జనగట్టు
భక్తులతో పోటెత్తిన దురాజ్‌పల్లి పెద్దగట్టు
తెలంగాణలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరైన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగ మంతులస్వామి ఉత్సవానికి(పెద్దగట్టు) సోమవారం భక్తులు పోటెత్తారు. యాదవులు తమ ఆరాధ్యదైవాలైన లింగమంతులస్వామి, సౌడమ్మ తల్లికి బోనం చెల్లించి నైవేద్యం పెట్టారు.
గొర్రెపొట్టేళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సోమవారం ఒక్కరోజే సుమారు 8 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. జాతర మరో మూడు రోజులపాటు కొనసాగనుంది.