Published
Sun, Aug 14 2016 11:39 PM
| Last Updated on Sun, Apr 7 2019 4:37 PM
ఘనంగా తీజ్ వేడుకలు
మున్యానాయక్‌తండ(చివ్వెంల) : మండల పరిధిలోని మున్యానాయక్‌తండాలో ఆదివారం గిరిజనులు తీజ్(బతుకమ్మ) పండుగను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన యువతులు గోధుమలు, వరి ధాన్యాన్ని వెదురు బుట్టలలో ఉంచి వాటికి నీరు పోసి మొలకెత్తిన నారును బతుకమ్మగా పూజించి, గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు. దీని వల్ల మంచి భర్త రావడంతో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగా పండుతాయని గిరిజన పెద్దలు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధరావత్ రాములు, ధరావత్ రవికుమార్, కోటయ్య, శ్రావణ్, సుష్మా, రోజా, సంద్య, ఇందిర, కావేరి, సంగీత, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.