మిథేన్ గ్యాస్ లీకేజీయే కారణమన్న ప్రభుత్వం
టెహ్రాన్: ఇరాన్ తూర్పు ప్రాంతంలోని దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్‌లోని టబాస్ గనిలో భారీ ప్రమాదం సంభవించింది. మిథేన్ గ్యాస్ వెలువడటంతో జరిగిన పేలుడులో 51 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 20 మంది గాయపడ్డారు.
మరికొందరి జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో 70 మందికి పైగా 700 మీటర్ల లోతులో పనిచేస్తున్నారని చెప్పారు. రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment