యాంగూన్: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలను ఆర్మీ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రజాస్వామ్య అనుకూలవాదులపై బాగో నగరంలో జరిపిన కాల్పుల్లో శనివారం ఒక్కరోజే 82 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే స్వతంత్ర సంస్థ ఈ గణాంకాలు వెలువరించింది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. మయన్మార్ నౌ అనే వెబ్‌సైట్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. సైనికవాహనాల్లో మృతదేహాలను తీసుకెళ్లి పగోడా వద్ద పడేశారని తెలిపింది. ఆందోళ నకారులపైకి సైన్యం భారీ ఆయుధాలను, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లను, మోర్టార్లను ప్రయోగిస్తోందని పేర్కొంది. మార్చి 14న యాంగూన్‌లో జరిగిన కాల్పుల్లో 100 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment