ఘనంగా బెతస్థ ప్రార్థన మందిరం వార్షికోత్సవం
ఖాసీంపేట(చివ్వెంల) : మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ ఆవాసం ఖాసీంపేట గ్రామంలోని బెతస్థ ప్రార్థన మందిర 9వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాస్టర్స్ అసోషియేషన్ నియోజక వర్గ అధ్యక్షుడు దుర్గాం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఐకమత్యంగా కలిసి మెలిసి జీవించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 1000 మందికి అన్నదానం చేశారు. ఈకార్యక్రమంలో బిషప్ నయోమియా ఎస్. రావు, చివ్వెంల, ఆత్మకూర్(ఎస్) మండల ఫాస్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు గుగలోతు బాలాజీ నాయక్, మత్తయ్య, ఎలియాజ్, జాకబ్, గండూరి రామస్వామి, రూబెన్ తదితరులు పాల్గొన్నారు.