Samakka
-
సమక్క చరిత్ర తెలియాలంటే.. దీన్ని డీకోడ్ చేయాల్సిందే
-
అనాథనంటూ వచ్చి.. అడ్డం తిరిగాడు..
పెళ్లి చేసుకుని జారుకున్నాడు.... చిట్టినగర్ : మీ బిడ్డగా పెరుగుతానంటే నిజమేనని నమ్మిన ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగల్చడమే కాకుండా ఎదురు కిడ్నాప్ కేసు పెట్టిన ఘటన కొత్తపేట ఆంజనేయ వాగు సెంటర్లో చోటు చేసుకుంది. కొత్తపేట ఆంజనేయ వాగు బ్రహ్మయ్య వీధికి చెందిన బత్తుల మంగ ఒడ్రు పని చేస్తుంది. ఆమెకు సమీప బంధువైన రాములు చిట్యాలలో కోళ్ల ఫారంలో పనిచేస్తుంటాడు. ఐదేళ్ల కిందట రాములు బస్టాండ్‌లో పరిచయమైన ఒక యువకుడి(16)ని తెచ్చి మంగకు అప్పగించాడు. మంగ తన ముగ్గురు బిడ్డలతో సమానంగా ఆ యువకుడిని పెంచి ప్రసాద్‌గా నామకరణం చేసింది. తెలంగాణ రాష్ర్టం కోరుట్లకు చెందిన తన దూరపు బంధువు సమ్మక్కకు ఇచ్చి వివాహం జరిపించడమే కాకుండా తన ఇంటి పక్కనే ఓ ఇంటిని కట్టించి ఇచ్చింది. అయితే మూడు నెలల కాపురం తర్వాత ఓ రోజు బయటకు వెళ్లి వస్తానని చెప్పిన ప్రసాద్ తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది. కాగా, హైదరాబాద్ చేరుకున్న ప్రసాద్ తన పేరు రాము అని, తనను విజయవాడకు చెందిన కొంతమంది కిడ్నాప్ చేశారంటూ బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై కొత్తపేట సీఐ దుర్గారావుకు వివరణ అడగగా ప్రసాద్ కనిపించకుండా పోయాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కేసు కొత్త మలుపు తిరగడంతో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఇదిలా ఉండగా, బీసీ సంఘాల నేతలు బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. -
జనగట్టు
భక్తులతో పోటెత్తిన దురాజ్‌పల్లి పెద్దగట్టు తెలంగాణలో సమ్మక్క, సారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరైన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగ మంతులస్వామి ఉత్సవానికి(పెద్దగట్టు) సోమవారం భక్తులు పోటెత్తారు. యాదవులు తమ ఆరాధ్యదైవాలైన లింగమంతులస్వామి, సౌడమ్మ తల్లికి బోనం చెల్లించి నైవేద్యం పెట్టారు. గొర్రెపొట్టేళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సోమవారం ఒక్కరోజే సుమారు 8 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. జాతర మరో మూడు రోజులపాటు కొనసాగనుంది.