పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఘోర ప్రమాదం సంభవించింది. పుణె-బెంగళూరు హైవేపై ఉన్న ఓ వంతెన వద్ద ఓ ట్యాంకర్ లారీ బీభత్సం సృష్టించింది. ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుణెలోని నావెల్ వంతెనపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం, పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానిక మీడియా ప్రకారం.. ఓ ట్యాంకర్ లారీ వేగంగా వెళ్తుండాగ బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటం వల్ల పలు వాహనాలు పట్టుకోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.
Horrible Accident at Navale Bridge Pune .... minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ
— Nikhil Ingulkar (@NikhilIngulkar) November 20, 2022
A major accident occurred at Navale bridge on the Pune-Bengaluru highway in Pune in which about 48 vehicles got damaged. Rescue teams from the Pune Fire Brigade and Pune Metropolitan Region Development Authority (PMRDA) have reached the spot: Pune Fire Brigade pic.twitter.com/h5Y5XtxVhW
— ANI (@ANI) November 20, 2022
ఇదీ చదవండి: శ్రద్ధ వాకర్ హత్య కేసు.. అడవిలో పుర్రె, దవడ స్వాధీనం చేసుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment