Published
Mon, Aug 15 2016 11:25 PM
| Last Updated on Sun, Apr 7 2019 4:37 PM
ఘనంగా తీజ్ వేడుకలు
చివ్వెంల :మండల పరిధిలోని లక్ష్మణ్‌నాయక్‌తండా, గీష్యాతండా, మంగళితండ, జంటభావ్‌సింగ్ తండా, హున్యానాయక్‌తండాలో సోమవారం గిరిజనులు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులుగా తండాలకు చెందిన యువతులు ఉపవాస దీక్షలతో వరి ధాన్యం, గోధుమలను వెదురు బుట్టలలో ఉంచారు. మొలకెత్తే వరకు ప్రతి రోజు మూడుసార్లు నీరు పోసి తొమ్మిదవ రోజు మొలకను తీసి బతుకమ్మగా పేర్చి గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, టీఆర్‌ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బుసైదులు గౌడ్, సర్పంచ్‌లు ధరావత్ వెంకన్న నాయక్, పుత్లీభేగం, ఎంపీటీసీ సభ్యులు గుగులోతు బిక్కి, నాయకులు చీమ క్రిష్ణ, గుగులోతు నాగునాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.