దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. ఒకే కుటుంబంలో 9 మంది దుర్మరణం! | Major Accident In Karnataka Hassan District Several Pilgrims Died | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం!

Published Sun, Oct 16 2022 9:14 AM | Last Updated on Sun, Oct 16 2022 9:14 AM

Major Accident In Karnataka Hassan District Several Pilgrims Died - Sakshi

బెంగళూరు: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. టెంపో ట్రావెలర్‌ను ఓ పాల వ్యాన్‌ ఢీకొట్టటంతో తొమ‍్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కర్ణాటకలోని హస్సాన్‌ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో టెంపో ట్రావెలర్‌ నుజ్జునుజ్జయింది. మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. 

జిల్లాలోని అర్సికేరే తాలుకాలోని గాంధీనగర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ధర్మస్థల, సుబ్రమణ్య, హసనాంబ ఆలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణమైనట్లు చెప్పారు. ‘గాంధీనగర్‌ సమీపంలో టెంపో ట్రావెలర్‌, కేఎంఎఫ్‌ పాల వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్‌ కీలక ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement