deaths records
-
ఉత్తర గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
డెయిర్ అల్–బలాహ్: ఉత్తర గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీట్ లాహియా పట్టణంపై ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 87 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాయపడిన వారితో ఉత్తర గాజాలోని ఆస్పత్రులు పోటెత్తాయని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ మౌనిర్ అల్–బర్‡్ష పేర్కొన్నారు.ఆస్పత్రులపై దాడులు ఆపాలి: ఎంఎస్ఎఫ్ఉత్తర గాజాలోని ఆసుపత్రులపై వారి దాడులను వెంటనే ఆపాలని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఎంఎస్ఎఫ్)ఇజ్రాయెల్ దళాలకు పిలుపునిచ్చింది. ఉత్తర గాజాలో రెండు వారాలుగా కొనసాగుతున్న హింస, నిర్విరామ ఇజ్రాయెల్ సైనిక చర్యలు భయానక పరిణామాలను కలిగిస్తున్నాయని ఎంఎస్ఎఫ్ ఎమర్జెన్సీ కోఆర్డినేటర్ అన్నా హాల్ఫోర్డ్ తెలిపారు. ఉత్తర గాజాలో శనివారం అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది. దీంతో దాడుల సమాచారమే కాదు సహాయక చర్యలు కష్టంగా మారాయని తెలిపారు. రహస్య పత్రాలపై అమెరికా దర్యాప్తుఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ ప్రణాళికలను అంచనా వేసే రహస్య పత్రాలు లీకవడం తెలిసిందే. ఈ విషయంపై అమెరికా దర్యాప్తు చేస్తోందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 1న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా దాడులను నిర్వహించడానికి ఇజ్రాయెల్ సైనిక ఆస్తులను తరలిస్తోందని యూఎస్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన ఈ పత్రాలు సూచిస్తున్నాయి. సిన్వర్ హత్య తర్వాత గాజాలో కాల్పుల విరమించాలని అమెరికా ఇజ్రాయెల్‌ను కోరుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. తమ వాహనంపై ఇజ్రాయెల్సైన్యం చేసిన దాడిలో ముగ్గురు మృతి చెందినట్లు లెబనాన్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్‌లో పౌరుల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా బీరుట్‌తోపాటు చుట్టుపక్కల కొన్ని దాడులను తగ్గించాలని అమెరికా రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ను కోరారు.ఉత్తర గాజాలో భారీ ఆపరేషన్ ఉత్తర గాజాలోని జబాలియాలో ఇజ్రాయెల్ గత రెండు వారాలుగా భారీ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అక్కడ తిరిగి చేరిన హమాస్ మిలిటెంట్లపై ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది. యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ దళాలు జబాలియాకు తిరిగి వచ్చాయి. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత గత ఏడాది చివరి నుంచి ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టిన ఉత్తర గాజా యుద్ధంలో భారీ విధ్వంసాన్ని చవిచూసింది. -
ఇరాన్ గనిలో పేలుడు.. 51 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్ తూర్పు ప్రాంతంలోని దక్షిణ ఖొరసాన్ ప్రావిన్స్‌లోని టబాస్ గనిలో భారీ ప్రమాదం సంభవించింది. మిథేన్ గ్యాస్ వెలువడటంతో జరిగిన పేలుడులో 51 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 20 మంది గాయపడ్డారు. మరికొందరి జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో 70 మందికి పైగా 700 మీటర్ల లోతులో పనిచేస్తున్నారని చెప్పారు. రక్షణ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారులను ఆదేశించారు. -
అమెరికాలో మరో భారతీయుడి హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారతీయుల వరస మరణాలు అక్కడి భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. కాలిఫోరి్నయా రాష్ట్రంలో కేరళ కుటుంబం మొత్తం సొంతింట్లో మరణించిన వార్త మరువకముందే మరో హత్యోదంతం అమెరికాలో వెలుగుచూసింది. అలబామా రాష్ట్రంలో రహదారి వెంట హోటల్‌ను నడుపుకుంటున్న 76 ఏళ్ల ప్రవీణ్ రావూజీభాయ్ పటేల్‌ను అద్దె గది కోసం వచి్చన ఒక కస్టమర్ కాల్చి చంపారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరిగిన ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను షెఫీల్డ్ పట్టణ పోలీస్ ఉన్నతాధికారి రిక్కీ టెర్రీ గురువారం వెల్లడించారు. షెఫీల్డ్ పట్టణంలో హిల్‌క్రెస్ట్ మోటెల్ పేరుతో ఒక హోటల్‌ను ప్రవీణ్ సొంతంగా నిర్వహిస్తున్నారు. ఆ హోటల్‌కు 35 ఏళ్ల విలియం జెరిమీ మోరే అనే వ్యక్తి వచ్చి రూమ్ కావాలని ప్రవీణ్‌ను అడిగాడు. కొద్దిసేపటికే విలియం, ప్రవీణ్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. వెంటనే విలియం తన వద్ద ఉన్న గన్‌తో ప్రవీణ్‌ను కాలి్చచంపాడు. అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లోని ఇంట్లో చొరబడేందుకు ప్రయతి్నస్తుండగా పోలీసులు అరెస్ట్‌చేశారు. మూడు సార్లు తుపాకీ శబ్దం విన్నానని అక్కడే ఉన్న ఒక సాక్షి చెప్పారు. అసలు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. -
ఈజిప్టులో పలు వాహనాలు ఢీకొని... 32 మంది మృతి
కైరో: ఈజిప్టులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. కైరో–అలెగ్జిండ్రియా ప్రధాన రహదారిపై బెహీరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వెనుకే వస్తున్న కార్లు ఒకదానినొకటి ఢీకొట్టి, మంటలు చెలరేగాయి. మొత్తం 29 వాహనాలు ప్రమాదంలో చిక్కుకోగా బస్సు సహా ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో 32 మంది వరకు చనిపోగా మరో 63 మంది గాయపడ్డారు. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. -
9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి మాయమైందట!
దాదాపు 9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి ఉన్నపళాన తుడిచిపెట్టుకుపోయిందట. చివరి మంచు యుగం తుదినాళ్లలో చోటు చేసుకున్న విపరీతమైన వాతావరణ మార్పులే ఇందుకు కారణంగా నిలిచాయని అంతర్జాతీయ అధ్యయనం ఒకటే తాజాగా తేలి్చంది. అయితే నేటి ఆధునిక మానవుని పూరీ్వకులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి కూడా ఈ మహా ఉత్పాతం పరోక్షంగా కారణమైందని చెబుతోంది. చాన్నాళ్ల క్రితం. అంటే దాదాపు 9.3 లక్షల నుంచి 8.13 లక్షల ఏళ్ల క్రితం. పర్యావరణ పరంగా భూమ్మీద కనీ వినీ ఎరుగని ఉత్పాతం సంభవించింది. ఈ మహోత్పాతం వల్ల అప్పటి జనాభాలో ఏకంగా 98.9 శాతం తుడిచిపెట్టుకుపోయిందట. దాని బారినుంచి కేవలం 1,300 మంది మాత్రమే బతికి బట్టకట్టారట. మన పూరీ్వకులైన హోమోసెపియన్లు వీరినుంచే పుట్టుకొచ్చారట. చివరి మంచు యుగపు తుది నాళ్లలో ఈ పెను ఉత్పాతం జరిగింది. అధ్యయనం ఇలా... ► రోమ్‌లోని సపియెంజా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్ నిపుణులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ► ఆ యుగంలో జరిగిన తీవ్ర వాతావరణ మార్పులు మానవ జాతి వినాశనానికి కారణంగా మారినట్టు వారు తేల్చారు. ► అధ్యయనం కోసం 50కు పైగా విభిన్న దేశాలకు చెందిన 3,154 మంది సంపూర్ణ జన్యుక్రమాలను లోతుగా విశ్లేíÙంచారు. ► ఇందుకోసం ఫిట్ కోల్ అనే సరికొత్త బయో ఇన్ఫర్మాటిక్స్ పద్ధతిని అనుసరించారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంత ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► జెనెటిక్ బాటిల్ నెక్‌గా పిలుస్తున్న ఈ మహోత్పాతానికి నాటి మంచు యుగ సంధి సందర్భంగా చోటు చేసుకున్న తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తేలింది. ► ఆ దెబ్బకు నేటి ఆఫ్రికా ఖండమంతా ఎండిపోయి మరు భూమిగా మారిందట. ► మానవులతో పాటు ఏనుగుల వంటి భారీ క్షీరదాలన్నీ దాదాపుగా అంతరించాయట. ► ఆ దెబ్బకు దాదాపు 3 లక్షల ఏళ్ల పాటు మానవ ఉనికి ఉందా లేదా అన్నంత తక్కువ స్థాయికి పడిపోయిందట. ► ఆ సమయం నాటి శిలాజాల్లో మానవ అవశేషాలు అసలే దొరక్కపోవడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. ► ఈ అధ్యయన వివరాలు జర్నల్ సైన్స్‌లో పబ్లిష్ అయ్యాయి. ‘నాటి మంచు యుగపు మహోత్పాతం మానవ వికాసంలో ఒక రకంగా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తదనంతరం పుట్టుకొచ్చిన ఆదిమ మానవ సంతతే ఆఫ్రికా నుంచి యురేషియాకేసి విస్తరించింది. ఈ విస్తరణ ఆఫ్రికాలో హోమోసెపియన్లు, యూరప్‌లో నియాండర్తల్, ఆసియాలో దేనిసోవన్ల ఆవిర్భావానికి కారణమైంది‘ – ఫాబియో డీ విన్సెంజో – నేషనల్ డెస్క్, సాక్షి -
వడగాడ్పులకు 100 మంది బలి!
బలియా/పట్నా: ఉత్తరాదిన కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో జనం పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 100 మంది వరకు ప్రజలు చనిపోయారు. భరించలేని ఎండలు, వడగాడ్పులకు తాళలేక యూపీలో 54, బిహార్‌లో 44 మరణాలు నమోదయ్యాయి. ఈ నెల 15, 16, 17 తేదీల్లో యూపీలోని బలియా ఆస్పత్రిలో చేరిన సుమారు 400 మంది జ్వర బాధితుల్లో 54 మంది వివిధ కారణాలతో చనిపోయారని అధికారులు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలకు గురై ఆస్పత్రికి వస్తున్నారని బలియా ప్రధాన వైద్యాధికారి(సీఎంవో) డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. మొత్తం 54 మందిలో 40 శాతం మంది జ్వరంతో, 60 శాతం మంది ఇతర వ్యాధులతో చనిపోయారని డాక్టర్ కుమార్ చెప్పారు. ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వారేనన్నారు. మరణాలకు కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు లక్నో నుంచి వైద్య బృందాలను పంపించింది. బల్లియా జిల్లా ఆస్పత్రిలో మరిన్ని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేశారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచామని అధికారులు తెలిపారు. ఆజంగఢ్ డివిజన్ ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ ఓపీ తివారీ శనివారం మీడియాతో మాట్లాడుతూ..లక్నో నుంచి రానున్న ఆరోగ్య శాఖ బృందం బల్లియాకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తుందని, మరణాలకు కారణాలను నిర్ధారిస్తామని చెప్పారు. బహుశా గుర్తించని ఏదో ఒక వ్యాధి మరణాలకు కారణమై ఉండొచ్చు, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వేసవి, శీతాకాలాల్లో డయాబెటిక్ రోగులతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తపోటు ఉన్నవారిలో మరణాల రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది’అని తివారీ చెప్పారు. శుక్రవారం బలియాలో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉషో్టగ్రత నమోదైందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే ఇది 4.7 డిగ్రీలు ఎక్కువని పేర్కొంది. సీఎంఎస్ తొలగింపు బలియా జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్(సీఎంఎస్) డాక్టర్ దివాకర్ సింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆస్పత్రిలో మరణాలకు కారణాలపై నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆజంగఢ్‌కు బదిలీ చేసింది. డాక్టర్ ఎస్కే యాదవ్‌కు సీఎంఎస్ బాధ్యతలను అప్పగించింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిత్యం 125 నుంచి 135 మంది రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారని తెలిపారు. 15న 23 మంది, 16న 20 మంది, 17న 11మంది వేర్వేరు కారణాలతో చనిపోయినట్లు తెలిపారు. బిహార్‌లో 44 మంది.. బిహార్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. గత 24 గంటల్లో తీవ్ర వడగాల్పుల కారణంగా 44 మంది చనిపోయారు. వీరిలో ఒక్క పటా్నలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వంద మంది వరకు వడదెబ్బ బాధితులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎండలకు తోడు రాష్ట్రంలోని 18 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు, నాలుగు చోట్ల వడగాడ్పులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయని అధికారులు తెలిపారు. షేక్‌పురాలో అత్యధికంగా 44.2 డిగ్రీలు, పటా్నలో 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీలకు వేసవి సెలవులను 24 వరకు పొడిగించింది. -
పులులకు ‘ఎండదెబ్బ’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న పులుల మరణాలు కలవర పరుస్తున్నాయి. ఈ ఏడాది రెండు నెలల్లోనే 34 పులులు మరణించాయి. ముఖ్యంగా ఎండాకాలం వాటి పాలిట మృత్యువుగా మారుతోంది. గత పదేళ్ల గణాకాలు కూడా అదే చెబుతున్నాయి. మార్చి నుంచి మే చివరి వరకు పులుల మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. దాంతో ఈ వేసవిలో పులుల సంరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. 2012–2022 మధ్య పదేళ్లలో దేశవ్యాప్తంగా 1,062 పులులు మరణించినట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 270, మహారాష్ట్రలో 184, కర్ణాటకలో 150 పులులు మరణించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో తొమ్మిది పులులు మృత్యువాత పడ్డాయి. 2020లో 106, 2021లో 127, 2022లో 121 పులులు మరణించాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లోనే 34 ప్రాణాలు కోల్పోవడం విషాదం. వీటిలో మధ్యప్రదేశ్‌లో 9, మహారాష్ట్రలో 8 మరణాలు సంభవించాయి. గడిచిన పదేళ్ల రికార్డులు చూస్తే మార్చిలో 123, ఏప్రిల్‌లో 112, మేలో 113 మరణాలు నమోదయ్యాయి. అంటే పదేళ్లలో వేసవిలో ఏకంగా 348 పులులు చనిపోయాయి! తస్మాత్ జాగ్రత్త ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటొచ్చన్న అంచనాల నేపథ్యంలో పులుల సంరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాత్రిళ్లు అభయారణ్యాల్లో సఫారీలను ఆపేయండి. అక్రమ నిర్మాణాలపై నిఘా పెంచండి’’ అని పేర్కొంది. వేసవిలో పులుల మరణాలకు ఇవీ కారణాలు... ► ఎండాకాలంలో నీరు, ఆహారం కోసం తమ ఆవాసాలను దాటి దూరంగా రావడం ► అభయారణ్యాలనుంచి బయటకు వచ్చేయడం ► ఆహారం కోసం పులుల మధ్య పోరాటాలు ► అడవుల్లో పచ్చదనం తగ్గడం, బఫర్ జోన్లు లేకపోవడం ► అటవీ భూముల నరికివేత, సమీప ప్రజల్లో అడవి జంతువులపై అసహనం, భయంతో కొట్టి చంపడం -
సెనెగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
డాకర్: ఆఫ్రికా దేశం సెనెగల్‌లో శనివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. కఫ్రిన్ ప్రాంతం గ్నివీ గ్రామం వద్ద ఒకటో నంబర్ జాతీయ రహదారిపై ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. ఘటనలో రెండు బస్సుల్లోని 40 మంది చనిపోగా, మరో 78 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రెండు బస్సులు పూర్తిగా నుజ్జయ్యాయన్నారు. ఘోర విషాదం నేపథ్యంలో దేశంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తామని అధ్యక్షుడు మాకీ సాల్ ప్రకటించారు. కెన్యా–ఉగాండా సరిహద్దుల్లోనూ... నైరోబి: ఉగాండాలోని ఎంబాలె నగరం నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తున్న బస్సు రెండు దేశాల సరిహద్దుల్లో ప్రమాదానికి గురైంది. 21 మంది చనిపోగా 49 మంది గాయపడ్డారు. -
సెల్ డ్రైవింగ్‌తో దేశవ్యాప్తంగా... ఏడాదిలో 1,040 మంది మృతి
న్యూఢిల్లీ: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ వాహనాలను నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాల్లో 2021లో 1,040 మంది మృతి చెందారు. అదేవిధంగా, రెడ్‌లైట్ పడినా పట్టించుకోకుండా వాహనాలను ముందుకు పోనివ్వడంతో 555 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని, 222 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లపై గుంతల కారణంగా 3,625 ప్రమాదాలు జరగ్గా, 1,481 మంది మృత్యువాతపడ్డారు. 2021కి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ ఇటీవల వెల్లడించిన నివేదిక ఈ అంశాలను పేర్కొంది. 2021లో దేశవ్యాప్తంగా మొత్తం 4,12,432 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 1,53,972 మంది చనిపోగా, 3,84,448 మంది గాయపడినట్లు ఆ నివేదిక తెలిపింది. -
కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు
న్యూఢిల్లీ: చైనాలో కొత్త ఏడాదిలో కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరనుంది. ఈ నెల 13వ తేదీ కల్లా రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని, మరో 10 రోజుల తర్వాత రోజుకు 25 వేల కరోనా మరణాలు సంభవిస్తాయని యూకేకు చెందిన అధ్యయన సంస్థ ఎయిర్ ఫినిటీ తెలిపింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి చైనాలో కరోనాతో రోజుకు 9 వేల మంది చొప్పున చనిపోతున్నారని తెలిపింది. జనవరి చివరి నాటికి చైనాలో 5,84,00 కోవిడ్ మరణాలు చోటుచేసుకుంటాయని పేర్కొంది. ఏప్రిల్ కల్లా కోవిడ్‌తో మృతుల సంఖ్య 17 లక్షలకు చేరుకుంటుందని తెలిపింది. మార్చి 3వ తేదీ నుంచి మరో విడత విజృంభణతో రోజుకు 42 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. -
చైనాలో శవాల గుట్టలు.. శ్మశానాల ముందు మృతదేహాలతో పడిగాపులు!
బీజింగ్: చైనాలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్7 విజృంభిస్తోంది. రోజుకు లక్షల మందికి సోకుతోంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచానికి కేసులు, మరణాలు తెలియనీయకుండా డ్రాగన్ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నా.. సోషల్ మీడియాల్లో బయటపడుతున్న వీడియోలు హృదయాలను కలచివేస్తున్నాయి. వందల మంది మరణిస్తుండడంతో శ్మశానాల ముందు అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆరోగ్య నిపుణులు ఎరిక్ ఫైగిల్ డింగ్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో తమ వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పెద్ద క్యూలైన్లో నిలుచుని మృతదేహాలను తీసుకెళ్తున్న హృదయవిదారక వీడియో వైరల్‌గా మారింది. ‘శ్మశానవాటికల్లో పెద్ద క్యూలైన్లు ఉన్నాయి. మీ ప్రియమైన వారి అంత్యక్రియల కోసం క్యూలైన్లలో వేచి ఉండటమే కాదు, ఆ సమయంలో వారిని మోసుకెళ్లాల్సి వస్తుందని ఊహించుకోండి. భయంకరమైన కోవిడ్ 19 చైనాను చుట్టివేయడంపై సానుభూతి చూపుదాం.’ అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ నుంచి ఓ డాక్యుమెంట్ లీక్ కావడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 1 నుంచి 20 మధ్య దేశంలోని సుమారు 17.56 శాతం మంది 25 కోట్ల మందికి వైరస్ సోకింది. రోజుకు లక్షల మంది వైరస్ బారినపడుతున్నారు. 35) Epic long lines at crematoriums… imagine having to not just wait for hours to cremate you loved ones, but have to do it carrying their deceased bodies for all those hours… let’s have empathy for the horrific #COVID19 wave 🌊 crashing into China. 🙏 pic.twitter.com/aQcmmjuCTC — Eric Feigl-Ding (@DrEricDing) December 26, 2022 ఇదీ చదవండి: Dalai Lama Bodh Mahotsav Event: దలైలామా ఈవెంట్ వేళ కరోనా కలకలం.. నలుగురు విదేశీయులకు పాజిటివ్ -
Ukraine-Russia war: రష్యాకు లక్ష, మాకు 13 వేలు సైనిక నష్టంపై ఉక్రెయిన్
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. యుద్ధం మొదలైన ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా 13 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదార మైఖైలో పోడోల్యాక్ వెల్లడించారు. వీరిలో సాధారణ పౌరులే అధికమన్నారు. రష్యా సైనికులు లక్ష మంది దాకా మరణించినట్టు అంచనా వేశామన్నారు. లక్షన్నర మంది గాయపడి ఉంటారని తెలిపారు. ఉక్రెయిన్ వైపు చనిపోయిన, గాయపడ్డ వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ రెండు పక్షాల్లో కలిపి మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ అన్నారు. ఉక్రెయిన్ పౌరులు 40 వేల మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక ఇరువైపులా కలిపి 6,655 మంది పౌరులు మరణించారని, 10, 368 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఐరాస వెల్లడించలేదు. -
భారత్‌లో కరోనా మరణాలు 40 లక్షలు?
లండన్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో భారత్‌లో రెండేళ్లలో ఏకంగా 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. అధికారిక లెక్కల్లోకి రాని కోవిడ్ మృతుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే టాప్‌లో ఉందని పేర్కొంది. 2020 జనవరి–2021 డిసెంబర్ మధ్య మరణించిన వారి సంఖ్య కేంద్రం వెల్లడించిన లెక్కల కంటే ఏకంగా 8 రెట్లు ఎక్కువని తెలిపింది. 2021 డిసెంబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 22.3 శాతం భారత్‌లోనే ఉన్నాయని తెలిపింది. రెండేళ్ల కాలంలో కరోనా మృతులపై 191 దేశాల గణాంకాలతో లాన్సెట్ నివేదిక రూపొందించింది. గత రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 59.4 లక్షల మంది కరోనాకు బలైనట్టు అధికారిక గణాంకాలున్నాయి. కానీ వాస్తవానికి 1.82 కోట్ల మంది మరణించినట్టు అధ్యయనంలో తేలినట్టు లాన్సెట్ వెల్లడించింది. భారత్‌లో కరోనాతో రెండేళ్లలో 4.89 లక్షల మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించిందని, కానీ వాస్తవానికి 40.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు తేలిందని వివరించింది. భారత్ తర్వాత అమెరికా (11.3 లక్షల మరణాలు), రష్యా (10.7 లక్షలు), మెక్సికో (7.98 లక్షలు), బ్రెజిల్ (7.36 లక్షలు), ఇండోనేసియా (7.36 లక్షలు), పాకిస్తాన్ (6.64 లక్షలు) ఉన్నట్టుగా వివరించింది. తప్పుడు సమాచారం: కేంద్రం లాన్సెట్ లెక్కల్ని కేంద్రం కొట్టిపారేసింది. ఆ సంస్థ విశ్లేషణలు, అంచనాలు ఊహాజనితాలని విమర్శించింది. కరోనా మరణాల లెక్కలు సేకరించే పద్ధతిలో తప్పులు దొర్లాయని ఆ నివేదిక రచయితలే అంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
మూడేళ్లలో 60 లక్షల మరణాలు
బ్యాంకాక్: కోవిడ్–19 ప్రబలిన మూడేళ్లలో ప్రపంచదేశాల్లో 60 లక్షల మందిని బలితీసుకుంది. ఇప్పటికీ వైరస్ తీవ్రతతో చాలా దేశాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. మాస్క్ ధరించడం మానేసి, ప్రయాణాలు, వ్యాపారాలు తిరిగి మొదలైనా ఈ మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. గత నాలుగు నెలల్లోనే 10 లక్షల కోవిడ్ మరణాలు నమోదైనట్లు తెలిపింది. ఇప్పటి వరకు వైరస్ సోకని పసిఫిక్ ద్వీపాల్లో సైతం మొదటి వేవ్ ప్రజలను వణికిస్తోంది. హాంకాంగ్ ప్రభుత్వం ఈ ఒక్క నెలలోనే మొత్తం 75 లక్షల మంది ప్రజలకు మూడు పర్యాయాలు కరోనా పరీక్షలు జరిపింది. అయినప్పటికీ అక్కడ రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 10 లక్షల మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 45 కోట్ల మంది కోవిడ్ బారినపడినట్లు లెక్కలు తేల్చింది. అయితే, కోవిడ్‌తో 1.40 కోట్ల నుంచి 2.35 కోట్ల మంది మరణించినట్లు ‘ది ఎకనామిస్ట్’విశ్లేషకుల అంచనా. చైనాలో మళ్లీ కోవిడ్ చైనా ప్రభుత్వం కోవిడ్–19 వ్యాప్తిని నిరోధించేందుకు అత్యంత కఠినమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు కొత్తగా బయటపడుతూనే ఉన్నాయి. దేశంలో సోమవారం ఒక్క రోజు వ్యవధిలో వెలుగు చూసిన 214 కొత్త కేసుల్లో గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులో 69, జిలిన్లో 54, షాడోంగ్ ప్రావిన్స్‌లో 46 నిర్ధారణ అయినట్లు ప్రధాని లీ కెకియాంగ్ తాజాగా నేషనల్ లెజిస్లేచర్‌కు అందజేసిన వార్షిక నివేదికలో తెలిపారు. 2019లో వూహాన్లో మొట్టమొదటిసారిగా కరోనా వైరస్ జాడలు వెలుగుచూశాక ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. దేశ రాజధాని బీజింగ్‌లో కొత్తగా కేసులు రానప్పటికీ మాస్క్ తప్పనిసరి చేశారు. కోవిడ్ వ్యాప్తిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. స్వల్పసంఖ్యలో కేసులు బయటపడిన చోట్ల కూడా క్వారంటైన్, లాక్డౌన్లను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. బీజింగ్‌లోని ప్రముఖ బౌద్ధాలయాలు, చర్చిలు, మసీదులను జనవరి నుంచి నిరవధికంగా మూసే ఉంచారు.చైనాలో ఇప్పటి వరకు 1,11,195 కేసులు, 4,636 మరణాలు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3,837 మంది కోవిడ్‌తో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. -
నదిలో పడిపోయిన పెళ్లి బృందం వాహనం
కోట(రాజస్తాన్): రాజస్తాన్‌లోని కోట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం నదిలో పడిపోవడంతో వరుడితో సహా 9 మంది మృతిచెందారు. ఈ పెళ్లి బృందం ఆదివారం తెల్లవారుజామున సవై మాధోపూర్ జిల్లాలోని చౌత్ కా బర్వారా గ్రామం నుంచి ఎర్టిగా వాహనంలో బయలుదేరింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చేరుకోవాల్సి ఉంది. ఉదయం 5.30 గంటలకు బ్రిడ్జిపై వెళ్తూ చంబల్ నదిలో పడిపోయింది. నిద్రమత్తు కారణంగా వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, అందుకే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ దుర్ఘటనలోవరుడు అవినాశ్ వాల్మీకి(23), అతడి సోదరుడు కేశవ్(30), కారు డ్రైవర్ ఇస్లాం ఖాన్(35), బంధువులు కుశాల్(22), శుభం(23), రోహిత్ వాల్మీకి(22), రాహుల్(25), వికాశ్ వాల్మీకి(24), ముకేశ్ గోచర్(35) చనిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో 9 మంది మృతి చెందడం పట్ల కోట–బుండీ ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, ప్రతి మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తామని సీఎం అశోక్ గహ్లోత్ ట్విట్టర్లో తెలిపారు. -
50 లక్షల మంది బలి
వాషింగ్టన్: ప్రపంచంలో తొలిసారిగా వెలుగు చూసిన నాటి నుంచి కేవలం రెండేళ్లలోపే కరోనా మహమ్మారి తన కరాళ నృత్య విశ్వరూపాన్ని చూపించింది. కరోనా రక్కసి కోరలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 50లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య అమెరికాలోనే శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిలెస్ నగరాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. 1950 ఏడాది నుంచి ప్రపంచంలో వేర్వేరు చోట్ల పలు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో కారణంగా నమోదైన మరణాల కంటే కూడా కోవిడ్ మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఓస్లోలోని శాంతి అధ్యయన సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భూమండలంపై హృద్రోగం, గుండెపోటుతర్వాత కోవిడ్ ఊహకందని స్థాయిలో ప్రాణాలను హరిస్తూ మూడో అతిపెద్ద ప్రాణాంతక వ్యాధిగా అవతరించిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. నిజానికి ఈ అరకోటి మరణాల సంఖ్య అనేది చాలా తక్కువ అని ఒక వాస్తవిక వాదన ప్రపంచమంతటా వినిపిస్తోంది. అత్యల్ప స్థాయిలో జరుగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కోవిడ్ తొలినాళ్లలో సమాజం వెలివేస్తుందనే భయంతో ఇంట్లో కరోనాకు సొంత వైద్యం ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు లక్షల్లో ఉంటారనే అభిప్రాయం జనాల్లో ఉంది. ప్రజారోగ్య వ్యవస్థ అధ్వాన్నంగా ఉండే పేద దేశాలనే కాదు పౌరుల ఆరోగ్యంపై లక్షల కోట్లు ఖర్చుచేసే సంపన్న దేశాలనూ కోవిడ్ కుదిపేసింది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలు కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఒక్క అమెరికాలోనే 7.40లక్షలకు పైగా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ‘ మన జీవన మార్గాన్ని నిర్ణయించే కాలమిది. 50లక్షల మంది బలైపోయారనేది ఇకపై గతం. మరో అరకోటి మందిని కోవిడ్‌కు బలికాకుండా ఎలా ఆపాలి? అనేదే మన ముందున్న అసలు సవాలు’ అని అమెరికాలో యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆల్బర్ట్ కో హెచ్చరించారు. కోవిడ్‌పై అపోహలు, అపనమ్మకాలు, తప్పుడు సమాచారం సమాజంలో రాజ్యమేలుతుండటంతో కొన్ని దేశాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతోంది. -
రష్యాలో కరోనా మరణమృదంగం
మాస్కో: రష్యాలో కోవిడ్ 24 గంటల వ్యవధిలో వెయ్యి మందిని బలి తీసుకుంది. ఒకే రోజు 33,208 కొత్త కేసులు నమోదు కాగా, 1,002 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,58,384కి చేరుకోగా, ఇప్పటివరకు 2,22,315 మంది ప్రాణాలు కోల్పోయారు. యూరప్ దేశాల్లో అత్యధిక కరోనా మరణాలు రష్యాలోనే సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో తర్వాత కరోనా కేసులు అధికంగా రష్యాలోనే వెలుగులోకి వస్తున్నా యి. అయితే, ప్రభుత్వం మాత్రం కరోనా ఆంక్షలు విధించాలో, వద్దో స్థానిక యంత్రాంగం నిర్ణయించాలని అంటోంది. ఇప్పటి వరకు కేవలం 29% మంది జనాభాకి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. -
న్యూయార్క్‌లో తుపాను బీభత్సం
న్యూయార్క్: అమెరికా ఈశాన్య రాష్ట్రాలను ‘ఇదా’ తుపాను అతలాకుతలం చేస్తోంది. న్యూయార్క్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియాలలో మొత్తంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపాను సృష్టించిన విలయం ధాటికి న్యూయార్క్ రాష్ట్రంలో అత్యయిక స్థితి (ఎమర్జెన్సీ)ని గవర్నర్ క్యాథీ హోచల్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. న్యూ ఇంగ్లండ్ (కనెక్టికట్, మెయిన్, మసాచుసెట్స్, న్యూ హాంప్‌షైర్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్ రాష్ట్రాలున్న ప్రాంతం)లోనూ తుపాను ప్రభావం పెరుగుతోంది. మరిన్ని భీకర సుడిగాలులు దూసుకొచ్చే ప్రమాదముందని వార్తలొచ్చాయి. ఒక్క న్యూయార్క్‌లోనే రెండేళ్ల బాలుడు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూజెర్సీలో ఒకరు మరణించారని పోలీసులు చెప్పారు. సబ్వే స్టేషన్లలోకి వర్షపు నీరు చేరడంతో అన్ని సర్వీస్‌లను రద్దుచేశారు. సబ్వేలో సీట్లపై నిలబడే నగరవాసులు ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. ఇళ్లలోకి విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 10 లక్షల మంది ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. సెంట్రల్ పార్క్‌లో రికార్డుస్థాయి వర్షపాతం ‘న్యూయార్క్ సిటీలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించాం’ అని న్యూయార్క్‌లోని అమెరికా జాతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత సెంట్రల్ పార్క్‌లో బుధవారం రాత్రి ఒక్క గంటలోనే రికార్డుస్థాయిలో 8.91 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూజెర్సీలోనూ తుపాను కారణంగా భారీస్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సుడిగాలుల ధాటికి దక్షిణ న్యూజెర్సీ కౌంటీలో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. మొత్తం 21 కౌంటీల్లో ఎమర్జెన్సీ విధించారు. పెన్సిల్వేనియాలో వరదల పట్టణంగా పేరున్న జాన్స్టౌన్ దగ్గరున్న ఆనకట్ట పొంగి పొర్లే ప్రమాదం పొంచి ఉంది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి లక్షలాది ఇళ్లలో అంధకారం అలముకుంది. సబ్వే స్టేషన్లోకి దూసుకొస్తున్న వరద నీరు; అపార్ట్మెంట్ సెల్లార్ నుంచి వృద్ధుడిని రక్షిస్తున్న దృశ్యం -
పిడుగులు పడితే రక్షించుకోవడం ఎలా? ఏం చేయాలి?
వానాకాలంలో అప్పుడప్పుడూ పలుకరించే పిడుగులతో... ఒకటి అర ప్రాణాలు పోవడం అసహజమేమీ కాదుకానీ.. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లలో పిడుగుల బారిన పడి పదుల సంఖ్యలో మృతి వేర్వేరు ఘటనల్లోనైనా.. ఒకేరోజు ఇంత మంది చనిపోవడం అసాధారణమే. మరి.. పిడుగులు పడితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? చేయకూడనివి ఏమిటి? అసలు... ఈ పిడుగులేమిటి? వాటి కథేమిటి? పిడుగేమిటన్నది అర్థం చేసుకోవాలంటే ముందుగా మెరుపు గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి ఆవిరిపైపైకి ప్రయాణించి మేఘాలుగా మారతాయని మనకు తెలుసు. ఇవి కొన్ని వేల అడుగుల ఎత్తు వరకూ వివిధ స్థాయిల్లో ఉంటాయి. సూర్యకిరణాల వల్ల మేఘాల పైభాగంలో కొన్ని ధనావేశిత కణాలు ఏర్పడుతూంటాయి. ఇతర కణాల కంటే తేలికగా ఉండటం వల్ల ఇవి మేఘాల పైభాగంలో పోగుబడితే.. బరువైన రుణావేశిత కణాలు దిగువకు వస్తూంటాయి. మామూలుగానైతే.. వ్యతిరేక ఆవేశాలు ఉన్న కణాలు పరస్పరం ఆకర్షితమై ఒక దగ్గరకు చేరాలి కానీ.. మేఘాల దిగువన గాలి కదిలే వేగానికి లేదా కొన్ని ఇతర కారణాల వల్ల రెండింటి మధ్య అంతరం కొనసాగుతూంటుంది. ఈ క్రమంలోనే మేఘాల దిగువన ఉన్న రుణాత్మక కణాలు (ఎలక్ట్రాన్లు) భూమివైపు ప్రయాణిస్తాయి. (ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే విద్యుత్తు అంటాం) మరోవైపు భూమి ఉపరితలంపై ఉండే పొడవాటి నిర్మాణా (విద్యుత్తు స్తంభాలు, ఎత్తైన భవనాలు వంటివి)ల నుంచి ధనావేశిత కణాలు పైపైకి వెళుతూంటాయి. వేడిగా ఉండే ఈ కణాలు రుణావేశిత కణాలను కలిసినప్పుడు అప్పటివరకూ మేఘాల్లో గుమికూడిన ఎలక్ట్రాన్లు మొత్తం ఒక్కసారిగా విడుదలవుతాయి. ఈ విద్యుత్తే పిడుగుపాటు. ఈ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి కారణంగా చుట్టూ ఉన్న గాలి స్వల్ప సమయంలో వేడెక్కుతుంది. వ్యాకోచిస్తుంది. ఇంతలోపే చల్లగా మారిపోతుంది కూడా. అకస్మాత్తుగా జరిగే ఈ మార్పులే శబ్దంగా అంటే ఉరుముగా మనకు వినిపిస్తుంది. నేలపైకి దూసుకొచ్చేవే ఎక్కువ నేలపై, నదులు, సముద్రాలపై కూడా పిడుగులు పడవచ్చు కానీ.. సాధారణంగా భూమ్మీదకు చేరేవే ఎక్కువ. సముద్రతీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు కోటీ అరవై లక్షల పిడుగుపాట్లు నమోదవుతూంటాయని అంచనా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం భారతదేశంలో ఒక్క 2019లోనే దాదాపు 2,900 మంది పిడుగుపాటుకు మరణించారు. ముందుగా గుర్తించలేమా? పిడుగులను ముందుగా గుర్తించేందుకు ఇప్పటికే ఒక టెక్నాలజీ అందుబాటులో ఉంది. నాలుగేళ్ల క్రితం కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. వజ్రపథ్ పేరుతో రూపొందించిన స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను వాడితే మన పరిసరాల్లో పిడుగులు పడే అవకాశాన్ని ముందుగానే తెలిపి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సెన్సర్లు కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఏ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో కనీసం నలభై నిమిషాల ముందే తెలుసుకోవచ్చు. జాగ్రత్తలు ► బహిరంగ ప్రదేశంలో ఉంటే నిటారుగా నిలుచొని ఉండటం కూడదు ► చెట్లు, చెమ్మ, నీరు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ► గుంపులుగా ఉండటం కంటే.. విడిపోయి దూర దూరంగా ఉండటం మంచిది. ► ప్రతి మెరుపుకూ పిడుగు పడదు కానీ.. సురక్షిత ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు వెళ్లకండి. ► పొడవాటి చెట్ల కింద, విద్యుత్ స్తంభాలకు దగ్గరలో నుంచోరాదు. ► స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడరాదు. ► నీళ్లలో ఉంటే వెంటనే బయటపడాలి. నీరు మంచి విద్యుత్ వాహకమన్నది తెలిసిన విషయమే. మీకు తెలుసా? ► ఒక్కో మెరుపులో ఉండే విద్యుత్తు.. దాదాపు పది కోట్ల వోల్టులు! ► లేక్ మారాసియాబో: ప్రపంచం మొత్తమ్మీద అత్యధిక సంఖ్యలో మెరుపులు మెరిసే ప్రాంతం. వెనిజులాలో ఉంది ఇది. ఇక్కడ ఏటా 160 రోజులపాటు తుపాను గాలులు వీస్తూంటాయి. ఆయా రోజుల్లో సగటున నిమిషానికి 28 మెరుపులు.. వరుసగా 10 గంటలపాటు కనిపిస్తాయి. మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకే రాత్రి దాదాపు 36 వేల మెరుపులు, వాటితో పిడుగులూ పడినట్లు వార్తలు ఉన్నాయి. ► మెరుపును కృత్రిమ పద్ధతుల్లో తొలిసారి సృష్టించింది.. నికోలా టెస్లా. ఈ కృత్రిమ మెరుపు తరువాత పుట్టిన ఉరుము శబ్ధం 15 మైళ్ల దూరం వరకూ వినిపించిందట. ► మెరుపు లేదా పిడుగు కారణంగా గాల్లో ని నైట్రోజన్.. మొక్కలు శోషించేందుకు అనువైన రూపంలోకి మారిపోతుంది. –నేషనల్ డెస్క్, సాక్షి -
ప్రపంచంలో కోవిడ్ మరణాలు 40 లక్షలు
వాషింగ్టన్: భారత్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా డెల్టా వేరియెంట్ వివిధ దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 మరణాలు 40 లక్షలు దాటడం ఆందోళన పెంచుతోంది. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ప్రపంచ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య బుధవారం నాటికి 40 లక్షలు దాటింది. ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి కంటే ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువ. 1982 నుంచి ఇప్పటివరకు జరిగిన యుద్ధాల్లో మరణించిన వారితో ఈ మృతుల సంఖ్య సరిసమానమని ఓస్లోలోని పీస్ రీసెర్చ్ యూనివర్సిటీ అంచనా వేసింది. జనవరి నెలలో రోజుకి ప్రపంచ దేశాల్లో 18 వేలుగా ఉన్న కరోనా మరణాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరమైన తర్వాత 7,900కి తగ్గింది. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో వ్యాక్సినేషన్ ఉధృతంగా జరిగి కరోనా నుంచి ఉపశమనం లభించిందని భావిస్తున్న తరుణంలో డెల్టా వేరియెంట్ మళ్లీ ఆయా దేశాల్లో విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలోనే కోవిడ్–19 మరణాలు అధికంగా నమోదయ్యాయి. ప్రతీ ఏడుగురు కరోనా రోగుల్లో ఒకరు మరణించారు. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 6 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత స్థానం బ్రెజిల్‌ది. ఆ దేశంలో 5 లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అయితే ఆ దేశం మరణాల సంఖ్యని దాస్తోందన్న ఆరోపణలైతే ఉన్నాయి. కరోనాతో 40 లక్షల మంది మరణించారని రికార్డులు చెబుతున్నప్పటికీ లెక్కల్లోకి రాని వి మరిన్ని ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయాసస్ అన్నారు. వ్యాక్సినేషన్ పెరిగితే మరణాల సంఖ్యని అరికట్టవచ్చునని చెప్పారు. వివిధ దేశాలు లాక్డౌన్ ఎత్తేస్తున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నిరుపేద దేశాలకు అండగా ధనిక దేశాలు నిలవాలని విజ్ఞప్తి చేశారు. -
గోవా జీఎంహెచ్‌సీలో మరణ మృదంగం
పనాజీ: గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జీఎంహెచ్‌సీ)లో తెల్లవారుజామున జరుగుతున్న మరణాల పరంపర కొనసాగుతోంది. కేవలం నాలుగు రోజుల్లో తెల్లవారుజాము సమయంలో 75 మంది మరణించారు. తెల్లవారు జామున 2 నుంచి 6 గంటల మధ్యలో ఈ మరణాలు సంభవించాయి. ఈ వ్యవహారంపై బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ విచారణ జరుపుతోంది. గురువారం గోవా ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ దేవీదాస్ పంగం.. ఆక్సిజన్ సరఫరా లోపాల వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఆక్సిజన్‌ను తీసుకొచ్చే ట్యాంకర్ల లాజిస్టికల్ సమస్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆక్సిజన్ ప్రెజర్లో లోపాల వల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. అయితే, ఆస్పత్రిలో శుక్రవారం మరో 13 మంది చనిపోయారు. ఆక్సిజన్ సంబంధిత సమస్యల కారణంగా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో కలిపి 75 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Coronavirus India Highlights: మూడు రెట్లు వేగంగా
సాక్షి, నేషనల్ డెస్క్: దేశాన్ని కరోనా కసిగా కాటేస్తోంది. మొదటి వేవ్ తర్వాత దాని కోరలు పీకామని భావించాం కానీ, అనూహ్యమైన రీతిలో మూడు రెట్ల వేగంతో విషం కక్కుతోంది. రోజు రోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. మొదటి వేవ్‌లో రికార్డులన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. కరోనా పడగ నీడలో బిక్కు బిక్కుమంటూ కాలం నెట్టుకొస్తున్నాం. ఫస్ట్ వేవ్ తర్వాత దేశంలో సెకండ్ వేవ్ ఎలా విజృంభిస్తోందో చూద్దాం. కరోనా మొదటి వేవ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో కొంత మేర విస్తరించింది. ప్రతీ రాష్ట్రంలోనూ హాట్‌స్పాట్స్ ఉన్నాయి. కానీ రెండో వేవ్ వచ్చేసరికి కొన్ని రాష్ట్రాల్లోనే వైరస్ లోడు అధికంగా ఉంది. ఇండియా టాస్క్‌ఫోర్స్ సభ్యుల లాన్సెట్ కోవిడ్–19 కమిషన్ ఈ వారంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం మొదటి వేవ్‌లో నమోదైన కేసుల్లో 50 శాతం 40 జిల్లాల్లో బయటపడితే, రెండో వేవ్‌లో సగం కేసులు 20 జిల్లాల్లోనే వెలుగు చూశాయి. 2020 ఆగస్టు–సెప్టెంబర్ మధ్య కరోనా మొదటి వేవ్ ఉధృతరూపం దాల్చినపుడు 75 శాతం కేసులు 60–100 జిల్లాలోనేయి. అదే సెకండ్ వేవ్‌లో మార్చి–ఏప్రిల్ నెలలో నమోదైన కేసుల్లో 75 శాతం కేసులు 20–40 జిల్లాల్లోనే బయటకొచ్చాయి. లక్షణాల్లేకుండా చుట్టేస్తోంది గత ఏడాది తొలిసారిగా జనవరిలో కేరళలో తొలికేసు వచ్చింది. చైనా నుంచి దిగుమతి అయిన వైరస్ మాత్రమే అందరికీ సోకింది. కానీ రెండో దశ మొదలైనప్పట్నుంచి వైరస్ జన్యుక్రమం మార్చుకొని విశ్వరూపం చూపిస్తోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా మ్యుటేషన్లతో పాటు రెండుసార్లు జన్యుక్రమం మార్చుకున్న భారత్ వైరస్ సార్స్ కోవ్–2 ద్వారా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సెకండ్‌వేవ్‌లో అత్యధికుల్లో లక్షణాలు కనపడటం లేదు. దాంతో తెలియకుండానే వీరు ఇతరులకు వైరస్‌ను అంటిస్తున్నారు. అంతేకాదు కొన్ని కేసుల్లో కరోనా నేరుగా ఊపిరితిత్తుల పైనే దాడి చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రాణాల మీదకి వస్తోంది. యువతపై ప్రభావం కరోనా మొదటి వేవ్ పెద్దల్ని కాటేస్తే సెకండ్ వేవ్‌లో యువతకి ఎక్కువగా సోకుతోంది. ఢిల్లీలోని కరోనా రోగుల్లో 65 శాతం మంది 45 కంటే తక్కువ వయసు ఉన్న వారేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలో సగం కేసులు 30–40 ఏళ్ల మధ్య వయసున్న వారినే సోకుతున్నాయి. మొదటి వేవ్‌లో కరోనా మరణాల్లో 60 ఏళ్లకు పైబడిన వారే 88శాతం మంది ఉన్నారు. ఇక కేసులు కూడా 60 శాతానికిపైగా 50 ఏళ్ల వయసున్న వారికే సోకింది. మొదటి వేవ్‌లో చిన్నపిల్లలకు కరోనా సోకిన కేసులు అరుదు. కానీ ఈసారి మార్చి నెలలోనే 80 వేల మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. వ్యాక్సినేషన్ సాగుతున్నా తగ్గని జోరు మొదటి దశలో కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు మాత్రమే జరిగాయి. కానీ రెండో వేవ్ వచ్చేసరికి వ్యాక్సినేషన్ మొదలైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్, సీరమ్ సంస్థ తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వ్యాక్సిన్లను 45 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. నాడు అవగాహన లేమి.. నేడు నిర్లక్ష్యం కరోనా మొదటి వేవ్‌లో ఈ వైరస్‌పై ఎవరికీ అవగాహన లేదు. లాక్డౌన్, క్వారంటైన్, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు పూసుకోవడం అన్నీ కొత్త. దీంతో గత ఏడాది లాక్డౌన్ ఎత్తేశాక జూలై– సెప్టెంబర్ మధ్య కేసులు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండో వేవ్ సమయానికి ప్రజల్లో అవగాహన వచ్చినప్పటికీ వ్యాక్సిన్ వచ్చిందన్న ధీమా, కరోనా నిబంధనల్ని గాలికి వదిలేయడం, ప్రభు త్వం కూడా ఆర్థిక నష్టం జరగకూడదన్న ఉద్దేశం తో అన్ని రకాల కార్యక్రమాలకు అనుమతినివ్వడం, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మార్చి నుంచి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా రెండో వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. మొదటి వేవ్‌లో ఒక కరోనా రోగిని కలుసుకున్న వారిలో 30 నుంచి 40% మందికి వైరస్ సోకే అవకాశాలుంటే, రెండో వేవ్‌లో 80 నుంచి 90% మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలున్నాయి - డాక్టర్ రణదీప్ గులేరియా, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ -
మరోసారి సైన్యం కాల్పులు, 82 మంది మృతి!
