టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో మరో శుభకార్యం జరగనుంది. గతేడాది చైతూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయన వివాహమాడారు. అంతకుముందే అఖిల్ అక్కినేని సైతం ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం అఖిల్, జైనాబ్ ఈ ఏడాది మార్చి 24న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అంటే మార్చి చివరి వారంలో అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది.
అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి తేదీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చైతూ బాటలోనే అఖిల్..
అయితే అఖిల్ పెళ్లి వేడుక కూడా హైదరాబాద్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. చైతూ- శోభిత పెళ్లి మాదిరే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి వివాహా వేడుక జరగనున్నట్లు టాక్. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందే నాగచైతన్య పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినందున ఈ స్టూడియో నాగార్జున కుటుంబానికి సెంటిమెంట్‌గా కనెక్ట్ అయింది. అయితే మరోవైపు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.
ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment