chivvemla
-
రహస్యంగా ప్రేమ జంటల ఫోటోలు, వీడియోలు రికార్డ్.. ఫోన్ లాక్కొని చూడగా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: రహస్యంగా ప్రేమజంటల ఫొటోలు, వీడియోలు తీస్తున్న యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామ శివారులో వెలసిన శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో పాటు, పరిసర ప్రాంతాల్లో కట్టడాలను చూసేందుకు వస్తున్న ప్రేమ జంటలను రహస్యంగా సెల్ఫోన్లో చిత్రికరిస్తున్నాడు. దీనిని గమనించిన వారు ఫోన్ లాక్కుని చూడగా అందులో అప్పటికే ఇంతకు ముందు తీసిన 40 వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడే ఉన్న స్థానికులకు విషయం చెప్పడంతో వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి! -
కరోనా ‘వల’కు చిక్కొద్దు..!
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను ఎంతలా తలకిందులు చేస్తున్నా, ఇప్పటికీ కొందరు వైరస్ పట్ల అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. చెరువులోని చేపలను దక్కించుకునే క్రమంలో కరోనా నిబంధనలను సైతం పక్కనపెట్టేశారు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులోని పెద్ద చెరువులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ మునీర్ ఖాన్ రూ.1.75 లక్షలకు గ్రామ పంచాయతీ వేలంపాటలో పెద్ద చెరువును కైవసం చేసుకున్నాడు. జూన్ 8 వరకు చెరువులో చేపలు పట్టుకునేందుకు ఆయనకు అవకాశం ఉంది. గురువారం చేపలు పట్టుకునేందుకు మునీర్ ఖాన్ చెరువు వద్దకు రాగా, అప్పటికే చుట్టుపక్కల గ్రామాలైన వాల్యతండా, వట్టిఖమ్మంపహాడ్, జగనా తండా, మంగళితండా, అక్కలదేవి గూడెం నుంచి వందల సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా వచ్చి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలను పక్కనబెట్టి మరీ చేపలను లూఠీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రజలను చెదరగొట్టారు. – చివ్వెంల (సూర్యాపేట) చదవండి: హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..! Photo Feature: తుపాను దెబ్బ.. కరోనా కట్టడి -
కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే.. బాబుకు వేసినట్లే : మంత్రి జగదీశ్ రెడ్డి
సాక్షి, సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని.. రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూస్తుంటే దేశంలో కేసీఆర్‌కు తప్ప మరెవరికి ఇంతటి ప్రజామద్దతు లేదన్నారు. ఆదివారం పట్టణంలోని వాణిజ్యభవన్ సెంటర్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత స్థానం భవన నిర్మాణ రంగానిదే అన్నారు. భవన నిర్మాణ రంగం కార్మికుల పిల్లలకు కల్యాణలక్ష్మితో పాటు డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో పెద్దపీట వేస్తామన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 లక్షలు, వికలాంగులైతే రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే వస్తున్నాయన్నారు. తనను మరోసారి గెలిపిస్తే పేట ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందజేస్తామన్నారు. అదే విధంగా గండూరి జానకమ్మ ఇండోర్ స్టేడియంలో ది క్లాత్ మర్చంట్స్ వర్కర్స్ యూనియన్ ఆత్మీయ సమావేశం నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం పలువురు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, ఉప్పల ఆనంద్, గండూరి కృపాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఇక కనుమరుగే.. సూర్యాపేటరూరల్ : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ ఇక కనుమరుగు కానున్నాయని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసే భారీగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఆదివారం మండలంలోని గాంధీనగర్‌లో ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్ నివాసంలో బాలెంల గ్రామానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పలువురు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. టీఆర్ఎస్లో చేరిన శివరాత్రి భిక్షపతి, దుండగుల వెంకన్నతో పాటు మరో 50 మందికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, పులగం వెంకట్‌రెడ్డి, మామిడి రవి, టైసన్, రూపని శ్రీను, పల్స నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాబు చేతుల్లో కీలుబొమ్మ కాంగ్రెస్ .. చివ్వెంల : చంద్రబాబు నాయుడు చేతులో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని ఆపద్ధర్మ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి మండలంలోని బి.చందుపట్ల, పాశ్చతండా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2014కు ముందు ఆకలిచావులు ఉండేవని టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రజలు గౌరవంగా బతుకుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్దే అన్నారు. దేశంలో 45వేల కోట్ల రూపాయలు సంక్షేమ రంగం కోసం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశాన్ని ఉద్దరించామని గొప్పలు చెప్తున్న సోని యాగాంధీ, రాహుల్‌గాంధీకి రాజకీయ భిక్షపెట్టిన ఉత్తరప్రదేశ్‌లోని రెండు వేల గ్రామాల్లో ఇప్పటికీ కరెంట్ లేదన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఖరీప్ నుంచి పది నెలల పాటు సాగునీరందిస్తామన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డ చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. పేట ప్రజలు మరోసారి తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతానన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్‌సభ్యుడు షేక్‌బాషా, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, పెద్దగట్టు చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ భూక్యా వెంకటేశ్వర్లు, చందుపట్ల పద్మయ్య, మారినేని సుధీర్‌రావు, వేముల చిన్న, మిర్యాల గోవిందరెడ్డి, వెంకన్న పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
ప్రతి ఇంటిపై రక్తపు మరకలు .. అసలేం జరిగింది?
సూర్యాపేట : సుర్యాపేట జిల్లాలోని ఓ తండాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కొందరు దుండగులు తండాలోని ప్రతి ఇంటిపై రక్తాన్ని చల్లారు. అందరి ఇంటి ముందు రక్తపు మరకలు కనిపించడంతో తండాలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం రోళ్ల బండ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తండాలోకి చొరబడి శ్రీరాంసాగర్ కాల్వ దగ్గర నుండి గ్రామపంచాయతీ చివరి వరకు గ్రామంలోని ప్రతి ఇంటిపైన రక్తాన్ని చల్లారు. మెట్లు ఉన్న ఇళ్లపైకి వెళ్లి డాబాపైన కూడా రక్తం చల్లారు. సోమవారం ఉదయం దీన్ని గమనించిన తండావాసులు ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తండాకు ఎవరు వచ్చారు ..? రక్తం ఎక్కడిది ? ప్రతి ఇంట్లో రక్తం చల్లింది ఎవరు? ఎందుకు చల్లారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
ఐపీఎల్ మ్యాచ్ చూసి వెళ్తుండగా..
-
ఐపీఎల్ మ్యాచ్ చూసి వెళ్తుండగా..
చివ్వెంల: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన నలుగురు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన సన్‌రైజర్స్- కోల్‌కతా ఐపీఎల్ మ్యాచ్ చూసి తిరిగి కారులో వెళ్తుండగా.. గుంపుల తిరుమలగిరి వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరో ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చివ్వెంల మండలం కుడకుడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనాథ్ ఆదివారం రాత్రి డ్యూటీ ముగించుకొని స్వగ్రామమైన నూతనకల్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన శ్రీనాథ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పాలనా సౌలభ్యం కోసమే నూతన జిల్లాలు
దురాజ్‌పల్లి(చివ్వెంల) : పాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులో గల కామాక్షి ఇంజనీరింగ్ కళాశాలలో ఎర్పా టు చేసిన కలెక్టరేట్‌ను సందర్శించారు. కార్యాలయంలో వివిధ శాఖలకు కేటాయించిన గదులను పరిశీలించారు. దసరా రోజు నుంచే నూతన జిల్లాల్లో పాలన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వ కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బంగారు తెలంగాణ సాధనలో భాగమని, తెలంగాణ సమాజాన్ని దేశస్థాయిలో గుర్తుంచుకునే వి«ధంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిరుద్యోగ యువతీ, యువకులను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ దసరా నుంచే నూతన జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ, మండలాలు, గ్రామాలు ఆమల్లోకి వస్తాయన్నారు. సంబంధిత శాఖల అవసరానికి అనుగుణంగా అధికారులను, సిబ్బందిని సర్దుబాటు చేసినట్లు తెలిపారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ సత్యరాయరణ, ఆర్డీఓ నారాయణరెడ్డి, ఎంపీపీ కల్పగిరి యశోద, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ భాషా, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బు సైదులు గౌడ్, నాయకులు గండూరి ప్రకాశ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, కొణతం అప్పిరెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక లారీ సీజ్
బీబిగూడెం (చివ్వెంల) : అక్రమంగా ఇసుకను తీసుకెళ్తున్న లారీని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని బీబిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఖమ్మం నుంచి ౖహె దరాబాద్‌కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కలెక్టరేట్ కార్యాలయాన్ని సందర్శించిన అధికారులు
దురాజ్‌పల్లి(చివ్వెంల) : మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులోని కామాక్షి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో భాగంగా తమ శాఖలకు కేటాయించిన గదులను డీపీఓ పి.ప్రభాకర్ రెడ్డి, డీపీఆర్ఓ డి.నాగార్జునలు మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా డీపీఓ మాట్లాడుతూ అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఈఓఆర్డీలు గోపి, లక్ష్మీ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకుంటాం
దురాజ్‌పల్లి (చివ్వెంల) : నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్పీఓ వి.సురేష్‌మోహన్ అన్నారు. గురువారం మండలంలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులో అక్రమంగా చేసిన వెంచర్లను పరిశీలించారు. నిబంధలనకు విరుద్ధంగా చేసిన వెంచర్లలో హద్దురాళ్లను తొలగించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట, చివ్వెంల మండలాల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా, నాలా పన్ను కట్టకుండా అక్రమంగా చేసిన చివ్వెంల మండలం బీబిగూడెం, కుడకుడ, దురాజ్‌పల్లి, సూర్యాపేట మండలం గాంధీనగర్, పిల్లలమర్రి, రాయిన్‌గూడెం గ్రామాల్లోని వెంచర్లను తొలగించాలని కార్యదర్శులను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి లేని వెంచర్లలో ఎవరు ప్లాట్లు కోనుగోలు చేయవద్దన్నారు. ఈ సమావేశంలో ఈఓఆర్డీలు లక్ష్మి, గోపి, సూర్యాపేట, చివ్వెంల మండలాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ
వట్టిఖమ్మంసహాడ్(చివ్వెంల) : విద్యార్థులు, క్రమ శిక్షణ, పట్టుదలతో చదవాలని వాసవీక్లబ్ సూర్యాపేట అధ్యక్షుడు పి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం వట్టిఖమ్మంపహాడ్ గ్రామానికి చెందిన దాత బిక్కుమల్ల అరుణ్‌కుమార్–మణిల కుమారుడు అభిజిత్ కుమారుడు భారత నేవీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉద్యోగం పొందిన సందర్భంగా 150 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు బ్రహ్మరావు, శ్యాంప్రసాద్, రాధాక్రిష్ణ, హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, సూర్యానారాయణ, శ్యామల, విజయ కుమారి, క్రిష్ణ, వెంకటేశ్వర్లు, చారి, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు
చివ్వెంల: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని బీబిగూడెం, దురాజ్‌పల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం పట్టణానికి చెందిన గోపాలదాస్ చందు స్వగ్రామం వెళ్లేందుకు బీబిగూడెం గ్రామంలో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట నిలబడి ఉన్నాడు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అదేవిధంగా దురాజ్‌పల్లి గ్రామ శివారులో సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న టాటాఏస్ అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అహ్మద్, కమతం నరేందర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
పాశ్చ్యానాయక్‌తండ(చివ్వెంల) : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట డివిజన్ మలేరియా నియంత్రణ అధికారి తీగల నర్సింహ అన్నారు. పీహెచ్సీ ఆధ్వర్యంలో ఆదివారం మండల పరిధిలోని పాశ్చ్యానాయక్‌తండా ఆవాసాలు బద్యాతండా, పిల్లల జెగ్గుతండా, తుమ్మల జెగ్గుతండా, భోజ్యతండా, జయరాం గుడి తండా, హలవత్తండా, భీమ్లాతండా, పాండుతండాల్లో ఇళ్లలో దోమల నివారణ మందులను స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇళ్ల మందు మురుగు నీరు నిలువ కుండా చూసుకోవాలని, వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ బూతరాజు సైదులు, ఎఎన్ఎం లూర్దు మేరి, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ఆశ వర్కర్లు జ్యోతి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం గిరిజనుల ధర్నా
బద్యాతండ(చివ్వెంల) : తాగునీటి కోసం మండల పరిధిలోని పాశ్చ్యానాయక్‌తండా ఆవాసం బద్యాతండాలో గిరిజనులు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా తండా వాసులు మాట్లాడుతూ తండాకు తాగునీరు సరఫరా చేసే స్కీం బోరు మరమ్మతుకు గురై వారం రోజులు గడుస్తున్నా సర్పంచ్, కారద్యర్శి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనితో గ్రామ శివారులోని వ్యవసాయ బోర్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలని కోరారు. ఈకార్యక్రమంలో భానోతు ఈరోలి, నీలిమా, మంగ్లీ, జీజా, లక్ష్మీ, జ్యోతి, బద్రి, కవిత, బుజ్జి, లచ్చి, మంగమ్మ, పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
భాదిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేత
ఐలాపురం(చివ్వెంల) : మండల పరిధిలోని ఐలాపురం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ మేలినాటి రామక్రిష్ణ ఇటివల గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి ఆర్ఎంపీల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రూ.10 వేల ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన యూత్ ఆధ్వర్యంలో రూ.32వేలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు పుప్పాల లక్ష్మీనారాయణ, చివ్వెంల మండల అధ్యక్షుడు కె. వెంకన్న, శ్రీను. దామోదర్, జానయ్య, క్రిష్ణ, యూత్ సభ్యులు వెంకటరమణ, సతీష్, నాగరాజు, సైదులు, బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని 15 గొర్రెలు మృతి
తుల్జారావుపేట(చివ్వెంల) : కారు ఢీకొని 15 గొర్రెలు మృతిచెందగా, ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈసంఘటన మండల పరిధిలోని తుల్జారావుపేట గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని జి.తిర్మలగిరి ఆవాసం గుంపుల గ్రామానికి చెందిన మేకల వెంకన్న తన గొర్రెలను వ్యవసాయ వ్యవసాయం పొలం వద్దకు తీసుకెళ్లే క్రమంలో తుల్జారావుపేట గ్రామ స్టేజీ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో 15 గొర్రెలు అక్కడిక్కడే మృతి చెందగా, వెంకన్న కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు 108 అంబులెన్స్‌లో సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా గొర్రెల విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. -
ఘనంగా తీజ్ వేడుకలు
చివ్వెంల : మండల పరిధిలోని లక్ష్మణ్‌నాయక్‌తండా, గీష్యాతండా, మంగళితండ, జంటభావ్సింగ్ తండా, హున్యానాయక్తండాలో సోమవారం గిరిజనులు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా తండాలకు చెందిన యువతులు ఉపవాస దీక్షలతో వరి ధాన్యం, గోధుమలను వెదురు బుట్టలలో ఉంచారు. మొలకెత్తే వరకు ప్రతి రోజు మూడుసార్లు నీరు పోసి తొమ్మిదవ రోజు మొలకను తీసి బతుకమ్మగా పేర్చి గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బుసైదులు గౌడ్, సర్పంచ్‌లు ధరావత్ వెంకన్న నాయక్, పుత్లీభేగం, ఎంపీటీసీ సభ్యులు గుగులోతు బిక్కి, నాయకులు చీమ క్రిష్ణ, గుగులోతు నాగునాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా తీజ్ వేడుకలు
మున్యానాయక్తండ(చివ్వెంల) : మండల పరిధిలోని మున్యానాయక్తండాలో ఆదివారం గిరిజనులు తీజ్(బతుకమ్మ) పండుగను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన యువతులు గోధుమలు, వరి ధాన్యాన్ని వెదురు బుట్టలలో ఉంచి వాటికి నీరు పోసి మొలకెత్తిన నారును బతుకమ్మగా పూజించి, గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు. దీని వల్ల మంచి భర్త రావడంతో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగా పండుతాయని గిరిజన పెద్దలు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధరావత్ రాములు, ధరావత్ రవికుమార్, కోటయ్య, శ్రావణ్, సుష్మా, రోజా, సంద్య, ఇందిర, కావేరి, సంగీత, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
దురాజ్‌పల్లి(చివ్వెంల) : ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు భాగస్వాములు కావాలని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు తన్నీరు సత్యనారాయణ కోరారు. ఆదివారం మండల పరిధిలోని దురాజ్‌పల్లిలో నిర్వహించిన ఆసంఘం మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50 వేల మంది ఆర్ఎంపీలు (రూరల్ మెడికల్ ప్రాక్టిషనర్) లకు శాస్త్రీయంగా పారామెడికల్ శిక్షణను ప్రభుత్వ ఆస్పత్రిలో పునర్ ప్రారంభించారు. శిక్షణ పూర్తిచేసిన గ్రామీణ వైద్యులకు పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. సభ్యులంతా ఐక్యమత్యంగా కలిసి మెలిసి ఉండాలని, సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఈసందర్భంగా మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా మల్లేబోయిన వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా డి.అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా వి.సత్యం, పూర్ణచందర్రావు నాగరాజులను ఎనుకున్నారు. ఎన్నికల అధికారిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమాశంకర్ వ్యవహరించిన ఈకార్యక్రమంలో సీనియర్ నాయకుడు వెంకన్న గౌడ్, తిరుపతి, శోభన్‌బాబు, నర్సింహచారి తదితరులు పాల్గొన్నారు. -
కారు అదుపుతప్పి ఒకరు మృతి
వల్లభాపురం (చివ్వెంల) : అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని వల్లభాపురం గ్రామ శివారులోని జగన్నాయక్తండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర రాజధాని నగరంలోని హైటెక్ సిటీలో ప్రైవేటు ఉద్యోగులుగా పనిచేస్తున్న నగరవాసులు ఎలిమిలేటి అభిషేక్ (26), వి.విక్రమ్, ఆకుల అరుణ్, మారినేని సుధీర్, ఫణీ శుభకార్యం నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు స్కోడా కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ హైవేపై వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో సుధీర్, విక్రమ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. సంఘటనాస్థలాన్ని హెడ్‌కానిస్టేబుల్ చిత్తలూరి భిక్షంగౌడ్ సందర్శించి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. -
అనాథాశ్రమంలో అన్నదానం
దురాజ్‌పల్లి(చివ్వెంల) : దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ఆలేటి ఆటం వరల్డ్ అనాథాశ్రమంలో ఆదివారం సూర్యాపేట పట్టణానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా 64 మందికి అన్నదానం చేసి పండ్లు. బ్రెడ్డు అందజేశారు. అదేవిధంగా ఆశ్రమానికి వంట సామగ్రి అందజేశారు. ఈకార్యక్రమంలో అబ్దుల్ రహిం, కొక్కు సోమేశ్వర్రావు, బి.గోపాల్, టి.నర్సింహారావు, జి.ప్రవీణ్, అంతటి సైదులు, కె.రామక్రిష్ణ. సీహెచ్ నర్సింహారావు, పబ్బు రఘు, పిల్లల హరీష్, మేకల వెంకన్న, ఉప్పల రాజా, టి.నవీన్, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
చివ్వెంల : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కల్పగిరి యశోద అధ్యక్షతన జరిగిన సర్వసభ్వ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌నాయక్‌తండా, పాండ్యానాయక్‌తండా, బి.చందుపట్ల గ్రామాల సర్పంచ్‌లు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని నూతన బోర్లు మంజూరు చే యాలని సభకు దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సమస్యపై దృష్టిసారించి పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా మండలంలో మలేరియా, డెంగీ వ్యాధులపై గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని కుడకుడ గ్రామ ఎంపీటీసీ రత్నావత్ నాగరాజు కోరగా వైద్యాధికారి స్పందించి ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. రోళ్లబండ తండా, వట్టిఖమ్మంపహాడ్ గ్రామాల్లోని పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని సర్పంచ్ అనంతుల వెంకటమ్మ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బుసైదులు గౌడ్లు కోరారు. దీంతో ఎంఈఓ మాట్లాడుతూ జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. మండల కేంద్ర శివారులోని ఊర చెరువు వరద కాలువను పూడ్చి వేసి కొంతమంది రియల్ వ్యాపారులు వెంచర్లు చేస్తున్నారని మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ లాల్‌మహ్మద్ సభ దృష్టికి తీసకురాగా సంబందిత వ్యాపారులకు నోటీసులు జారీచేస్తామని ఈఓఆర్డీ పేర్కొన్నారు. ఇంకా పలువురు సభ్యులు పలు సమస్యలను సభలో ప్రస్తావించగా వాటి పరిష్కారానికి కృషిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సభలో జెడ్పీటీసీ సభ్యురాలు రౌతు చొక్కమ్మ, ఎంపీడీఓ జె.వెంకటేశ్వర్రావు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ భాషా, పశు వైద్యాధాకారి శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ పుష్ప, ఎఈలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం గిరిజనుల ధర్నా
చివ్వెంల : తాగునీటి కోసం మండల పరిధిలోని లక్ష్మణ్‌నాయక్‌తండా గ్రామ ఆవాసం బులాకి తండాకు చెందిన గిరిజనులు« ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తండాలో తాగునీటి వసతి లేక గత రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఆర్‌డబ్ల్యూస్ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తామని హమీ ఇచ్చారని, కాని ఒక్కరోజు మాత్రమే నీరు సరఫరా చేసి ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై స్థానిక సర్పంచ్, కార్యదర్శికి చెప్పిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ జె.వెంకటేశ్వర్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో సుమారు 100 మంది గిరిజనులు పాల్గొన్నారు. -
డీసీఎం, పాల వ్యాన్ ఢీ... 1500 కోళ్ల లూటీ
అక్కలదేవిగూడెం(చివ్వెంల) అతివేగంగా వస్తున్న పాల వ్యాన్ డీసీఎంను ఢీకొట్టి అదుపుతప్పి ఫల్టికొట్టింది. ఈసంఘటన మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి వెళ్తున్న కోళ్ల లోడు డీసీఎంను ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు వస్తున్న పాల వ్యాన్ ఎదురుగా ఢీకొట్టింది, ప్రమాదంలో డీసీఎం అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో సంఘటన స్థల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో తరలివచ్చి కోళ్లను ఆటోల్లో, మోపెడ్లపై తీసుకువెళ్లారు. కాగా ప్రమాదంతో జనం కోళ్లకోసం రహదారిపైకి రావడంతో సుమారు గంట సేపు ట్రాఫిక్ స్తంబించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. కాగా ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అశోక్, సూపర్వైజర్నర్సింహకు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో సూర్యాపేటకు తరలించారు. ఈఘటనలో 1500 కోళ్లు లూటి అయి.రూ. 5లక్షల నష్టం వాటిళ్లినట్లు బాధితులు తెలిపారు. -
ఘనంగా బెతస్థ ప్రార్థన మందిరం వార్షికోత్సవం
ఖాసీంపేట(చివ్వెంల) : మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ ఆవాసం ఖాసీంపేట గ్రామంలోని బెతస్థ ప్రార్థన మందిర 9వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాస్టర్స్ అసోషియేషన్ నియోజక వర్గ అధ్యక్షుడు దుర్గాం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఐకమత్యంగా కలిసి మెలిసి జీవించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 1000 మందికి అన్నదానం చేశారు. ఈకార్యక్రమంలో బిషప్ నయోమియా ఎస్. రావు, చివ్వెంల, ఆత్మకూర్(ఎస్) మండల ఫాస్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు గుగలోతు బాలాజీ నాయక్, మత్తయ్య, ఎలియాజ్, జాకబ్, గండూరి రామస్వామి, రూబెన్ తదితరులు పాల్గొన్నారు. -
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్లేట్ల పంపిణీ
బి.చందుపట్ల(చివ్వెంల) : గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట చేస్తున్న సేవలు అభినందనీయమని మండల విద్యాధికారి కట్టా యల్లారెడ్డి అన్నారు. మంగళవారం సంస్థ ఆధ్వర్యంలో బి.చందుపట్ల ప్రాథమిక పాఠశాలలోని 243 మంది విద్యార్థులకు రూ.20 వేల విలువ చేసే పెన్నులు, పుస్తకాలు, ప్లేట్లు అందజేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ రతిరాం నాయక్, లయన్స్ క్లబ్ చైర్మన్ బండారి రాజా, సభ్యులు యామా రామ్మూర్తి, భోనగిరి విజయ్‌కుమార్, యాదా కిరణ్, బజ్జూరి శ్రీహరి, ఏనుగుల లింగారెడ్డి, హెచ్ఎం నూకల వెంకట్‌రెడ్డి , ఉపాధ్యాయలు క్రిష్ణ, రవీందర్, పద్మజ, కమల తదితరులు పాల్గొన్నారు, -
సూర్యాపేట- ఖమ్మం రహదారిపై ప్రమాదం
చివ్వెంల(నల్లగొండ): సూర్యాపేట- ఖమ్మం రహదారిపై ఎదురెదురుగా వచ్చిన కారు, ఆటో ఢీకొన్న ఘటనలో మహిళలు, చిన్నారులు సహా 14 మంది గాయపడ్డారు. నల్లగొండ జిల్లా చివ్వెంల మండల శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆటో సూర్యాపేట నుంచి ప్రయాణికులతో చివ్వెంల వస్తుండగా, కారు.. ఖమ్మం నుంచి సూర్యాపేట వైపునకు ప్రయాణిస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ 14 మందీ ఆటోలో ప్రయాణిస్తున్నవారే కావటం గమనార్హం. రోడ్డుపై పడిపోయిన క్షతగాత్రులను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. -
వికటించిన మధ్యాహ్న భోజనం
చివ్వెంల (నల్లగొండ) : కలుషిత భోజనం తిని 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో సోమవారం జరిగింది. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని 108 సాయంతో సూర్యాపేట ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
గంజాయి పట్టివేత
చివ్వెంల (నల్లగొండ) : అక్రమంగా గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శనివారం నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలో జాతీయరహదారి-65 పై జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు చెందిన సైది రెడ్డి, నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు దురాజ్‌పల్లిలో గంజాయిని విక్రయిస్తున్నారు. కాగా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 5వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే వీరితోపాటు ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, డిప్లొమా కాలేజీలు ఉండటంతో విద్యార్థులకు గంజాయిని విక్రయించేందుకు నిందితులు వచ్చినట్లు సమాచారం.