డీసీఎం, పాల వ్యాన్ ఢీ... 1500 కోళ్ల లూటీ
డీసీఎం, పాల వ్యాన్ ఢీ... 1500 కోళ్ల లూటీ
Published Sat, Jul 30 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
అక్కలదేవిగూడెం(చివ్వెంల)
అతివేగంగా వస్తున్న పాల వ్యాన్ డీసీఎంను ఢీకొట్టి అదుపుతప్పి ఫల్టికొట్టింది. ఈసంఘటన మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి వెళ్తున్న కోళ్ల లోడు డీసీఎంను ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు వస్తున్న పాల వ్యాన్ ఎదురుగా ఢీకొట్టింది, ప్రమాదంలో డీసీఎం అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో సంఘటన స్థల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో తరలివచ్చి కోళ్లను ఆటోల్లో, మోపెడ్‌లపై తీసుకువెళ్లారు. కాగా ప్రమాదంతో జనం కోళ్లకోసం రహదారిపైకి రావడంతో సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంబించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. కాగా ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అశోక్, సూపర్‌వైజర్‌నర్సింహకు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో సూర్యాపేటకు తరలించారు. ఈఘటనలో 1500 కోళ్లు లూటి అయి.రూ. 5లక్షల నష్టం వాటిళ్లినట్లు బాధితులు తెలిపారు.
Advertisement