పాల వ్యాన్ బోల్తా
Published Sat, Nov 26 2016 10:23 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న పాల వ్యాన్ డివైడర్‌ను ఢీ కొట్టి అదుపు తప్పి బోల్తా కొట్టింది. నగరంలోని సంతోష్‌నగర్ చౌరస్తాలో శనివారం తె ల్లవారు జామున చోటు చేసుకున్న ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పాలతో సంతోష్‌నగర్ వైపుగా వాహనం బోల్తా కొట్టడంతో పాలన్ని నేలపాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి.. వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
Advertisement
Advertisement