Durajpalli
-
పర్యాటక ప్రదేశాల ఖిల్లా.. సూర్యాపేట జిల్లా
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా అలరారుతోంది. జిల్లాలో అతి పురాతన కట్టడాలు సంస్కృతికి అద్దం పడుతాయి. తెలంగాణ– ఆంద్రప్రదేష్ రాజాధానులకు 143 కిలో మీటర్ల సమాన దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో అనేక అపురూప కట్టడాలు పర్యాటక ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలు పర్యాటకులకు కను విందుగొలుపుతాయి. పురాతన కట్టడాలు, ఎతైన కొండలు, దట్టమైన అడవులు, ప్రాచీన శిలాయుగం నాటి రాక్షసగుళ్ళు, క్రీస్తు పూర్వం నాటి భౌద్దస్తూపాలు, కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి శివాలయాలు, అపురూప శిల్పలు, మండపాలు, మూసి రిజర్వయర్ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా. కాకతీయుల కళ నైపుణ్యం అద్దం పటే పిల్లలమర్రి... జిల్లా కేంద్రానికి 3 కిలో మీటర్ల దూరంలో 65 నెంబర్ జాతీయ రహదారికి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామం కాకతీయుల కాలంనాటి శివాలయాలు వారి కాల నైపుణ్యానిక అద్దం పడుతున్నాయి. క్రి.శ 1203లో కాకతీయ సామంతరాజు అయిన రేచర్ల వంశానికి చెందిన బేతిరెడ్డి పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించినట్లు శిలాశాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ నిర్మించిన శివాలయాలు ఎంతో ప్రసిద్ది చెందాయి. ఎర్రకేశ్వర ఆలయం, త్రికూటేశ్వరాలయం, నామేశ్వరాలయాలు కాకతీయుల కళానైపుణ్యానికి అద్దం పడుతాయి. శిలాశాసనాలు, వైవిద్యభరితమైన శిల్పాలు ఈ ఆలయాలలో ఉంటాయి. సప్త స్వరాలను వినిపించే రాలిస్తంబం, రాతి కట్టడాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయాలలో వార్షిక ఉత్సవాలు ఫిబ్రవరి– మార్చి మాసంలో జరుగుతాయి. ఇక పిల్లలమర్రి పినవీరభద్రుడు జన్మించిన గ్రామం పిల్లలమర్రి. ఫణిగిరిలో ప్రసిద్ధ భౌద్ధక్షేత్రం.... జిల్లా కేంద్రానికి 40 కిలో మీటర్ల దూరంలో జనగాం రహదారిపై ఉన్న ఫణిగిరి గ్రామం ప్రసిద్ద బౌద్ధక్షేత్ర పర్యాటక ప్రదేశంగా వెలుగొంతున్నది. ఫణిగిరి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో క్రీ. పూ 1–3 ఎడి శతాబ్దం నాటి భౌద మహాస్తూపం, మందమైన ఇటుకలతో నిర్మాంచిన చైత్యగదులు, విహారాలు, పాలరాతి శిల్పాలు,భౌద జాతక కథలతో చెక్కిన తోరణాలు, బ్రహ్మలిపిలో ఉన్న శిలా శాసనాలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతాయి. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో రోమన్ రాజుల కాలంనాటి బంగారు, వెండి, గాజు, రాగి, నాణాలు దొరికాయి. వీటియి కొండపై భద్రపరిచారు. ఇలా తొవ్వకాలలో బయటపడిన వస్తువులు ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లకు ఆధారాలుగా నిలుస్తున్నాయి పురాతన గిరిదుర్గం.. ఉండ్రుగొండ ప్రసిద్ధి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన పురాతన గిరిదుర్గంగా ప్రసిద్ధి పొందిన కట్టడాలు ఉన్న ప్రాంతం ఉండ్రుగొండ. జిల్లా కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉండ్రుగొండ చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. చుట్టు కొండలు, దట్టమైన అడవి మద్య ఆద్యత్మికత ఉట్టి పడే విధంగా లక్ష్మీ నర్సింహ్మస్వామి ఆలయం ఉంటుంది. దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఉండ్రుగొండ కోట చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. 