అనాథనంటూ వచ్చి.. అడ్డం తిరిగాడు.. | escape an abusive marriage | Sakshi
Sakshi News home page

అనాథనంటూ వచ్చి.. అడ్డం తిరిగాడు..

Published Sat, Jul 18 2015 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

అనాథనంటూ వచ్చి.. అడ్డం తిరిగాడు..

అనాథనంటూ వచ్చి.. అడ్డం తిరిగాడు..

పెళ్లి చేసుకుని జారుకున్నాడు....
 
చిట్టినగర్ :  మీ బిడ్డగా పెరుగుతానంటే నిజమేనని నమ్మిన ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగల్చడమే కాకుండా ఎదురు కిడ్నాప్ కేసు పెట్టిన ఘటన కొత్తపేట ఆంజనేయ వాగు సెంటర్‌లో చోటు చేసుకుంది. కొత్తపేట ఆంజనేయ వాగు బ్రహ్మయ్య వీధికి చెందిన బత్తుల మంగ ఒడ్రు పని చేస్తుంది. ఆమెకు సమీప బంధువైన రాములు చిట్యాలలో కోళ్ల ఫారంలో పనిచేస్తుంటాడు. ఐదేళ్ల కిందట రాములు బస్టాండ్‌లో పరిచయమైన ఒక యువకుడి(16)ని తెచ్చి  మంగకు అప్పగించాడు. మంగ తన ముగ్గురు బిడ్డలతో సమానంగా ఆ యువకుడిని పెంచి ప్రసాద్‌గా నామకరణం చేసింది. తెలంగాణ రాష్ర్టం కోరుట్లకు చెందిన తన దూరపు బంధువు సమ్మక్కకు ఇచ్చి వివాహం జరిపించడమే కాకుండా తన ఇంటి పక్కనే ఓ ఇంటిని కట్టించి ఇచ్చింది.

అయితే మూడు నెలల కాపురం తర్వాత ఓ రోజు బయటకు వెళ్లి వస్తానని చెప్పిన ప్రసాద్ తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది. కాగా, హైదరాబాద్ చేరుకున్న ప్రసాద్ తన పేరు రాము అని, తనను విజయవాడకు చెందిన కొంతమంది కిడ్నాప్ చేశారంటూ  బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై కొత్తపేట సీఐ దుర్గారావుకు వివరణ అడగగా ప్రసాద్ కనిపించకుండా పోయాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కేసు కొత్త మలుపు తిరగడంతో దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఇదిలా ఉండగా, బీసీ సంఘాల నేతలు బాధితురాలికి అండగా నిలుస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement