
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
రామాయంపేట(మెదక్) : మండలంలోని కాట్రియాల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. పర్వతాపూర్ పంచాయతీ పరిధిలోని లక్యా తండాకు చెందిన అనిల్, కాట్రియాల తండాకు చెందిన మహేందర్.. కాట్రియాల స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.
బుధవారం పతాకావిష్కరణ కార్యక్రమం అనంతరం వారిద్దరూ సైకిల్‌పై వెళ్తుండగా కాట్రియాల వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో అనిల్ ఎడమ చేయి విరగగా.. మహేందర్ వీపు, తలకు గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న బాలుడు సైతం గాయపడ్డాడు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.