1370 ఎకరాల విస్తీర్ణంలో నిగనిగలాడే చెట్ల చెట్ల మద్య 9 కొండలను కలుపుతూ 14 కిలో మీటర్ల పొడవులన నిర్మించిన ఎత్తైన దుర్గప్రాకారాలు, కొలనులు, కొండపైన ఉన్న గొలుసుకట్టు నీటి కుంటలు, గృహాల దార్మికతను వెల్లివిరిసే పురాతన దేవాలయాలు ఉండ్రుగొండ ప్రత్యేకత. శాతవాహనులు, కళ్యాణచాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహాన్లు, రేచర్లరెడ్డి రాజులు, పద్మనాయకులు ఈ కోటను అభివృధ్ది చేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ గుట్టలపై శ్రీ లకక్ష్మీ నరసింహస్వామి, గోపాలస్వామి, కాలభైరవుడు, రాజభవనాలు, నర్తకీమణుల గృమాలు, బోగందానిగద్దెమంటపం, చాకలిబావి, మంత్రిబావి, నాటి చారిత్రక వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. కొండపై నుంచి నాగుల పాహడ్శివాలయం వరకు సొరంగమార్గం ఉండేదని ఈ ప్రాంత ప్రజలు చెపుతుంటారు. తెలంగాణ అతి పెద్ద జాతర... పెద్దగట్టు లింగన్న జాతర తెలంగాణలో సమ్మక్క– సారలమ్మ జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతర జరిగేది సూర్యాపేట జిల్లాలోనే. సూర్యాపేటకు 7 కిలో మీటర్ల దూరంలో దురాజ్‌పల్లి గ్రామంలో ఉన్న పెద్దగట్టు(గొల్లగట్టు) ఏటేటా అభివృద్ధిచెందుతూ పర్యాటక ప్రదేశంగా ఎదుగుతున్నది. ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరిన మొక్కులను తీర్చే స్వామిగా పేరొందిన లింగన్న దర్శనానికి ఇప్పుడు ప్రతి రోజు భక్తులు వస్తున్నారు. మత సమైక్యతకు చిహ్నం.. జానపహడ్ దర్గా.. కుల మతాలకు అతీతంగా దర్శించుకునే ప్రదేశం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్‌పహడ్ దర్గా.. 4 శతాబ్దాల చరిత్ర గల ఈ ధర్గాలో హజ్రత్ సయ్యద్ మోహినుద్ధీన్షా, జాన్సాక్షహిద్రహమత్తుల్లా సమాధులు ఉన్నాయి. ఈ దర్గాను మానవత్వనికి, త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ ఉర్సు సందర్భంగా పంచే గందానికి ప్రత్యేకత ఉంది. ఈ దర్గా పర్యాటక ప్రదేశంగా కొనసాగుతున్నది. ఇవే కాకుండా ప్రత్యేక గల అనేక దేవాలయాలు, కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాగులపహడ్ శివాలయం, మట్టంపల్లి లక్ష్మినర సింహస్వామి ఆలయం, సూర్యాపేట వెంకటేశ్వరస్వామి దేవాలయ, మిర్యాలలో సీతరామచంద్రస్వామి దేవస్థానం, అర్వపల్లిలో లక్ష్మినరసింహస్వామి ఆలయం, దర్గా తదితర ప్రదేశాలు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. -
పాలనా సౌలభ్యం కోసమే నూతన జిల్లాలు
దురాజ్‌పల్లి(చివ్వెంల) : పాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులో గల కామాక్షి ఇంజనీరింగ్ కళాశాలలో ఎర్పా టు చేసిన కలెక్టరేట్‌ను సందర్శించారు. కార్యాలయంలో వివిధ శాఖలకు కేటాయించిన గదులను పరిశీలించారు. దసరా రోజు నుంచే నూతన జిల్లాల్లో పాలన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వ కార్యకలాపాలు అక్కడి నుంచే కొనసాగుతాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బంగారు తెలంగాణ సాధనలో భాగమని, తెలంగాణ సమాజాన్ని దేశస్థాయిలో గుర్తుంచుకునే వి«ధంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిరుద్యోగ యువతీ, యువకులను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కలెక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ దసరా నుంచే నూతన జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ, మండలాలు, గ్రామాలు ఆమల్లోకి వస్తాయన్నారు. సంబంధిత శాఖల అవసరానికి అనుగుణంగా అధికారులను, సిబ్బందిని సర్దుబాటు చేసినట్లు తెలిపారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ సత్యరాయరణ, ఆర్డీఓ నారాయణరెడ్డి, ఎంపీపీ కల్పగిరి యశోద, జిల్లా కోఆప్షన్ సభ్యుడు షేక్ భాషా, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పబ్బు సైదులు గౌడ్, నాయకులు గండూరి ప్రకాశ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, కొణతం అప్పిరెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ కార్యాలయాన్ని సందర్శించిన అధికారులు
దురాజ్‌పల్లి(చివ్వెంల) : మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులోని కామాక్షి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో భాగంగా తమ శాఖలకు కేటాయించిన గదులను డీపీఓ పి.ప్రభాకర్ రెడ్డి, డీపీఆర్ఓ డి.నాగార్జునలు మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా డీపీఓ మాట్లాడుతూ అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఈఓఆర్డీలు గోపి, లక్ష్మీ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకుంటాం
దురాజ్‌పల్లి (చివ్వెంల) : నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్పీఓ వి.సురేష్‌మోహన్ అన్నారు. గురువారం మండలంలోని దురాజ్‌పల్లి గ్రామ శివారులో అక్రమంగా చేసిన వెంచర్లను పరిశీలించారు. నిబంధలనకు విరుద్ధంగా చేసిన వెంచర్లలో హద్దురాళ్లను తొలగించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట, చివ్వెంల మండలాల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా, నాలా పన్ను కట్టకుండా అక్రమంగా చేసిన చివ్వెంల మండలం బీబిగూడెం, కుడకుడ, దురాజ్‌పల్లి, సూర్యాపేట మండలం గాంధీనగర్, పిల్లలమర్రి, రాయిన్‌గూడెం గ్రామాల్లోని వెంచర్లను తొలగించాలని కార్యదర్శులను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి లేని వెంచర్లలో ఎవరు ప్లాట్లు కోనుగోలు చేయవద్దన్నారు. ఈ సమావేశంలో ఈఓఆర్డీలు లక్ష్మి, గోపి, సూర్యాపేట, చివ్వెంల మండలాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
దురాజ్‌పల్లి(చివ్వెంల) : ఆరోగ్య తెలంగాణ నిర్మాణంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు భాగస్వాములు కావాలని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు తన్నీరు సత్యనారాయణ కోరారు. ఆదివారం మండల పరిధిలోని దురాజ్‌పల్లిలో నిర్వహించిన ఆసంఘం మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50 వేల మంది ఆర్ఎంపీలు (రూరల్ మెడికల్ ప్రాక్టిషనర్) లకు శాస్త్రీయంగా పారామెడికల్ శిక్షణను ప్రభుత్వ ఆస్పత్రిలో పునర్ ప్రారంభించారు. శిక్షణ పూర్తిచేసిన గ్రామీణ వైద్యులకు పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. సభ్యులంతా ఐక్యమత్యంగా కలిసి మెలిసి ఉండాలని, సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఈసందర్భంగా మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. అధ్యక్షుడిగా మల్లేబోయిన వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా డి.అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా వి.సత్యం, పూర్ణచందర్రావు నాగరాజులను ఎనుకున్నారు. ఎన్నికల అధికారిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రమాశంకర్ వ్యవహరించిన ఈకార్యక్రమంలో సీనియర్ నాయకుడు వెంకన్న గౌడ్, తిరుపతి, శోభన్‌బాబు, నర్సింహచారి తదితరులు పాల్గొన్నారు. -
అనాథాశ్రమంలో అన్నదానం
దురాజ్‌పల్లి(చివ్వెంల) : దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ఆలేటి ఆటం వరల్డ్ అనాథాశ్రమంలో ఆదివారం సూర్యాపేట పట్టణానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా 64 మందికి అన్నదానం చేసి పండ్లు. బ్రెడ్డు అందజేశారు. అదేవిధంగా ఆశ్రమానికి వంట సామగ్రి అందజేశారు. ఈకార్యక్రమంలో అబ్దుల్ రహిం, కొక్కు సోమేశ్వర్రావు, బి.గోపాల్, టి.నర్సింహారావు, జి.ప్రవీణ్, అంతటి సైదులు, కె.రామక్రిష్ణ. సీహెచ్ నర్సింహారావు, పబ్బు రఘు, పిల్లల హరీష్, మేకల వెంకన్న, ఉప్పల రాజా, టి.నవీన్, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనాథాశ్రమంలో దుప్పట్ల పంపిణీ
దురాజ్‌పల్లి(చివ్వెంల) : మాజీ రాజ్యసభ సభ్యుడు, టీడీపీ సీనియర్ నాయకుడు ఆకారపు సుదర్శన్ 5 వ వర్ధంతిని ఆపార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా దురాజ్‌పల్లి గ్రామ శివారులోని ఆలేటి ఆటం వరల్డ్ అనాథాశ్రమంలో దుప్పట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆయన సతీమణి మేరమ్మ, కుమారుడు ఆకారపు రమేష్, టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జ్ పటేల్ రమేష్‌రెడ్డి, పగడాల లింగయ్య, ధారోజు జానకి రాములు, జుట్టుకొండ సత్యనారాయణ, పెద్ది రెడ్డి రాజా, ఎండీ మునీర్ ఖాన్, బొలికొండ సైదులు, కంచర్ల గోవిందరెడ్డి, పల్స ఉపేందర్‌గౌడ్, సోమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గండి కోట లక్ష్మయ్య, నేరెడ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు. -
జనగట్టు
భక్తులతో పోటెత్తిన దురాజ్‌పల్లి పెద్దగట్టు తెలంగాణలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరైన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగ మంతులస్వామి ఉత్సవానికి(పెద్దగట్టు) సోమవారం భక్తులు పోటెత్తారు. యాదవులు తమ ఆరాధ్యదైవాలైన లింగమంతులస్వామి, సౌడమ్మ తల్లికి బోనం చెల్లించి నైవేద్యం పెట్టారు. గొర్రెపొట్టేళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సోమవారం ఒక్కరోజే సుమారు 8 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. జాతర మరో మూడు రోజులపాటు కొనసాగనుంది. -
భక్తులపాలిట కొంగుబంగారం.. దురాజ్‌పల్లి లింగన్న