యాంగూన్: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలను ఆర్మీ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రజాస్వామ్య అనుకూలవాదులపై బాగో నగరంలో జరిపిన కాల్పుల్లో శనివారం ఒక్కరోజే 82 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే స్వతంత్ర సంస్థ ఈ గణాంకాలు వెలువరించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. మయన్మార్ నౌ అనే వెబ్సైట్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. సైనికవాహనాల్లో మృతదేహాలను తీసుకెళ్లి పగోడా వద్ద పడేశారని తెలిపింది. ఆందోళ నకారులపైకి సైన్యం భారీ ఆయుధాలను, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లను, మోర్టార్లను ప్రయోగిస్తోందని పేర్కొంది. మార్చి 14న యాంగూన్‌లో జరిగిన కాల్పుల్లో 100 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఈక్వెడార్ జైళ్లలో భారీ ఘర్షణ
క్విటో: ఈక్వెడార్‌లో దారుణం చోటుచేసుకుంది. ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాల్లో రక్తపాతం జరిగింది. మూడు జైళ్లలో ఖైదీల మధ్య భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 79 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రి ఘర్షణ జరగ్గా, 800 మంది పోలీసులు రంగంలోకి దిగి మంగళవారం నాటికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపాయి. దక్షిణ ఈక్వెడార్‌లోని క్యున్కా జైల్లో 34 మంది, పసిఫిక్ తీరప్రాంతంలోని గుయాక్విల్ జైల్లో 37 మంది, సెంట్రల్ సిటీ లాటకూంగా జైల్లో 8 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. అధిపత్యం కోసమే ఈ గ్రూపుల మధ్య దాడులు జరిగినట్లు తెలుస్తోంది. -
ఆర్థిక రాజధాని అతలాకుతలం
ఎందరికో అదొక కలల నగరం ఉపాధి అవకాశాలతో ఎందరినో అక్కున చేర్చుకున్న నగరం పగలు, రాత్రి అన్న తేడా లేకుండా శ్రమించే నగరం ఇప్పుడు కరోనా కాటుతో విలవిలలాడుతోంది. ముంబైవాసులకు ప్రతీ రాత్రి కాళరాత్రిగానే మారుతోంది. ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కోవిడ్ విలయతాండవం చేస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 62 శాతం ముంబైలోనే ఉన్నాయి. ఒకే రోజు 1,002 కేసులు నమోదు కావడంతో 32 వేలు దాటేశాయి. కేవలం 10 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపైంది. కేసుల పెరుగుదల రేటు ఇలాగే కొనసాగితే జూన్ చివరి నాటికి ముంబైలో లక్ష కేసులు దాటిపోతాయని ఒక అంచనా. ఇక మృతుల సంఖ్య 1,065కి చేరుకుంది. కారిడార్లలోనే శవాలు ముంబైలో కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆస్పత్రి రోగులతో కిటకిటలాడిపోతోంది. మరణాలు ఎక్కువగా ఉండడంతో మార్చురీ సదుపాయాలు సరిపోక కారిడార్లలోనే శవాలను ఉంచుతున్నారు. ‘మార్చురీలో ఒకేసారి 27 మృతదేహాలను మించి ఉంచడానికి సదుపాయం లేదు. మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో చేసేదేమీలేక స్ట్రెచర్లపై శవాలను కారిడార్లకి ఇరువైపులా ఉంచుతున్నారు’అని కేఈఎం ఆస్పత్రి ఉద్యోగుల సంఘం నేత సంతోష్ ధూరి చెప్పారు. ఇక ఆరోగ్య సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో సదుపాయాలు లేని విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె అంగీకరించారు. ‘ఆక్సిజన్ సరఫరాతో కూడిన 10వేల పడకలు తక్షణమే కావాలి. ఆ ఏర్పాట్లలోనే ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకి చెందిన డాక్టర్లు కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నారు. వైరస్ సోకుతున్న వారిలో అత్యధికులకి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది’అని మంత్రి చెప్పారు. ముగ్గురు రోగులకు ఒకే ఆక్సిజన్ ట్యాంక్ ముంబైలో కోవిడ్ రోగులకు చికిత్సనందించే సియోన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంకులకు కొరత ఉండడంతో ముగ్గురు రోగులకు ఒకటే అందిస్తున్నారు. ఎక్కువ రోగులకు చికిత్స అందించడానికి వీలుగా మంచాల మధ్య దూరాన్ని తగ్గిస్తున్నారు. ఒకవైపు మృతదేహాలను పక్కనే ఉంచుకొని మరోవైపు రోగులకు చికిత్స అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఆందోళన పెంచుతున్నాయి. ‘ముంబైలో వైద్య సౌకర్యాలు, సుశిక్షితులైన సిబ్బంది ఎక్కువగానే ఉన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో కేసులు పెరిగిపోతుంటే ఆస్పత్రులు తట్టుకోలేకపోతున్నాయి. కలల నగరం కాళరాత్రి నగరంగా మారింది’’అని ప్రజారోగ్య వైద్య నిపుణురాలు డాక్టర్ స్వాతి రాణె అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ ముంబైలో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆస్పత్రి సదుపాయాలు ఇలా.. ► ముంబైలో 20,700 పడకల సామర్థ్యం ఉన్న 70 ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. మరో 20 వేల పడకలతో 1500 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. ► సగటున ప్రతీ 550 మందికి ఒక పడక ఉండాలని ప్రపంచ ఆరోగ్య శాఖ అంచనా వేస్తే ముంబైలో ప్రతీ 3 వేల మందికి మాత్రమే ఒక పడక ఉంది. ► పదేళ్లలో ముంబై జనాభా విపరీతంగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల్లో ముంబై కూడా ఒకటి. ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 32 వేల మంది వరకు నివసిస్తారు. పెరిగిన జనాభాకి తగ్గట్టుగా వైద్య సదుపాయాలు పెరగలేదు. కరోనా వ్యాప్తి కట్టడితోపాటు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ఇప్పటికే 1.1 ట్రిలియన్ డాలర్లతో నిధిని ఏర్పాటు చేసిన జపాన్ మరో 296 బిలియన్ డాలర్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ అనుబంధ బడ్జెట్‌కు జపాన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. నిధులను దెబ్బతిన్న వ్యాపారాలను ఆదుకోవడానికి, స్థానిక ప్రభుత్వాలకు రాయితీలకు ఖర్చు చేస్తారు.