major accident
-
ఇరాన్ గనిలో పేలుడు.. 51 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్ తూర్పు ప్రాంతంలోని దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్‌లోని టబాస్ గనిలో భారీ ప్రమాదం సంభవించింది. మిథేన్ గ్యాస్ వెలువడటంతో జరిగిన పేలుడులో 51 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 20 మంది గాయపడ్డారు. మరికొందరి జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో 70 మందికి పైగా 700 మీటర్ల లోతులో పనిచేస్తున్నారని చెప్పారు. రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారులను ఆదేశించారు. -
భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏఆర్ రెహమాన్ కొడుకు
ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్‌కు భారీ ప్రమాదం తప్పింది. తమిళనాడులో జరిగిన ఓ ప్రమాదంలో అమీన్ తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఘటన జరిగి మూడు రోజులైనా ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేపోతున్నట్లు ఆమీన్ తెలిపాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ''నా టీంతో కలిసి ఓ మ్యూజిక్ వీడియో షూట్ చేస్తుండగా క్రేన్‌కు ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు.. భారీ లైట్లు కింద పడ్డాయి.ఈ ప్రమాదం జరిగిన సమయంలో నేను వాటికి కొద్ది దూరంలోనే ఉన్నాను. పైనుంచి కిందపడిన వాటిలో ఓ భారీ షాండిలియర్ కూడా ఉంది. ఏమాత్రం కాస్త అటుఇటు అయినా అవి మా తలపై పడేవి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో మా టీం అంతా షాక్‌కి గురయ్యాం. ఇప్పటికీ దాన్నుంచి తేరుకోలేకపోతున్నా. ఆ భగవంతుడు, తల్లిదండ్రులు, అభిమానుల ఆశీర్వాదం వల్లే ఆరోజు నేను ప్రమాదం నుంచి బయటపడగలిగాను. లేదంటే చాలా ఘోరం జరిగి ఉండేది'' అంటూ ఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్చేశాడు అమీన్. View this post on Instagram A post shared by “A.R.Ameen” (@arrameen) -
హైవేపై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం.. 30 మందికి గాయాలు
పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఘోర ప్రమాదం సంభవించింది. పుణె-బెంగళూరు హైవేపై ఉన్న ఓ వంతెన వద్ద ఓ ట్యాంకర్ లారీ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుణెలోని నావెల్ వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం, పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక మీడియా ప్రకారం.. ఓ ట్యాంకర్ లారీ వేగంగా వెళ్తుండాగ బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటం వల్ల పలు వాహనాలు పట్టుకోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. Horrible Accident at Navale Bridge Pune .... minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ — Nikhil Ingulkar (@NikhilIngulkar) November 20, 2022 A major accident occurred at Navale bridge on the Pune-Bengaluru highway in Pune in which about 48 vehicles got damaged. Rescue teams from the Pune Fire Brigade and Pune Metropolitan Region Development Authority (PMRDA) have reached the spot: Pune Fire Brigade pic.twitter.com/h5Y5XtxVhW — ANI (@ANI) November 20, 2022 ఇదీ చదవండి: శ్రద్ధ వాకర్ హత్య కేసు.. అడవిలో పుర్రె, దవడ స్వాధీనం చేసుకున్న పోలీసులు -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. ఒకే కుటుంబంలో 9 మంది దుర్మరణం!
