
సాక్షి, సూర్యాపేట జిల్లా: రహస్యంగా ప్రేమజంటల ఫొటోలు, వీడియోలు తీస్తున్న యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామ శివారులో వెలసిన శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో పాటు, పరిసర ప్రాంతాల్లో కట్టడాలను చూసేందుకు వస్తున్న ప్రేమ జంటలను రహస్యంగా సెల్‌ఫోన్‌లో చిత్రికరిస్తున్నాడు.
దీనిని గమనించిన వారు ఫోన్ లాక్కుని చూడగా అందులో అప్పటికే ఇంతకు ముందు తీసిన 40 వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అక్కడే ఉన్న స్థానికులకు విషయం చెప్పడంతో వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు.
చదవండి: పెళ్లై 40 రోజులు.. ఏమైందో ఏమో.. బయటకు వెళ్తున్నానని చెప్పి!
Comments
Please login to add a commentAdd a comment