వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు
Published Wed, Aug 31 2016 12:11 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
చివ్వెంల: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని బీబిగూడెం, దురాజ్‌పల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం పట్టణానికి చెందిన గోపాలదాస్ చందు స్వగ్రామం వెళ్లేందుకు బీబిగూడెం గ్రామంలో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట నిలబడి ఉన్నాడు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అదేవిధంగా దురాజ్‌పల్లి గ్రామ శివారులో సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న టాటాఏస్ అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అహ్మద్, కమతం నరేందర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement