కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను ఎంతలా తలకిందులు చేస్తున్నా, ఇప్పటికీ కొందరు వైరస్ పట్ల అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. చెరువులోని చేపలను దక్కించుకునే క్రమంలో కరోనా నిబంధనలను సైతం పక్కనపెట్టేశారు. ఈ ఘటన చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులోని పెద్ద చెరువులో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ మునీర్ ఖాన్ రూ.1.75 లక్షలకు గ్రామ పంచాయతీ వేలంపాటలో పెద్ద చెరువును కైవసం చేసుకున్నాడు.
జూన్ 8 వరకు చెరువులో చేపలు పట్టుకునేందుకు ఆయనకు అవకాశం ఉంది. గురువారం చేపలు పట్టుకునేందుకు మునీర్ ఖాన్ చెరువు వద్దకు రాగా, అప్పటికే చుట్టుపక్కల గ్రామాలైన వాల్యతండా, వట్టిఖమ్మంపహాడ్, జగనా తండా, మంగళితండా, అక్కలదేవి గూడెం నుంచి వందల సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా వచ్చి చెరువులోకి దిగారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలను పక్కనబెట్టి మరీ చేపలను లూఠీ చేశారు. దీంతో కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ప్రజలను చెదరగొట్టారు.
– చివ్వెంల (సూర్యాపేట)
చదవండి:
హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..!
Comments
Please login to add a commentAdd a comment