పాలనా సౌలభ్యం కోసమే నూతన జిల్లాలు
పాలనా సౌలభ్యం కోసమే నూతన జిల్లాలు
Published Sun, Oct 9 2016 10:30 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
దురాజ్‌పల్లి(చివ్వెంల) : పాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులో గల కామాక్షి ఇంజనీరింగ్ కళాశాలలో ఎర్పా టు చేసిన కలెక్టరేట్‌ను సందర్శించారు. కార్యాలయంలో వివిధ శాఖలకు కేటాయించిన గదులను పరిశీలించారు. దసరా రోజు నుంచే నూతన జిల్లాల్లో పాలన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వ కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బంగారు తెలంగాణ సాధనలో భాగమని, తెలంగాణ సమాజాన్ని దేశస్థాయిలో గుర్తుంచుకునే వి«ధంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిరుద్యోగ యువతీ, యువకులను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ దసరా నుంచే నూతన జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ, మండలాలు, గ్రామాలు ఆమల్లోకి వస్తాయన్నారు. సంబంధిత శాఖల అవసరానికి అనుగుణంగా అధికారులను, సిబ్బందిని సర్దుబాటు చేసినట్లు తెలిపారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ సత్యరాయరణ, ఆర్డీఓ నారాయణరెడ్డి, ఎంపీపీ కల్పగిరి యశోద, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ భాషా, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బు సైదులు గౌడ్, నాయకులు గండూరి ప్రకాశ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, కొణతం అప్పిరెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement