చివ్వెంల (నల్లగొండ) : అక్రమంగా గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన శనివారం నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలో జాతీయరహదారి-65 పై జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు చెందిన సైది రెడ్డి, నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు దురాజ్‌పల్లిలో గంజాయిని విక్రయిస్తున్నారు. కాగా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరి వద్ద నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 5వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే వీరితోపాటు ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, డిప్లొమా కాలేజీలు ఉండటంతో విద్యార్థులకు గంజాయిని విక్రయించేందుకు నిందితులు వచ్చినట్లు సమాచారం.
గంజాయి పట్టివేత
Published Sat, Aug 15 2015 5:51 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM
Advertisement
Advertisement