శివుడు సర్వాంతర్యామి... ప్రతి ప్రాణిలో శివమే జీవం.. అటువంటి శివం భూమిపై లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. కానీ విగ్రహ స్వరూపంలో దర్శనమిచ్చేది అతి తక్కువగానే. శివుడు అలా భక్తులకు దర్శనమిచ్చే ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్రంలో పేరొందింది నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతులస్వామి జాతర. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు ఉన్న ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు లింగమంతులస్వామి జాతర, యాదవగట్టు, గొల్లగట్టు, పెద్దగట్టు జాతరగా పేర్లు ఉన్నాయి. యాదవులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తూ ఉంటారు. ఈ నెల 8 నుంచి 12వరకు జాతర నిర్వహించనున్నారు. ఈ ప్రాంతవాసులు దురాజ్‌పల్లి జాతర గురించి రకరకాలుగా చెప్పుకుంటుంటారు. చాలా ఏళ్ల క్రితం దురాజ్‌పల్లి ప్రాంతం దట్టమైన అభయారణ్యంలో ఉండేది. వల్లభాపురం, ఉండ్రుగొండ, కాశీంపేట, దురాజ్‌పల్లి ప్రాంతాల యాదవులు తమ గొర్రెల మందలను తెచ్చి ఈ ప్రాంతంలో మేపే వారు. ఈ ప్రాంతంలో క్రూరమృగాలు కూడా అధిక సంఖ్యలో ఉండేవి. మేత కోసం వచ్చిన గొర్రెలు, మేకలను వందల సంఖ్యలో చంపి తినేవి. దీంతో యాదవులు దిక్కుతోచని స్థితిలో పరమశివుడికి మొరపెట్టుకున్నారు. దీంతో శివుడు లింగమంతులస్వామిగా గుర్రంపై త్రిశూలధారి అయి ఈ ప్రాంతంలో సంచరిస్తూ క్రూరమృగాలను వధించసాగాడు. ఎన్ని క్రూరమృగాలను వధించినా, రాక్షసమాయ మూలంగా వాటి రక్తపు చుక్కలు భూమిపై పడగానే మళ్లీ పుడుతుండటంతో లింగమంతులస్వామి సోదరి సౌడమ్మ ఆ స్థలంలో మృగాల రక్తపు చుక్కలు కిందపడకుండా నాలుకను చాపి, నాకడంతో మృగాలన్నీ మృతి చెందాయి. యాదవులు కృతజ్ఞతగా శివుడికి పిల్లతల్లి గొర్రెను బలి ఇవ్వాలనుకున్నారు. శివుడు తాను శాకాహారినని, తమ సోదరి సౌడమ్మకు బలివ్వమనడంతో వారు సౌడమ్మకు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అప్పుడు యాదవులు శివుడిని ఇక్కడే ఉండాల్సిందిగా వేడుకోవడంతో సమీపంలోని ఉండ్రుగొండ గుట్టల్లో వెలిశాడు. కాలక్రమంలో ఓ యాదవ మహిళ నిండు గర్భంతో లింగమంతులస్వామిని దర్శించుకునేందుకు గుట్ట మెట్లు ఎక్కుతుండగా కాలు జారి కిందపడి గర్భవిచ్ఛిత్తి జరిగి మృతి చెందింది. దాంతో చలించిన శివుడు ఉండ్రుగొండ గుట్టపై నుంచి దురాజ్‌పల్లిలోని పెద్దగట్టుపై వెలిశాడని కథనం. మరో కథనం.. పూర్వం పెద్దగట్టు సమీపంలో కేసారంగ్రామానికి చెందిన గొర్ల లింగారెడ్డి, మరికొందరు గొర్రెల కాపరులుగా అక్కడకు చేరుకున్నారు. గొర్రెలు మేస్తుండగా గొర్ల భిక్షంరెడ్డి చెట్టుకింద నిద్రకు ఉపక్రమించారు. నిద్రలో లింగారెడ్డికి శివుడు ప్రత్యక్షమై తాను మర్రిచెట్టు సమీపంలో గల బావిలో పూడుకుపోయాయని, తనను వెలికి తీసి ప్రతిష్ఠించాలని చెప్పి అదృశ్యమయ్యాడు. వెంటనే మేలుకొన్న అతను ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పి మరుసటి రోజు బావిలో వెతకగా గుర్రంపై త్రిశూలధారిగా ఉన్న శివుడి విగ్రహం బయటపడింది. అందరూ కలిసి ఆ విగ్రహాన్ని వెలికి తీసి పెద్దగట్టుపై ప్రతిష్ఠించి జాతర జరుపుతున్నారు. ఇప్పటికి కేసారం గొర్ల వంశీయులు దేవుడికి గొర్రెలను బలివ్వడం, దేవరపెట్టెకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న జాతర కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. రెండువందల ఏళ్లుగా పూజలు - గొర్ల గన్నారెడ్డి, కేసారం రెండువందల ఏళ్లుగా తాతల కాలం నుంచి గట్టుజాతరలో పూజలు చేస్తున్నాం. తమ కోర్కెలు నెరవేరుతున్నందున భక్తుల సంఖ్య అశేషంగా పెరిగింది. గ్రామంలోని మెంతబోయిన వంశస్తులు పూజలు చేయడంతో జాతర ప్రారంభమవుతుంది.