తాగునీటి కోసం గిరిజనుల ధర్నా
తాగునీటి కోసం గిరిజనుల ధర్నా
Published Wed, Aug 3 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
చివ్వెంల : తాగునీటి కోసం మండల పరిధిలోని లక్ష్మణ్‌నాయక్‌తండా గ్రామ ఆవాసం బులాకి తండాకు చెందిన గిరిజనులు« ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తండాలో తాగునీటి వసతి లేక గత రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల క్రితం ఆర్‌డబ్ల్యూస్ ఆధ్వర్యంలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తామని హమీ ఇచ్చారని, కాని ఒక్కరోజు మాత్రమే నీరు సరఫరా చేసి ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయమై స్థానిక సర్పంచ్, కార్యదర్శికి చెప్పిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ జె.వెంకటేశ్వర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో సుమారు 100 మంది గిరిజనులు పాల్గొన్నారు.
Advertisement