బెంగళూరు: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. టెంపో ట్రావెలర్‌ను ఓ పాల వ్యాన్ ఢీకొట్టటంతో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో టెంపో ట్రావెలర్ నుజ్జునుజ్జయింది. మరికొంత మంది గాయపడినట్లు సమాచారం. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. జిల్లాలోని అర్సికేరే తాలుకాలోని గాంధీనగర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ధర్మస్థల, సుబ్రమణ్య, హసనాంబ ఆలయాలను దర్శించుకుని తిరుగు ప్రయాణమైనట్లు చెప్పారు. ‘గాంధీనగర్ సమీపంలో టెంపో ట్రావెలర్, కేఎంఎఫ్ పాల వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.’ అని పేర్కొన్నారు. Hassan, Karnataka | 9 people died in an accident involving a head-on collision between a Tempo traveller vehicle and a KMF milk vehicle near Gandhinagar in Arsikere taluka while returning home after visiting Dharmasthala, Subramanya, Hasanamba temples: Police pic.twitter.com/DTbMkbWnWI — ANI (@ANI) October 16, 2022 ఇదీ చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్ కీలక ప్రకటన -
తప్పిన పెను ప్రమాదం
కుంచనపల్లి (తాడేపల్లి రూరల్): తాడేపల్లి మండల పరిధిలోని కుంచనపల్లి జాతీయ రహదారిలో బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జిపై గురువారం అర్థరాత్రి జరిగిన పెను ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో తాడేపల్లి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంకు సంబంధించి బస్సు డ్రైవర్‌పై ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి ఎస్ఐ ప్రతాప్‌కుమార్ కేసు నమోదు చేశారు. తెనాలి నుంచి వయా గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుని అక్కడనుంచి హైదరాబాద్ వెళ్లే శ్రీ సాయికృష్ణ ట్రావెల్స్ బస్సులో తెనాలి, గుంటూరులో 35 మంది ప్రయాణికులను ఎక్కించుకుని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా కుంచనపల్లి బ్రిడ్జి వద్దకు రాగానే ఎదురుగా ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి కుడివైపునకు వెళ్లి అటు ప్రయాణిస్తున్న మరో లారీని తప్పించబోయి బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి రైలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు చక్రం ఒకటి బ్రిడ్జి అంచు భాగంలో వేలాడుతుండగా, మరో చక్రం డివైడర్‌ను ఆనుకుని బస్సు నిలిచిపోయింది. ఆ సమయంలో వెనుకనుంచి ఎటువంటి వాహనాలు రాకపోవడం వల్ల బస్సు అక్కడితో ఆగిపోయింది. హైవే మీద 60 నుంచి 100 కిలోమీటర్ల స్పీడుతో ప్రయాణిస్తూ వెళ్తున్న బస్సు ఎదురుగా ఉన్న ట్రాక్టర్‌ను గమనించక పోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏదేమైనా ప్రమాదం పెద్దదైనప్పటికీ ప్రాణనష్టం లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై బస్సులో ప్రయాణిస్తున్న ప్రకాశం జిల్లా బిళ్ళకుదురు మండలానికి చెందిన ఎ.కిషోర్ ఫిర్యాదు చేయడంతో డ్రైవర్ చక్రపాణి, ట్రావెల్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సులో డ్రైవర్‌తో పాటు సహాయకుడు కూడా లేడని, కనీసం ప్రమాదం జరిగినప్పుడు అద్దాలు పగులగొట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని ప్రయాణికులు వాపోయారు. బస్సులో ఉన్న యువకులే అద్దాలు పగలగొట్టి బయటకు రావాల్సివచ్చిందని, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ప్రయాణికుల క్షేమం గురించి ఆలోచించకుండా పరారైనట్టు కిషోర్ తెలియచేశారు. -
తప్పిన పెను ప్రమాదం
చింతపల్లి, న్యూస్‌లైన్ : నాగార్జునసాగర్-హైదరాబాద్ హైవేపై గరుడ బస్సు లో అగ్ని ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో 50 మంది ప్రయాణికులను ఎక్కించుకున్న గరుడ బస్సు రాత్రి 12:30 గంటలకు నెల్లూరుకు బయలుదేరింది. నసర్లపల్లి సమీపంలోకి రాగానే గరుడ బస్సు ఇంజన్ డిక్కీలో నుంచి పొగ వచ్చింది. గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. అప్పటికే ఇంజన్ డిక్కీలో నుంచి మంటలు రేగుతున్నాయి. అయితే మాల్ సమీపంలోకి రాగానే బస్సులో నుంచి ఒక రకమైన వాసన వస్తుండడంతో ప్రయాణికులు కూడా ఈ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పారు. దీంతో ముందుగానే ఇంజన్ డిక్కీ తెరిచి చూడడంతో ప్రమాదం తప్పింది. డిక్కీలో మంటలు రేగుతున్న విషయాన్ని ప్రయాణికులకు చెప్పడం తో వారు బస్సు నుంచి కిందకు దిగి ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు తమ వద్ద ఉన్న వాటర్ బాటిళ్లతో మం టలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వెంటనే ఫైరిం జన్‌కు, పోలీసులకు సమాచారం అంది ంచారు. దేవరకొండ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే డిక్కీలో ఉన్న సామగ్రి కొంతమేర కాలిపోయింది. అయితే మరికొద్దిసేపు విషయాన్ని గమనించకుండా అలాగే బస్సు నడిపితే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. రెండు గంటల అనంతరం మరో బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశారు. షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు బస్సు డిక్కీలో పరిమితికి మించి ప్రయాణికుల లగేజీని ఉంచడమే ప్రధా న కారణమని తెలుస్తోంది. లగేజీని అందులోకి నెట్టి ఉంచడంతో వైర్లు షార్ట్‌సర్క్యూట్ కావడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్, ప్రయాణికులు పేర్కొన్నారు.