర్ పాలేపు గుప్తా, సిబ్బంది పట్టాభిరావు, వికాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాన్ కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు యార్లగడ్డ రాజాదిగా గుర్తించారు. రాజా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగు కాంట్రాక్ట్ రద్దుచేసిన విజయ డెయిరీ చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): విజయ పాల వ్యాన్‌లో మద్యం తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై సదరు సంస్థ చర్యలు తీసుకుంది. ఉయ్యూరులో విజయ పాల వ్యాన్‌లో మద్యం రవాణా చేస్తున్న ఘటనపై విజయ డెయిరీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్‌బాబు స్పందించారు. పాల వ్యాన్‌ను నడుపుతున్న వై. రాజా కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాల వ్యాన్లను ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు జేఎండీ పేర్కొన్నారు. -
ట్రావెల్స్ బస్సు పాల వ్యాన్ ఢీ..ఒకరి మృతి
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, వ్యాన్ ఢీ..ఒకరి మృతి
కృష్ణా జిల్లా : నందిగామ సమీపంలో జాతీయరహదారిపై కంచికచర్లలోని చెరువు కట్ట వద్ద మార్నింగ్ ట్రావెల్స్ బస్సు, పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పల్టీ కొట్టింది. పాల వ్యానును వేగంగా ఢీకొట్టడంతో వ్యాను డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుతోంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాల వ్యాన్ బోల్తా
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న పాల వ్యాన్ డివైడర్‌ను ఢీ కొట్టి అదుపు తప్పి బోల్తా కొట్టింది. నగరంలోని సంతోష్‌నగర్ చౌరస్తాలో శనివారం తె ల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పాలతో సంతోష్‌నగర్ వైపుగా వాహనం బోల్తా కొట్టడంతో పాలన్ని నేలపాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి.. వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
రోడ్డుపాలైన వందల లీటర్ల పాలు
-
బైక్‌ను ఢీకొట్టిన పాలవ్యాన్..ఒకరు మృతి
హైదరాబాద్ : పాలవ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి.. ఒకరి మరణానికి కారణమయ్యాడు. కుషాయిగూడలో పోచమ్మ ఆలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అత్తాపూర్‌కు చెందిన బలరాం (21) మరో వ్యక్తితో కలసి చక్రిపురం నుంచి ఈసీఐఎల్ వైపు తన ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. పోచమ్మ ఆలయం వద్ద అతని వాహనాన్ని మదర్ డెయిరీ పాల వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బలరాం అక్కడికక్కడే చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి...క్షతగాత్రుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పాలవ్యాను దూసుకెళ్లి బాలిక మృతి
– శోకసముద్రంలో గల్లావారిపల్లి కలికిరి :పాలవ్యాను దూసుకెళ్లడంతో బాలిక మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని అద్దవారిపల్లి పంచాయతీ గల్లావారిపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగింది. గ్రామానికిచెందిన జి.రెడ్డెప్ప, రెడ్డిరమణ మ్మ దంపతుల కుమార్తె జి.పావని(12) మహల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది. పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆడుకునేందుకు వెళ్లింది. ప్రతిరోజూ గ్రామం నుంచి కలకడ మండలంలోని పోతువారిపల్లి సమీపంలోని ఓప్రైవేట్ డెయిరీకి పాలు తీసుకెల్తున్న పాలవ్యాను రివర్స్ తీసుకునే క్రమంలో బాలికపై దూసుకెళ్లింది. బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. స్నేహితుల కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకునేలోపు డ్రైవర్ పరారయ్యాడు. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు అంతవరకూ ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగిన కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రెడ్డెప్ప, రెడ్డిరమణమ్మ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఎన్నో వ్రతాలు, పూజలు చేసిన తర్వాత పావని పుట్టింది. ఈ క్రమంలో వ్యానురూపంలో వచ్చిన మృత్యువు కబళించడంతో వారు బోరున విలపించారు. హెడ్‌కానిస్టేబుల్ రాజారాంరెడ్డి అక్కడికి చేరుకుని బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పాలవ్యాన్ డ్రైవర్ కలకడ మండలం కోన పంచాయతీ గొల్లపల్లికి చెందిన శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
డీసీఎం, పాల వ్యాన్ ఢీ... 1500 కోళ్ల లూటీ
అక్కలదేవిగూడెం(చివ్వెంల) అతివేగంగా వస్తున్న పాల వ్యాన్ డీసీఎంను ఢీకొట్టి అదుపుతప్పి ఫల్టికొట్టింది. ఈసంఘటన మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి వెళ్తున్న కోళ్ల లోడు డీసీఎంను ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు వస్తున్న పాల వ్యాన్ ఎదురుగా ఢీకొట్టింది, ప్రమాదంలో డీసీఎం అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో సంఘటన స్థల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో తరలివచ్చి కోళ్లను ఆటోల్లో, మోపెడ్లపై తీసుకువెళ్లారు. కాగా ప్రమాదంతో జనం కోళ్లకోసం రహదారిపైకి రావడంతో సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంబించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. కాగా ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అశోక్, సూపర్వైజర్నర్సింహకు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో సూర్యాపేటకు తరలించారు. ఈఘటనలో 1500 కోళ్లు లూటి అయి.రూ. 5లక్షల నష్టం వాటిళ్లినట్లు బాధితులు తెలిపారు. -
మిల్క్ వ్యాన్ బీభత్సం
హైదరాబాద్: మిల్క్ వ్యాన్ శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన వ్యాన్ అదుపు తప్పి బస్టాండ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్‌లోని జవహర్ నగర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యాన్, బైక్ ఢీ: ఒకరికి గాయాలు
బొబ్బిలి(విజయనగరం): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని గ్రోత్ సెంటర్లో ద్విచక్రవాహనం పై వెళుతున్న వ్యక్తిని పాల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికులు 108 వాహనంలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడిది మండలంలోని కాచంద్ర వలసగా స్థానికులు గుర్తించారు. -
విషాదం
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్ : పొద్దంతా కష్టపడి పని చేసి.. సాయంత్రం సరదాగా స్నేహితులతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైన ముగ్గురు యువకులు.. తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడ్డారు. పాలవ్యాన్ రూపంలో వారిని మృత్యువు వెంటాడింది. వారిలో ఇద్దరు కొత్త అంజనాపురం గ్రామానికి చెందిన వారు కాగా, మరొకరు ఆ గ్రామానికి చుట్టపుచూపుగా వచ్చిన ఇల్లెందు మండలానికి చెందిన వ్యక్తి. వివరాలిలా ఉన్నాయి... కొత్త అంజనాపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు గురువారం సాయంత్రం కొత్తగూడెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అక్కడ అందరితో కలిసి సరదాగా గడిపి.. అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి ఇంటికి పయనమమ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఆటోను చుంచుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద ఎదురుగా వస్తున్న పాలవ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంజనాపురంలోని ఒకరి ఇంటికి బంధువుగా వచ్చిన ఇల్లెందు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పాయం రాము(35) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అంజనాపురానికి చెందిన ముక్తి కుమార్(19)ను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అదే గ్రామానికి చెందిన జబ్బ నాగరాజు (24)ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గాయపడిన గణేష్, ఆదినారాయణ, వీరబాబు, భూపతి. కొండల్, సురేష్ కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో అంజనాపురం... ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడడంతో కొత్త అంజనాపురం గ్రామం శోకసంద్రంలో మునిగింది. ఆర్తదానలు, ఆక్రందనలు మిన్నంటాయి. పెళ్లికి ఎంతో ఆనందంగా ఆటోలో వెళ్లిన వారు ఇలా విగతజీవులుగా మారడాన్ని వారి కుటుంబసభ్యులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు మృతదేహాలను చూసి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికందిన కొడుకులు కాటికి వెళ్లడంతో కుమార్, నాగరాజుల తల్లిదండ్రులు రోదనలను ఎవరూ ఆపలేకపోతున్నారు. గ్రామస్తులు, బంధువుల ఆర్తనాదాల మధ్య రెండు మృతదేహాలను శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కాగా రాము మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించారు.