Myanmar
-
‘అక్కడి నుంచి బయటపడండి’ మయన్మార్‌లోని భారతీయులకు హెచ్చరిక!
మయన్మార్‌లోని రఖైన్ ప్రావిన్స్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడున్న భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు అక్కడి నుండి బయటపడాలని భారత్ కోరింది. రఖైన్ ప్రావిన్స్ సురక్షితంగా లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, ల్యాండ్లైన్లతో సహా టెలికమ్యూనికేషన్‌కు అంతరాయం, నిత్యావసర వస్తువుల కొరత తదితర కారణాల దృష్ట్యా భారతీయ పౌరులెవరూ రఖైన్ రాష్ట్రానికి వెళ్లవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ రాష్ట్రం విడిచి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. 2021, ఫిబ్రవరి ఒకటి నుంచి మయన్మార్‌లో అస్థిరత నెలకొంది. సైనిక తిరుగుబాటులో దేశ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పలు హింసాత్మక నిరసనలు జరిగాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మయన్మార్‌లో నెలకొన్న అస్థిరత మన దేశంపై ప్రభావం చూపబోతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మయన్మార్ మన పొరుగు దేశం కావడంతో అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నామన్నారు. భారతదేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు మయన్మార్‌తో అనుసంధానమై ఉన్నాయి. భారతదేశం, మయన్మార్లు దాదాపు 1,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. -
ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి
ఇండియా–మయన్మార్ సరిహద్దులను కంచెతో మూసేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న 1,643 కిలోమీటర్ల సరిహద్దు గుండా ఈశాన్య రాష్ట్రాల్లోకి మత్తు పదార్థాలు, ఆయుధాలు సరఫరా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అఫ్గానిస్తాన్‌ను దాటి మయన్మార్ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించిందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఆ సాగుకు కావాల్సిన నీరు, ఎరువులు, మూలధన పెట్టుబడులు, కొనుగోలుదారులు, మార్కెటింగ్, హవాలా లాంటి కార్యకలాపాలన్నీ ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటుగా, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతం చేస్తే తప్ప ఈ ప్రమాదాన్ని అరికట్టలేం. కాలాడాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మయన్మార్‌లోని సీత్త్వే పోర్ట్‌ను మిజోరం రాజధాని ఐజ్వాల్‌తో కలిపే ప్రణాళికలో ముఖ్యమైన పాలేత్వా పట్టణాన్ని సాయుధ తిరుగుబాటు గెరిల్లా గ్రూపు ఆరగాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుందన్న వార్తలు... ఇండియా –మయన్మార్ సరిహద్దులను కంచెతో మూసేస్తాం అన్న కేంద్ర హోంమంత్రి ప్రకటన... ఈ రెండు కూడా భారతదేశ భద్రతతో ముడిపడిన అంశాలు. అలాగే ఇటీవల మణిపుర్లో చెలరేగిన జాతుల మధ్య ఘర్షణతో కూడా కొంత సంబంధం ఉన్న విషయాలు. 2003 డిసెంబర్లో వెలువడిన ‘యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ నివేదిక ప్రకారం, అఫ్గానిస్తాన్‌ను దాటి మయన్మార్ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించింది. అఫ్గానిస్తాన్‌లో నల్లమందు సాగుపై తాలిబన్ ప్రభుత్వం తీసుకొంటున్న కఠిన చర్యల ఫలితంగా అక్కడి ఉత్పత్తిలో గణనీయమైన తరుగుదల కనిపిస్తుండగా, మయన్మార్‌లో పెరుగుతోందన్న వార్తలు సరిహద్దు పంచుకుంటున్న భారత్ లాంటి దేశాలకు కలవరం కలిగించేదే. దశాబ్దాలపాటు మయాన్మార్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, సాయుధ తిరుగుబాటు... నల్లమందు (ఓపియం) ఉత్పత్తి పెరగడా నికి కారణమయ్యాయి. పేదరికంతో బాధపడుతున్న రైతులకు నల్ల మందు సాగు పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు ఒకే ఒకమార్గంగా అవతరించింది. కిలోకు సుమారు 23 వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒక కోటి పదిలక్షల హెక్టార్ల సాగు చేయదగిన భూమి ఉన్న మయన్మార్‌లో దాదాపు 47,000 హెక్టార్లు అంటే 0.5 శాతం భూమిలో నల్లమందు పండుతోంది. దీనివల్ల గతేడాది 1080 మెట్రిక్ టన్నుల నల్లమందు ప్రపంచ మార్కెట్లోకి విడుదలైంది. ఇది 2022లో ఆ దేశం ఉత్పత్తి చేసిన నల్లమందు కన్నా సుమారు 36 శాతంఅధికం. ఇదే సమయంలో ఎకరానికి సగటు ఉత్పత్తి 19 నుండి 22 కిలోలకు పెరిగింది. సాగులో అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నా రనీ, ఆయా ప్రాంతాలను నియంత్రిస్తున్నవారి సహాయం లేకుండా ఇది సాధ్యపడదనీ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం వ్యాపారం విలువ సుమారు రెండు బిలియన్ డాలర్లు. ఈ నల్లమందు ద్వారా ఉత్పత్పయ్యే హెరాయిన్, మార్ఫీన్, కోడెయిన్ వంటి మత్తు పదార్థాల ద్వారా సుమారు పది బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇది మయన్మార్ స్థూల జాతీయోత్పత్తిలో 2–4 శాతం. మయన్మార్‌లో ముఖ్యంగా మూడు రాష్ట్రాలైన షాన్, చిన్, కాచి న్లలో నల్లమందు సాగు నిరాటంకంగా జరుగుతోంది. థాయిలాండ్, లావోస్ దేశాలను ఆనుకుని ఉండే షాన్‌లో 1750ల లోనే నల్లమందు సాగు మొదలైంది. క్రమంగా ఆ ప్రాంతం మొత్తం విస్తరించి, ఇర వయ్యో శతాబ్దం నాటికి గోల్డెన్ ట్రయాంగిల్ రూపంలో అవతరించడమే గాక, ప్రపంచంలో సగం నల్లమందు ఆధారిత మత్తుపదార్థాలు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే సుమారు 80 శాతం ఉత్పత్తి జరుగుతుంటే, భారత్‌ను ఆనుకొని ఉండే చిన్, కాచిన్ రాష్ట్రాలు మిగిలిన ఇరవై శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలలోని టాహం, ఫాలం, తుఎంసెంగ్ ప్రాంతాల మీదుగా మయన్మార్‌తో సుమారు 510 కిలోమీటర్ల కంచె లేని సరిహద్దు కలిగి వున్న మిజోరంలోని ఛాంఫై, మణిపుర్‌లోని మొరెహ్, టాము ప్రాంతాల ద్వారా నల్లమందు భారత్‌లోకి చేరుతోంది. మయన్మార్‌తో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న భారత్‌పై, ముఖ్యంగా మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. వివిధ జాతులకు చెందిన సాయుధ పోరాట సంస్థలతో పాటు కొన్ని మిలిటరీ విభాగాలు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం, ఆయుధాల కొనుగోలు కోసం ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగం పంచుకుంటున్నారు. కాచిన్ ప్రాంతంలోని కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ, ఆరగాన్ ఆర్మీ, యునైటెడ్ వా స్టేట్ ఆర్మీ వాటిలో కొన్ని మాత్రమే. అలాగే చిన్ రాష్ట్రం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న చిన్ నేషనల్ ఆర్మీ, చిన్ నేషనల్ డెమోక్రాటిక్ ఫోర్స్, చిన్ ల్యాండ్ డిఫెన్స్ ఫోర్స్ లాంటి కొన్ని సాయుధ సంస్థలతో పాటు, సరిహ ద్దులకు ఇరువైపులా కార్యకలాపాలు సాగిస్తున్న కుకీ నేషనల్ ఆర్మీ కూడా ఈ వ్యవహారాల్లో భాగం కావడం ఆందోళన కలిగించేదే. సరి హద్దు దేశాలపై తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా ఒత్తిడి తేవ డానికి మయన్మార్ మిలిటరీ జుంటా కూడా ఈ నల్లమందు అక్రమ రవాణాలో భాగం పంచుకుంటోందని ఆ దేశానికి చెందిన ‘నేషనల్ యూనిటీ కన్సల్టేటివ్ కౌన్సిల్’ సభ్యుడు యు మయూన్గ్ మయూన్స్ ఆరోపిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో చైనీస్ డ్రగ్ కార్టెల్స్ పాత్ర చెప్పుకో దగినది. డ్రగ్స్‌ను అటు ఆగ్నేయాసియా మార్కెట్లలోకి తరలిస్తూ, ఇటు థాయిలాండ్ నుంచి మయన్మార్, బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ మీదుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ఆయుధాల్ని సరఫరా చేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతానికి చెందిన సాయుధ వేర్పాటు దళాలుఇంతకు ముందు నిధుల సేకరణకు బ్యాంకు దోపిడీలు, టీ గార్డెన్లు, వ్యాపార సముదాయాల నుండి అక్రమ వసూళ్లు, ప్రజల వద్ద పన్నులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల నుండి డబ్బు గుంజడాలు లాంటివి చేస్తుండేవి. ఈ నిధులను మయన్మార్‌లోని కాచిన్ వేర్పాటు వాద వర్గాల నుండి ఆయుధాలు కొనుగోలు కోసం వెచ్చిస్తుండేవి. అవి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకునేవి కాదు. కానీ గత కొన్నేళ్లుగా ఈ ధోరణిలో మార్పువస్తోంది. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే, నాలుగు విషయాలు గోచరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ, మారుమూల ప్రాంతాల్లో నల్లమందు, గంజాయి సాగు పెరుగుతోంది. హెరాయిన్, యాంఫేట మిన్ లాంటి మత్తు పదార్థాలు చిన్న పరిమాణాల్లో ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్నాయి. కొన్ని రకాల ఫార్మాస్యూటికల్స్ ఈశాన్య రాష్ట్రాల నుండి మయన్మార్‌లోకి రవాణా అవుతున్నాయి. యాంఫేటమిన్ లాంటి మత్తు పదార్థాలు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఫెడ్రిన్, సూడోపె డ్రిన్ లాంటివి మయన్మార్‌కు ఈశాన్య రాష్ట్రాల నుండి వెళ్తున్నాయి. అంటే సరిహద్దులకు ఇరు వైపులా సాగుతున్న వ్యవహారం ఇది! పశ్చిమాన అఫ్గానిస్తాన్, వాయవ్య పాకిస్తాన్, మధ్య ఆసియాతో కూడిన ‘గోల్డెన్ క్రెసెంట్’కూ... తూర్పున మయన్మార్, థాయిలాండ్, లావోస్‌లతో కూడిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’కూ మధ్యలో ఉన్న భారత్ మాదక ద్రవ్యాలకు అతిపెద్ద ఆకర్షణీయమైన మార్కెట్. మత్తు పదా ర్థాలను ఏమాత్రం సహించని(జీరో టోలెరెన్స్) విధానాన్ని కేంద్ర ప్రభుత్వ స్వీకరించింది. దీనిలో భాగంగా 2016లో నార్కో కోఆర్డి నేషన్ సెంటర్, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం2019లో జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైనాయి. ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్’ చట్టం 1985లో భాగంగా బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్‌కు డ్రగ్స్ వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి అధికారం కల్పించారు. ఇప్పటివరకూ సుమారు ఒకటిన్నర లక్షల కిలోల మత్తు మందులను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేస్తే, అందులో నలభై వేల కిలోలు ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లోవే. ప్రభుత్వాలే కాకుండా వివిధ రంగాల ప్రజలు కూడా సమాజాన్ని జాగృతం చేస్తేనే మత్తు మహమ్మారిని అరికట్టగలం. కొన్ని సినిమాల్లో చూపిస్తున్న విధంగా డ్రగ్స్ సేవించడం, సైకోల్లా ప్రవర్తించడమే హీరోయిజంగా యువత భావిస్తే మనం కేవలం నిట్టూర్పు విడవాల్సి వస్తుంది. - వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, జేఎన్‌యూ ‘ 79089 33741 - డాక్టర్ గద్దె ఓంప్రసాద్ -
మిజోరాంలో ప్రమాదానికి గురైన మయన్మార్ సైనిక విమానం..
ఐజ్వాల్: మిజోరంలో మయన్మార్ ఆర్మీకి చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం రన్‌వేపై దిగుతుండగా అదుపు తప్పి కొంత దూరంలో ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో జరుగుతున్న అతర్యుద్ధం కారణంగా సరిహద్దుల దాటి భారత్‌లోని మిజోరం రాష్ట్రంలోకి చొరబడిన మయన్మార్ సైనికులను స్వదేహానికి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చిన సమయంలో ప్రమాదం జరిగింది. కాగా టేబుల్‌టాప్ రనేవేలు (పీఠభూమి లేదా ఎత్తైన కొండ పైభాగం ప్రాంతాల్లో నిర్మించిన రన్‌వే) సవాలుతో కూడుకొని ఉన్నాయి. ఇలాంటి రన్‌వేలో భారత్‌లో ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి వల్ల విమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయాల్లో రన్‌వే నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. చదవండి: భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేదు.. ఐక్యరాజ్య సమితిపై మస్క్ కీలక వ్యాఖ్యలు ఇక మయన్మార్‌లో తిరుగుబాటు గ్రూపులతో జరుగుతోన్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో ఆ దేశం నుంచి భారీగా సైనికులు భారత్‌లోకి చొరబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత వారం మొత్తం 276 మంది మయన్మార్ సైనికులు మిజోరాంలోకి ప్రవేశించారని, వీరిలో 184 మంది సైనికులను భారత్ సోమవారం వెనక్కి పంపినట్లు అస్సాం రైఫఙల్స్ సోమవారం పేర్కొంది. స్వతంత్ర రాఖైన్ రాష్ట్ర కోసం పోరాటం చేస్తున్న మయన్మార్ తిరుగుబాటు బృందం ‘అరాకన్ ఆర్మీ’ సాయుధులు గతవారం దేశ సైనిక క్యాంప్‌పై దాడి చేసి ఆక్రమించుకున్నారు. దీంతో మయన్మార్ సైనికులు మిజోరాంలోని లాంగ్ట్లై జిల్లాలోని భారత్-మయన్మార్-బంగ్లాదేశ్ ట్రైజంక్షన్ వద్ద ఉన్న బందుక్‌బంగా గ్రామం ద్వారా దేశంలోకి ప్రవేశించి అస్సాం రైఫిల్స్ క్యాంప్‌లో లొంగిపోయారు. వీరి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి. మయన్మార్ సైనికులను పర్వాలోని అస్సాం రైఫిల్స్ శిబిరానికి తరలించారు. అనంతరం వారిని లుంగ్లీకి మకాం మార్చారు. ఐజ్వాల్ సమీపంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని సిట్వేకు మయన్మార్ వైమానిక దళానికి చెందిన విమానాల్లో సైనికులను స్వదేశానికి పంపే ప్రక్రియ ప్రారంభించినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి ఒకరు తెలిపారు. మిగిలిన 92 మంది సైనికులను నేడు మయన్మార్ తరలిస్తామని చెప్పారు. -
భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన
గౌహతి: మయన్మార్‌లో కొన్ని రోజులుగా దేశ సైనిక ప్రభుత్వం, అక్కడి ప్రజాస్వామ్య సాయుధ దళాలకు మధ్య ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మయన్మార్ ఆర్మీ(జుంటా) సైనికులు భారత సరిహద్దులు దాటి భారత్‌లోని మీజోరంకి వరుసకడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం అప్రమత్తమైంది. మీజోరం భూభాగంలోకి చొచ్చుకువస్తున్న జుంటా సైనికులను వెంటనే మయన్మార్‌కు తిరిగి పంపిచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద ఎత్తున సరిహద్దు దాటుకొని మిజోరం వైపు వస్తున్న మయన్మార్ సైనికులను వెనక్కి పంపిచాలని మిజోరం సీఎం లాల్దుహోమ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు మిజోరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిత్త పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్థిరత్వం నెలకొల్పడానికి మయన్మార్ సైనికులు వెనక్కి పంపించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇక.. ఇటీవల తరచూ మయన్మార్ సైనికలు భారత సరిహద్దులు దాటుకొని మిజోరం రాష్ట్రంలోకి వస్తున్నారని మిజోరం సీఎం లాల్దుహోమ తెలిపారు. మనవతా సాయం కింద మయన్మార్ సైనికులకు తాము సైనిక క్యాంప్‌లో సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలా 450 మంది జుంటా సైనికులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. 2021 నుంచి మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా? -
తీవ్ర గాయాలతో భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. ఏమైందంటే?
మయన్మార్ (బర్మా) చెందిన 151 మంది సైనికులు భారత్‌లోకి చొచ్చుకొని వచ్చారు. మిజోరం రాష్ట్రంలో గల సరిహద్దు జిల్లా లాంగ్ట్లైలోకి మమన్మార్ సైనికులు తరలివచ్చినట్లు అస్సాం రైఫిల్స్ అధికారి వెల్లడించారు. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థ అయిన అరాకన్ ఆర్మీ(ఏఏ) ఆ దేశ సైన్యం ‘తత్మాదవ్’ క్యాంప్‌ను ధ్వంసం చేసింది. దీంతో మయన్మార్ సైన్యంలోని 151 మంది సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోని మిజోరంలోకి ప్రవేశించారు. కాగా.. కొన్ని రోజులుగా భారత్ సరిహద్దుకు సమీపంలోని మయన్మార్ ప్రాంతంలో ఆ దేశ సైన్యానికి, ప్రజాస్వామ్య అనుకూల సాయుధ సంస్థ అరాకన్ ఆర్మీకి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తీవ్రమైన గాయాలతో కొంతమంది సైనికులు భారత్‌లోకి వచ్చినట్లు ధ్రువీకరించారు. అయితే అస్సాం రైఫిల్స్ అధికారులు గాయపడిన మయన్మార్ సైనికులకు ప్రథమ చికిత్స అందించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మయన్మార్ సైనికులు అస్సాం రైఫిల్స్ కస్టడీలో మయన్మార్ సరిహద్దు వద్ద ఉన్నారని పేర్కొన్నారు. వారిని మయన్మార్ పంపించడానికి భారత దేశ విదేశాంగ శాఖ, మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయని అస్సాం రైఫిల్స్ అధికారులు తెలిపారు. మరోవైపు మయన్మార్‌లో సైనిక పాలనను కూలదోసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి అక్కడి ప్రజాస్వామ్య అనుకూల సాయుధ తిరుగుబాటు సంస్థలు ఉమ్మడిగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. త్రీబ్రదర్‌హుడ్ అలయన్స్ (టీబీఏ), మయన్మార్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్డీఏఏ), టాంగ్ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్ ఆర్మీ(ఏఏ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. చదవండి: హౌతీ రెబెల్స్‌ను మళ్లీ దెబ్బ కొట్టిన అమెరికా -
మణిపూర్‌లో వలసదారుల జల్లెడ కార్యక్రమం పొడిగింపు
ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లు తగ్గుముఖం పట్టి అక్కడ పరిస్తితి ఇప్పుడిప్పుడే యధాస్థితికి చేరుకుంటోంది. అంతకుముందు మయన్మార్ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారిని లెక్కించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో కేంద్రం ఆ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మణిపూర్ అల్లర్లకు మయన్మార్ నుంచి వలస వచ్చిన వారు కూడా కారణమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ వాసులను లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర హోంశాఖ.మణిపూర్‌తో పాటు మిజోరాంలో కూడా ఈ వలసదారులను లెక్కించమని కోరిన మిజోరాం దానిని తిరస్కరించింది. అలా చేస్తే అక్కడి వారిపై వివక్ష చూపించినట్లవుతుందని మిజోరాం అభిప్రాయపడింది. మే 29న కేంద్ర హోంశాఖ అక్రమ వలసదారులను బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించాలని సెప్టెంబర్ 30 లోపే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ అంతకుముందు తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ వాసులు సాధారణంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తుంటారని అందుకే వారి గణన చేపట్టామన్నారు. ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) వారిచే శిక్షణ తీసుకున్న ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కూడా అల్లర్లకు మయన్మార్ వాసులే కారణమని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని సీఎం బైరెన్ సింగ్ ప్రకటించారు. ఇది కూడా చదవండి: సీబీఐ క్లీన్చిట్ ఇస్తే రాజీనామా చేస్తారా? కేజ్రీవాల్ సవాల్! -
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవి! అడుగుపెట్టారో అంతే..!
మయాన్మార్‌లోని రామ్రీ దీవిలో అడుగుపెట్టాలంటే ఇప్పటికీ జనాలకు హడలే! ఆ దీవిలో ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా మొసళ్లు సంచరిస్తుంటాయి. ఉప్పునీటిలో బతికే ఈ మొసళ్లకు చిక్కితే వాటికి పలారమైపోవడం తప్ప బతికి బట్టకట్టడం అసాధ్యం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా పేరుమోసిన ఈ రామ్రీ దీవికి ఒక చరిత్ర ఉంది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఇక్కడ మోహరించిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ బలగాలపై దాడి చేసేందుకు జపాన్ సైన్యం ఈ దీవికి చేరుకునే ప్రయత్నం చేసినప్పుడు వందలాది మంది జపాన్ సైనికులు ఈ దీవిలోని మొసళ్లకు పలారమైపోయారు. యుద్ధ సమయంలో అత్యధికులు జంతు దాడిలో మరణించిన సంఘటనగా ఇది గిన్నిస్‌బుక్‌లో చోటు పొందింది. (చదవండి: అక్కడ అడుగుపెడితే ప్రమాదమే!) -
అంగ్ సాన్ సూకీ జైలు శిక్ష తగ్గింపు
బ్యాంకాక్: పదవీచ్యుతురాలైన అంగ్ సాన్ సూకీ(78) జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం ప్రకటించింది. రెండున్నరేళ్ల క్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సైనిక పాలకులు కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అనంతరం సూకీపై 19 నేరారోపణలు మోపారు. వీటిలో కొన్నిటిపై విచారణ జరిపిన సైనిక కోర్టులు సూకీకి 33 ఏళ్ల జైలు శిక్షలు విధించాయి. బౌద్ధులు మెజారిటీగా ఉన్న మయన్మార్‌లో మంగళవారం ‘గౌతమ బుద్ధుని మొదటి ఉపన్యాస’దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా మిలటరీ కౌన్సిల్ చీఫ్, సీనియర్ జనరల్ మిన్ సుమారు 7 వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. వీరిలో సూకీ, మాజీ అధ్యక్షుడు విన్‌మింట్ ఉన్నారు. సూకీకి ఆరేళ్ల జైలు శిక్షను తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రకారం, ఆమె మరో 27 ఏళ్లపాటు జైలు జీవితం గడపాలి. -
రెండు రోజుల్లో మణిపూర్‌లోకి 718 మంది మయన్మార్ దేశస్తులు..
ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లు మొదలై రెండు నెలలకు పైబడుతోంది. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోంది. మెల్లిగా జనజీవనం కూడా యధాస్థితికి చేరుకుంటోంది. అంతలోనే మయన్మార్ నుండి 700 కు పైగా వలసదారులు మణిపూర్‌లో అడుగుపెట్టారు. రాష్ట్ర సరిహద్దు చుట్టూ వేల సంఖ్యలో అస్సాం రైఫిల్స్ ను కాపలా పెట్టినా సరైన డాక్యుమెంట్లు లేకుండా అంతమంది రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్నదే ప్రభుత్వాన్ని తొలిచేస్తున్న ప్రధాన ప్రశ్న. మే 3 నుండి మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు యావత్ భారతదేశం నివ్వెరపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే రెండు జాతుల మధ్య వైరుధ్యం కారణంగా చెలరేగిన అల్లర్లు సుమారు 150 మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఎన్నో ఇళ్ళు దగ్ధమయ్యాయి. ఏ వీధిని చూసిన సగం కాలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. 40 వేలకు పైగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయారు. ఒకపక్క ప్రాణాలను చేత బట్టుకుని మణిపూర్ వాసులు వలస పోతుంటే పక్క దేశం నుండి అగ్నిగుండంలా ఉన్న రాష్ట్రంలోకి వలసలు వస్తున్నారు. హోంశాఖ తెలిపిన విసరాల ప్రకారం జులై 22, 23 లోనే మయన్మార్ నుండి 718 మంది వలసవచ్చారు. వీరంతా ఎవరనేది మణిపూర్ ప్రభుత్వానికి ఎదురవుతున్న మొదటి ప్రశ్న. బ్రతుకు తెరువు కోసమే వచ్చారా లేక ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చారా? అన్నదానిపై స్పష్టత లేదు. వారు ఆయుధాలు ఏవైనా వెంట తెచ్చుకున్నారా అన్న సమాచారం కూడా హోంశాఖ వద్ద లేదు. సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా దళాలు ఉన్నప్పటికీ వారి వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేవా అన్నది పరిశీలించకుండానే అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన -
‘ప్రశాంత మణిపూర్’ ఎట్లా?
నెలరోజులుగా భగ్గున మండుతున్న మణిపూర్‌లో ప్రశాంతత నెలకొల్పేందుకు ఎట్టకేలకు ఒక రాజకీయ ప్రయత్నం మొదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించి పరస్పరం కలహిస్తున్న మెయితీ, కుకీ తెగల నాయకులతో, పౌర సమాజ కార్యకర్తలతో, రాజకీయ పార్టీలతో మంగళవారం సమావేశమయ్యారు. సమస్య ఉగ్రరూపం దాల్చినప్పుడు, జనం చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు పాలకులుగా ఉన్నవారు సంయమనంతో మెలగటం, సాధారణ స్థితి ఏర్పడేందుకు ప్రయత్నించటం అవసరం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్‌కు ఈ ప్రాథ మిక విషయాలు కూడా తెలిసినట్టు లేదు. ఇప్పటివరకూ జరిగిన ఘర్షణల్లో దాదాపు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 40,000 మంది వరకూ కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఊళ్లకు ఊళ్లే మంటల్లో మాడి మసయ్యాయి. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి తుపాకులు, మందుగుండు అపహరించిన ఉదంతాలు జరిగాయి. ఇలాంటి సమయంలో ‘ఇదంతా కుకీ ఉగ్ర వాదులకూ, భద్రతా దళాలకూ సాగుతున్న ఘర్షణ తప్ప మరేంకాద’ని బీరేన్ సింగ్ ప్రకటించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరోక్షంగా కుకీలను మిలిటెంట్లుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించటమే ఆయన ప్రకటన వెనకున్న సారాంశమన్న విమర్శలు వెల్లువెత్తాయి. రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సీఎం ప్రకటనను తోసిపుచ్చారు. ఇది కేవలం రెండు తెగల మధ్య ఘర్షణేనని తేల్చి చెప్పారు. మెయితీ తెగకు చెందిన నేతగా బీరేన్ సింగ్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ పాలకుడిగా స్పందించాల్సి వచ్చినప్పుడూ, రాష్ట్రం ఇంకా ఘర్షణలతో అట్టుడుకు తున్నప్పుడూ ఆచి తూచి మాట్లాడాలి. తమ తెగవారిపై జరుగుతున్న దాడుల మాటేమిటని కుకీ శాసనసభ్యులు నిలదీస్తే ఆయన నుంచి సమాధానం లేదు. ఇదొక్కటే కాదు... హింసను సాకుగా చూపి 25 మిలిటెంట్ సంస్థలతో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు బీరేన్ సింగ్ ఏకపక్షంగా ప్రకటించటం కూడా సమస్య తీవ్రతను పెంచింది. కుకీలతో అమిత్ షా నిర్వహించిన సమావేశానికి సీఎం రాలేని స్థితి ఏర్పడటం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వారు కోరటం రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడిన అవిశ్వాసానికి అద్దం పడుతుంది. మణిపూర్‌తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడి నాలుగున్నర కోట్ల జనాభాలో 400కు పైగా తెగలున్నాయి. మాండలికాలు సైతం దాదాపు అంతే సంఖ్యలో ఉంటాయి. వీరంతా భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందినవారైనా... అప్పుడప్పుడు అపోహలు తలెత్తిన సందర్భాలున్నా మొత్తంమీద శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే ఇంచుమించు ఏభైయ్యేళ్లుగా ఇదంతా మారింది. తెగల పరిరక్షకులమంటూ సాయుధ బృందాలు తలెత్తటం మొదలైంది. ఉపాధి లేమివల్ల కావొచ్చు... జీవికకు ముప్పు కలుగుతుందన్న భయాందోళనల వల్ల కావొచ్చు చిన్న సమస్య రాజుకున్నా అది క్షణాల్లో కార్చిచ్చుగా మారి కల్లోలం రేపుతోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాన్ని ఏర్పరచాలన్న డిమాండ్ బయల్దేరుతోంది. వివిధ రాష్ట్రాల్లో తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను కలిపి ‘ప్రత్యేక నాగాలిమ్’ ఏర్పరచాలని నాగాలు పదేళ్ల క్రితం తీవ్ర ఆందోళనకు దిగారు. పరిమిత వనరులను పలువురితో పంచుకోవటం తప్పనిసరి కావటంతో అవత లివారు శత్రువులుగా కనిపిస్తున్నారు. మెయితీలను సైతం ఎస్టీలుగా పరిగణించాలన్న న్యాయస్థానం ఆదేశాలు ఈ కారణంతోనే ఆదివాసీలైన కుకీల్లో కల్లోలం సృష్టించాయి. ఇదే అదునుగా ఘర్షణలు తలెత్తాయి. పొరుగునున్న మయన్మార్ నుంచి వచ్చిపడుతున్న శరణార్థులను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మెయితీ నాయకులు చెప్పటం సమస్యను తగ్గించి చూపటమే అవుతుంది. అసలు కుకీలు స్థానికులు కాదనీ, వారు మయన్మార్ నుంచి వలస వచ్చినవారనీ చాన్నాళ్లనుంచి మెయితీలు వాదిస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్ఆర్సీ) అమలు చేసి, పౌరసత్వాన్ని నిగ్గుతేల్చి స్థానికేతరులను పంపేయాలని వారు కోరుతున్నారు. 53 శాతంగా ఉన్న మెజారిటీ తెగ నుంచి ఇలాంటి డిమాండ్ రావటం కొండప్రాంతాల్లో ఉంటున్న కుకీల్లో సహజంగానే గుబులు రేపుతోంది. 1901 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో కుకీలు 14.5 శాతం. 110 ఏళ్ల తర్వాత 2011 నాటికి వారి జనాభా పెరుగుదల రెండు శాతం మాత్రమే. అలాంటపుడు కుకీలపై స్థానికేతరుల ముద్రేయటం అసంబద్ధం కాదా? ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రకటనలనూ, తెగల మధ్య అపోహలు పెంచే వదంతులనూ నివారించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాని పర్యవసానంగానే ఇంత హింస చోటుచేసుకుంది. నిరుడు యూపీలోని మధురలో కన్నవారి కర్కశత్వానికి బలైపోయిన 21 ఏళ్ల యువతిని మెయితీ తెగ మహిళగా చిత్రించి, ఆమెపై కుకీలు అత్యాచారానికి పాల్పడి హతమార్చారని తప్పుడు ప్రచారం జరపడంతో ఉద్రిక్తతలు రాజుకున్నాయి. కుకీ తెగ మహిళలపై దాడులు జరిగాయి. అత్యాచార ఉదంతాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక చుర్‌చాంద్‌పూర్‌లో హిందూ దేవా లయాలపై దాడులు సాగించారన్న వదంతులు లేవదీశారు. ఇదంతా అబద్ధమని వెంటనే ఆ ప్రాంత మార్వాడీ, పంజాబీ సొసైటీలు, బెంగాలీ సొసైటీ, బిహారీ సొసైటీ సంయుక్తంగా ప్రకటించాయి. తెగల పేరుతో, మతం పేరుతో ప్రజల్లో చీలికలు తెచ్చే యత్నాలను మణిపూర్ పౌర సమాజం ఐక్యతతో తిప్పికొట్టాలి. పాలకులు, రాజకీయ పార్టీల నేతలు జవాబుదారీతనంతో మెలగాలి. అప్పుడే ప్రశాంత మణిపూర్ సాధ్యమవుతుంది. -
బంగ్లా తీరాన్ని తాకిన మోకా
సాక్షి, విశాఖపట్నం: భీకర మోకా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, మయన్మార్ తీరాన్ని తాకి తీవ్ర నష్టం కలగజేసింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో 8–12 అడుగుల ఎత్తున ఎగిసి పడిన అలలు లోతట్టు ప్రాంతాలను ముంచి వేశాయి. సెంట్ మార్టిన్ దీవిలో బలమైన గాలులు, భారీగా వానలు కురిశాయి. గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తివంతమైన తుపాను అని అధికారులు తెలిపారు. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపితే హుద్‌హుద్ తరహా పెను విపత్తుకు కారణమయ్యేదని నిపుణులు చెబుతున్నారు. -
మయన్మార్, బంగ్లాదేశ్లని తాకనున్న మోచా తుఫాను..ఇప్పటికే వేలాదిమంది..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా మోచా తుపానుగా మారింది. తొలుత ఈ తుపాను ప్రభావం ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని భావించారు అధికారులు. కానీ తుపానుగా మారిన తర్వాత తన దిశ మార్చుకుని ఈశాన్య రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను మే 14న బంగ్లాదేశ్, మయాన్మార్ సరిహద్దుల్లో తీరం దాటనుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ మోచా తుపాను గంటకు హరికేన్ 4కి సమానంగా సుమారు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ తుపాను మయాన్మార్ రఖైన్ తీరంలోని సిట్వే మధ్య ఆదివారం ఉదయం తాకగానే బలహీనపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు ఒక లక్ష మందికిపైగా ప్రజలు ఉన్న పట్టణంలో దుకాణాలు, మార్కెట్లు మూసేశారు. ఇదిలా ఉండగా, మయన్మార్ జుంటా అధికారులు రఖైన్ తీరం వెంబడి ఉన్న గ్రామాలలో తరలింపు ప్రక్రియలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మయన్మార్ ఎయిర్వేస్ ఇంటర్నేషనల్ రాఖైన్ ఎయిర్‌పోర్టు తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమానాలను సోమవారం వరకు నిలిపివేసినట్లు తెలిపింది. అలాగే పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో అధికారులు రోహింగ్యా శరణార్థులను ప్రమాదకర ప్రాంతాల నుంచి కమ్యూనిటీ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సిద్ర్ తుపాను తర్వాత మోచా తుపాను అత్యంత శక్తిమంతమైన తుపాన్ అని బంగ్లాదేశ్ వాతావరణ విభాగం అధిపతి రెహ్మన్ వెల్లడించారు. ఈపాటికే వేలాది మంది వాలంటీర్లు రోహింగ్యాలను ప్రమాదకర ప్రాంతాల నుంచి పాఠశాలలు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆయా సరిహద్దులోని దీవుల్లో పనిచేసే వేలాదిమంది ఆయా ప్రాంతాలను విడిచి పారిపోయినట్లు కూడాఅధికారులు పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఓడరేవు చిట్టగాంగ్‌లో కార్యకలాపాలు నిలిపివేయడమే గాక పడవ రవాణా, చేపల వేటను కూడా నిషేధించారు అధికారులు. (చదవండి: క్షణాల్లో కాల్చివేత, అమెరికాలో సంచలనం.. దడ పుట్టిస్తున్న వీడియో) -
బంగ్లాదేశ్–మయన్మార్ తీరం దిశగా ‘మోకా’
న్యూఢిల్లీ: మోకా తుపాను మరింత శక్తివంతంగా మారుతోందని, శుక్రవారం ఉదయానికల్లా మరింత తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను బంగ్లాదేశ్–మయన్మార్ దిశగా కదిలే అవకాశాలు ఉన్నాయని అధికారులు గురువారం రాత్రి తెలియజేశారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమంగా 520 కిలోమీటర్లు, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ నుంచి దక్షిణ దిశగా 1,100 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ బంగాళాఖాతంపై మోకా తుపాను ఆవరించి ఉంది. ఆదివారం ఉదయం వరకూ ఈశాన్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. -
సొంత పౌరులపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 100 మంది మృతి
మయన్మార్‌లో పాలక సైన్యం దారుణానికి తెగబడింది. సొంత పౌరులపై వైమానిక దాడి జరిపింది. సైనిక పాలనను వ్యతిరేకించే ఓ వర్గంపై ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ భీకర దాడిలో 100 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. కాగా సగయింగ్ ప్రాంతంలోని పాజిగై గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటలకు సైనిక పాలనను వ్యతిరేకించే ప్రతిపక్షం పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మంది హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో మయన్మార్ సైన్యం ఆ గ్రామంపై ఫైటర్ జెట్‌తో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 100 మందికి పైగా మరణించగా.. మృతుల్లో మహిళలు, 20 నుంచి 30 మంది చిన్నారులు, స్థానికంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపులు, ఇతర ప్రతిపక్ష సంస్థల నాయకులు కూడా ఉన్నారని ప్రతక్ష్య సాక్షి ఒకరు స్థానిక మీడియాతో వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే మయన్మార్ సైన్యం వివరాలను బయటకు పొక్కనీయకపోవడంతో మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. చదవండి: Bathinda: మిలిటరీ స్టేషన్లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి.. ఇక ఈ దాడి తామే చేసినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం జుంటా ప్రకటించింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నందుకు పాజిగై గ్రామంపై అటాక్ చేశామని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. ఈ ఘటనను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. మయన్మార్ మిలిటరీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అమాయక పౌరులపై సాయుధ దళాల దాడిని ఉగ్రవాద సైన్యం జరిపిన హేయమైన చర్యగా ప్రతిపక్ష నేషనల్ యూనిటీ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 2021లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నుంచి సైన్యం దేశ అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి సైనిక పాలనను వ్యతిరేకించే వారిని అణచివేసేందుకు విపరీతంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భద్రతా బలగాలు దాదాపు 3,000 మంది పౌరులను పొట్టనపెట్టుకున్నట్లు సమాచారం. -
Aung San Suu Kyi: ఎన్ఎల్డీ పార్టీ గుర్తింపు రద్దు
మయన్మార్ జుంటా గవర్నమెంట్ (మిలిటరీ ప్రభుత్వం) మంగళవారం సంచలన ప్రకటన చేసింది. మిలిటరీ ప్రభుత్వ పర్యవేక్షణలోని ఎన్నిక సంఘం ప్రతిపక్ష నేత ఆంగ్ సాన్ సూకీకి భారీ షాక్ ఇచ్చింది. సూకీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ’(NLD) పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మయన్మార్ ఈసీ. కొత్త సైనిక-ముసాయిదా ఎన్నికల చట్టానికి అనుగుణంగా.. ఎన్ఎల్డీ పార్టీ తన రిజిస్ట్రేషన్‌ను తిరిగి నమోదు చేసుకోవడంలో విఫలమైందని, అందుకే గుర్తింపు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. మయన్మార్‌లో కఠిన ఎన్నికల చట్టం తీసుకొచ్చింది జుంటా మిలిటరీ ప్రభుత్వం. దాని ప్రకారం.. కేసులు ఎదుర్కొంటున్న వాళ్లు, అజ్ఞాతంలో ఉన్నవాళ్లు, ఇంకా పలు నిబంధంనల కింద.. రాజకీయ పార్టీలను అధికారికంగా నమోదు చేయడానికి వీల్లేదు. తద్వారా ప్రత్యర్థి పార్టీల అడ్డుతొలగించుకునేందుకు మిలిటరీ ప్రభుత్వం ప్లాన్ వేసింది. ఈ క్రమంలో.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నప్పటికీ, విపక్షాల నుంచి విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఈ ఏడాది జనవరి నుంచి పార్టీల రీ రిజిస్ట్రేషన్లకు రెండు నెలల గడువు ఇచ్చింది. ఆ దేశంలోని మొత్తం 90 పార్టీలకుగానూ 50 పార్టీలు మాత్రమే రీ రిజిస్ట్రేషన్ ద్వారా అర్హత సాధించుకున్నాయి. ఇక మిగతా పార్టీల గుర్తింపు(సూకీ ఎన్ఎల్డీ సహా) బుధవారం(నేటి) నుంచి రద్దు కానున్నాయి. మయన్మార్ ఉద్యమ నేత అయిన ఆంగ్ సాన్ సూకీ 1988లో ఎన్‌ఎల్‌డీని స్థాపించారు. 1990 ఎన్నికలలో ఘనవిజయం సాధించగా.. అప్పటి జుంటా(మిలిటరీ) ఆ ఎన్నికను రద్దు చేసింది. అయినప్పటికీ ఆమె ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే వస్తున్నారు. ఈ క్రమంలో 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమె మిలిటరీ భాగస్వామ్య పార్టీలను మట్టికరిపించి కూటమి పార్టీల సాయంతో ఘన విజయం సాధించారు. ఇదిలా ఉంటే.. 2020లో జరిగిన ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. కానీ, ఎన్నికల్లో మోసం జరిగిందంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ.. కిందటి ఏడాది ఫిబ్రవరిలో జుంటా మిలిటరీ నేతలు తిరుగుబాటుకి దిగారు. ఆపై సూకీని జైలు పాలు చేయడంతో పాటు పలు నేరాల కింద ఆమెకు శిక్షలు విధిస్తూ వెళ్తున్నారు. వివిధ కేసుల్లో పడిన జైలుశిక్ష ఇప్పటిదాకా మొత్తం 33 ఏళ్లకు చేరుకుంది. ఒకవైపు ఆమెపై కేసులు, వాటి విచారణ పరంపర కొనసాగుతోంది. అందులో అవినీతి, రహస్య సమాచార లీకేజీ తదితర ఆరోపణలు ఉండడం గమనార్హం. మరోవైపు మిలిటరీ నేతల పాలనలో మయన్మార్ గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇంకోవైపు సూకీని రిలీజ్ చేయాలని ఇటీవల యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్ ఓ ప్రకటనలో కోరింది. -
వన్డే మ్యాచ్.. రికార్డు స్కోర్, భారీ విజయం
ACC Mens Challenger Cup 2023: ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏసీసీ మెన్స్ ఛాలెంజర్ కప్-2023లో రికార్డు విజయం నమోదైంది. టోర్నీలో భాగంగా మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌదీ అరేబియా ఏకంగా 327 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఏసీసీ మెన్స్ ఛాలెంజర్ కప్ చరిత్రలో ఇది భారీ విజయంగా రికార్డైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌదీ అరేబియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేయగా.. ఛేదనలో మయన్మార్ 25.3 ఓవర్లలో 97 పరగులకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. Saudi Arabia dominates Myanmar with a massive 327-run victory in the #ACCChallengercup, qualifying for the semifinals in style! Congratulations to the team on their remarkable performance! pic.twitter.com/5SyTaDgotu — AsianCricketCouncil (@ACCMedia1) March 1, 2023 సౌదీ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మనన్ అలీ (102) సెంచరీతో చెలరేగగా.. మహ్మద్ హిషమ్ షేక్ (59), అబ్దుల్ వహీద్ (61), జైన్ ఉల్ అబ్దిన్ (66 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. మయన్మార్ బౌలర్లలో ఖిన్ అయే, ఔంగ్ ఖో ఖో తలో 2 వికెట్లు పడగొట్టగా.. పైంగ్ దాను, సాయ్ హ్టెట్ వై, కో కో లిన్థు ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మయన్మార్ ఇన్నింగ్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. వీరిలో యే నైంగ్ తున్ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌదీ బౌలర్లలో అబ్దుల్ వహీద్ 4 వికెట్లు పడగొట్టగా.. జైన్ ఉల్ అబ్దిన్ 2, అబ్దుల్ వహీద్, జుహైర్ మహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో సౌదీ అరేబియా దర్జాగా సెమీస్ఫైనల్లోకి ప్రవేశించింది. -
మయన్మార్ అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి
ఆదిలాబాద్: అతడేమో గుడిహత్నూర్ మండలం చింతగూడకు చెందిన గొల్లపల్లి రవి.. ఆమెనేమో మయన్మార్ దేశంలోని ఇన్సైన్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన జిన్ న్వే థీయోన్. వీరిద్దరు ఉపాధి నిమిత్తం ఖతర్ దేశానికి వెళ్లి అక్కడ హోటళ్లో పనిచేస్తుండగా ఇద్దరు మనస్సులు కలిశాయి. ఇరు కుటుంబాలను సంప్రదిస్తే వారు వివాహానికి సమ్మతించారు. ఇంకేముందు సీన్ కట్ చేస్తే.. సోమవారం రవి స్వగ్రామం చింతగూడలో వారిద్దరికి సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. అయితే ఈ జంటను చూస్తున్నవారికి ముచ్చట గొలిపింది. ప్రేమకు భాష, దేశ హద్దులు అడ్డురావని నిరూపించారు ఈ ప్రేమికులు. మండలంలోని చింతగూడెం గ్రామానికి చెందిన గొల్లపల్లి రవి ఆరేళ్ల క్రితం ఉపాధి కోసం ఖతర్ దేశం వెళ్లాడు. అక్కడ దోహా పట్టణంలోని హోటల్లో పని చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో అదే హోటల్లో పనిచేస్తున్న మయన్మార్ దేశంలోని ఇన్సైన్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన జిన్ న్వే థీయోన్తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. వీరి ప్రేమ వ్యవహారంను ఇరు కుటుంబాలకు తెలిపారు. వీరి ప్రేమను అర్థం చేసుకొని వారు స్వాగతించారు. రవి స్వగ్రామమైన చింతగూడెంలో క్రైస్తవ సంప్రదాయబద్ధంగా పెళ్లికి నిశ్చయించారు. ఈ క్రమంలో సోమవారం గ్రామంలోని చర్చిలో పెళ్లి చేసుకొని ఈ జంట ఒక్కటయ్యారు. వరుడు తరఫున బంధుమిత్రులు హాజరుకాగా, వధువు తరఫున ఆమె సోదరుడు క్వేక్వే థీయన్ హాజరై ఇక్కడి పెళ్లి తంతు సంప్రదాయాలను తన మొబైల్ ద్వారా మయన్మార్ లోని తన కుటుంబ సభ్యులకు చేరవేశాడు. వరుడు రవి కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంతో వధువును తమ కుటుంబంలోకి స్వాగతించారు. -
Viral Video: ‘మయన్మార్‌లో తింటే.. భారత్‌లో పడుకుంటారు’
నాగాలాండ్ మంత్రి టెన్జెన్ ఇమ్నా ఓ ఆసక్తికర వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ఇది భారత్, మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఓ ప్రత్యేకమైన గ్రామం గురించి తెలియజేస్తుంది. నాగాలాండ్‌లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం భారత్, మయన్మార్ దేశాల సరిహద్దులుగా కలిగి ఉండటమే దీని ప్రత్యేకత లాంగ్వా గ్రామానికి ఓ వైపు మయన్మార్ దట్టమైన అడువులు ఉండగా.. మరోవైపు భారత్‌లోని వ్యవసాయ భూమి సరిహద్దుగా కలిగి ఉంది. 1970లో భారతదేశం, మయన్మార్ మధ్య సరిహద్దులు సృష్టించడానికి చాలా కాలం ముందే లాంగ్వా గ్రామం ఏర్పడింది. అధికారులు సరిహద్దు రేఖను గీస్తున్నప్పుడు, వారు తమ కమ్యూనిటీ విభజించేందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామం గుండా సరిహద్దు గీశారు. అందుకే ఒక సరిహద్దు పిల్లర్‌పై బర్మీస్ బాషలో రాసి ఉంటే మరో పిల్లర్‌పై హిందీలో రాసి ఉంటుంది. లాంగ్వాలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే అధికంగా నివసిస్తుంటారు. నాగాలాండ్‌లో గుర్తింపు పొందిన 16 గిరిజనుల్లో కొన్యాక్ తెగ అతి పెద్దది. కొన్యాక్ తెగకు ఆంగ్ అనే వ్యక్తి అధిపతిగా పిలవబడుతుంటాడు. లాంగ్వా గ్రామం భారత్, మయన్మార్ దేశాలను సరిహద్దులుగా కలిగి ఉన్నప్పటికీ ఓకే వ్యక్తి దీనిని పాలిస్తున్నాడు. అతని పాలన 75 గ్రామాలకు విస్తరించింది. ఇందులో కొన్ని మయన్మార్‌కు, మరికొన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వానికి తన ప్రజలకు ఆంగ్ వారధిగా వ్యవహరిస్తుంటారు. అంతేగాక మయన్మార్, భారత్ సరిహద్దు రేఖ ఇతని ఇంటి గుండా వెళుతుంది. ఇతని ఇళ్లు ఇండియా, మయన్మార్‌ను వేరు చేస్తుంది. ఇంట్లోని సగభాగం భారత్‌లో ఉంటే మిగిలిన సగం మయన్మార్‌కు చెందుతుంది. అంటే ఆంగ్ తమ కిచెన్ నుంచి బెడ్ రూమ్‌లోకి వెళ్లాడమంటే ఏకంగా దేశ సరిహద్దు దాటడమే అన్నట్లు. అంతేగాక ఈ సరిహద్దు లాంగ్వా ప్రజలను విభజించడానికి బదులు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ గ్రామం గుండా మొత్తం నాలుగు నదులు ప్రవహిస్తుండగా అందులో రెండు భారత్ భూభాగంలో ఉండగా.. మరో రెండు నదులు మయన్మార్ భూభాగం పరిధిలోకి వస్తాయి. దీనిని నాగాలాండ్ మంత్రి ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఆ కుటుంబం ఇండియాలో నిద్రపోతే(బెడ్రూం).. మయన్మార్‌లో తింటారు(కిచెన్) అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. OMG | यह मेरा इंडिया To cross the border, this person just needs to go to his bedroom. बिलकुल ही "Sleeping in India and Eating in Myanmar" वाला दृश्य😃 @incredibleindia @HISTORY @anandmahindra pic.twitter.com/4OnohxKUWO — Temjen Imna Along (@AlongImna) January 11, 2023 -
సూకీకి మరో ఏడేళ్ల జైలు
బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్ సాన్ సూకీ(77)కి మరో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో, వివిధ అభియోగాలపై ఇప్పటి వరకు ఆమెకు కోర్టులు విధించిన జైలు శిక్షల మొత్తం సమయం 33 ఏళ్లకు పెరిగింది. ఆమెపై మోపిన ఐదు అభియోగాలపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ హెలికాప్టర్‌ను మంత్రి ఒకరికి అద్దెకు ఇవ్వడంలో ఆమె నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఫిబ్రవరిలో సూకీ సారథ్యంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి, సూకీ సహా వేలాది మందిని మిలటరీ పాలకులు దిగ్బంధించిన విషయం తెలిసిందే. కోర్టులు ఆమెపై మోపిన ఆరోపణలపై రహ స్యంగా విచారణలు జరిపి, శిక్షలు ప్రకటిస్తున్నా యి. తనపై చేస్తున్న ఆరోపణలన్నీ వట్టివేనంటూ సూకీ కొట్టిపారేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీని వెంటనే విడుదల చేయాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గత వారం సైనిక పాలకులను కోరింది. -
నేలపై నుంచి కాల్పులు.. విమానంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
మయన్మార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నేషనల్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి బుల్లెట్ తగిలింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. నేలపై నుంచి ఎవరో కాల్పులు జరపడంతో విమానం పైకప్పుకు రంద్రంపడి బుల్లెట్ లోనికి దూసుకెళ్లింది. అనంతరం లోయికావ్ నగరంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బ్రిటీష్ వార్త సంస్థ వివరాల ప్రకారం విమానం 3,500 అడుగుల ఎత్తులో, విమానాశ్రయానికి నాలుగు మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే లోయికావ్ విమానాశ్రయానికి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే విమానంపై కాల్పులు జరిపింది కచ్చితంగా రెబల్ గ్రూప్‌కు చెందిన వారే అని మయన్మార్ సైన్యం తెలిపింది. కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది. రెబల్స్ గ్రూప్స్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సాయుధ దళాలు, సంప్రదాయ తెగలు పోరాటం చేస్తున్నాయి. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అనుబంధ సంస్థలే విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలిటరీ కౌన్సిల్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ జామ్ మిన్ టున్ తెలిపారు. మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీని జైలుకు తరలించిన నాటి నుంచి ఆ దేశంలో అనేక చోట్ల సాయుధ దాళాలు పోరాటం చేస్తున్నాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు విమానంపై కాల్పులు జరిగిన కాయా రాష్ట్రంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. చదవండి: ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్! -
స్కూలుపై మయన్మార్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
స్కూలుపై మయన్మార్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి -
స్కూలుపై ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి!
యాంగూన్: తిరుగుబాటుదారులు నక్కి ఉన్నారనే అనుమానంతో మయన్మార్ ఆర్మీ హెలికాప్టర్ ఓ స్కూలు భవనంపై జరిపిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు సహా 13 మంది చనిపోయారు. సగయింగ్ ప్రాంతంలోని లెటెయెట్ కోన్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. బౌద్ధ ఆశ్రమం ఆవరణలోని 240 మంది విద్యార్థులున్న స్కూలుపై సైన్యం కాల్పులకు తెగబడింది. ఇందులో 30 మంది విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. బాలుని మృతదేహాన్ని తరలిస్తూ తండ్రి కంటతడి గ్రామంలోని 2 వేల మంది ప్రాణభయంతో ఊరొదిలారు. రెబల్స్ కాల్పులు జరిపారని, ఎదురుకాల్పుల్లో వారితో పాటు విద్యార్థులు చనిపోయారని సైన్యం తెలిపింది. సైనిక నేతలు గత ఏడాది ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి దేశంలో హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయి. నేలపై రక్తం. అక్కడ పడున్న స్కూలు బ్యాగు ఇదీ చదవండి: ప్రపంచ నేతలు స్పందించాలి: ఎన్జీవోలు -
రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: రోహింగ్యా శరణార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటనపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయన ప్రకటనను తోసిపుచ్చింది. రోహింగ్యాలకు అటువంటి హామీలేమీ లేవని తేల్చి చెప్పింది. రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని తెలిపింది. న్యూఢిల్లీలోని బక్కర్‌వాలాలో రోహింగ్యా శరణార్థులకు ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను అందించడానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. అక్రమ విదేశీ శరణార్థులైన వారికి ఎలాంటి సౌకర్యాలు ప్రకటించలేదని స్పష్టం చేసింది. India has always welcomed those who have sought refuge in the country. In a landmark decision all #Rohingya #Refugees will be shifted to EWS flats in Bakkarwala area of Delhi. They will be provided basic amenities, UNHCR IDs & round-the-clock @DelhiPolice protection. @PMOIndia pic.twitter.com/E5ShkHOxqE — Hardeep Singh Puri (@HardeepSPuri) August 17, 2022 కాగా, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థులకు పక్కా ఇళ్లు, భద్రత కల్పిస్తామని గృహ, పట్టణ వ్యవహరాలశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు. వారిని ఔటర్ ఢిల్లీలోని బక్కర్‌వాలాలోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) అర్ట్‌మెంట్‌లకు తరలిస్తామని పేర్కొన్నారు. అలాగే వారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే, ఆయన ప్రకటనపై స్పందించిన కేంద్రం, అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిపింది. చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు With respect to news reports in certain sections of media regarding Rohingya illegal foreigners, it is clarified that Ministry of Home Affairs (MHA) has not given any directions to provide EWS flats to Rohingya illegal migrants at Bakkarwala in New Delhi. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) August 17, 2022 ‘రోహింగ్యాలను కొత్త ప్రదేశానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇప్పటికే విదేశాంగ శాఖ ద్వారా సంబంధిత దేశంతో వారి బహిష్కరణ విషయాన్ని చర్చిస్తున్నందున.. రోహింగ్యాలు ప్రస్తుతం ఉన్న మదన్‌పూర్ ఖాదర్, కాళింది కుంజ్ ప్రదేశాల్లో కొనసాగేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. చట్టప్రకారం రోహింగ్యా శరణార్థులను బహిష్కరించే వరకు డిటెన్షన్ సెంటర్లో( నిర్బంధ కేంద్రం) ఉంచుతాం. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం శరణార్థులు ఉన్న ప్రదేశాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించలేదు.. వెంటనే ఆ పనిచేయాలని ఆదేశించాం.’ అని హోం మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. Rohingya Illegal Foreigners Press release-https://t.co/eDjb9JK1u1 pic.twitter.com/uKduPd1hRR — Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 17, 2022 -
సూకీకి మరో ఆరేళ్ల జైలు శిక్ష
బ్యాంకాక్: మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీకి అక్కడి న్యాయస్థానం వివిధ అవినీతి కేసుల్లో మరో ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం చేపట్టిన కోర్టు రహస్య విచారణకు మీడియాను, ప్రజలను అనుమతించలేదు. విచారణకు సంబంధించిన వివరాలను బహిర్గత పరచరాదని ఆమె తరఫు లాయర్లకు కోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. తాజా అభియోగాల్లో అధికార దుర్వినియోగం, మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రభుత్వ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం, దాతృత్వ కార్యక్రమాల కోసం సేకరించిన విరాళాలతో ఇల్లు నిర్మించుకోవడం ఉన్నాయి. ఈ నేరాలకు గాను మొత్తం ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఈ ఆరోపణలన్నిటినీ సూకీ కొట్టిపారేశారు. తాజా తీర్పును ఆమె ఎగువ కోర్టులో సవాల్ చేయనున్నారు. 77 ఏళ్ల సూకీ సారథ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చిన మయన్మార్ సైనిక పాలకులు 2021 ఫిబ్రవరిలో ఆమెను నిర్బంధంలో ఉంచారు. దేశద్రోహం, అవినీతి తదితర ఆరోపణలపై ఆమెకు ఇప్పటికే 11 ఏళ్ల జైలు శిక్ష పడింది -
ఇంద్రుడి ఐరావతం భూమిపై పుట్టింది! ఏడు రకాల ప్రత్యేకతలు కూడా..
పురాణాల ప్రకారం ఇంద్రుడి వాహనం ఐరావతం. అంటే తెల్లని మదపుటేనుగు.. సాధారణంగా ఏనుగులు తెలుపు రంగులో ఉండటం అత్యంత అరుదు. అలాంటిది ఇటీవల మయన్మార్‌లోని పశ్చిమ రఖినే రాష్ట్రంలో ఉన్న టౌంగప్ పట్టణంలో ఓ తెల్ల ఏనుగు పుట్టింది. ఆ తెల్ల ఏనుగు పిల్ల రెండున్నర అడుగుల ఎత్తుతో 80 కిలోల బరువు ఉంది. దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్ ప్రత్యేక వీడియో, ఫొటోలను విడుదల చేసింది. ఓ నదిలో తల్లి ఏనుగుతో కలిసి తెల్ల పిల్ల ఏనుగు స్నానం చేస్తున్న ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. మయన్మార్‌లో ఎక్కువ మంది బౌద్ధమతాన్ని పాటిస్తారు. వారి సంస్కృతిలో తెల్ల ఏనుగులను పవిత్రమైనవిగా భావిస్తారు. ఇటు హిందూ పురాణాల ప్రకారం చూసినా.. తెల్ల ఏనుగు అయిన ఐరావతం ఇంద్రుడి వాహనంగా పూజలు అందుకుంటుంది. ఏడు రకాల ప్రత్యేకతలు కూడా.. పవిత్రంగా భావించే తెల్ల ఏనుగులకు సంబంధించిన ఏడు అంశాలు ఈ పిల్ల ఏనుగులో ఉన్నట్టు మయన్మార్ అధికార వార్తా సంస్థ గ్లోబల్ న్యూలైట్ తెలిపింది. ‘‘ముత్యం రంగులో ఉండే కళ్లు, తెల్లని వెంట్రుకలు, అరటి కాండం ఆకారంలోని వెనుకభాగం, సరైన ఆకృతిలోని తోక, చర్మంపై ఆధ్యాత్మికపరమైన గుర్తులు, పెద్ద చెవులు, ముందు కాళ్లకు ఐదు చొప్పున, వెనుక కాళ్లకు నాలుగు చొప్పున గోర్లు ఉన్నాయి. ఇవన్నీ పవిత్ర ఏనుగు లక్షణాలు’’ అని పేర్కొంది. మయన్మార్‌లో ప్రస్తుతం ఆరు తెల్ల ఏనుగులు ఉన్నట్టు వెల్లడించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినా తెల్ల ఏనుగుల సంఖ్య 30 మాత్రమే కావడం గమనార్హం. వీటిలోనూ ఎక్కువ భాగం మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లోనే ఉన్నాయి. -
నలుగురు రాజకీయ నేతలకు ఉరి.. 50 ఏళ్ల తర్వాత అమలు
బ్యాంకాక్: మయన్మార్ సైనిక పాలకులు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధితోపాటు మరో ముగ్గురికి ఉరిశిక్షలు అమలు చేశారు. ఆంగ్ సాన్ సుకీ ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న ఫియో జెయా థావ్(41), హక్కుల కార్యకర్తలైన క్యావ్ మిన్ యు(53), హలా మియో ఆంగ్, ఆంగ్ థురా జావ్ ఉరికంబం ఎక్కారు. వీరికి క్షమాభిక్ష పెట్టాలంటూ ప్రపంచదేశాల నుంచి ఒత్తిడులు వచ్చినా శిక్షలను అమలు చేసినట్లు అధికార మిర్రర్ డైలీ వార్తా పత్రిక తెలిపింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరికి చట్ట ప్రకారమే ఉరి శిక్షను అమలు చేసినట్లు వెల్లడించింది. శిక్షలను ఎప్పుడు అమలు చేసిందీ వెల్లడించలేదు. తన భర్తకు ఉరిశిక్ష అమలు చేసిన విషయం తెలియదని ఫియో జెయా థావ్ భార్య తెలిపారు. ఈ విషయమై అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఈ పరిణామంపై సైనిక ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా, చివరి సారిగా 1976లో సలాయ్ టిన్ మౌంగ్ వూ అనే విద్యార్థి నేతకు అప్పటి సైనిక ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. సైనికపాలకులు ప్రజలను భయపెట్టేందుకే ఇలాంటి శిక్షలను అమలు చేస్తున్నారని హక్కుల నేతలు అంటున్నారు. -
ఆంగ్‌సాన్ సూకీకి గృహ నిర్బంధం నుంచి జైలు నిర్బంధం
బ్యాంకాక్: గతేడాది తిరుబాటు చేసిని ఆంగ్ సాన్ సూకీని గృహ నిర్బంధం నుంచి సైనిక నిర్మిత జైలు కాంపౌండ్‌లోకి తరలించినట్లు మయన్మార్ జుంటా అధికార ప్రతినిధి తెలిపారు. క్రిమినల్ చట్టాల ప్రకారం ఆంగ్ సాన్ సూకీని రాజధాని నైపిడావ్లోని జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచామని జుంటా అధికారి జా మిన్ తున్ పేర్కొన్నారు. ఐతే ఆమె తిరుబాటు చేసినప్పటి నుంచి నేపిడావ్‌లోని ఒక అజ్ఞాత ప్రదేశంలో తన కుక్కతో కలిసి గృహ నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను కోర్టులో విచారణకు హజరుపరచడం కోసం ఈ ప్రాంతం నుంచి తరలించారు. పైగా ఆమెకి 150 ఏళ్లకు పైనే శిక్ష విధించారు. అంతేకాదు సూకీ తరుఫున న్యాయవాదులు మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించారు. జర్నలిస్టులు సైతం ఆమెతో మాట్లాడేందుకు వీల్లేదు. ఇంతకుముందు కూడా ఆమె మయాన్మార్లో అతిపెద్ద నగరమైన యాంగాన్‌లోని తన ఇంటిలోనే చాలాఏళ్లు గృహనిర్బంధంలో ఉంది. ఆమె అవినీతి, మిలటరీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు, కోవిడ్-19 ప్రోటోకాల్, టెలికమ్యూనికేషన్స్ చట్టం ఉల్లంఘన తదితర ఆరోపణలతో ఆమెను దోషిగా నిర్థారించారు. పైగా కోర్టు సూకీకి ఇప్పటివరకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వద్దని హెచ్చరించిన యూఎన్) -
రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వార్నింగ్ ఇచ్చిన యూఎన్
Myanmar Junta Executions' Plan: మయన్మార్ జుంటా ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు, ఒక ప్రజాస్వామ్య కార్యకర్తని ఉరితీస్తామని ప్రకటించింది. ఇద్దరూ తీవ్రవాదానికి పాల్పడ్డారని, అందువలన మరణశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అదీగాక 1991 తర్వాత దేశంలో తొలిసారిగా న్యాయపరమైన ఉరిశిక్ష విధించిబడుతుందని పేర్కొంది. ఈ మేరకు మాజీ ఎంపీ ఫియో జెయా థా, ప్రజాస్వామ్య కార్యకర్త కో జిమ్మీతో సహా నలుగురికి మరణశిక్ష విధించినట్లు జుంటా ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు. పైగా వారిని జైలు విధానాల ప్రకారం ఉరితీస్తామని వెల్లడించారు. ఐతే ఈ కేసును మయన్మార్ తరుపున యూఎన్ విచారణా యంత్రాంగానికి అధిపతి అయిన నికోలస్ కౌమ్జియాన్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం, విచారణలో దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని తెలుస్తోందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఉరితీయడం అనేది యుద్ధ నేరం లేదా మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలతో సమానం అని ఆయన హెచ్చరించారు. గతేడాది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మయన్మార్ జుంటా ప్రభుత్వం అణిచివేతలో భాగంగా డజన్ల కొద్దీ తిరుగుబాటు వ్యతిరేక కార్యకర్తలకు మరణశిక్ష విధించింది. అయితే మయన్మార్ దశాబ్దాలుగా ఉరిని అమలు చేయలేదు. విచారణ న్యాయమైనదిగా పరిగణించబడాలంటే, సాధ్యమైనంత వరకు ఈ కేసుని బహిరంగంగా దర్యాప్తు చేయాలని యూఎన్ విచారణాధికారి కౌమ్జియాన్ అన్నారు. కానీ ఈ కేసులో పబ్లిక్ ప్రోసీడింగ్లు లేదా తీర్పులు బహిరంగంగా అందుబాటులో లేవు. ఇక్కడ ట్రిబ్యునల్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందా లేదా అనే సందేహాన్ని రేకెత్తించిందన్నారు. మయన్మార్ కోసమే ఈ యూఎన్ విచారణా యంత్రాంగం 2018లో యూఎన్ మానవ హక్కుల మండలిచే రూపొందించబడింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను సులభతరం చేసేలా డాక్యుమెంట్ చేయడం దీని పని. (చదవండి: ఉక్రెయిన్ చిన్నారుల కోసం.. నోబెల్ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్ జర్నలిస్ట్) -
ఆంగ్‌సాన్ సూకీపై విచారణ ఆరంభం
బ్యాంకాక్: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మయన్మార్ మాజీ ప్రధాని ఆంగ్‌సాన్ సూకీకి మిలటరీ ప్రభుత్వం సోమవారం విచారణ ఆరంభించింది. ఇప్పటికే సూకీపై పలు ఆరోపణలతో ప్రభుత్వం ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2020 ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీకి మంచి మెజార్టీ వచ్చింది. అయితే ఆమె ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ మిలటరీ జుంటా అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటినుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. మిలటరీ చర్యను దేశీయంగా పలువురు వ్యతిరేకించారు. కస్టడీలోకి తీసుకున్నప్పటి నుంచి సూకీపై జుంటా పలు కేసులు పెడతూనే ఉంది. అయితే ఇవన్నీ నిరాధారాలని ఆమె పార్టీ కార్యకర్తలు, మానవహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా ఉండేందుకే జుంటా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. తాజా కేసులో సూకీతో పాటు మాజీ అధ్యక్షుడు విన్ మైఇంట్, మాజీ మంత్రి మిన్ తు సహ నిందితులుగా ఉన్నారు. కేసులో ఆరోపణలు రుజువైతే సూకీ పార్టీ రద్దు చేసేందుకు అవకాశాలున్నాయి. -
తిరుగుబాటుకు ఏడాది పూర్తి.. వేల మంది బలిదానం!
అనూహ్యంగా మొదలైన సైన్యం తిరుగుబాటు పరిణామాలతో.. ఏడాదిగా పౌరుల వ్యతిరేక నిరసనలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఈ నిరసనల్లో చెలరేగిన హింసతో వేలమంది బలికాగా.. కొన్ని వేలమందిని నిర్భంధానికే పరిమితం చేసింది సైన్యం. ఇక ఈ పరిస్థితులు కొనసాగుతుండగా.. మయన్మార్ సంక్షోభం గురించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం అధికారికంగా ఒక నివేదిక విడుదల చేసింది. ఏడాదిపాటుగా మయన్మార్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఐరాస మంగళవారం అధికారికంగా స్పందించింది. ఈ ఏడాది కాలంలో పదిహేను వందల మంది బలికాగా.. 11, 782 మందిని చట్టాన్ని అతిక్రమించి సైన్యం నిర్భంధించిందని, వీళ్లలో 8,792 మంది ఇంకా నిర్భంధంలోనే ఉన్నారని ఐరాస మానవ హక్కుల విభాగం ప్రతినిధి రవీనా శమ్దాసానీ తెలిపారు. అయితే మయన్మార్‌లో పాలక జుంటా సైన్యం.. హక్కుల సంఘాలు విడుదల చేసిన మరణాల సంఖ్యను ఖండించిన విషయం తెలిసిందే. జెనీవాలోని జరిగిన యూఎన్ సమావేశంలో ఏకపక్ష నిర్బంధాల గణాంకాలపై శమ్సదానీ వివరణ ఇచ్చారు. ఏడాది కాలంగా సైన్యానికి వ్యతిరేకంగా వినిపిస్తున్న నిరసన ఇది. శాంతియుత ప్రదర్శనలు, ఆన్లైన్ ద్వారా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. కానీ, ప్రాణ నష్టం తప్పలేదు. చంపబడ్డ 1,500 మందిని మేం డాక్యుమెంట్ చేశాం. అయితే ఇది నిరసనల సందర్భంలో మాత్రమే’’ అని శామ్సదానీ వివరించారు. వీళ్లలో 200 మంది మిలిటరీ కస్టడీలో వేధింపుల ద్వారానే చనిపోయారు అని ఆమె ధృవీకరించారు. ఈ 1,500 మందిలో సాయుధ పోరాటం కారణంగా మరణించిన వ్యక్తులను చేర్చలేదు! ఎందుకంటే మరణించిన వాళ్లు వేలల్లో ఉన్నారని మేము అర్థం చేసుకోగలం’ ఆమె భావోద్వేగంగా ప్రసంగించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో ఉవ్వెత్తున ఎగిసిన మయన్మార్ సైన్య దురాగతాలు.. వేలమంది పౌరులను బలిగొనడంతో పాటు ఆంక్షలతో, కఠిన నిర్భంధాలతో ఇబ్బందులు పెడుతూ వస్తోంది. మరోవైపు గత పాలకులపైనా సైన్యం ప్రతీకారం కొనసాగుతూ వస్తోంది. ఆంగ్‌సాన్ సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి సైన్యం పలు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. -
అంగ్‌సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు
బ్యాంకాక్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీ(76)కి మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ మయన్మార్‌లోని ఓ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా మిలటరీ పాలకులు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించారు. సూకీకి చెందిన నేషనల్ లీగ్ఫర్ డెమోక్రసీ పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న తరుణంలో గత ఫిబ్రవరిలో మిలటరీ.. సూకీతోపాటు పలువురు నేతలను నిర్బంధంలో ఉంచి పలు అభియోగాలు మోపింది. అవన్నీ రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
అజ్ఞాతవాసులు.. ఏ తల్లి కన్న బిడ్డలో!
పేరూ తెలియదు.. ఊరూ తెలియదు.. ఎక్కడి నుంచో సడన్‌గా ఊడిపడతారు. పరీక్షలు చేస్తారు. మందులు ఇస్తారు. జాగ్రత్తలూ చెప్తారు. వీళైతే మంచి తిండి కూడా అందిస్తారు. వాళ్ల ధ్యాసంతా అవతలి ప్రాణం కాపాడాలనే. కానీ, వాళ్ల ప్రాణం పోతుందన్న భయం మాత్రం వాళ్లకు ఉండట్లేదు ఎందుకనో!. ఈ కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. వేవ్‌ల వారీగా విరుచుకుపడుతున్నా.. ఫ్రంట్ లైన్ వారియర్లుగా వాళ్లందించిన సేవల్ని అంత త్వరగా మరిచిపోలేం కూడా. అయితే వైరస్‌ను మించిన ముప్పు నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ సేవలందిస్తున్నారు మయన్మార్‌లో వైద్యసిబ్బంది. ఈ ప్రయాణంలో నిర్బంధాలతోపాటు ప్రాణాలు సైతం పొగొట్టుకుంటున్నారు. ఏ తల్లి కన్నబిడ్డలో పాపం.. ఇప్పుడు వేలమంది ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు . చేతిలో బ్యాగు. బ్యాగు నిండా మందుల సరంజామా. ఒక చోటు నుంచి మరో చోటుకి గప్‌చుప్ ప్రయాణం. దొరికితే మాత్రం ఆయువు ముడినట్లే!. మయన్మార్‌లో హెల్త్ వర్కర్స్ క్షణమోక నరకంగా గడుపుతున్నారు. సైన్యం చేతిలో పదుల సంఖ్యలో వైద్య సిబ్బంది ప్రాణాలు పొగొట్టుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఫిబ్రవరిలో ఉవ్వెత్తున చెలరేగిన మయన్మార్ సైన్య దురాగతాలు.. 1500 మంది దాకా బలిగొన్నట్లు ఒక అంచనా(అనధికారికం). అప్పటి నుంచి ఆస్పత్రులు సిబ్బంది లేకుండా బోసిపోతున్నాయి. నిరసనకారుల్లో ఉన్న వైద్య సిబ్బందిని సైతం నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టింది జుంటా సైన్యం. జుంటా నుండి దాక్కున్న అనేక మంది మయన్మార్ నర్సులు కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి తాత్కాలిక క్లినిక్‌లను నడుపుతున్నారు. మిలిటరీ చెక్పాయింట్ల గుండా అక్రమంగా రవాణా చేయబడిన మందులతో సైన్యం కళ్లు కప్పి తిరుగుతున్నారు. సంబంధిత వార్త: మయన్మార్ నియంతల ఆగడం అడవుల్లో మకాం, పాడుబడ్డ స్కూళ్లలో.. మయన్మార్‌లో సైన్యం ఆరాచకాలు మొదలయ్యాక.. చాలామంది ప్రాణ భీతితో దేశం విడిచి పారిపోయే ప్రయత్నాలు చేశారు. వైద్య సిబ్బంది మాత్రం అక్కడే ఉండిపోయారు. మిలిటరీ-నిరసనకారుల మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో.. వాళ్లలో చాలామంది అడవుల్లో తలదాచుకున్నారు. అదే టైంలో రోజూ 40వేల చొప్పున నమోదు అవుతూ వస్తున్న రోజూవారీ కొవిడ్ కేసుల్ని తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాడుబడ్డ ఇళ్లలో, స్కూళ్లలో క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. పల్లెల్లో ఉన్న సౌకర్యాలతోనే పాపం వాళ్లు టెస్టులు, చికిత్స కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదని, ఒకవేళ విజృంభణ మొదలైతే మాత్రం జనాలకు ఇబ్బందులు తప్పవని వాళ్లు జాగ్రత్తలు సూచిస్తున్నారు. సైన్యం ఆరాచకం కరోనా సోకినా పౌరులకు సైన్యం నుండి అందే వైద్యసాయం ఘోరంగా ఉంటోంది. బతికితే బతుకుతారు. చస్తే చస్తారు. అదే టైంలో సైన్యంలో ఎవరికైనా కరోనా సోకితే మాత్రం.. అత్యవసర సేవల కింద చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న వైద్య సిబ్బందికి మందులు చేరకుండా ఉండేందుకు వీలైనన్ని ఎక్కువ చెక్ పోస్టుల ద్వారా అడ్డుకుంటోంది సైన్యం. ఆరునెలలుగా కొనసాగుతున్న సైన్యం ఆరాచకాల్లో 190 మంది వైద్య సిబ్బందిని అరెస్ట్ చేయగా.. 25 మందికి దారుణాతిదారుణంగా హతమార్చినట్లు ఓ నివేదిక సారాంశం. వైద్య సిబ్బంది కుటుంబాలు సైతం తమ ప్రాణాలకు తెగించి.. పేషెంట్ల కోసం కృషి చేస్తుండడం ఈ పరిణామాల్లో అసలైన కొసమెరుపు. చదవండి: ఒక పోరాట యోధుడి అస్తమయం -
మయన్మార్ నియంతల ఆగడం
నిరంతర అప్రమత్తత కొరవడితే ప్రజాస్వామ్యం క్రమేపీ కొడిగట్టడం ఖాయమని గ్రహించనిచోట చివరకు నియంతలదే పైచేయి అవుతుంది. వర్తమాన మయన్మార్ ప్రపంచానికి చాటిచెబుతున్న పాఠం అదే. తన జీవితంలో ఇప్పటికే పదిహేనేళ్లపాటు చెరసాలలో గడిపిన సీనియర్ నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీపై రెండు నాసిరకం ఆరోపణల ఆధారంగా నడిచిన కేసులో సైనిక న్యాయస్థానం సోమవారం నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన వైనం అక్కడి సైనిక పాలకుల పోకడలు తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించలేదు. తీర్పు వెలువడిన వెంటనే ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తున్నట్టు సైన్యం ఉదారత ప్రకటించడం దాని నయవంచనకు నిదర్శనం. ఆమెపై మరో తొమ్మిది అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ‘విచారణ’ పూర్తయితే ఆమెకు మొత్తం 102 ఏళ్ల వరకూ శిక్ష పడుతుందంటున్నారు! సూకీని గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించడం, ప్రత్యేక కోర్టు విచారణకు వేరెవరినీ అనుమతించకపోవడం, కేసు గురించి ఆమె న్యాయవాది బయటెక్కడా మాట్లాడకూడదని ఆంక్ష పెట్టడం సైనిక ముఠా దుర్మార్గానికి నిదర్శనం. ఆరు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన సైనిక దుశ్శాసనులు అప్పుడప్పుడు తగ్గి నట్టు నటించడం, అదునుచూసి తమ వికృత రూపాన్ని ప్రదర్శించడం రివాజే. నిరుడు నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వరసగా రెండోసారి కూడా ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని నేష నల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్ఎల్డీ) విజయం సాధించడాన్ని చూసి కడుపుమండిన సైనిక ముఠా... మొన్న ఫిబ్రవరిలో ఉన్నట్టుండి ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అధికారాన్ని హస్త గతం చేసుకుంది. వాస్తవానికి ఇదంతా లాంఛనమే. అధికార పీఠాన్ని సైన్యం ఎప్పుడూ వదిలింది లేదు. పేరుకు ప్రజాస్వామ్య వ్యవస్థకు చోటిచ్చినట్టు కనబడినా తన హవా నడిచేందుకు అనువైన రాజ్యాంగాన్ని సైన్యం ముందే రాసిపెట్టుకుంది. పార్లమెంటులో తనకు 25 శాతం స్థానాలు రిజర్వ్ చేసుకుంది. ఆ స్థానాలకు ప్రతినిధులను తానే నామినేట్ చేస్తుంది. మిగిలిన 75 శాతం స్థానాలకు జరిగే ఎన్నికల్లో సైతం కీలుబొమ్మ పార్టీలను నించోబెట్టి తమ పలుకుపడికి ప్రమాదం రాకుండా చూసుకోవడం మొదటినుంచీ సైనిక పాలకులకు అలవాటైన విద్య. కానీ 2020 ఎన్నికల్లో కీలుబొమ్మ పార్టీ అయిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎన్డీపీ)కి కేవలం 25 స్థానాలే లభించేసరికి సైన్యానికి దిక్కుతోచలేదు. ఈ మెజారిటీతో సూకీ రాజ్యాంగాన్ని మార్చేస్తారని రూఢీ చేసుకుని మళ్లీ అది పంజా విసిరింది. సైనిక ముఠా రూపొందించిన రాజ్యాంగమంతటా కంతలే. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అధ్యక్ష పీఠం అధిష్టించడానికి అనర్హులవుతారని అందులో ఉన్న ఒక నిబంధన కేవలం సూకీని దృష్టిలో పెట్టుకుని చేసిందే. అయితే 2015లో అధికారంలోకొచ్చిన తర్వాత సూకీ ఈ దొంగల రాజ్యాంగంపై పోరాడవలసింది. సైన్యం దురాలోచనను ఎండగట్టవలసింది. కానీ ఆమె రాజీపడ్డారు. దేశాధ్యక్ష పదవి దక్కకపోయినా సరిపెట్టుకుని వెనకుండి పాలనను పర్యవేక్షించారు. కీలకమైన ఆంతరంగిక భద్రత, రక్షణ శాఖలను సైన్యం తన చేతుల్లో పెట్టుకున్నా అదేమని ప్రశ్నిం చిన పాపాన పోలేదు. సైన్యం ఆగడాలు అంతకంతకు మితిమీరుతున్నా చూసీచూడనట్టు మిన్న కుండిపోయారు. చివరకు దేశ పౌరుల్లో భాగమైన రోహింగ్యాలపై జాత్యహంకార బుద్ధిస్టులతో ఏకమై సైన్యం దమనకాండకు దిగినా ఖండించడానికి సూకీ ముందుకు రాలేదు. సైనిక నియంత లపై నిలకడగా, నిబ్బరంగా శాంతియుత పోరాటాన్ని కొనసాగించి నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న ధీరవనిత ఇలా మూగనోము పట్టడమేకాదు... ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై వారిని సమర్థిస్తూ మాట్లాడిన తీరుకు ప్రపంచ ప్రజానీకం విస్తుపోయింది. నిజానికి ఆమె ఇంటా బయటా కూడా ఒంటరి కాదు. ఆమెకు దేశ ప్రజానీకంలోనూ మద్దతుంది. విదేశాల్లోనూ ఆదరణ ఉంది. కానీ ఆమె దాన్ని కాపాడుకోలేకపోయారు. ప్రజాస్వామ్యం కోసం జనం సాగించిన పోరాటం కేవలం సూకీని అధికార పీఠంపై ప్రతిష్టించడానికి కాదు... వ్యవస్థలన్నిటినీ చెరబట్టిన సైనిక ముఠాను గద్దెదించి, మానవ, పౌరహక్కులనూ సాధించుకోవడానికి. సకలరంగాల్లోనూ ప్రజా స్వామ్య సంస్కృతిని పునఃప్రతిష్టించడానికి. వాటి సాధనకై ఉద్యమానికి నాయకత్వం వహించ డంలో, ప్రజలను చైతన్యవంతం చేయడంలో అధికారంలోకొచ్చాక సూకీ విఫలమయ్యారు. తాను రాజీపడితే సైన్యం కూడా ఒక మెట్టు దిగుతుందనుకున్నారు. అది అడియాసే అయింది. చెప్పుకోదగ్గ నాయకత్వం లేకున్నా మయన్మార్ విద్యార్థులు, యువజనులు మొక్కవోని దీక్షతో పోరాడుతున్నారు. వివిధ సందర్భాల్లో గత ఎనిమిది నెలలుగా 1,300మంది ప్రాణాలు తీసినా వారు వెనక్కు తగ్గటంలేదు. ఐక్యరాజ్యసమితివంటి అంతర్జాతీయ సంస్థలు, అమెరికా తదితర దేశాలు మాటల్లో సైనిక పాలకులను ఖండిస్తున్నా చేతల్లో చూపిస్తున్నదేమీ లేదు. చైనా సరేసరి. దానికి లాభార్జన మినహా ఏదీ పట్టదు. అక్కడి పాలకులను వ్యతిరేకిస్తే ఈశాన్య భారత్‌లో తిరుగుబాటు దార్ల ఆటకట్టించడం అసాధ్యమవుతుందని మన ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రజానీకం మయన్మార్‌కు నైతిక మద్దతునీయాలి. అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమానికి చేయూతనందించాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అప్పుడు మాత్రమే మయన్మార్ పాలకులు దిగివస్తారు. -
ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు.. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో?
యాంగోన్: ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చెలాయిస్తున్న మయన్మార్ సైనిక ప్రభుత్వం వారి నిర్బంధంలో ఉన్న కీలక నేతలను జైలుకు పంపే చర్యలను తీవ్రం చేసింది. ఇప్పటికే ఎన్నికల్లో కుట్ర, అవినీతి ఆరోపణలపై బహిష్కృత నేత ఆంగ్ సాన్ సూకీపై కేసులు పెట్టి విచారిస్తుండగా.. తాజాగా రెండు అభియోగాలపై అక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కోవిడ్ కాలంలో ప్రజల్ని రెచ్చగొట్టడం, కరోనావైరస్ నియంత్రణలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం 76 ఏళ్ల సూకీతోపాటు మరికొంత మంది నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నేతలను నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఫేస్బుక్ పేజీలో ప్రజల్ని రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని, అలాగే గత నవంబర్ ఎన్నికల సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా వేలాది మందితో ర్యాలీ నిర్వహించారని సైన్యం ఆరోపించింది. (చదవండి: Time Traveller Prediction On 2021: డిసెంబర్ 25న ప్రపంచానికి భారీ షాక్.. మారనున్న జీవితాలు’) కాగా, గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ రెండో దఫా కూడా ఘన విజయం సాధించగా.. సైన్యం, దాని మిత్ర పక్షాలు పార్టీలు ఘోర ఓటమిపాలయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన సైన్యం ఫిబ్రవరిలో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇక సైన్యం అరాచకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజలు నిరసనలతో హోరెత్తుతుండగా ఆంగ్ సాన్‌కి జైలు శిక్ష విధించడం మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) -
ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్..
రొటీన్‌కి భిన్నంగా వెరైటీ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? లేక్ ఆఫ్ నో రిటర్న్‌కు వెళ్లండి. ఎందుకుంటే ఇదో రహస్యాల పుట్ట. మన దేశంలో ఉన్న మిస్టీరియస్ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. మీరిప్పటి వరకు చాలా సరస్సుల గురించి వినడం, చదవడం, చూడటం జరిగి ఉండవచ్చు. కానీ ఈ మిస్టీరియస్ సరస్సుకు వెళ్లినవారు మాత్రం తిరిగి రావడం ఇప్పటివరకూ జరగలేదు. ఇది కథలో సరస్సు కాదు. ఇలలోని సరస్సే! ఎక్కడుందో తెలుసా.. మనదేశానికి, మయన్మార్‌కు మధ్య సరిహద్దు ప్రాంతంలో అంటే అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలో నవాంగ్ యాంగ్ సరస్సు ఉంది. దీనిని అందరూ మిస్టీరియస్ లేక్ అని పిలుస్తారు. అనేక సంఘటనల ఆధారంగా దానికాపేరు వచ్చింది. ప్రచారంలో ఉన్న కొన్ని కథనాలు ఏంటంటే.. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీస్ సైనికులతో ఉన్న ఒక విమానం ఈ ప్రదేశంలో అత్యవసర ల్యాండ్ అయ్యిందట (వాళ్లు దారి తప్పటం వల్ల). ఐతే చాలా అనూహ్య రీతిలో విమానంతో సహా అందరూ అదృశ్యమయ్యారట. ఒక అధ్యయనం ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్న జపాన్ సైనికులందరూ మలేరియా కారణంగానే మరణించి ఉంటారని పేర్కొంది. చదవండి: Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..! ఐతే ఈ సరస్సు చుట్టుపక్కల గ్రామస్తుల్లో మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఒక అతనికి ఈ సరస్సులో ఓ పెద్ద చేప దొరికింది. దీంతో అతను ఆ గ్రామంలోని అందరికీ విందు ఏర్పాటు చేశాడు. కానీ ఓ వృద్ధురాలు, ఆమె మనవరాలిని మాత్రం అతను విందుకు ఆహ్వానించలేదు. దీంతో సరస్సుకు కాపలా కాస్తున్న వ్యక్తి కోపోద్రిక్తుడై వారిద్దరినీ ఊరు విడిచి వెళ్లమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ మరుసటి రోజే ఊరంతా సరస్సులో మునిగిపోయిందట. అక్కడి గ్రామస్తుల్లో ఈ విధమైన జానపద కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ఐతే ఈ మిస్టీరియస్ సరస్సు రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! ఈ విధంగా అనేక పురాణాలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యాటకాన్ని పెంచాలనే ఆశతో అక్కడి గ్రామస్తులు ఈ స్థానిక బెర్ముడా ట్రయాంగిల్‌పై రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారనే నానుడి కూడా ఉంది. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! -
తక్షణమే చర్యలు తీసుకుంటాం!:బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి
బంగ్లాదేశ్: రోహింగ్యాల శరణార్థుల నాయకుడు మోహిబ్ ఉల్లాను హత్య చేసిన వారిపై సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ అఘాయత్యానికి పాల్పడిన వారు తప్పించుకోలేరని వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మోహిబ్ ఉల్లాను కాక్స్ బజార్లో కొంత మంది ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. (చదవండి: తల్లి చికిత్స కోసం కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టిన బాలిక.. చివర్లో) 2017లో సైనిక దాడి కారణంగా ఏడు లక్షల మంది రోహింగ్యాలు మయాన్మార్ నుంచి పారిపోయి బంగ్లాదేశ్ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే మోహిబ్ ఉల్లా ఈ శరణార్థుల కోసం అర అరకాన్ రోహింగ్యా శరణార్థుల సోసైటిని ఏర్పాటు చేసి వారి హక్కులు, శాంతియుత జీవనం కోసం పోరాడుతున్న రోహింగ్యాల నాయకుడు . అంతేకాదు రోహింగ్యాల స్వదేశమైన మయాన్మార్లో వారిపై జరుగుతున్న దాడుల గురించి అంతర్జాతీయంగా వారి గళం వినిపించేలా ఒక డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేశాడు. ఈ మేరకు రోహింగ్యాలు తమ స్వదేశానికి తిరిగే వెళ్లి జీవించే హక్కు ఉందని తాము కచ్చితంగా తమ స్వదేశానికీ తిరిగి వెళ్లాలన్నదే తన ఆశ అని కూడా వివరించాడు. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు తమ స్వార్థ ప్రయోజనాల దృష్ట్య అతనిని హత్య చేసి ఉండవచ్చని విదేశాంగ మంత్రి మోమెన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పైగా మోహిబ్ ఉల్లా 2019లో తనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని 'ఒక వేళ తాను మరణించిన బాగానే ఉంటాను, ప్రస్తుతం మాత్రం నేను నా ప్రాణన్ని ఇస్తాను' అంటూ అతను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. (చదవండి: వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు) -
మయన్మార్ నుంచి భారత్‌కు 15వేల మంది: ఐరాస
ఐక్యరాజ్యసమితి: మయన్మార్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చారు. ప్రజల నిరసనలపై మయన్మార్ సైన్యం ఉక్కుపాదం మోపింది. విచ్చలవిడిగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 1,120 మంది చనిపోయినట్లు అంచనా. ఘర్షణలు, హింసాకాండ నేపథ్యంలో మయన్మార్ నుంచి 15,000 మందికిపైగా పౌరులు సరిహద్దు దాటి, భారత్‌లోకి ప్రవేశించారని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు? ఈ మేరకు ఆయన ‘మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలు, ఇతర మైనార్టీల మానవ హక్కుల పరిస్థితి’పేరిట ఒక నివేదికను ఐరాస సర్వ సభ్య సమావేశంలో సమర్పించారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఫిబ్రవరి 1 కంటే ముందే సంక్షోభ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా 3.36 లక్షల మంది సొంత ప్రాంతాలను వదలిపెట్టారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 తర్వాత 2.20 లక్షల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారని వివరించారు. మరో 15వేల మందికిపైగా జనం సరిహద్దు దాటి, పొరుగు దేశమైన భారత్‌కు చేరుకున్నారని తెలిపారు. చదవండి: నేడు గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు -
బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా అక్రమంగా హైదరాబాద్‌లోకి
సాక్షి, రాజేంద్రనగర్: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నివసిస్తున్న ఇద్దరు మయన్మార్ దేశస్తులను రాజేంద్రనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి ఆధార్, పాన్ కార్డులను స్వాదీనం చేసుకున్నారు. మయన్మార్‌కు చెందిన అబ్దుల్ మునాఫ్ అలియాస్ అన్సారీ(31) 2014లో బంగ్లాదేశ్ సరిహద్దు మీదుగా పంజాబ్‌కు చేరుకుని అక్కడి నుంచి ముంబై, ఢిల్లీలలో నివసించాడు. అనంతరం రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతల్మెట్ ప్రాంతానికి వచ్చి దినసరి కూలీగా బతుకుతున్నాడు. మయన్మార్‌కు చెందిన అఫీజ్ అహ్మద్(34) 2017లో బంగ్లా సరిహద్దు మీదుగా చింతల్మెట్ ప్రాంతానికి వచ్చి మునాఫ్‌తో ఉంటున్నాడు. 2018 నుంచి వీరిద్దరు ఇక్కడే ఉంటూ పనులు చేసుకుంటూ వారి భార్యలను సైతం నగరానికి రప్పించారు. ఇక్కడే ఆధార్, పాన్, ఓటర్ కార్డు తదితర వాటిని ఏజెంట్ల ద్వారా సమకూర్చుకున్నారు. పోలీసులు అబ్దుల్ మునాఫ్, అఫీజ్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి భార్యలు నూర్ కాలీమా, షేక్ రోఫికా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇరువురిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మయన్మార్‌లో ఘర్షణలు, 25 మంది మృతి
యాంగాన్: మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, పెత్తనం సాగిస్తోన్న జుంటా సైనిక చర్యకు వ్యతిరేకంగా సెంట్రల్ మయన్మార్‌లో జరిగిన ఘర్షణల్లో ఇరవై ఐదు మంది మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో యాంటీ జుంటా ఉద్యమకారులతో పాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలగొట్టి, పాలనా పగ్గాలు చేపట్టిన జుంటా సైన్యం.. నిత్యం తుపాకుల మోత మోగిస్తూ అరాచకం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు సైనిక బలగాల చేతుల్లో 890 మంది ప్రాణాలు కోల్పోయారని అసిస్టెంట్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ సంఘం తెలిపింది. కాగా, జుంటా సైన్యం చేపడుతున్న చర్యలు సిరియాలో మాదిరిగా పౌర సంఘర్షణలకు దారి తీయవచ్చని ఐక్యరాజ్య సమితి హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేస్తుంది. -
కుప్పకూలిన విమానం: 12 మంది దుర్మరణం
న్యాపిడా: ఘోర విమాన ప్రమాదం సంభవించి ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసితో పాటు మొత్తం 12 మంది మృతి చెందిన సంఘటన మయన్మార్‌లో చోటుచేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో సైనిక విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. న్యాపిడా నుంచి పైన్ ఓ ఎల్విన్ నగరానికి వెళ్తుండగా ఈ విషాద ఘటన సంభవించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మఠం శంకుస్థాపన చేసేందుకు విమానం పై ఓ ఎల్విన్ పట్టణానికి వెళ్తోంది. దేశ రాజధాని న్యాపిడా నుంచి గురువారం బయల్దేరిన కొద్దిసేపటికి కుప్పకూలింది. విమానంలో ఆరుగురి మిలిటరీ సిబ్బందితో పాటు ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు ఉన్నారు. ప్రమాదంలో అందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే వారిలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. అయితే ఘటనలో ఓ సైనికుడు ప్రాణాలతో బయటపడినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. 400 మీటర్ల ఎత్తుకు ఎగిరిన అనంతరం వాతావరణం సహకరించక సిగ్నల్స్ అందలేదు. దీంతో విమానం కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో సైనిక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా.. చదవండి: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
Myanmar: మా పౌరులు మరణిస్తున్నారు..దయచేసి స్పందించండి
యాంగాన్: మయన్మార్‌లో సైన్యం అక్కడి ప్రజాస్వామిక ప్రభుత్వంపై ఫిబ్రవరిలో తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆంగ్ సాన్ సూచీతో పాటు పలువురు నేతలను నిర్బంధంలోకి తీసుకొని సైనిక పాలన ప్రకటించింది. సూచీపై పలు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టించింది. నాటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాయుధ బలగాల దినోత్సవం రోజే మయన్మార్ సైన్యం రెచ్చిపోయింది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై తూటాల వర్షం కురిపించింది. రక్తపాతం సృష్టించింది. మయన్మార్ చరిత్రలోనే ఇది చీకటి రోజని ప్రజాస్వామ్య అనుకూలవాదులు, మానవతావాదులు పేర్కొన్నారు. మయన్మార్‌లోని ప్రముఖులు, నటులు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు, కీడాకారులు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలిపారు. తాజాగా మయన్మార్ మిస్ యూనివర్స్ పోటీదారు తుజార్ వింట్ ఎల్విన్ ఆదివారం పోటీలో మాట్లాడుతూ.. మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా స్పందించాలని ప్రపంచ దేశాలను కోరారు. "మయన్మార్‌లో జరిగే హింస గురించి మాట్లాడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. సైన్యం తిరుగుబాటు చేసినప్పటి నుంచి దీనిపై స్పందిస్తున్నాను. మా ప్రజలు ప్రతిరోజూ మిలిటరీ దళాల కాల్పుల్లో చనిపోతున్నారు" అంటూ ఆమె బావోద్వేగానికి గురయ్యారు. ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్ & క్యాసినోలో జరిగిన ఫైనల్స్‌లో ఆమె కనిపించారు. కాగా తుజార్ వింట్ ఎల్విన్ మిస్ యూనివర్స్ పోటీ చివరి రౌండ్లో పాల్గొనలేదు. కానీ ఆమె ధరించిన ఆ దేశ జాతీయ దుస్తులకు గాను "బెస్ట్ నేషనల్ అవార్డ్"ను గెలుచుకుంది. ఆమె ఆ దుస్తులతో కవాతు చేస్తూ "మయన్మార్ కోసం ప్రార్థించండి" అనే ఒక ప్లకార్డ్ ప్రదర్శించారు. ఇక ఇప్పటివరకు 790 మంది భద్రతా దళాల కాల్లుల్లో మరణించగా.. 5,000 మందిని అరెస్టు చేసినట్లు, 4,000 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ఖైదీల కార్యకర్త బృందం తెలిపింది. (చదవండి: Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి) -
Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి
మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్.. జుంటా సైనిక నియంత పాలకులపై సమర శంఖాన్ని పూరించారు! జన్మభూమి విముక్తి కోసం మరణానికైనా తను సిద్ధమేనని ప్రకటించారు. మూడున్నర నెలల క్రితం మయన్మార్ సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి దేశాన్ని హస్తగతం చేసుకున్నాక మొదలైన తిరుగుబాటు ప్రదర్శనల్లో ఇప్పటివరకు వందల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాకూదని అంటూ.. సైన్యంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధం కమ్మని యువతకు పిలుపునిస్తున్నారు హటటున్. మయన్మార్ బ్యూటీ క్వీన్ హటటున్ 1992లో పుట్టే నాటికే ముప్పై ఏళ్లుగా ఆ దేశం సైనిక పాలనలో ఉంది. పుట్టాక కూడా మరో ఇరవై ఏళ్లు మయన్మార్ సైనిక పాలనలోనే ఉంది. మధ్యలో పదేళ్ల ప్రజాస్వామ్య పాలన తర్వాత మళ్లీ ఇప్పుడు సైనిక పాలన! ఈ మధ్యలోని పదేళ్లలో హటటున్ బి.టెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. మోడల్ అయ్యారు. సినిమాల్లో నటించారు. టీవీ సీరియల్స్‌లో కనిపించారు. మిస్ మయన్మార్ అయ్యారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచారు. జిమ్నాస్టిక్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నారు. ఇప్పుడు ‘మిలిటెంట్’ అయ్యారు! దేశమాత స్వేచ్ఛ కోసం తుపాకీని చేతికి అందుకున్నారు. ఇందుకు ఆమెను ప్రేరేపించిన పరిణామాలు ప్రపంచం అంతటికీ తెలిసినవే. నిత్యం ప్రపంచం కళ్లబడుతున్నవే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న మయన్మార్ సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూలదోసింది. ప్రజలెన్నుకున్న నేత ఆంగ్‌సాంగ్ సూకీని అరెస్ట్ చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రజలెవరూ ప్రశ్నించడానికి, నిరసన ప్రదర్శనలు చేయడానికి వీధుల్లోకి రాకుండా యుద్ధట్యాంకుల్ని కవాతు చేయించింది. గగనతలంపై నుంచి బాంబులు జారవిడిచింది. సైన్యం కుట్రకు వ్యతిరేకంగా బిగిసిన పిడికిళ్లకు సంకెళ్లు వేసింది. గర్జించిన గళాలను అణిచివేసింది. ఇప్పటికి 800 మందికి పైగా ప్రదర్శనకారులు నియంత సైన్యం ‘జుంటా’ కాల్పుల్లో అమరులయ్యారు. బందీలుగా చిత్రహింసలు అనుభవిస్తూ తదిశ్వాస విడిచారు. ఈ ఘటనలన్నీ హటటున్‌ను కలచివేశాయి. ఆగ్రహోదగ్రురాలిని చేశాయి. అందాలరాణి కిరీటాన్ని పక్కనపెట్టి తుపాకీని చేతబట్టేలా ఆమెను ప్రేరేపించాయి. తనకు జన్మనిచ్చిన తల్లిని కాపాడుకోలేకపోతే తన జన్మే వృథా అనే ఆలోచనను ఆమెలో కలిగించాయి. ఇన్నాళ్లూ హటటున్‌ను ఒక అందాలరాణిగా మాత్రమే చూసిన మయన్మార్ యువత అత్యవసర సమయంలో ఆమెనొక పీపుల్స్ సోల్జర్‌గా చూసి సైనిక నియంతలపై తమ తిరుగుబాటుకు ఒక దివ్యాస్త్రం దొరికినట్లుగా భావిస్తున్నారు. కలిసికట్టుగా చేస్తున్న యుద్ధంలో హటటున్ ఇచ్చిన పిలుపు వారిలో ధైర్యాన్ని, సమరోత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ‘‘తిప్పికొట్టేందుకు సమయం ఆసన్నమైంది. మీ చేతిలో ఉన్న ఆయుధం అది ఏమిటన్నది కాదు. కలం, కీబోర్డు, ప్రజాస్వామ్య ఉద్యమానికి విరాళాలు ఇవ్వడం.. ఏదైనా సరే. అది ఆయుధమే. విప్లవం విజయం సాధించడానికి ఎవరి వంతుగా వారు పోరాడాలి’’ అని హటటున్ సోషల్ మీడియాలో విప్లవ నినాదం చేశారు. ఆ వెంటనే మయన్మార్ సైనిక ప్రభుత్వం ఆమెపై నిఘాపెట్టింది. ఆమె ఏ ప్రదేశం నుంచి తిరుగుబాటును రాజేస్తున్నదీ ఇప్పటికే సైన్యం కనిపెట్టిందనీ, ఏ క్షణమైనా ఆమెను రహస్య నిర్బంధంలోకి తీసుకోవచ్చనీ ఐక్యరాజ్యసమితికి వర్తమానం అందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి! అయితే సైన్యం బూట్లచప్పుడుకు బెదిరేది లేదని హటటున్ అంటున్నారు. ‘‘నా దేశం కోసం నా ప్రాణాన్ని మూల్యంగా చెల్లించడానికైనా నేను సిద్ధమే. ‘విప్లవం అనేది చెట్టుపైనే మగ్గి రాలిపడే ఆపిల్ పండు కాదు. ఆ పండును నువ్వే చెట్టుపై నుంచి రాలిపడేలా చెయ్యాలి’ అని చే గువేరా అన్నారు. ఆయన మాటల్ని మదిలో ఉంచుకుంటే మనం విజయం సాధించినట్లే..’’ అని మే 11న ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇచ్చిన ఒక పోస్టుతో యువతరంలో విప్లవస్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు హటటున్. ∙∙ మయన్మార్‌లోని ప్రధాన నగరం యాంగూన్‌లో ఉండేవారు హటటున్. గత ఏప్రిల్‌లో అక్కడి నుంచి తన ఫ్రెండ్‌తో కలిసి అజ్ఞాత ప్రదేశానికి తరలి వెళ్లారు. అక్కడ కారెన్ నేషనల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, యునైటెడ్ డిఫెన్స్ ఫోర్స్‌లతో కలిసి యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. నెలా పదిరోజులు ఆమె ఆ శిక్షణలో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లను బట్టి తెలుస్తోంది. -
మయన్మార్ ఆర్మీ సంచలన నిర్ణయం: ప్రజలకు న్యూఇయర్ గిఫ్ట్
యాంగూన్: మయన్మార్‌లో సంప్రదాయ తింగ్యాన్ కొత్త సంవత్సర సెలవు సందర్భంగా జైళ్లలో ఉన్న 23 వేల మందికి పైగా నిరసన కారుల క్షమాభిక్ష పెట్టి, వారిని విడుదల చేసినట్లు మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఫిబ్రవరిలో అధికారాన్ని చేజిక్కించు కున్న నాటి నుంచి అరెస్టయిన వారిని అందరినీ విడుదల చేసిందో లేదో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. ఆర్మీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లైంగ్ మొత్తం 23,047 మందికి క్షమాభిక్ష పెట్టారని, అందులో 137 మంది విదేశీయులు కూడా ఉన్నారని అక్కడి ప్రభుత్వ మీడియా ఎమ్ఆర్టీవీ తెలిపింది. విడుదలైన విదేశీయులను అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. యాంగూన్‌లోని ఇన్సేన్ కారాగారం నుంచి వీరంతా విడుదలవుతున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో పెట్టిన పోస్టులకు సైతం పలువురుని ఆర్మీ అరెస్టు చేసింది. అయితే ఇప్పుడు విడుదలైన వారిలో వారున్నారో లేదో ఇంకా తెలియలేదు. ఆర్మీ దేశాధికారం అందుకున్న నాటి నుంచి ఇలా ఖైదీలను విడుదల చేయడం ఇది రెండోసారి. -
తాజ్‌మహల్ పైనుంచి విమానాలు వెళ్లలేవు, ఎందుకో తెలుసా?
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుట్రతో కూల్చివేసి, ఆ ప్రజలపైనే దాడులకు తెగబడుతున్న మయన్మార్ నియంత పాలకుల మారణహోమం మొత్తానికి భూతలం నుంచి గగనతలానికి చేరుకుంది! కుట్రకు వ్యతిరేకంగా వీధులలోకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరుపుతున్న పౌరులపై సొంత సైన్యమే జరిపిన కాల్పులలో ఫిబ్రవరి 1 నుంచి (ప్రభుత్వాన్ని సైన్యం హస్తగతం చేసుకున్న రోజు) ఇంతవరకు వెయ్యిమందికి పైగా మరణించారు. వీరు కాక, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలపై సైనిక విమానాలు నిన్న, మొన్న జరిపిన బాంబు దాడుల వల్ల మరణించినవారిలో వంద మందికి పైగా పౌరులు, చిన్నారులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం నాడు ఐక్యరాజ్య సమితిలో మయన్మార్ రాయబారి క్యాఉమో తున్ మయన్మార్‌ను నిర్వైమానిక మండలం (నో–ఫ్లయ్ జోన్) గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మయన్మార్ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటిస్తే వెంటనే అక్కడ విమానాలు ఎగరడం ఆగిపోవాలి. లేకుంటే అది అంతర్జాతీయ ఆదేశాలకు విరుద్ధం అవుతుంది. అసలు నో–ఫ్లయ్ జోన్‌ను ఏయే పరిస్థితుల్లో ప్రకటిస్తారు? నో–ఫ్లయ్ జోన్ విధింపును ఉల్లంఘిస్తూ ఒక విమానం గాల్లోకి లేస్తే ఆ విమానాన్ని కూల్చివేయవచ్చా? ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వం మిలటరీ చేతుల్లో ఉంది. మిలటరీనే పౌరులపై వైమానిక దాడులకు పాల్పడుతోంది కనుక వారి విమానాలను ఎవరు నేలకు ‘దించుతారు’? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ కింది ఏడు నో–ఫ్లయ్ జోన్స్‌లో దొరుకుతాయి. ఇంకొక విషయం. కేవలం యుద్ధ వాతావరణంలో మాత్రమే నో–ఫ్లయ్ జోన్స్‌ని ప్రకటిస్తారనేం లేదు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కూడా ప్రత్యేక ప్రాంతాలలో విమానాలను ఎగరనివ్వరు. ఉత్తర కొరియా ఈ దేశం ఎప్పుడు, ఎక్కడ, ఏ మిస్సయిల్ను పరీక్షించి చూసుకుంటుందో ఎవరికీ తెలియదు. చిన్న హెచ్చరికైనా జారీ చేయకుండా తరచు జపాన్ సముద్రం మీదుగా ఉత్తర కొరియా తన క్షిపణుల పని తీరును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూ ఉంటుంది! అందుకే ప్రపంచంలోని అనేక దేశాలకు ఉత్తర కొరియా గగనతలం నో–ఫ్లయింగ్ జోన్. చివరికి ఐక్యరాజ్య సమితికి కూడా. తాజ్‌మహల్, ఇండియా భారత ప్రభుత్వం 2006లో తాజ్‌మహల్ గగనతలాన్ని నిర్వైమానిక మండలంగా ప్రకటించింది. తాజ్‌మహల్ పైన విమానాలు ఎగిరేందుకు లేదు. కట్టడాన్ని విమానాల శబ్దం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విమానాల రాకపోకల వల్ల జనించే కాలుష్యం నుంచి ఆ పాలరాతి భవనాన్ని సంరక్షించే ప్రయత్నం కూడా అది. బకింగ్‌హామ్ ప్యాలెస్, లండన్ బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఉత్తర భాగం, ఉక్రెయన్ 2014లో ఇక్కడ జరిగిన ఘోర దుర్ఘటనలో మలేషియా విమానం ఎంహెచ్–17 కూలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులంతా మరణించారు. దాంతో విమానాలు ఎగిరేందుకు యోగ్యం కాని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా దీనిని పరిగణించి, నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటించారు. అంతేకాదు, రష్యా, ఉక్రెయిన్ల మధ్య నడిచే అన్ని విమానాలూ ఒక దాని గగనతలం మీద ఒకటి (కొన్ని ప్రాంతాల మీదుగా) ఎగిరేందుకు లేదు. సరిహద్దు వివాదాలు అందుకు కారణం. వాల్ట్ డిస్నీ వరల్డ్, యు.ఎస్.ఎ. ఈ థీమ్ పార్క్‌కు మూడు మైళ్ల పరిధిలో, 3000 అడుగుల లోపు ఎత్తులో విమానాలు ఎగిరేందుకు లేదు. విమానాల ధ్వనులు అత్యంత సున్నితమైన తమ నిర్మాణాలకు పడవని డిస్నీ అంటుంది! ఆ ధ్వనులు.. ప్రశాంతమైన డిస్నీకి కొత్తగా వచ్చినవాళ్లను భయపెట్టే ప్రమాదం ఉందని కూడా యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ గగనతలాన్ని నో–ఫ్లయ్ జోన్‌గా ప్రకటించింది. అయితే ‘ఫ్లయింగ్ అడ్వరై్టజ్మెంట్లు’ ఇచ్చేందుకు వీల్లేకుండా తమను నివారించడానికే డిస్నీ ఆ ప్లాన్ వేసిందని పోటీదారుల ఆరోపణ. ఏరియా 51, యు.ఎస్.ఎ. నెవడా రాష్ట్రంలోని ఎడారి వంటి ఈ ప్రాంతం అమెరికా రక్షణదళం అధీనంలో ఉంది. అమెరికా సైన్యం నిరంతరం ఇక్కడ మిలటరీ టెక్నాలజీకి సంబంధించిన రహస్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. 1950 లు, 60 లలో ‘యు–2 స్పై ప్లేన్’ను ఇక్కడే తయారు చేశారు. యు.ఎస్. రాజధాని వాషింగ్టన్‌పై ఎంత గట్టి నిఘా ఉంటుందో ఈ ‘ఏరియా 51’ చుట్టూ, లోపల మానవ కదలికలపై అంతకుమించిన నిఘా, ఆంక్షలు ఉంటాయి. ఏరియా 51 గగనతలంపై చిన్న పిట్టలాంటి విమానం కూడా ఎగరడానికి లేదు. అది స్వదేశీ విమానమే అయినా.. నేల కూల్చేస్తారు. తియానన్మెన్ స్క్వేర్, చైనా చైనా గగనతలంలో ఏ ప్రాంతంలోనైనా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయంటే అది తియానన్మెన్ స్క్వేరే. ఆ స్క్వేర్ మీదుగా విమానాలు వెళ్లకూడదు. ఒకప్పుడు పావురాలు, ద్రోణ్‌లు, బెలూన్లు కూడా పైన ఎగరడం నిషిద్ధం. వెంటనే షూట్ చేసి పడగొట్టేసేవారు. ఈ స్క్వేర్‌లోనే అమూల్యమైన పురావస్తుశాలల భవంతులు, చైనా చారిత్రక యోధుల స్మరణ మందిరాలు ఉన్నాయి. వాటికి తాకిడి లేకుండా ఉండేందుకే నో–ఫ్లయ్ జోన్ చేశారు. బ్రిటన్ రాచకుటుంబాలు నివాసం ఉంటే ఈ భవంతుల గగనతలాలు నో–ఫ్లయ్ జోన్స్. రాణిగారి కుటుంబ సభ్యుల భద్రత, రక్షణల కోసం వీటిపై విమానాలు ఎగరకుండా ఏళ్ల నుంచే నిషేధాజ్ఞలు ఉన్నాయి. -
మరోసారి సైన్యం కాల్పులు, 82 మంది మృతి!
యాంగూన్: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలను ఆర్మీ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రజాస్వామ్య అనుకూలవాదులపై బాగో నగరంలో జరిపిన కాల్పుల్లో శనివారం ఒక్కరోజే 82 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ అనే స్వతంత్ర సంస్థ ఈ గణాంకాలు వెలువరించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. మయన్మార్ నౌ అనే వెబ్సైట్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. సైనికవాహనాల్లో మృతదేహాలను తీసుకెళ్లి పగోడా వద్ద పడేశారని తెలిపింది. ఆందోళ నకారులపైకి సైన్యం భారీ ఆయుధాలను, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లను, మోర్టార్లను ప్రయోగిస్తోందని పేర్కొంది. మార్చి 14న యాంగూన్‌లో జరిగిన కాల్పుల్లో 100 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే. -
'నా గదికి వెళ్లగానే పెద్దగా ఏడ్చేశాను'
థాయిలాండ్‌లో మార్చి 27న ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ అందాల పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో మయన్మార్ మోడల్ హ్యాన్ లే గెలవలేకపోయింది! అయితే ఆమెను ఒక ‘పరమోద్వేగిని’గా లోకం తన హృదయానికి హత్తుకుంది. ఆ అందాల పోటీ వేదికపై హ్యాన్ లే.. ‘తక్షణం మీ సహాయం కావాలి’ అంటూ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలను కదిలించింది. చెమరించిన కళ్లతో జడ్జిలు, పోటీలో పాల్గొన్న మిగతా అమ్మాయిలు హ్యాన్ లే లోని ఆత్మసౌందర్యాన్ని దర్శించారు. మయన్మార్‌లో ఇప్పుడేం జరుగుతోందో తెలిసిందే! ప్రపంచం ఇప్పుడేం చేయాలో హ్యాన్ లే తన ప్రసంగంలో తెలియజెప్పింది. మయన్మార్‌లో సైనిక పాలకులు పాల్పడుతున్న అరాచకాలకు అడ్డకట్ట వేయాలని హ్యాన్ లే అభ్యర్థించింది. థాయిలాండ్‌లో 2013లో ప్రారంభమై, గత ఏడేళ్లుగా ‘మిస్ గ్రాండ్ థాయిలాండ్’, ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ థాయిలాండ్’ అందాల పోటీలు జరుగుతున్నాయి. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను ఈ ఏడాది అమెరికా అందాల రాణి అబెనా అపయా గెలుచుకున్నారు. మొత్తం 63 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సమంతా (ఫిలిప్పీన్స్) ఫస్ట్ రన్నర్–అప్‌గా, ఇవానా (గటెమలా) సెకండ్ రన్నర్–అప్‌గా విజయం సాధించారు. మయన్మార్ నుంచి పోటీలో పాల్గొన్న హ్యాన్ లే ఈ మూడు స్థానాలలో లేనప్పటికీ, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రం పొందగలిగింది. ఆ స్థానానికి అందమైన కిరీటం లేకపోవచ్చు. కానీ అందమైన ఆమె మనసే అందాల కిరీటంలా ఆ రోజు వేదికంతటా ధగధగలాడింది. తన జన్మభూమిని కాపాడమంటూ స్టేజ్ మీద నుంచి ఆమె చేసిన విజ్ఞప్తి ఆమె భావోద్వేగాలను స్ఫూర్తి శతఘ్నుల్లా మార్చి ప్రపంచాన్ని కదిలించేలా చేసింది. ‘అందాల వేదికపై బంధ విముక్తి ప్రసంగం’ అంటూ.. అంతా ఆమె ప్రయత్నాన్ని నేటికీ కొనియాడుతూనే ఉన్నారు. తన దేశం, తన ప్రజలు తిరుగుబాటు మిలటరీ పాలకుల కబంధ హస్తాలలో చిక్కుకుపోయి విలవిలాడుతున్న దృశ్యాన్ని ఇరవై రెండేళ్ల హ్యాన్ లే అంత హృద్యంగా ఆవిష్కరించింది మరి! హ్యాన్ లే, స్టేజ్‌పై కంటతడి Han Lay, a Myanmar national participating in a beauty pageant in Thailand, pleaded for 'urgent international help' for her country pic.twitter.com/cqGkDNNM6R — Reuters (@Reuters) April 3, 2021 ఆ రోజు థాయిలాండ్‌లో ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ పోటీలు జరుగుతున్న సమయానికి మయన్మార్‌లో మారణహోమం జరుగుతూ ఉంది. సైనిక పాలకుల చేతుల్లో ఆ ఒక్కరోజే 141 ప్రదర్శనకారులు చనిపోయారు. ఇక్కడ పోటీలో ఉన్న హ్యాన్ లే కు ఆ వార్త చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి1న ప్రజా ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూలదోసి, మయన్మార్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకున్న సైనిక నేతలు అప్పటికే 550 మంది పౌరులను కాల్చి చంపారు. ఆ వార్తల్ని కూడా హ్యాన్ లే వింటూ ఉంది. మయన్మార్ పౌరులొక్కరే రోడ్ల మీదకు వచ్చి సైనిక నియంతలతో పోరాడుతున్నారు. ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఒక్క దేశమూ సహాయానికి రావడం లేదు. హ్యాన్ లే తట్టుకోలేకపోయింది. ఆ అంతర్జాతీయ అందాల పోటీ వేదిక మీద నుంచే అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ‘‘ఇక ఆగే సమయం లేదు. వెంటనే సహాయానికి రండి’’ అని దుఃఖంతో పూడుకుపోతున్న స్వరంతో విజ్ఞప్తి చేసింది. హ్యాన్ లే ప్రసంగం మధ్యలో స్క్రీన్‌పై మయన్మార్ హింసాఘటనల దృశ్యాలు ‘‘ఒకటైతే చెప్పగలను. మయన్మార్ పౌరులు ఎప్పటికీ ఆశ వదులుకోరు’’. ‘‘వాళ్లు వీధుల్లోకి వచ్చిన పోరాడుతున్నారు. నేను ఈ వేదికపై నుంచి నా నిరసన గళాన్ని వినిపిస్తున్నాను’’. ‘‘నా భావోద్రేకాలను నియంత్రించుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఒకటీ రెండు నిముషాల్లోనే యావత్ప్రపంచానికీ నేను చెప్పదలచింది చెప్పుకోవాలి.’’ ‘‘రావడమే ఇక్కడికి నేను అపరాధ భావనతో వచ్చాను. ఇక్కడి వచ్చాక కూడా ఇక్కడ ఎలా ఉండాలో అలా నేను లేను. అందాల రాణులు చిరునవ్వుతో ఉండాలి. అందర్నీ నవ్వుతూ పలకరించాలి. అందరితో కలుపుగోలుగా ఉండాలి. నేను అలా ఉండలేకపోయాను.’’ .. హ్యాన్ లే ఈ రెండు మాటలు మాట్లాడుతున్నప్పుడు వేదిక మౌనముద్ర దాల్చింది. సహానుభూతిగా ఆమె వైపు చూసింది. ఈ అందాల పోటీల వ్యవస్థాపకులు 47 ఏళ్ల నవత్ ఇత్సారాగ్రిసిల్ వెంటనే వేదిక పైకి వచ్చారు. ‘‘హ్యాన్ లే ను మనం మయన్మార్ పంపలేం. నేననుకోవడం.. ఈ ప్రసంగం తర్వాత అక్కడి ‘జుంటా’ పాలకులు ఆమె తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మయన్మార్‌లో దిగగానే ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. తనను మనం కాపాడుకోవాలి. ఏ దేశమైనా హ్యాన్ లేకు ఆశ్రయం ఇచ్చేందుకు ముందుకు రావాలి’’ అని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రపంచానికి రెండు పిలుపులు. ఒకటి: మయన్మార్‌ను కాపాడటం కోసం. రెండు: హ్యాన లే కు ఆశ్రయం ఇవ్వడం కోసం. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను ‘‘నా లోపలిదంతా నేను మాట్లాడేయాలి. నిన్న రాత్రి నేను నా గదికి వెళ్లగానే పెద్దగా ఏడ్చేశాను. అది ఆగని దుఃఖధార. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మయన్మార్‌లో చనిపోతున్నవారంతా మన ఈడు వారు. యువకులు. పెద్దవాళ్లు చేస్తున్న పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న యువతీ యువకులను తూటాలు నేల కూల్చేస్తున్నాయి. ఈ నరమేధాన్ని ఆపేందుకు ప్రపంచం ముందుకు రావాలి’’ – మిస్ హ్యాన్ లే, మయన్మార్ (థాయిలాండ్ అందాల పోటీ వేదికపై) -
మయన్మార్‌లో ఆగని అరాచకం.. 550 మంది మృతి
యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. నిరసనకారుల్ని అణిచివేయడానికి సైన్యం ప్రతీ రోజూ కాల్పులకు దిగుతోంది. శనివారం సైన్యం కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు బలయ్యారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అందులో కొంతమంది తల నుంచి రక్తం ధారగా కారుతున్న ఒక యువకుడిని తీసుకొని పరుగుల తీస్తున్న దృశ్యంతో పాటు కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఫిబ్రవరి 1న అంగసాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపిన తర్వాత మిలటరీ కాల్పుల్లో ఇప్పటివరకు 550 మంది ప్రాణాలు పోయాయని స్థానిక హక్కుల సంస్థ వెల్లడించింది. మరణించిన వారిలో 46 మంది చిన్నారులు ఉండడం తీవ్రంగా కలకలం రేపే అంశం. మయన్మార్ అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2,751 మందిని సైన్యం అదుపులోనికి తీసుకొని జైలు పాలు చేసింది. మిలటరీ ప్రజా ఉద్యమాన్ని ఎంతలా అణగదొక్కాలనుకుంటుందో అంతే బలంగా అది పైకి లేస్తోంది. మిలటరీ తూటాలకు భయపడేది లేదంటున్న ప్రజలు రోడ్లపైకి వచ్చి మిలటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. అందరిపైనా తుపాకీ గురి పెడుతున్నారు ఇల్లు దాటి బయటకి వచ్చిన ప్రతీ ఒక్కరిపైనా మయన్మార్ సైనికులు తుపాకీ గురి పెడుతున్నట్టుగా సీఎన్ఎన్ చానెల్‌కి కొందరు నిరసనకారులు చెప్పారు. ‘‘దుకాణాలకి వెళ్లినా, రోడ్డుపై నడిచి వెళుతున్నా సైనికులు పిస్టల్ని గురి పెట్టి బెదిరిస్తున్నారు. ఎవరైనా సాయం కోరినా అందించే పరిస్థితి లేదు’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా మిలటరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మైనార్టీ రెబెల్ గ్రూపు కరేన్ నేషనల్ యూనియన్ తమకు పట్టున్న గ్రామాలపై మిలటరీ నిరంతరాయంగా బాంబుల వర్షం కురిపిస్తోందని తెలిపింది. చదవండి: తల్లి టీవీ ఆఫ్ చేసిందని కొడుకు ఆత్మహత్య ఇండోనేషియాలో భారీ వరదలు.. 44మంది మృతి -
ప్రపంచ ఫ్యాషన్ షోలో కన్నీరు పెట్టిన సుందరి
బ్యాంకాక్: ప్రపంచ దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్న ఫ్యాషన్ షో అది. హొయలు ఒలుకుతూ.. తమ అందచందాలను చూపుతూ ఆహూతులను ఆకట్టుకునేలా వయ్యారంగా నడుస్తున్నారు. వందలాది మంది పాల్గొన్న ఆ షోలో 20 మంది తుది పోటీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారితో నిర్వాహకులు మాట్లాడించారు. ఈ క్రమంలో ఓ సుందరి మాట్లాడుతూ.. తన దేశాన్ని తలుచుకునూ కన్నీటి పర్యంతమైంది. నా దేశాన్ని కాపాడండి’ అంటూ అంతర్జాతీయ వేదికపై రోదిస్తూ విజ్ఞప్తి చేసింది. ఈ రోజు నా సోదరులు 64 మంది మృతి చెందారని ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ పరిణామం మయన్మార్‌లో నెలకొన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించింది. బ్యాంకాక్ మిస్ గ్రాండ్ పోటీలు-2020 ఉత్సాహంగా జరుగుతున్నాయి. మయన్మార్‌కు చెందిన 22 ఏళ్ల హాన్ లే కూడా పాల్గొంది. తన అందం.. వస్త్రధారణ, నడక, చూపులతో అందరినీ దృష్టిని ఆకర్షించి టాప్ 20 మందిలో చోటు సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె వేదికపై మాట్లాడుతూ.. తన దేశంలో జరుగుతున్న పరిణామాలను వివరించింది. ‘ఈ స్టేజీపై నిలబడి మాట్లాడడం సాధారణ రోజుల్లో గర్వపడేదాన్ని. కానీ నా దేశంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో మీ ముందు మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. వందలాది మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. 64 మంది మరణించారనే విషయం నన్ను దిగ్ర్భాంతికి గురి చేసింది. మా దేశానికి అత్యవసర సాయం, అంతర్జాతీయ జోక్యం అవసరం’ అని హాన్ లే గుర్తు చేసింది. ‘దయచేసి మయన్మార్‌కు సాయం చేయండి’ అంటూ విలపిస్తూ ఆ అందాల సుందరి విజ్ఞప్తి చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ ఫ్యాషన్ షో వాతావరణం ఉద్విగ్నంగా మారింది. హాన్ లే మిస్ గ్రాండ్ మయన్మార్ అవార్డు సొంతం చేసుకుని ఈ పోటీలకు ఎంపికైంది. Han Lay, a Miss Grand Myanmar made an emotional appeal for international help for her country during the Miss Grand International pageant in Thailand https://t.co/tsb3jj86qy pic.twitter.com/JL3ei9RzwZ — Reuters (@Reuters) March 30, 2021 -
మయన్మార్‌లో బాంబుల వర్షం
-
Myanmar: గ్రామంపై బాంబుల వర్షం
మయన్మార్: మయన్మార్‌లో మిలటరీ, ప్రజల మధ్య జరుగుతున్న పోరు కారణంగా ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతూ ఉండటంతో అది అంతర్యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిలటరీ అరాచకాలకు నిరసనగా వేలాదిమంది రోడ్లపైకి వస్తున్నారు. కాగా, కేఎన్‌యూ సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినట్లు స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. గ్రామంపై మయన్మార్ ఆర్మీ బాంబుల వర్షం యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ కరేన్ నేషనల్ యూనియన్ (కేఎన్‌యూ) సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్న గ్రామంపై బాంబుల వర్షం కురిపించింది. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆదివారం రోడ్లపైకి వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిం చాలని నినదించారు. మరోవైపు థాయ్ సరిహద్దుల్లోని గ్రామంపై మయన్మార్ మిలటరీ ప్రతీకార దాడులకు దిగింది. పపూన్ జిల్లాలో ఓ గ్రామంపై వైమానిక దాడులు చేసి బాంబుల వర్షం కురిపించింది. దీంతో గ్రామస్తులు ప్రాణాలరచేతుల్లో పట్టుకొని పరుగులు తీశారు. ఈ దాడిలో పిల్లలు సహా పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఓ సంస్థ వెల్లడించింది. కేఎన్‌యూకి చెందిన కొంతమంది శనివారం ఒక ఆర్మీ బేస్‌పై దాడి చేసి లెఫ్ట్‌నెంట్ కల్నల్ సహా 10 మంది సైనికుల్ని చంపేశారు. ప్రతీకారంగా సైన్యం ఈ దాడి చేసింది. యాంగాన్‌లో రోడ్లపై ప్రజాస్వామ్యవాదులు ఏర్పాటు చేసిన అడ్డంకులు -
మయన్మార్‌లో నిరసనకారులపై తూటా
-
మయన్మార్‌లో నిరసనకారులపై తూటా
యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ ఒకవైపు సాయుధ బలగాల దినోత్సవాన్ని జరుపుకుంటూనే నిరసనకారులపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. మిలటరీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న వారిపై తుపాకీగుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో శనివారం మధ్యాహ్నానికి 93 మందిపైగా మిలటరీ తూటాలకు బలైనట్టుగా మయన్మార్‌లో స్వతంత్ర అధ్యయన సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి సైనికులు యాంగాన్, మాండాలే సహా 12 పట్టణాల్లో నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మండాలేలో జరిగిన కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు మరణించడంతో విషాదం నెలకొంది. మయన్మార్ సైనికులు తమని అణగదొక్కాలని చూస్తున్నప్పటికీ వారు గద్దె దిగేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిరసనకారులు ఎలుగెత్తి చాటారు. ‘‘మమ్మల్ని పిట్టల్లా కాల్చేస్తున్నారు. మా ఇళ్లల్లోకి కూడా సైనికులు చొరబడుతున్నారు’’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు మొత్తంగా 400 మంది అమాయకులు బలయ్యారు. సిగ్గుతో తలదించుకోవాలి ఒకే రోజు ఈ స్థాయిలో అమాయకులు బలైపోవడంతో అంతర్జాతీయంగా మయన్మార్ మిలటరీపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘సాయుధ బలగాలు ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’’ అని మిలటరీకి వ్యతిరేకంగా అధికారాన్ని కోల్పోయిన ప్రజాప్రతినిధుల కూటమి అధికార ప్రతినిధి డాక్టర్ శస అన్నారు. సాయుధబలగాల దినోత్సవం బీభత్సంగా జరిగింది. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు అని మయన్మార్‌లో యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం విమర్శించింది. మరోవైపు మిలటరీ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హాలింగ్ ప్రజల పరిరక్షణ కోసమే తామున్నామని అన్నారు. త్వరలోనే స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తామని చెప్పారు. -
ఆర్మీ డేన 100కు పైగా మందిని కాల్చి చంపిన సైన్యం
మయన్మార్ : దేశంలో సైనిక ప్రభుత్వ హింసాకాండలు ఏ మాత్రం తగ్గడం లేదు. తమ ప్రభుత్వాన్ని ఎదురిస్తున్నవారిని దారుణంగా బలితీసుకుంటోంది. శనివారం 100 మందికిపైగా నిరసనకారుల్ని సైనిక బలగాలు కాల్చి చంపాయి. నిన్న, ఫిబ్రవరి 1 సైనిక చర్యను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో నిరసనకారులు యాంగాన్, మాండలే, మరికొన్ని పట్టణాల్లోని వీధుల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో సైనిక బలగాలు వారి తలలు, వీపులపై కాల్పులు జరిపాయి. చనిపోయిన వారిలో ఐదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మాండలే పట్టణంలో 13 మంది మరణించగా.. దేశ వ్యాప్తంగా 100 మందికి పైగా చనిపోయారు. నేషనల్ ఆర్మీ డేన ఈ దారుణం జరగటం గమనార్హం. కాగా, ఫిబ్రవరి నెలలో మయన్మార్ ప్రధాని ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. సైనిక పాలనకు వ్యతిరేకంగా అప్పటినుంచి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. నిరసనలను అదుపు చేసే నెపంతో సైనిక బలగాలు ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నాయి. సైన్యం ఇప్పటి వరకు 400 మందికిపైగా నిరసనకారుల్ని కాల్చి చంపేసింది. చదవండి, చదివించండి : టాటా ఏస్ క్యాబిన్లో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు.. -
ఇక పెళ్లిళ్లు కష్టమే! పాకిస్తాన్‌కు షాకిచ్చిన సౌదీ
రియాద్: సౌదీ అరేబియా తన దేశంలోని పురుషులకు షాకిచ్చింది. పాకిస్తాన్‌తో సహా మరో మూడు దేశాల మహిళలను వివాహం చేసుకోకూడదంటూ ఆదేశాలు జారీ చేసిందట. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు చెందిన డాన్ వెల్లడించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌కి చెందిన మహిళల్ని పెళ్లి చేసుకోవద్దని... సౌదీ పాలకులు ఆదేశాలు జారీ చేసినట్లు సౌదీ మీడియా చెబుతోందని డాన్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు సౌదీ అరేబియా జారీ చేసిన తాజా ఉత్తర్వలు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయని డాన్ పేర్కొంది. అనధికారిక లెక్కల ప్రకారం... ఈ నాలుగు దేశాలకు చెందిన 5 లక్షల మంది మహిళలు ఇప్పుడు సౌదీ అరేబియాలో ఉన్నారు. ఇన్నాళ్లు సౌదీ అరేబియా ప్రజలు ఈ నాలుగు దేశాల ప్రజలను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ తాజా ఆదేశాలతో ఈ దేశాల మహిళల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే... కఠిన నిబంధనలు అడ్డొస్తాయి అని మక్కా డైలీ రిపోర్ట్ చేసింది. అసలు నిషేధం విధించడం.. కఠినమైన ఆంక్షలు పెట్టడం ఎందుకు అంటే గత కొన్నాళ్లుగా సౌదీ అరేబియాలో విదేశీ మహిళల్ని పెళ్లి చేసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని పాలకులు భావించినట్లు తెలిసింది. ఎవరైనా తప్పనిసరిగా విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలంటే... కొన్ని అదనపు రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు విదేశీ మహిళను పెళ్లి చేసుకోవాలి అనుకునే సౌదీ అరేబియా పురుషులు... వివాహానికి ముందు తప్పనిసరిగా ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రభుత్వం దాన్ని ప్రభుత్వం ఆమోదించాలో లేదో నిర్ణయిస్తుంది. ఎవరైనా విడాకులు తీసుకొని... మళ్లీ పెళ్లికి రెడీ అయితే... వారు 6 నెలల దాకా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని డైరెక్టర్ మేజర్ జనరల్ అస్సాఫ్ అల్ ఖురేషీ తెలిపారు. అప్లికేషన్ పెట్టుకునేవారి వయస్సు 25 ఏళ్లు దాటి ఉండాలి. అప్లికేషన్‌పై ముందుగానే స్థానిక జిల్లా మేయర్ సంతకం పెట్టి ఉండాలి. గుర్తింపు పత్రాలు (ఐడీ కార్డులు), ఫ్యామిలీ కార్డు కాపీ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ చేసుకునే వ్యక్తికి అప్పటికే వివాహం అయితే అతడు తన భార్యకు సంబంధించి వికలాంగురాలని లేదా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుందని.. లేదా ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్ సర్టిఫికెట్ తప్పని సరిగా సమర్పించాలని తాజా ఆదేశాలు పేర్కొంటున్నాయి. చదవండి: ‘సీఎం సాబ్... నాకు పెళ్లి కూతుర్ని చూడండి’ -
మయన్మార్: 9 మందిని కాల్చి చంపిన సైన్యం
మయన్మార్ : ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వం ఆగడాలు రోజురోజుకు పెచ్చు మీరుతున్నాయి. ఆంగ్ సాన్ సూకీ ప్రజా ప్రభుత్వానికి మద్ధతుగా వెల్లు వెత్తుతున్న నిరసనలను అణగదొక్కటానికి సైనిక బలగాలు దారుణానికి పాల్పడుతున్నాయి. శుక్రవారం ఆంగ్బాన్ సెంట్రల్ టౌన్ వద్ద సైనిక బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపటంతో 9 మంది మృత్యువాతపడ్డారు. ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా.. ఓ వ్యక్తి కలావ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దేశంలో నెలకొన్న హింసకు స్వప్తి పలకాలని ఇండోనేషియా పిలుపునిచ్చిన రోజే ఈ దారుణం చోటుచేసుకోవటం గమనార్హం. కాగా, ఫిబ్రవరి నెలలో మయన్మార్ ప్రధాని ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. సైనిక పాలనకు వ్యతిరేకంగా అప్పటినుంచి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. నిరసనలను అదుపు చేసే నెపంతో సైనిక బలగాలు ప్రజల్ని పొట్టన పెట్టుకుంటున్నాయి. సైన్యం ఇప్పటి వరకు 150 మందికిపైగా నిరసనకారుల్ని చంపేసింది. చదవండి : సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా -
సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా
మాండలే: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారపగ్గాలు చేపట్టిన సైనిక పాలకులు, ఆ దేశ నేత అంగ్‌సాన్ సూకీపై మరింత ఒత్తిడి పెంచారు. అంగ్‌సాన్ సూకీకి 5 లక్షల డాలర్లకు పైగా అందజేసినట్లు సైనిక జుంటా అనుకూల నిర్మాణ సంస్థ యజమాని మౌంగ్ వైక్ ఆరోపించారు. గతంలో డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులున్న వైక్ గురువారం ప్రభుత్వ ఆధీనంలోని టీవీలో ఈ మేరకు ప్రకటించారు. సూకీ తల్లి పేరిట ఉన్న చారిటబుల్ ట్రస్టుకు 2018 నుంచి వివిధ సందర్భాల్లో మొత్తం 5.50 లక్షల డాలర్లను అందజేసినట్లు తెలిపారు. అప్పటి ప్రభుత్వంలోని మంత్రులు తన వ్యాపారానికి అనుకూలంగా ఉండేందుకు కొంత మొత్తాన్ని ఇచ్చినట్లు చెప్పుకున్నారు. నిర్బంధంలో ఉన్న సూకీపై సైనిక పాలకులు ఇప్పటికే పలు ఆరోపణలు మోపిన విషయం తెలిసిందే. వాకీటాకీలను అక్రమంగా కలిగి ఉండటం, ఒక రాజకీయ నేత నుంచి 6 లక్షల డాలర్ల విలువైన బంగారాన్ని తీసుకోవడం వంటివి వీటిలో ఉన్నాయి. సూకీతోపాటు నిర్బంధం అనుభ విస్తున్న దేశాధ్యక్షుడు విన్ మింట్‌పై కూడా దేశంలో అశాంతికి కారకుడయ్యారంటూ ఆరోపణలు మోపారు. ఫిబ్రవరి ఒకటో తేదీన అధికారాన్ని హస్త గతం చేసుకున్న సైనిక పాలకులు ప్రజాస్వామ్యం కోసం ప్రజలు తెలుపుతున్న నిరసనలను ఒక వైపు ఉక్కుపాదంతో అణచివేస్తూనే.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన పాలకులను నిర్బంధించి, పలు ఆరోపణలు మోపి విచారణకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా, ఐక్యరాజ్యసమితిలో ప్రజాస్వామ్యా నికి అనుకూలంగా మాట్లాడిన ఆ దేశ రాయబారి క్యామోటున్‌పై సైనిక జుంటా దేశ ద్రోహ నేరం మోపింది. అజ్ఞాతంలో ఉన్న ప్రజానేత మహ్‌న్ విన్ ఖయింగ్ థాన్‌పైనా దేశద్రోహం మోపింది. గురువారం యాంగూన్ శివారు ధామైన్‌లో ఆందోళనలు చేపట్టిన ప్రజలు పోలీసులకు రాకను అడ్డుకునేందుకు రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి, వాటికి నిప్పంటించారు. -
మయన్మార్ నుంచి అక్రమ వలసలు
యాంగూన్/న్యూఢిల్లీ: మయన్మార్‌లో సైనిక పాలన భారత్‌పై ప్రభావం చూపుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దె దించి ఫిబ్రవరిలో సైన్యం అధికారం హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అక్కడి నిర్బంధాలకు భయపడి ప్రజలు భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా, 116 మంది సరిహద్దుల్లో భారత బలగాల గస్తీ ఎక్కువగా కనిపించని తియు నదిని దాటి మిజోరంలోకి ప్రవేశించారు. సరిహద్దులకు సమీపంలోని ఫర్కాన్ గ్రామంలో వీరంతా తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మయన్మార్ పోలీసు, అగ్ని మాపక సిబ్బంది అని సమాచారం. మానవతాసాయం కోరుతూ వచ్చే వారినే అనుమతించాలంటూ సరిహద్దుల్లోని మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వాలను కేంద్రం ఇటీవల కోరింది. భారత్–బర్మాలకు సుమారు 1,643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మయన్మార్‌లో అల్లకల్లోల పరిస్థితులతో వలస వచ్చిన వేలాది మంది భారత్‌లో తలదాచుకుంటున్నారు. కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి ప్రజలు సాగిస్తున్న పోరాటాన్ని మయన్మార్ సైనిక పాలకులు కఠినంగా అణచివేస్తున్నారు. ఆదివారం నిరసనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాంగూన్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతోపాటు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు.సైనిక పాలనను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టిన వారిపై సైన్యం జరిపిన కాల్పుల్లోదేశ వ్యాప్తంగా శనివారం కూడా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని మీడియా పేర్కొంది. ఆస్పత్రులను కూడా సైన్యం స్వాధీనం చేసుకోవడంతో వైద్యులు సేవలను నిరాకరిస్తున్నారు. సైన్యం పగ్గాలు చేపట్టాక ఇప్పటి వరకు కనీసం 70 మంది ప్రజలు కాల్పుల్లో మరణించినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సంఖ్య 90 వరకు ఉంటుందని అనధికార వర్గాల సమాచారం. చదవండి: సారా ఎవెరార్డ్ హత్య ప్రకంపనలు -
కదిలించే ఫోటో: ‘వారికి బదులు నన్ను చంపండి’
యాంగాన్: మయన్మార్‌లో అధికారం సైన్యం చేతిల్లోకి వెళ్లింది. అధ్యక్షురాలు అంగ్ సాన్ సూకిని సైన్యం నిర్భంధించి.. అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిలటరీకి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. ప్రజల నిరసనని అణచివేయడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉండడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సైన్యం అరాచకాలను కళ్లకు కట్టే ఫోటో ఒకటి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరలవుతోంది. కచిన్ రాష్ట్రంలో మైత్‌క్వీనా నగరంలో సోమవారం నాడు తీసిన ఫోటో ఇది. ఆ వివరాలు... కచిన్ రాష్ట్రంలో సోమవారం కొందరు బయటకు వచ్చి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేయడం.. మాట వినకపోతే తూటాకు పనిచెప్పడమే వారి లక్ష్యం. పోలీసులను చూసి అక్కడి యువకులు పరుగులు పెడుతున్నారు. అప్పటికే అధికారులు తుపాకులకు పని చెప్పడంతో ఓ యువకుడు మరణించాడు. మరి కొందరి ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు. ఈ విపత్కర పరిస్థితిని గ్రహించిన ఓ మహిళ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అధికారులకు అడ్డు నిలబడింది. తెల్లటి దుస్తులు ధరించి శాంతికి మారుపేరుగా ఉన్న ఆ నన్ పోలీసులకు ఎదురెళ్లింది. నిగ్రహం పాటించండి అంటూ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె మాట వినలేదు. దాంతో ఆమె వెంటనే మోకాళ్లపై కూర్చొని ‘ఆందోళనకారులను ఏమీ చేయొద్దు.. కావాలంటే నా ప్రాణం తీసుకోండి’ అంటూ వేడుకుంది. ఆమెలోని తెగువ, మానవత్వానికి చలించిన అధికారులు ఆమెకు ప్రతి నమస్కారం చేశారు. మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్న ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మైత్‌క్వీనాలో సోమవారం నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులకు నచ్చజెప్పేందుకు సిస్టర్ అన్న్ రోజ్ ను తవాంగ్ ప్రయత్నించారు. వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్తున్న పోలీసులను అడ్డుగా నిలిచారు. వారినేమీ చేయొద్దంటూ మోకాలిపై నిలబడి వేడుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోనే ఇది. ఇద్దరు పోలీసులు సైతం ఆమెకు చేతులు జోడించి నమస్కరించడం కనిపించింది. ఫిబ్రవరి 28న సైతం నిరసనకారులపై ప్రతాపం చూపేందుకు వచ్చిన పోలీసులను ఇలానే అడ్డుకున్నారు సిస్టర్ తవాంగ్. ఈ ఘటనపై సిస్టర్ తవాంగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం మయన్మార్ దుఃఖంలో ఉంది. నా కళ్ల ముందు ప్రజలకు ఏమైనా జరిగితే తట్టుకోలేను. చూస్తూ ఊరుకోలేను. ప్రజల కోసమే నా జీవితాన్ని అంకితం చేశాను. వారి కోసం చావడానికి నేను భయపడను’’ అన్నారు. చదవండి: ప్రజలు ఎన్నుకున్నా పవర్లో లేరెందుకు! బయటికొస్తే అరెస్ట్ చేస్తాం... -
మయన్మార్ ఆర్మీ ఛానెల్స్‌పై యూట్యూబ్ వేటు
యాంగాన్: మయన్మార్‌లో మిలటరీ నడుపుతున్న అయిదు ఛానెల్స్‌ని యూట్యూబ్ తొలగించింది. తమ నిబంధనలకి విరుద్ధంగా ఉన్నందున ఆ ఛానెల్స్‌ని తొలగిస్తున్నట్టుగా యూట్యూబ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లు మయన్మార్ మిలటరీతో సంబంధం ఉన్న అన్ని పేజీలను తొలగించాయి. యూట్యూబ్ నిబంధనలకి విరుద్ధంగా ఎవరు ఎలాంటి వీడియోలు ఉంచినా వారి ఛానెల్స్‌ను తొలగిస్తామని ఆ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు ఫిబ్రవరి1న ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని దింపేసి బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకున్న మిలటరీకి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. దేశంలో రాజకీయ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రత్యేక సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనల్ని మరింత ఉధృతం చేశారు. ప్రధాన నగరాల్లో భారీ ప్రదర్శనలు జరుగుతున్నా యి. ప్రజల నిరసనని అణచివేయడానికి భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉండడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చదవండి: ఖాళీగా ఇంట్లో కూర్చోలేను బిడ్డా! స్మృతి ఇరానీ పోస్ట్‌పై సోనూసూద్ కామెంట్ -
మయన్మార్‌లో సైన్యం ఆగడం
గత నెల 1న మయన్మార్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం హస్తగతం చేసుకున్న సైనిక ముఠా రోజూ వీధుల్లో ఎగిసిపడుతున్న జన కెరటాలను చూసి బెంబేలెత్తుతోంది. ఉద్యమకారులను నియంత్రించే పేరుతో చాలా తరచుగా భద్రతా బలగాలు సాగిస్తున్న కాల్పులు ఆ ముఠా బలాన్ని కాక బలహీనతను పట్టిచూపుతున్నాయి. వివిధ నగరాల్లో కేవలం బుధవారం రోజున 38 మంది పౌరుల్ని భద్రతా బలగాలు పొట్టనబెట్టుకున్న తీరు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచింది. సరిగ్గా అంతకు మూడు రోజుల ముందు ఆదివారం వేర్వేరు నగరాల్లో కాల్పులు జరిపి 25 మంది ప్రాణాలు తీశారు. సైనిక నియంతల నేర చరిత్ర తిరగేస్తే ఈ దమనకాండ వున్నకొద్దీ పెరుగుతుంది తప్ప ఇప్పట్లో తగ్గదని అర్థమవుతుంది. నిరసనల్లో ముందున్నవారిని ఈడ్చుకొచ్చి కాల్చిచంపటం, ఉద్యమకారుల్ని వేటకుక్కల్లా తరుముతూ ప్రాణాలు తీయటం, రోజూ ఇళ్లపై దాడులు చేస్తూ వందలమందిని నిర్బంధించటం సామాజిక మాధ్యమాల్లో కనబడుతున్నాయి. ఇళ్లల్లో వున్నవారిని గురిచూసి కాల్చటం, హఠాత్తుగా లోపలికి చొరబడి పౌరుల్ని కొట్టుకుంటూ తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించటం వంటి ఉదంతాలు నిత్యకృత్యమయ్యాయి. ఆఖరికి గాయపడిన ఉద్యమకారులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సైతం అరెస్టు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఉద్యమానికి చెప్పుకోదగ్గ నాయకులంటూ లేరు. వివిధ రాజకీయ పక్షాల నేతలనూ, ప్రభుత్వ వ్యతిరేక దృక్పథం వున్న పాత్రికేయులనూ సైనిక ముఠా జైళ్లపాలు చేసింది. అయినా నిరసనల తీవ్రత తగ్గుతున్న దాఖలాలు లేవు. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కీలక నేత ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్ఎల్డీ) 83 శాతం స్థానాలను గెల్చుకోగా, తమ ఏజెంటుగా వున్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ)కి కేవలం 7శాతం స్థానాలు రావటం సైనిక ముఠా జీర్ణించుకోలేకపోయింది. అడ్డగోలు నిబంధనలతో నింపిన రాజ్యాంగం సైతం ఈసారి పార్లమెంటులో తమకు అక్కరకొచ్చే స్థితి లేకపోవటంతో ఎటూ పాలుబోలేదు. ఆ ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం సైన్యానికుండే అధికారాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుందని సూకీ చెప్పారు. ఎన్ఎల్డీ మెజారిటీ పెరగటంతో తాము దశాబ్దాలుగా అనుభవిస్తున్న పెత్తనం అంతరిస్తుందన్న భయం సైన్యాన్ని పీడించింది. పర్యవ సానంగా సైనిక కుట్రకు పాల్పడింది. సూకీతో సహా ప్రధాన నాయకులందరినీ గుర్తు తెలియని ప్రాంతాల్లో నిర్బంధించింది. అయితే జనాన్ని తక్కువ అంచనా వేసింది. విద్యార్థులు, ఉపా ధ్యాయులు, వైద్యులు, బ్యాంకర్లు, కార్మికులు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. పైగా వీరంతా రోహింగ్యా ముస్లింలపైనా, ఇతర మైనారిటీలపైనా సైన్యం అమలు చేస్తున్న అణచివేతను ప్రశ్నిస్తున్నారు. వారి ఆందోళనకు కూడా మద్దతిస్తున్నారు. నాలుగైదేళ్లక్రితం దేశంలో మతతత్వాన్ని, జాతీయవాదాన్ని రెచ్చగొట్టి రోహింగ్యాలను తుడిచి పెట్టేందుకు సైన్యం మారణహోమాలకు పాల్పడింది. ఊళ్లకు ఊళ్లు తగలబెడుతూ, వేలాదిమందిని ఊచకోత కోసింది. ఇందుకు ప్రైవేటు ముఠాల సాయం కూడా తీసుకుంది. దురదృష్టమేమంటే అప్పుడు తమ పార్టీ ప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహిస్తున్న సూకీ సైన్యం ఆగడాల గురించి నోరెత్తలేదు. పైగా అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ముందు హాజరై వారిని వెనకేసుకొచ్చారు. కనీసం రోహింగ్యాల పేరెత్తడానికి కూడా ఆమె సిద్ధపడలేదు. తనను రోహింగ్యాల ఏజెంటుగా ప్రచారం చేస్తున్న బౌద్ధ మిలిటెంటు గ్రూపుల ప్రచార హోరును చూసి, సైన్యం ఆగ్రహానికి గురికావలసివస్తుందని భయపడి ఆమె చూసీచూడనట్టు వూరుకున్నారు. కానీ ఇప్పుడు వీధుల్లో కొచ్చిన ఉద్యమకారులు అలాంటి వివక్ష పాటించటం లేదు. తమపై ఇప్పుడు సాగుతున్న సైనిక అకృత్యాలు రోహింగ్యాలపై అమలైన అణచివేతకు కొనసాగింపుగానే చూస్తున్నారు. ఇది సైనిక పాలకులకు మాత్రమే కాదు... మళ్లీ వారి చెరలో పడిన సూకీకి సైతం ఊహించని పరిణామం. పదిహేనేళ్లు ఆమె నిర్బంధంలో వున్నప్పుడు ప్రజానీకం ఆమెకు అండదండలందించారు. ప్రజా స్వామ్యం కోసం, ప్రత్యేకించి ఆమె కోసం రోడ్లపైకొచ్చి నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు వారి ఏకైక ఎజెండా ప్రజాస్వామ్య పునరుద్ధరణే. ఈ క్రమంలో సైనిక పాలకులు కల్పిస్తున్న అన్ని అడ్డంకులనూ ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా మయన్మార్ పోరాటానికి మద్దతునిస్తున్నవారికి ఇప్పుడొక ధర్మసంకటం ఏర్పడింది. రోహింగ్యాల ఊచకోత సమయంలో ప్రభుత్వానికి మార్గదర్శకత్వం వహిస్తూ, సైన్యాన్ని వెనకేసుకొచ్చిన సూకీని దూరం పెడుతూ... ఉద్యమానికి మద్దతునీయటం ఎలాగన్నది వారిని వేధి స్తున్న ప్రశ్న. మయన్మార్‌లో భారీయెత్తున పెట్టుబడులు పెట్టిన చైనా, ఆ దేశంతో మరింత సాన్నిహిత్యం కోసం ఉవ్విళ్లూరుతున్న రష్యా స్వప్రయోజనాల కోసం సైనిక పాలకుల ఆగడాలను గుడ్లప్పగించి చూస్తున్నాయి. వారి చర్యలను ఖండించే భద్రతా మండలి తీర్మానాన్ని నీరుగార్చటంతో పాటు మానవహక్కుల మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకున్నాయి. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమానికి మద్దతుగా నిలిచేందుకు ఎక్కడికక్కడ తమ ప్రభుత్వాలపై ప్రపంచ ప్రజానీకం ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడు మాత్రమే సైనిక పాలకులు దారికొస్తారు. -
పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు
సింగపూర్ సిటీ : సింగపూర్‌లో భారత సంతతికి చెందిన మహిళ తన పనిమనిషి పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. ఆకలికి అలమటిస్తున్న ఆమెకు పట్టెడు మెతుకులు కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన గయాతిరి మురుగన్ అనే మహిళ 2015 నుంచి సింగపూర్‌లో నివసిస్తోంది. ఐదు నెలల క్రితం ఆమె మయన్మార్‌కు చెందిన పియాంగ్‌ను పనిలో పెట్టుకుంది. పనిలో చేరిన మరుక్షణం నుంచి గయాతిరి ఆమెతో క్రూరంగా ప్రవర్తించేది. బండెడు చాకిరి చేసిన ఆమెకు కనీసం తినడానికి తిండి కూడా పెట్టేది కాదు. పైగా ప్రతిరోజు ఆమెను కొడుతూ ఉండేది. ఈ క్రమంలో ఓ రోజు ఆమెను ఇంట్లోనే బంధించింది. ఇంట్లోని ఓ రూమ్‌లో గ్రిల్‌కు కట్టేసి, ఆమెపై వేడివేడి పదార్థాలు వేసి నరకం చూపించింది. దీంతో ఆమె పెట్టిన చిత్రహింసలు తాళలేక ఆ పని మనిషి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహానికి శవ పరీక్ష చేయగా, విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంలో 31 చోట్ల గాయాల తాలూకు మచ్చలుండగా, బయట చర్మం మీద 47 గాయాలున్నట్లు డాక్టర్లు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆమె చనిపోయిందన్నారు. పోషకాహారం అందకపోవడం కూడా ఆమె చావుకు మరొక కారణమని పేర్కొన్నారు. కాగా నిందితురాలి మీద 28 అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది సభ్యసమాజం తలదించుకునే చర్య అని పనిమనిషి బంధువుల తరపు న్యాయవాది మహమ్మద్ ఫైజల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితురాలికి జీవితఖైదు లేదా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరారు. చదవండి: కూల్‌డ్రింక్ ఆర్డర్ చేస్తే.. యూరిన్ బాటిల్ వచ్చింది! -
బయటికొస్తే అరెస్ట్ చేస్తాం...
బయటికొస్తే అరెస్ట్ చేస్తాం. ‘ఎవడాడు ఆ మాటన్నది?!’ పన్నులు కట్టకుంటే ముక్కులు పిండుతాం.‘ఎవడాడు ఆ మాటన్నది?!’శాసనాన్ని ధిక్కరిస్తే జైలే. ‘ఎవడాడు ఆ మాటన్నది?! ఆ మాటన్నది ఎవరైనా.. ‘ఎవడాడు’ అన్నది మాత్రం మహిళే! మహిళా సైన్యం అంటాం కానీ.. మహిళే ఒక సైన్యం! ప్రతి శాసనోల్లంఘనలో ముందుంది మహిళే. ముందుకు నడిపించిందీ మహిళే. రేపు సోమవారానికి వారం మయన్మార్‌లో ప్రభుత్వం పడిపోయి. పార్లమెంటులో మెజారిటీ తగ్గి పడిపోవడం కాదు. సైన్యం ట్యాంకులతో వెళ్లి ప్రభుత్వాన్ని కూల్చేసింది. దేశాన్ని ప్రెసిడెంట్ చేతుల్లోంచి లాగేసుకుంది. పాలకపక్ష కీలక నేత ఆంగ్ సాన్ సూకీని అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచింది. కరోనా సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాకీ టాకీని ఫారిన్ నుంచి దిగుమతి చేసుకోవడం.. ఇవీ ఆమెపై సైన్యం మోపిన నేరారోపణలు! దీన్ని బట్టే తెలుస్తోంది. పాలనను హస్తగతం చేసుకోడానికి సైన్యం పన్నిన కుట్ర ఇదంతా అని! దేశంలో ఎవరైనా తిరగబడితే సైన్యం దిగుతుంది. సైన్యమే తిరగబడితే ఎదురు తిరిగేవాళ్లెవరు? సైన్యం పేల్చిన నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో మయన్మార్ వీధులపై నెమ్మదిగా దొర్లుకుంటూ వెళుతున్న చెయిన్ చక్రాల కరకరలు విన్నవారికి తెలుస్తుంది. అయితే ఆ కరకరల మధ్య.. బుధవారం నాటికి ఒక కొత్త ధ్వని వినిపించడం మొదలైంది. ఆ ధ్వని.. సైన్యాన్ని ధిక్కరించి ఇళ్లలోంచి బయటికి వచ్చిన మహిళల ‘డిజ్ఒబీడియన్స్’! అవిధేయ గర్జన. ‘వియ్ డోంట్ వాట్ దిస్ మిలిటరీకూ’.. అన్నది ఆ మహిళల నినాదం. సైనిక కుట్రకు వ్యతిరేకంగా శాసనోల్లంఘన ప్రదర్శన జరుపుతున్న మయన్మార్ మహిళా టీచర్లు సైన్యం శాసించింది. ఆ శాసనాన్ని మయన్మార్ మహిళావని ఉల్లంఘించింది. మొదట సోమవారమే కాలేజీ అమ్మాయిలు మగపిల్లల వైపు చూశారు. ‘వేచి చూద్దాం’ అన్నట్లు చూశారు మగపిల్లలు. యూనివర్శిటీలలో మహిళా ప్రొఫెసర్ లు.. ‘ఏంటిది! ఊరుకోవడమేనా?’ అన్నట్లు మేల్ కొలీగ్స్‌తో మంతనాలు జరిపారు. ‘ప్లాన్ చేద్దాం’ అన్నారు వాళ్లు. మెల్లిగా ప్రభుత్వ శాఖల సిబ్బంది పని పక్కన పడేయడం మొదలైంది. బుధవారం నాటికి లెక్చరర్లు బయటికి వచ్చారు. మహిళా లెక్చరర్లు! వెంట సహోద్యోగులు. యాంగన్ యూనివర్శిటీ ప్రాంగణం బయటికి వచ్చి ఎర్ర రిబ్బన్లతో సైన్యానికి తమ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నాటికి టీచర్లు, హెల్త్ వర్కర్లు కూడా పోరుకు సిద్ధమై వీధుల్లోకి వచ్చారు. ప్రజలు ఎన్నుకున్న పాలనను ఉల్లంఘించి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. సైన్యాన్ని ధిక్కరించి మయన్మార్ మహిళలు బర్మాను రక్షించుకోవాలనుకున్నారు. తమ మహిళా నేత ఆంగ్ సాగ్ సూకీ వారిలో నింపిన స్ఫూర్తే ఇప్పుడు వారిని సైనిక కుట్రకు వ్యతిరేకం గా కదం తొక్కిస్తోంది. మయన్మార్‌ను సైన్యం నుంచి విడిపించుకునేందుకు నడుం బిగిస్తోంది. ‘‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చట్ట వ్యతిరేకంగా కూలదోస్తే చూస్తూ ఊరుకోం’’అని న్వే తాజిన్ అనే మహిళా లెక్చరర్ పిడికిలి బిగించారు. ∙∙ మహిళల ముందడుగుతో మొదలైన శాసనోల్లంఘనలు చరిత్రలో ఇంకా అనేకం ఉన్నాయి! 1930 – 1934 మధ్య గాంధీజీ నాయకత్వం వహించిన మూడు ప్రధాన శాసనోల్లంఘనలన్నిటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా మహిళల చేయూత, చొరవ, చేవ అండగా ఉన్నాయి. గాంధీజీ తొలి శాసనోల్లంఘన చంపారన్ (బిహార్)లో, రెండో శాసనోల్లంఘన అహ్మదాబాద్‌లో, మూడో శాసనోల్లంఘన దండి (సూరత్ సమీపాన) జరిగాయి. దండి ఉల్లంఘనలో దేవి ప్రసాద్ రాయ్ చౌదరి, మితూబెన్ ఆయన వెనుక ఉన్నారు. చంపారన్ శాసనోల్లంఘనలో నీలిమందు పండించే పేద రైతుల కుటుంబాల్లోని మహిళలు కొంగు బిగించి దోపిడీ శాసనాలపైకి కొడవలి లేపారు. అహ్మదాబాద్ జౌళి కార్మికుల ఉపవాస దీక్షలో, గుజరాత్‌లోనే ఖేడా జిల్లాలో పేద రైతుల పన్నుల నిరాకరణ ఉద్యమంలో మహిళలు సహ చోదకశక్తులయ్యారు. గాంధీజీనే కాదు.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, జేమ్స్ బెవెల్, రోసా పార్క్స్ వంటి అవిధేయ యోధులు అమెరికాలో నడిపిన 1950–1960 ల నాటి శాసనోల్లంఘన ఉద్యమాలన్నిటి ఆరంభంలో జ్వాలకు తొలి నిప్పుకణంలా మహిళా శక్తి ఉంది. రోసా పార్క్ అయితే స్వయంగా ఒక పెద్ద పౌరహక్కుల ఉద్యమాన్నే నడిపించారు. యాక్టివిస్టు ఆమె. ‘ది ఫస్ట్ లేడీ ఆఫ్ సివిల్ రైట్స్’ అని ఆమెకు పేరు. ∙∙ అన్యాయాన్ని బాహాటం ధిక్కరించే గుణం పురుషుల కన్నా స్త్రీలకే అధికం అని జీవ శాస్త్రవేత్తలు అంటారు. అందుకు కారణం కూడా కనిపెట్టారు. పురుషుడు బుద్ధితోనూ, స్త్రీ హృదయంతోనూ స్పందిస్తారట. అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని, మోసపూరిత శాసనాన్ని ప్రశ్నించడానికి బుద్ధి ఆలోచిస్తూ ఉండగనే, హృదయం భగ్గుమని ఉద్యమిస్తుందట. ఈ సంగతి తాజాగా ఢిల్లీలోని రైతు ఉద్యమంలోనూ రుజువవుతోంది. అయితే అక్కడింకా శాసనోల్లంఘన వరకు పరిస్థితి రాలేదు. ఒకవేళ వచ్చిందంటే తొలి ధిక్కారం, తొలి ఉల్లంఘన సహజంగానే మహిళలదే అయివుండే అవకాశం ఉంది. -
ఒకే దేశం రెండు పేర్లు
బాంకాక్: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం, అక్కడ తిరిగి సైనిక పాలనకు అంకురార్పణ చేయడమే కాక గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ఆంగ్‌సాంగ్ సూకీ, ఆమె అనుచరులను గృహనిర్భంధంలో ఉంచింది. పైగా మయన్మార్‌లో సైనిక పాలన విధించడం సబబేనని, ఆంగ్‌సాంగ్ సూకీ ప్రభుత్వం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడడమే అందుకు కారణమని తన చర్యలను మయన్మార్ సైన్యం సమర్థించుకుంది. సుదీర్ఘ సైనిక పాలన అనంతరం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాంగ్ సూకీ ప్రభుత్వం విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. మయన్మారా? బర్మానా? నిజానికి ఈ సైనిక తిరుగుబాటు ఎక్కడ జరిగింది? అధికారికంగా ఈ దేశాన్ని మయన్మార్ అనాలా? లేక ఇప్పటికీ అమెరికా సంభోదిస్తున్నట్టు బర్మా అని పిలవాలా? దీనికి సమాధానం క్లిష్టమైన విషయమే. మయన్మార్‌లో ప్రతిదీ రాజకీయమే. భాషతో సహా. ఒకే దేశానికి రెండు పేర్లు ఎందుకు? ► ఆధిపత్య జుంటాలు, బర్మన్ జాతి ప్రజల ప్రజాస్వామిక తిరుగుబాటుని అణచివేసిన తరువాత, 1989లో ఈ దేశం పేరుని బర్మాకి బదులుగా మయన్మార్‌గా మార్చారు. అక్కడి ప్రభుత్వాన్ని సైనిక పాలకులు ‘‘యూనియన్ ఆఫ్ బర్మా’’కి బదులుగా ‘‘యూనియన్ ఆఫ్ మయన్మార్’’గా మార్చారు. పాత పేరు అనేక పురాతన జాతులెన్నింటినో విస్మరించిందన్న విమర్శలున్నాయి. ► నిజానికి ఈ పేరులో పెద్ద తేడా ఏమీ లేదు. అయితే సాహిత్యపరంగా చిన్న తేడా వుంది. ‘మయన్మార్’ ‘బర్మా’ అధికారిక వర్షన్. రెండు పేర్లూ అంతిమంగా అతిపెద్ద జాతి సమూహమైన బామర్ ప్రజలు మాట్లాడే భాషకి సంబంధించినవే. ఒకటి రెండు బామర్ కాని సమూహాలు ముఖ్యంగా బామర్ మైనారిటీలు ఇందులో మినహాయింపు. మన్మా అనే శబ్దం ఎలా ఉద్భవించింది అనే విషయంలో స్పష్టత లేదు. అయితే 9వ శతాబ్దంలో సెంట్రల్ ఇర్వాడి నదీ లోయలోకి ప్రవేశించిన ‘‘బామాస్’’ పాగన్ రాజ్యాన్ని స్థాపించారు. అలాగే తమని తాము మన్మా అని సంభోదించుకున్నారు. ఆ తరువాత 1989లో ఈ దేశం పేరుని ఇంగ్లీషులో మయన్మార్‌గా మార్చారు. ప్రపంచంలోని చాలా మంది ఈ పేరుతో పిలవడాన్ని తిరస్కరించారు. ఈ మార్పు ఎప్పుడు జరిగింది? ► దేశం ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తోన్న తరుణంలో దశాబ్దం క్రితం ఈ పేరుని మార్పు చేశారు. బర్మాలో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకొని, అత్యధిక రాజకీయాధికారాలను దక్కించుకుంది. అయితే ప్రతిపక్ష నాయకులు జైలు నుంచి విడుదలై గృహనిర్భంధంలో ఉన్నారు. ఈ సందర్భంలో ఎన్నికలకు అనుమతిచ్చారు. సుదీర్ఘకాలంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతోన్న ఆంగ్‌సాంగ్ సూకీ ఈ ఎన్నికల్లో దేశానికి నాయకురాలయ్యారు. ► చాలా ఏళ్ళ పాటు చాలా దేశాలు, అసోసియేషన్ ప్రెస్‌తో సహా మీడియా అంతా ఈ దేశాన్ని అధికారికపు పేరుతోనే పిలవడం ప్రారంభించారు. నిర్భంధం, ఆంక్షలు తగ్గి, మిలిటరీ పాలనకు అంతర్జాతీయంగా పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో ‘‘మయన్మార్’’ పేరు కామన్‌గా మారిపోయింది. దేశంలోని ప్రతిపక్షాలు మాత్రం తమకు ఈ విషయంలో పెద్ద పట్టింపు లేదని తేల్చి చెప్పారు. అయితే మొత్తం ప్రపంచానికి భిన్నంగా అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ దేశాన్ని ‘బర్మా’ పేరుతోనే పిలుస్తూండడం విశేషం. ► 2012లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఈ దేశాన్ని సందర్శించినప్పుడు బర్మా, మయన్మార్ రెండు పేర్లతో సంభోదించారు. మయన్మార్ అధ్యక్షులు దీన్ని చాలా అనుకూలంగా భావించారు. ఇప్పుడేంటి? సైనిక తిరుగుబాటుపై అమెరికా విమర్శలు కురిపిస్తోంది. అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్, అధ్యుడు జో బైడెన్లు దేశం యొక్క చట్టబద్దమైన పేరుని కావాలనే విస్మరిస్తున్నారని భావిస్తున్నారు. బర్మాలో ప్రజాస్వామ్య పురోగతి నేపథ్యంలో బర్మాపై దశాబ్ద కాలంగా అమెరికా ఆంక్షలను సడలించింది. అయితే తిరిగి ఆ ఆంక్షల కొనసాగింపు అవసరాన్ని అమెరికా పునరాలోచిస్తోంది. -
ప్రజలు ఎన్నుకున్నా పవర్లో లేరెందుకు!
జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తికి ఎంతటి ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల్లో ఘన విజయం సాధించినా మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. ఆ పవర్ లేనందు వల్లనే మయన్మార్ సైన్యం తాజాగా మరొకసారి దేశంలోని ‘ప్రజా పాలన’ను∙చేజిక్కించుకుంది. సూకీని నిర్బంధించింది. సూకీకి అప్పుడు 43 ఏళ్లు 8–8–88. ఆగస్టు 8, 1988. రంగూన్లో ప్రజలు ఎక్కడికక్కడ గుమికూడుతున్నారు. పిడికిళ్లు ఎక్కడివక్కడ బిగుసుకుంటున్నాయి. నలు దిక్కులా ప్రజాస్వామ్యం కోసం నినాదాలు! విశ్వవిద్యాలయాల విద్యార్థులు, బౌద్ధ భిక్షువులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, యువకులు, గృహిణులు, చిన్నపిల్లలు... ‘విప్లవం వర్థిల్లాలి’ అంటూ ఇళ్ల నుంచి, మఠాల నుంచి, పాఠశాలల నుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి పరుగులు తీస్తూ బయటికి వస్తున్నారు. ఉద్యమ ప్రకంపనలు దేశంలో ప్రతిచోటా ప్రతిధ్వనించడం మొదలైంది. వక్తలు ఆవేశంగా ప్రసంగిస్తున్నారు. బుద్ధుడిని, మార్క్స్‌ని కలిపి బర్మాను సోవియెట్ యూనియన్‌లా మార్చేందుకు ‘కమ్యూనిస్టు నియంత’ నెవిన్ చేసిన ప్రయోగాలు వికటించి బర్మాకు తిండి కరువైంది. చివరికి తిరుగుబాటు ఒక్కటే ప్రజలకు మిగిలిన తిండీబట్టా అయింది. ఆ తిరుగుబాటు కు నాయకత్వం వహించడానికి సూకీ బయటికి వచ్చారు. ఆ తర్వాత బర్మా సైనిక పాలకులు ఆమెను దాదాపు పదిహేనేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆరేళ్ల వయసులో (1951) సూకీ సూకీ వయసిప్పుడు 75 ఏళ్లు 2020 నవంబర్ 8. మయన్మార్ పార్లమెంటు ఎన్నికల్లో సూకీ పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (ఎన్.ఎల్.డి.) ఘన విజయం సాధించింది. సూకీ అధ్యక్షురాలు అవ్వాలి. కానీ కాలేరు! అయ్యేపనైతే అంతకుముందు 2015లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించినప్పుడే కావలసింది. ఆంగ్‌సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. అందుకు మిలటరీ ఒప్పుకోవాలి. మిలటరీ ఒప్పుకునే పనైతే మొన్న సోమవారం సూకీని, మయన్మార్ దేశ అధ్యక్షుడిని, మరికొంతమంది ఎన్.ఎల్.డి. నేతల్ని సైన్యం నిర్బంధించి, దేశాన్ని తన అధీనంలోకి తీసుకునే వరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మొన్నటి నవంబర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కనుక, ఏడాది ఆగి సక్రమ ఎన్నికలు జరిపిస్తామని సైన్యం అంటోంది. అంతవరకు సూకీ నిర్బంధంలోనే ఉండే అవకాశం అయితే ఉంది. 88కి ముందు సూకీ ఎక్కడున్నారు? పెద్ద చదువులు చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ దాదాపు నలభై ఏళ్ల పాటు విదేశాల్లో గడిపి, 1988లో మయన్మార్ వచ్చిన ఏడాదే ఉద్యమ శక్తిగా అవతరించారు సూకీ. ‘ఆ శక్తి నాకు నా తండ్రి, బర్మా ప్రజలు ఇచ్చిన శక్తి’ అని చెప్తారు సూకీ. ఆమె తండ్రి దేశభక్త విప్లవకాý‡ుడు. అసలు ఆంగ్ సాన్ సూ కీ అన్న పేరులోనే మూడు తరాల శక్తి ఉంది. ‘ఆంగ్ సాన్’ అన్నది ఆమె తండ్రి పేరు. ‘సూ’ అన్నది తాతగారి (నాన్న నాన్న) పేరు. ‘కీ’ అన్నది అమ్మ పేరు. సూకీ రంగూన్లో జన్మించారు. పాలిటిక్స్, ఫిలాసఫీ చదివారు. బ్రిటిష్ పౌరుడు మైఖేల్ ఆరిస్ ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు. తర్వాత మయన్మార్ వచ్చి ఉద్యమం బాట పట్టారు. ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఫలితంగా గృహ నిర్బంధానికి గురయ్యారు. సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. 2015 పార్లమెంటు ఎన్నికల్లో, తిరిగి మొన్నటి 2020 ఎన్నికల్లో భారీ మెజారిటీతో నెగ్గారు. తొలి ఎన్నికలు (2015) ఆమె సాధించిన నోబెల్ శాంతి బహుమతి కంటే గొప్ప విజయంగా చెబుతారు అక్కడి ప్రజలు. ఇక ఏం జరగబోతోంది? కుట్రపూరితంగా తిరుగుబాటు చేసి ఈ సోమవారం (ఫిబ్రవరి 1) మయన్మార్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్న సైన్యం ఏడాది లోపే తిరిగి పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతవరకు సూకీ సహా ముఖ్య నేతలందరూ నిర్బంధంలోనే ఉండొచ్చు. అయితే సూకీ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా బాగుండటం లేదని వార్తలు అందుతున్నాయి. 2003 లోనే.. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు.. ఆమెకు స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యకు అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత 2013లో పాదానికి, 2016 లో కంటికి శస్త్ర చికిత్సలు జరిగాయి. సూకీని నిరంతరం పర్యవేక్షిస్తుండే డాక్టర్ టిన్ మియో విన్ ఆమె మరీ 48 కిలోల బరువు మాత్రమే ఉన్నారని, రక్త పీడనం కూడా బాగా తక్కువగా ఉంది కనుక తేలికగా ఆమె బలహీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని అప్పట్లోనే జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతానికి సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు. సూకీ భర్త 1999 లో 53 ఏళ్ల వయసులో మరణించారు. కొడుకులిద్దరూ బ్రిటన్ నుంచి వచ్చి పోతుంటారు. -
మయన్మార్ సంక్షోభం : ఎంబసీ కీలక సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ : మయన్మార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి పరిణామాల దృష్ట్యా, భారతీయ పౌరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు మంగళవారం ఒకప్రకటన విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని వెల్లడించింది. (మయన్మార్‌లో ఎమర్జెన్సీ: బందీగా ఆంగ్ సాన్ సూకీ ) కాగా కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వంతో విభేదిస్తున్న సైన్యం నిన్న (సోమవారం) మరోసారి తిరుగుబాటు చేసింది. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ సహా ఆ పార్టీ కీలక నేతలను అరెస్ట్ చేసింది. ఏడాదిపాటు ఎమర్జెన్సీ విధించింది. దేశం తమ పాలనలోకి వచ్చినట్టు ఆర్మీ ప్రకటించింది. ఈ ఉదంతాన్ని భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాలు ఖండించిన సంగతి తెలిసిందే. (మిలటరీ గుప్పెట్లో మయన్మార్ ) -
మిలటరీ గుప్పెట్లో మయన్మార్
నేపిదా: స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే బర్మాలో ప్రజాస్వామ్యం కనిపించింది. అధిక కాలం మిలటరీ గుప్పెట్లోనే బర్మా గడిపింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మయన్మార్‌లో జరిగిన కీలక సంఘటనల సమాహారం పరిశీలిస్తే.. 1948, జనవరి 4: బర్మాకు బ్రిటీష్ వారినుంచి స్వాతంత్రం లభించింది. 1962: మిలటరీ నేత నీ విన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేపట్టారు. 1988: ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆంగ్‌సాన్ సూకీ విదేశీ ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చారు. దేశంలో జుంటా(మిలటరీ సమూహం)పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో జరిగిన నిరసనలపై మిలటరీ కాల్పులు జరపగా వందలాది మంది మరణించారు. 1989, జూలై: జుంటాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సూకీని హౌస్ అరెస్టు చేశారు. 1990, మే 27: ఎన్నికల్లో సూకీ పార్టీ ద నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ బంపర్ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు జుంటా నిరాకరించింది. 1991, అక్టోబర్: సూకీకి శాంతియుత పోరాటానికిగాను నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 2010, నవంబర్ 7: ఇరవై సంవత్సరాల తర్వాత జరిపిన ఎన్నికల్లో జుంటా అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి. 2010, నవంబర్ 13: దశాబ్దాల హౌస్ అరెస్టు అనంతరం సూకీ విడుదలయ్యారు. 2012: పార్లమెంట్ బైఎలక్షన్లో సూకీ విజయం సాధించారు. 2015, నవంబర్ 8: సూకీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కీలక పదవులను జుంటా తన చేతిలో ఉంచుకొని సూకీకి స్టేట్ కౌన్సిలర్ పదవి కట్టబెట్టింది. 2017, ఆగస్టు 25: రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. దీంతో వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు. 2019, డిసెంబర్ 11: జుంటాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో సూకీ తమ మిలటరీకి మద్దతుగా నిలిచారు. 2020, నవంబర్ 8: ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్ఎల్డీకి మరోమారు మెజార్టీ దక్కింది. 2021, జనవరి 29: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న జుంటా ఆరోపణలను బర్మా ఎన్నికల కమీషన్ తోసిపుచ్చింది. ఇందుకు సరైన ఆధారాల్లేవని తెలిపింది. 2021, ఫిబ్రవరి 1: దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది. ఓటింగ్ అక్రమాలపై సూకీ ప్రభుత్వ స్పందన పేలవంగా ఉందని, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని సూకీ పట్టించుకోలేదని ఆరోపించింది. మరోమారు సూకీని హౌస్ అరెస్టు చేస్తున్నట్లు తెలిపింది. -
మయన్మార్‌లో సైనిక పాలన
నేపిదా: మయన్మార్ పాలన మరోసారి సైనిక జుంటా చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశం ఏడాది పాటు సైన్యం ఆధీనంలో ఉంటుందని సైన్యం ఆధీనంలోని ‘మ్యావద్దీ’టీవీ సోమవారం ప్రకటించింది. దేశ కీలక నేత, కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్‌సాన్ సూకీ(75) సహా సీనియర్ రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడం, కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయలేకపోయినందునే అధికారం చేజిక్కించుకుంటున్నట్లు ‘మ్యావద్దీ’తెలిపింది. కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లయింగ్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారని తెలిపింది. దేశ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లినందున, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కమాండర్ ఇన్ చీఫ్‌కు బదిలీ అయ్యాయని పేర్కొంది. సోమవారం ఉదయం నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులతో పార్లమెంట్ సమావేశాలు మొదలు కావాల్సిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అధికారం చేజిక్కించుకున్న సైనిక నేత సోమవారం వేకువజాము నుంచే రాజధాని నేపిదాతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ టెలివిజన్ ప్రసారాలు, ఫోన్, ఇంటర్నెట్ వంటి సమాచార సంబంధాలను నిలిపివేశారు. దేశ అగ్రనేత, కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్‌సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మియింత్లను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఎన్ఎల్డీ ప్రతినిధి తెలిపారని ఆన్లైన్ మీడియా వెల్లడించింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, ప్రాంతీయ కేబినెట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధరంగాలకు చెందిన ప్రముఖులను కూడా సైనిక పాలకులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లయింగ్ సారథ్యంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మింట్ స్వే ఉంటారని మిలటరీ టీవీ తెలిపింది. ఏడాదిలో ఎన్నికలు జరిపి, గెలిచిన వారికి అధికారం అప్పగిస్తామని ప్రకటించింది. దీనిపై సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డీ) ఒక ప్రకటన విడుదల చేసింది. సైనిక జుంటా చర్య అక్రమం, రాజ్యాంగానికి, ప్రజల అభీష్టానికి వ్యతిరేకం. సైనిక తిరుగుబాటును, నియంతృత్వ పాలనను వ్యతిరేకించాలి’అని కోరింది. అయితే, ఈ పోస్టును ఎవరు పెట్టారో తెలియరాలేదు. ఎన్ఎల్డీ నేతలెవరూ ఫోన్‌కాల్స్‌కు సమాధానం ఇవ్వడం లేదు. దేశీయ విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. దేశంలోని అతిపెద్ద యాంగూన్ విమానాశ్రయాన్ని మూసివేశారని మయన్మార్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. ఖండించిన ప్రపంచ దేశాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దాదాపు ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలన కొనసాగడం, 1962 నుంచి అంతర్జాతీయంగా ఏకాకిగా మారడం..2015లో ఎన్నికలు జరిగి, ప్రజాస్వామ్యం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం దేశ భవిష్యత్తును మరోసారి ప్రశ్నార్థ్ధకంగా మార్చాయి. ప్రజాస్వామ్యం కోసం అనేక ఏళ్లపాటు గృహ నిర్బంధంలో గడిపిన, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీని సైనిక జుంటా అధికారం నుంచి తొలగించి తిరిగి నిర్బంధంలోకి పంపడంతో ప్రపంచ దేశాలు షాక్‌కు గురయ్యాయి. మయన్మార్‌లో సైన్యం రాజకీయ నేతలను నిర్బంధించడంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ స్పందించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులను సైనిక పాలకులు వెంటనే విడుదల చేయాలి. ప్రజాభీష్టానికి లోబడి వ్యవహరించాలి’అని కోరారు. మయన్మార్‌తో బలమైన ఆర్థిక సంబంధాలు నెరపుతున్న పొరుగు దేశం చైనా ఆచితూచి స్పందించింది. అక్కడ జరుగుతున్న పరిణామాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ పార్టీల నేతలు తమ మధ్య విభేదాలను రాజ్యాంగానికి లోబడి పరిష్కరించుకోవాలంది. మయన్మార్‌లో పరిణామాలు ప్రజాస్వామ్య సంస్కరణలకు తీవ్ర విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. కారణం ఏమిటి? గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీకి చెందిన ఎన్ఎల్డీ ఘన విజయం సాధించగా సైన్యం మద్దతు ఉన్న ప్రతిపక్ష యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఓటమి పాలు కావడం గమనార్హం. సైనిక తిరుగుబాటుకు అవకాశాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజమేనని దీంతో తేలిపోయింది. దేశ రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు.. అత్యవసర పరిస్థితుల్లో పాలనా బాధ్యతలను సైన్యం హస్తగతం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయని సైనిక నేతలు సమర్థించుకుంటున్నారు. అయితే, ఇది సైనిక తిరుగుబాటు కిందికే వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లో తాము మద్దతిచ్చిన రాజకీయ పార్టీలు ఓటమి పాలుకావడం జీర్ణించుకోలేకే సైనిక నేతలు ఈ క్లాజ్‌ను ఉపయోగించుకున్నారని చెబుతున్నారు. అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంతో సైనిక పాలన మద్దతుదారులు, ప్రతిపక్ష పార్టీల శ్రేణులు యాంగూన్‌లో ర్యాలీలు చేపట్టాయి. -
మయన్మార్‌లో ఎమర్జెన్సీ: బందీగా ఆంగ్ సాన్ సూకీ
సాక్షి,న్యూఢిల్లీ: మయన్మార్‌లో అనూహ్య పరిణామాలు ప్రకంపనలు పుట్టించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఒక సంవత్సరం పాటు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేశ సైన్యం తన సొంత టెలివిజన్ ఛానల్ ద్వారా ప్రకటించింది. గత 50 ఏళ్లుగా సైన్యం చేతిలోనే మగ్గి తేరుకున్న ఆ దేశంలో తిరిగి సైనిక తిరుగుబాటుతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీ ప్రకటించిన సైన్యం నేషనల్ లీగ్ ఫర్ డెమెక్రసీ నేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు దేశమంతటా ఇంటర్నెట్ సేవలను ఆర్మీ నిలిపివేసింది. దీంతో అనేక మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయడంలేదు. సోమవారం సైనిక చర్య అనంతరం అంగ్ సాన్ సూకీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశం తమ పాలనలోకి వచ్చేసిందని ఆర్మీ ప్రకటించింది. ఎన్నికల అనంతరం అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మిలటరీకి మధ్య ఉద్రిక్తతల రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున సైనికులు దాడి జరిపి అంగ్ సాన్ సూకీతో పాటు ఆ పార్టీ కి చెందిన ఇతర సీనియర్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ ప్రతినిధి వెల్లడించారు.. గత నవంబర్‌లో నిర్వహించిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇప్పటికే సూకీ ప్రభుత్వం ఖండించింది. మరోవైపు అయితే మిలటరీ చర్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రజాస్వామ్యం నెలకొల్పే దిశగా జరిగిన ప్రయత్నాలను అడ్డుకుంటే సహించేది లేదని ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని, ఎన్నికల ఫలితాలను గౌరవించాలని మయన్మార్ సైన్యాన్ని కోరింది. దేశంపై నియంత్రణ కోసం మిలటరీ మరోసారి ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆస్ట్రేలియా ప్రజలు ఎన్నుకున్న నేత అంగ్ సాన్ సూకీ సహా ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
చైనా దుశ్చర్య.. సరిహద్దులో 2000 కి.మీ గోడ
బీజింగ్: ప్రపంచ దేశాలన్ని చీదరించుకున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా డ్రాగన్ దేశం మాత్రం తాను అనుకున్నదే చేస్తుంది. చుట్టు పక్కల దేశాలను తనలో కలుపుకుని.. అతిపెద్ద దేశంగా అవతరించడమే దాని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం చైనా ఎన్ని కుయుక్తులయినా పన్నుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చైనా మరో దుశ్చర్యకు దిగింది. మయన్మార్ సరిహద్దులో ఏకంగా 2000 వేల కిలోమీటర్ల పొడవైన గోడ నిర్మాణాన్ని తలపెట్టింది. అక్రమంగా దేశంలో ప్రవేశించే వారిని నివారించడానికే ఈ గోడ నిర్మాణం చేపడుతన్నట్లు చైనా చెప్తుండగా.. మయన్మార్ ఆక్రమణే డ్రాగన్ ప్రధాన ఉద్దేశం అని అమెరికా అత్యున్నత టింక్టాక్ వెల్లడించింది. వివరాలు.. చైనా తన దక్షిణ సరిహద్దు మయన్మార్ వెంట 2000 కిలోమీటర్ల పొడవైన ముళ్ల గోడను నిర్మించే పనిలో ఉంది. నివేదికల ప్రకారం, మయన్మార్ సైన్యం తన సరిహద్దులో గోడ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండగా, చైనా తన వైఖరిని మార్చుకోవడం లేదని సమాచారం. (చదవండి: పరాక్రమంతో తిప్పికొట్టాం) మయన్మార్ సరిహద్దు వెంట చైనా చేపట్టిన గోడ నిర్మాణంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా చేసిన ప్రయత్నం దాని విస్తరణవాద ఆలోచనను ప్రతిబింబిస్తుందని, రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో సంఘర్షణ గణనీయంగా పెరుగుతుందని ఒక అమెరికన్ థింక్ ట్యాంక్ తెలిపింది. చైనా ప్రభుత్వం మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ (గ్లోబల్ టైమ్స్) ప్రకారం మయన్మార్ నుంచి అక్రమ చొరబాట్లను అరికట్టడం కోసమే ఈ గోడ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొంది. చైనా నైరుతి యునాన్ ప్రావిన్స్‌లో 9 మీటర్ల ఎత్తులో ముళ్ల తీగతో ఈ గోడను నిర్మిస్తుంది. అసమ్మతివాదులు చైనా నుంచి తప్పించుకోకుండా చూడటం కోసమే ఈ గోడ నిర్మాణం చేపట్టినట్లు ఆర్ఎఫ్ఏ నివేదిక వెల్లడించింది. (సర్జికల్ స్ట్రైక్ చేయండి: సంజయ్ రౌత్) చైనా చర్యలను మయన్మార్ సైన్యం నిరంతరం వ్యతిరేకిస్తోంది. తమ దేశ సరిహద్దు వెంబడి ముళ్ల తీగను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపింది. ఈ నేపథ్యంలో మయన్మార్ సైన్యం చైనా అధికారులకు ఒక లేఖ రాసింది. అంతేకాక ఈ లేఖలో 1961 సరిహద్దు ఒప్పందం గురించి ప్రస్తావించింది. దాని ప్రకారం సరిహద్దుకు 10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టికూడదని ఒప్పందంలో ఉందని మయన్మార్ లేఖలో గుర్తు చేసింది. -
వైరల్: పాములకు ఆశ్రయం కల్పిస్తోన్న బౌద్ధ సన్యాసి
వన్యప్రాణులను అక్రమంగా విక్రయించడంలో మయన్మార్ ప్రపంచంలోనే కేంద్ర బిందువుగా మారింది. స్థానికంగా ఉండే పాములను పట్టుకొని తరచుగా పొరుగు దేశాలైన చైనా, థాయ్‌లాండ్‌కు అక్రమంగా రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌లోని యాంగోన్లో ఓ బౌద్ధ సన్యాసి వివిధ రకాల పాములకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు ఓ ఆశ్రమాన్ని ఎంచుకొని కొన్ని వేల జాతుల పాములకు అక్కడ రక్షణ కల్పిస్తున్నారు. ఈ క్రమంలో పాములతో బౌద్ధ సన్యాసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. విలాతా(69) అనే బౌద్ధ సన్యాసి సీక్తా తుఖా టెటూ ఆశ్రమంలో కొండ చిలువ, త్రాచుపాము, వైపర్లు వంటి సరీసృపాలకు ఆశ్రయం కల్పించి వాటిని రక్షిస్తున్నారు. ఇలా పాములకు ఆశ్రయం కల్పించడం దాదాపు అయిదేళ్ల క్రితమే ప్రారంభమైంది. చదవండి: కుక్కపిల్ల కోసం కొండచిలువతో పోరాటం ఈ మేరకు బౌద్ధ సన్యాసి మాట్లాడుతూ.. పాములను వ్యాపారంగా భావించి అమ్మడం, చంపేయండం చూసి చలించిపోయిన తను వెంటనే వాటికి వ్యాపారుల నుంచి రక్షణ అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. స్థానికులుతోపాటు, ప్రభుత్వ సంస్థలు వివిధ చోట్ల బంధించిన పాములను సన్యాసి వద్దకు తీసుకువస్తారని ఆయన పేర్కొన్నారు. వాటి సంరక్షణ, బాగోగులు చూసి పాములు తిరిగి అడవికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు భావించే వరకు ఆశ్రయంలో ఉంచి వాటికి భ్రదత కల్పిస్తానని తెలిపారు. ఇటీవల విలాతా అనేక రకాల పాములను హ్లావ్గా నేషనల్ పార్క్‌లో విడిచి వచ్చినట్లు వెల్లడించారు. అలా పాములు స్వేచ్చగా అడవిలోకి వెళ్లడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే మళ్లీ వాటిని ప్రజలు పట్టుకొని అమ్మేందుకు ప్రయత్నిస్తే ఆందోళన చెందుతానని అన్నారు. కాగా సన్యాసి రక్షిస్తున్న పాములకు ఆహారం అందించేందుకు ఇవ్వడానికి సుమారు 300 డాలర్లు విరాళాలు అసవరం అవుతున్నాయని తెలిపారు. చదవండి: 37 ఏళ్లలో 37 సార్లు పాము కాటు! -
మళ్లీ మయన్మార్ సూకీదే
మయన్మార్‌లో ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో వరసగా రెండోసారి కూడా ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్ఎల్డీ) విజయం సాధించింది. పార్లమెంటులోని మొత్తం 664 స్థానాల్లో ప్రజలు ఎన్నుకోవడానికి కేటాయించినవి 476. అందులో ఎన్ఎల్డీ 346 గెల్చుకుందంటే సూకీపై ప్రజా విశ్వాసం చెక్కుచెదరలేదని అర్థం. అయిదు దశాబ్దాల సైనిక నియంతృత్వానికి ముగింపు పలుకుతూ అయిదేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో ఆమెకు ఇదే స్థాయిలో సీట్లు లభించాయి. ప్రభుత్వం ఏర్పర్చడానికి కావలసిన కనీస మెజారిటీ 322. పార్లమెంటులోని మిగిలిన స్థానాలకు సైనిక ప్రతినిధులుంటారు. సైన్యం వత్తాసువున్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ(యూఎస్డీపీ)కి 25 స్థానాలు మాత్రమే లభించాయి. ఈసారి దానికి కూడా ప్రభుత్వంలో చోటివ్వబోతున్నారు. పేరుకు మయన్మార్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ వున్నట్టు కనబడు తున్నా అది పూర్తిగా సైన్యంనీడలోనే మనుగడ సాగించాలి. ఏమాత్రం తేడా వున్నట్టు కనబడినా సైన్యం పంజా విసురుతుంది. ఎన్ఎల్డీ సాగించిన గత అయిదేళ్ల పాలన అంత సంతృప్తికరంగా ఏమీ లేదు. అందుకు ఆ ప్రభుత్వానికున్న పరిమితులే కారణం. అధ్యక్షుడు విన్ మింట్, ఉపాధ్యక్షుడు హెన్రీ వాన్ షియోలే చేతుల మీదుగా పాలన సాగినా వారు స్టేట్ కౌన్సెలర్‌గా వ్యవహరించే సూకీ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తున్నారు. ఆమె పూర్తి స్థాయిలో అధ్యక్షురాలైతే పాలనపై తమ పట్టు జారుతుందన్న భయంతో సైన్యం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. విదేశీయుల్ని పెళ్లాడినా, విదే శాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ 2008లో రూపొందిం చిన రాజ్యాంగంలో నిబంధన విధించారు. ఆ తర్వాతే 2015లో సైనిక పాలకులు ఎన్నికలకు సిద్ధపడ్డారు. అలాగే పార్లమెంటు మొదలుకొని కింది స్థాయి చట్టసభల వరకూ 75 శాతం స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగేలా, మిగిలిన 25 శాతం స్థానాల్లో సైన్యం నామినేట్ చేసేవారు సభ్యుల య్యేలా మరో నిబంధన పొందుపరిచారు. ఈ 25 శాతం స్థానాలకూ ఎన్నికలు జరగవు. రాజ్యాంగంలో మరో చిత్రమైన నిబంధన కూడా వుంది. హోంమంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, సరిహద్దు వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై పూర్తి పెత్తనం సైన్యానిదే. ఈ నిబంధనల చక్ర బంధంలో ఏ ప్రభుత్వమైనా సవ్యంగా పాలన సాగించగలదా? గత అయిదేళ్లుగా ఎన్ఎల్డీ ప్రభుత్వం ఒకరకంగా అయోమయావస్థను ఎదుర్కొంది. అయితే ఇందుకు సూకీని కూడా తప్పుబట్టాలి. పరిస్థితులు సక్రమంగా లేవనుకున్నప్పుడు వాటిని మార్చడానికి పోరాడాలి. అందరినీ కూడగట్టి విజయం సాధించాలి. వాస్తవానికి సూకీ నేపథ్యం అటువంటిదే. బ్రిటిష్ జాతీయుణ్ణి పెళ్లాడి బ్రిటన్‌లో స్థిరపడిన సూకీ అస్వస్థురాలైన తల్లిని చూసేందుకు 1988లో మయన్మార్ వెళ్లినప్పుడు అక్కడి నిర్బంధ పరిస్థితులను నేరుగా చూశారు. పౌరజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న సైనిక పాలకులపై పోరాడేందుకు సిద్ధపడ్డారు. ఆమె నాయకత్వంలో సాగిన ప్రజాందోళనకు తలొగ్గి 1990లో సైనిక పాలకులు తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. వారు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఆమె నాయకత్వంలోని ఎన్ఎల్డీ 80 శాతం స్థానాలు చేజిక్కించుకుంది. ఫలితాలు వెలువడిన వెంటనే సైనిక పాలకులు ఎన్నికలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమెను అరెస్టు చేశారు. మధ్యలో ఒకటి రెండుసార్లు విడుదల చేసినా ఆమెకు వస్తున్న మద్దతు చూసి బెంబేలెత్తి మళ్లీ మళ్లీ అరెస్టు చేసేవారు. అయిదేళ్ల జైలు జీవితం తర్వాత పదిహేనేళ్లపాటు ఆమె గృహ నిర్బంధంలో మగ్గారు. మధ్యలో అస్వస్థుడిగా వున్న తన భర్తను చూడటానికి బ్రిటన్ వెళ్తానన్నా ఆమెను అనుమతించలేదు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నదని వార్తలు వెలువడ్డాక అంతర్జాతీయంగా వచ్చిన వత్తిళ్ల పర్యవసానంగా తప్పనిసరై 2010లో ఆమెను విడుదల చేశారు. ఇలా సైన్యంపై ఇరవైయ్యేళ్లపాటు పోరాడి సైన్యం మెడలు వంచిన సూకీ... అధికారంలో కొచ్చాక మెతకగా వ్యవహరించడం మొదలెట్టారు. మైనారిటీలైన రోహింగ్యాలపై దారుణమైన హింసాకాండ అమలు చేస్తున్నా అదేమని ఖండించలేదు. వారి ఇళ్లు తగలబెట్టి, నరమేథం సాగిస్తున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, రోహింగ్యాలు ప్రాణభయంతో దేశం విడిచివెళ్లేలా చేస్తున్నా ఆమె మౌనం వహించారు. పైగా రోహింగ్యాలదే తప్పన్నట్టు మాట్లాడారు. రోహింగ్యాలు, ఇతర మైనారిటీ వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలైన రఖినే, కచిన్, కయిన్, బగోలను ‘ఘర్షణ ప్రాంతాలు’గా ముద్రేసి ఎన్నికలు నిలిపివేసినా ఆమె ప్రశ్నించలేదు. ఆ సంగతలావుంచి తాను అధ్య క్షురాలు కాకుండా అడ్డుపడుతున్న నిబంధనపైగానీ... కీలకమైన హోంశాఖ, రక్షణ శాఖ తదితరాలు సైన్యం చేతుల్లో ఉండటంపై గానీ ఆమె పోరాడ లేకపోయారు. ఒక్కమాటలో సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఒకనాటి సూకీలో ఇంత మార్పేమిటని ప్రపంచ ప్రజానీకం విస్తుపోయే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు. మయన్మార్ సైన్యం దుర్మార్గాల పర్యవసానంగా దేశం విడిచిన రోహింగ్యాల్లో మన దేశానికి 40,000 మంది, బంగ్లాదేశ్‌కు 10 లక్షలమంది వచ్చారు. ఇప్పటికీ దేశంలో 600 మంది రాజకీయ ఖైదీలున్నారు. పరస్పరం సంఘర్షించుకుంటున్న భిన్న తెగల మధ్య సఖ్యత తీసుకురావడానికి, వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎన్ఎల్డీ ప్రభుత్వం చెప్పుకోదగ్గ కృషి చేసింది. సైన్యం అకృత్యాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నదన్న విమర్శలున్నా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందాయి. అక్కడ మన దేశం పెట్టుబ డులు కూడా గణనీయంగానే వున్నాయి. యధాప్రకారం అక్కడ పాగావేయాలని చైనా చూస్తోంది. ఈ విషయంలో మనం అప్రమత్తంగా వుండక తప్పదు. -
నగరానికి రోహింగ్యాల రాక సాగుతోందిలా..
సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాలు అనేక మంది ఉంటున్నారు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నారు. ఇలానే నగరానికి చేరుకుని, స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని, నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు కార్డులు పొందిన మహ్మద్ ఫారూఖ్‌తో పాటు ఇతడికి సహకరించిన మీ సేవ కేంద్రం నిర్వాహకుడు ఖదీరుద్దీన్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఫారూఖ్ విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల “ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితుల నేపథ్యంలో అనేక మంది రోహింగ్యాలు ఆ దేశం విడిచిపెడుతున్నారు. వీటిలో అత్యధికులు భారత్‌కు వలస వస్తున్నారు. వీరిలో కొందరు శరణార్థులుగా ప్రకటించుకుని ఐక్యరాజ్య సమితి నుంచి గుర్తింపు కార్డులు పొంది ఆశ్రయం పొందుతున్నారు. మరికొందరు అక్రమ మార్గంలో వచ్చి చేరుతున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతూ, పశ్చిమ బెంగాల్ వాసులుగా చెప్పుకుంటున్నారు. ఇక్కడి మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో గుర్తింపుకార్డులు పొందుతూ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా మారుతున్నారు. ♦ మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. ♦ ఈ మార్గంలో ఎక్కడా తమ ఉనికి అక్కడి పోలీసులు, సాయుధ బలగాలకు తెలియకుండా చూసుకుంటున్నారు. దీనికోసం ప్రధానంగా తెల్లవారుజామున ప్రయాణం సాగిస్తున్నారు. ♦ మాంగ్డో నుంచి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న నఫ్ నది తీరానికి వస్తున్న వీరికి ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు దళారులు సహకరిస్తున్నారు. ♦ రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. ♦ ఆద్యంత అక్రమంగా సాగే ఈ ప్రయాణంలో అడుగడుగునా ఉండే దళారులు వీరికి సహకరిస్తున్నారు. దీనికోసం సమయం, అవసరం, అవకాశాలను బట్టి రేటుకట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ♦ టెక్నాఫ్ నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్‌కు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. ♦ అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుంటున్న రోహింగ్యాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని, అక్కడ నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో చేరుతున్నారు. ♦ ఇక్కడ మరోసారి రంగంలోకి దిగే దళారులు వీరికి సరిహద్దుల్లో ఉన్న పొలాల్లో దాచి ఉంచుతున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నదిని దాటిస్తూ భారత్‌లోకి పంపుతున్నారు. ♦ పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బీహార్, జమ్మూకాశ్మీర్‌లకు వెళ్తున్నారు. ♦ ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్ వాసులం అంటూ చెప్పుకుని తొలుత ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. ♦అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. -
డెంగ్యూ ఎంట్రీతో ప్రభుత్వం హెచ్చరికలు
నైపిడా(మయన్మార్): పులిమీద పుట్రలా కరోనాతో వ్యాప్తి నియంత్రణా చర్యల్లో మునిగిన మయన్మార్ ప్రభుత్వంపై డెంగీ రూపంలో అదనపు భారం పడింది. వర్షాకాలం మొదలవడంతో తాజాగా కరోనా వైరస్‌కు డెంగ్యూ తోడయ్యింది. దేశం వ్యాప్తంగా జూన్ 27 నాటికి డెంగ్యూతో 20 మరణాలు సంభవించినట్టు స్థానిక మీడియా తెలిపింది. మొత్తం 2862 మంది డెంగ్యూ బారినపడ్డారని వెల్లడించింది. దీంతో మయన్మార్ ఆరోగ్య, క్రీడా మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. దోమ కాటు బారినపడకుంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది. (చదవండి: లైవ్ న్యూస్: పన్ను ఊడినా.. పట్టు వదలని యాంకర్) ముఖ్యంగా దేశంలోని 20 పట్టణాల్లో 1069 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 12 మంది మరణించడంతో ఆయా పట్టణాలపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టిందని తెలిపింది. ఇక దేశంలో గతేడాది 24,345 మంది డెంగ్యూ బారినపడగా, వంద మంది మృతిచెందారు. డెంగ్యూ జ్వరం ఈడెస్ దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందన్నది తెలిసిందే. వార్షా కాలంలో డెంగ్యూ వ్యాప్తి సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఇదిలాఉండగా కరోనా విషయంలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్కడ ఇప్పటివరకు కేవలం 339 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆరుగురు మరణించారు. 271 మంది కోలుకున్నారు. 62 మంది వైరస్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (మయన్మార్‌లో గని వద్ద ఘోర ప్రమాదం) -
మయన్మార్‌లో గని వద్ద ఘోర ప్రమాదం
యాంగూన్: మయన్మార్‌లోని ఓ గనివద్ద మట్టి కుప్పలు విరిగిపడిన ఘటనలో 162 మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు. కచిన్ రాష్ట్రం హపకంట్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి (జేడ్) గని ఉంది. ఈ గని నుంచి భారీ యంత్రాలతో తవ్వి తీసిన మట్టిని ఆ పక్కనే పోస్తుంటారు. కార్మికులు అక్కడే తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ మట్టిగుట్ట కార్మికుల నివాసాలపై పడటంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 162 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలో 113 మంది మృత్యువాత పడ్డారు. అక్రమంగా జరిగే జేడ్ గనుల తవ్వకాలతో మాజీ సైనిక పాలకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
కొండచరియలు విరిగిపడి 50 మంది మృతి
మయన్మార్ : మయన్మార్ : ఉత్తర మయన్మార్‌లోని జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 113 మంది మరణించారు. కాచిన్ రాష్ట్రంలోని జాడే-రిచ్ హపకాంత్ ప్రాంతంలో రాళ్ళు సేకరిస్తున్నప్పుడు భారీ వర్షం కారణంగా గురువారం కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వీరిలో మైనర్లు ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మట్టిదిబ్బలో చాలా మంది చిక్కుకుపోయారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అగ్నిమాపక విభాగం ఓ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ప్రమాద సమయంలో 38 ఏళ్ల మౌంగ్ ఖాన్ అనే వ్యక్తి రన్.. రన్ అంటూ అరుస్తూ మిగిలిన వాళ్లని అప్రమత్తం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ అతను అక్కడే మట్టిదిబ్బల్లో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన వీడియో ఫుటేజీలో రికార్డు అయ్యింది. (హెచ్1 బీ వీసాదారులకు బిడెన్ తీపి కబురు ) హప్‌కాంత్ గనులలో ఇటీవలి వరుసగా కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయతే గత ఐదేళ్లనుంచి జరిగిన ప్రమాదాల్లో ఇది అత్యధికం. 21015లో కూడా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలను మూసివేయాలని పలువురు డిమాండ్ చేశారు. అప్పట్లో తాత్కాలికంగా ఇది మూతపడ్డా వెంటనే మళ్లీ పరిశ్రమలు తెరుచుకున్నాయి. పేదరికాన్ని అడ్డుపెట్టుకొని కొందరు మైనర్లను పనిలో పెడతారని స్థానికులు పేర్కొన్నారు. ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయినా, అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడి మీడియా నివేదించింది. ఈ ప్రాంతంలో మైనింగ్ అమ్మకాలు జోరుగా సాగుతాయని ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2016-17లో మయన్మార్‌లో అత్యధికంగా 671 మిలియన్ యూరోలు (750.04 మిలియన్ డాలర్లు) వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. (కరోనా : వ్యాక్సిన్ అవసరం ఉండకపోవచ్చు ) -
వంటలతో అదరగొడుతున్న చిన్నారి
-
వయసు ఎనిమిదేళ్లు కానీ వంటలో దిట్ట
మయన్మార్: మో మైంట్ మే థు ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఈ ఎనిమిదేళ్ల చిన్నారి పేరు ఇప్పుడు ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. కరోనా కారణంగా ప్రపంచంలో చాలా దేశాలు లాక్డౌన్ విధించడంతో అందరూ దాదాపు ఇంటికే పరిమితమయిపోయారు. ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది తమలో ఉన్న టాలెంట్ ఏంటా అని వెతికి మరీ పదునుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ చిన్నారి కూడా ఎనిమిదేళ్ల లేత ప్రాయంలోనే వంటకాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. (కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు) రొయ్యల కూర, కప్ప ఫ్రై, పోర్క్, టమాటాతో చేపల కూర ఇలా నోరూరించే రకరకాల కూరలు చేస్తూ అందరిని మంత్రముగ్థుల్ని చేస్తోంది. ఈ పాప రొయ్యల కూర చేసిన వీడియోను ఆమె తల్లి ఏప్రిల్‌లో ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ‘లిటిల్ చెఫ్’ పేరుతో ఆన్లైన్లో పాపులర్ అయిపోయింది. ఈ విషయంపై మో మైంట్ మే థు మాట్లాడుతూ... ‘నాకు వంటచేయడం అంటే చాలా ఇష్టం’ అని తెలిపింది. ఇంకా తను కెరీర్‌ను కూడా ఆ దిశగానే ఎంచుకోవాలనుకుంటున్నట్లు కూడా తెలిపింది. (పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది) ఈ పాప చేసిన ఒక వీడియోని 2,00,000 మంది వీక్షించారు. ఈ వీడియోలో మో మైంట్ మే థు మయన్మార్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ మోహింగ్యా, బాయిల్డ్ కాట్ ఫిష్ ను తయారు చేసింది. ఇప్పుడు ఈ పాప చేసిన వంటకాల్ని 10,000క్యాత్లకు (7.20 డాలర్ల)కు విక్రయిస్తున్నారు. దీని గురించి ఆమె తల్లి హనీచో మాట్లాడుతూ... ప్రతి రోజు మో మైంట్ థు చేసిన వంటకాలను తమ కుటుంబం డెలివరీ చేస్తోందని తెలిపారు. అన్ని జాగ్రత్తలతో ఈ వంటకాలు చేస్తోన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మో మైంట్ మే థు తనకంటూ ప్రత్యేకమైన ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ పేజీలో తన వంటకాలను పోస్ట్ చేస్తోంది. అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ ఆమె వీడియోలను చూస్తుంటే తమని తాము మర్చిపోతున్నామని తెలిపారు. మో మైంట్ మే థు ఆన్లైన్లో కుకింగ్ క్లాస్‌లు కూడా చెబుతోంది. -
స్వేచ్ఛ కోసం బందీ అయిన యోధురాలు!
మయన్మార్ నాయకురాలు, ప్రస్తుత స్టేట్ కౌన్సెలర్ (ప్రధాని పదవికి సమానమైన హోదా) ఆంగ్‌సాన్ సూకీని ఏనాటికీ దేశాధ్యక్షురాలు కానివ్వకుండా అక్కడి విపక్షాలు జాగ్రత్త పడుతున్నాయి. ఆమెకు దేశాధ్యక్షురాలు అయ్యే అవకాశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన బుధవారం నాటి తాజా రాజ్యాంగ సవరణ బిల్లుకు సైతం మయన్మార్ పార్లమెంటులోని మెజారిటీ సభ్యుల ఆమోదం లభించలేదు. మయన్మార్ స్వేచ్ఛకోసం బందీ అయిన యోధురాలు ఆంగ్ సాన్ సూకీ. 1989 జూలై 20 నుంచి 2010 నవంబర్ 13 వరకు ఇరవయ్యొక్కేళ్ల కాలంలో మధ్య మధ్య స్వల్ప విరామాలతో దాదాపు 15 ఏళ్ల పాటు బర్మా సైనిక పాలకుల నిర్బంధంలో గడిపారు. నిర్బంధం నుంచి సూకీ విడుదలయ్యాక మయన్మార్‌లో జరిగిన ఒక కీలక పరిణామం... ఉప ఎన్నికలు. సూకీ విడుదలవడానికి సరిగ్గా ఆరు రోజుల ముందు 2010లో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తర్వాత్తర్వాత ఏర్పడ్డ ఖాళీల భర్తీకి ఈ ఉపఎన్నికలు అవసరమయ్యాయి. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో సూకీ పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (ఎన్.ఎల్.డి.) పాల్గొనేందుకు వీలు లేకపోవడంతో ఉప ఎన్నికలకు ఎన్.ఎల్.డి. సిద్ధమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సూకీ... కాము టౌన్షిప్ నియోజకవర్గం నుంచి దిగువసభకు పోటీ చేశారు. అధికార ‘యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ అభ్యర్థిపై మంచి మెజారిటీతో గెలిచారు. ఈ ఒక్క సీటే కాదు, ఖాళీ అయిన అన్ని సీట్లను దాదాపుగా ఎన్.ఎల్.డి.నే గెలుచుకుంది. ఉప ఎన్నికల ప్రచారంలో సూకీ ప్రధానంగా అవినీతి, నిరుద్యోగ నిర్మూలన అనే అంశాలపైనే దృష్టి సారించారు. అలాగే ‘2008 రాజ్యాంగం’ లోని లోపాలను సవరించి, సంస్కరించడం ద్వారా మయన్మార్‌లో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు, స్వయంప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ ఏర్పాటుకు ఎన్.ఎల్.డి. కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. పర్యవసానమే సూకీ ఘన విజయం. ఫలితాలు వెల్లడవగానే ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తరమెరికా, దక్షిణమెరికా, ఇజ్రాయిల్, జపాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియాల నుంచి సూకీకి అభినందలను వెల్లువెత్తాయి. ‘‘మయన్మార్‌కి మంచి భవిష్యత్తు ఉంది. అది మీ వల్లే సాధ్యమౌతుంది’’ కొందరు దేశాధినేతలు సూకీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి 2015 ఎన్నికల్లోనూ సూకీ ఘన విజయం సాధించారు. ఈ ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఆంగ్‌సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. ఆ సవరణ తెచ్చేందుకే బుధవారం పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడితే.. రెండింట మూడొంతుల మద్దతు లభించక అదే ఆమోదం పొందలేదు. సూకీ భర్త, ఇద్దరు కొడుకులు బ్రిటన్ జాతీయులు. ఆమె భర్త 1999లో చనిపోయారు. -
రోహింగ్యాలు: జాంబియా బాటలో మాల్దీవులు..
మాలే/మాల్దీవులు: మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అమల్ క్లూనీ రోహింగ్యాల తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు వినిపించనున్నారు. రోహింగ్యాలకు అండగా నిలిచిన మాల్దీవులు ప్రభుత్వం ఈ మేరకు అమల్ క్లూనీని సంప్రదించినట్లు పేర్కొంది. మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలు తమ దేశ పౌరులు కాదని, వారంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన తెగ అంటూ ఆ దేశం వారికి పౌరసత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానికంగా రోహింగ్యాలపై దాడులు జరిగాయి. ఈ క్రమంలో రోహింగ్యాలు వలసబాట పట్టి... తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. రోహింగ్యాలకు మద్దతుగా... పశ్చిమాఫ్రికా దేశం జాంబియా గతేడాది నవంబరులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మయన్మార్‌లో జరుగుతున్న ఊచకోతను ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సిందిగా కోర్టు మయన్మార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.(భారత్ మా మాతృదేశం అవుతుందనుకున్నాం : రోహింగ్యాలు) ఈ క్రమంలో తాజాగా మాల్దీవులు సైతం మయన్మార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఐసీజేలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయం గురించి మాల్దీవులు విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ మాట్లాడుతూ... ‘‘ రోహింగ్యా ప్రజల పట్ల జరుగుతున్న అకృత్యాలకు మయన్మార్ జవాబుదారీగా ఉండాలి. రోహింగ్యాలకు రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవులు మద్దతు తెలుపుతోంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ 14వ సదస్సులో... ఈ మేరకు నిర్ణయం తీసుకుంది’’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమల్ క్లూనీని తమ న్యాయవాదిగా నియమించుకున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయంపై స్పందించిన అమల్ క్లూనీ.. ‘‘అంతర్జాతీయ న్యాయస్థానంలో మాల్దీవులుకు ప్రాతినిథ్యం వహించాలని నన్ను సంప్రదించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. రోహింగ్యాల పట్ల మయన్మార్ వ్యవహరించిన తీరుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. రోహింగ్యా బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను’’ అని పేర్కొన్నారు. కాగా అమల్ క్లూనీ గతంలో మాల్దీవులు మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ తరఫున వాదించి.. గెలిచారు. ఆయనకు అన్యాయంగా జైలు శిక్ష విధించారని అంతర్జాతీయ న్యాయస్థానంలో నిరూపించారు. కాగా మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్(32), కా సో ఓ(28)లకు యంగూన్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించగా.. వారికి అమల్ క్లూనీ అండగా నిలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నదియా మురాద్ తరఫున కూడా అమల్ క్లూనీ వాదించారు.(‘ఆ జర్నలిస్టులకు క్షమాభిక్ష పెట్టాలి’) -
యుద్ధనేరాల విచారణకు ఐరాస నిధులు
ఐక్యరాజ్య సమితి: సిరియా, మయన్మార్‌లలో జరిగిన యుద్ధ నేరాల విచారణ కోసం ఐక్యరాజ్య సమితి తన బడ్జెట్లో నిధులు కేటాయించింది. 2020 సంవత్సరానికి గాను ఐరాస సర్వ ప్రతినిధి సభ శుక్రవారం 307 కోట్ల డాలర్లను కేటాయించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే బడ్జెట్ స్వల్పంగా పెరిగింది. 2019లో 290 కోట్ల డాలర్ల బడ్జెట్ ఉండేది. ఐక్యరాజ్య సమితి సచివాలయానికి అదనపు బాధ్యతలు అప్పగించడం, ద్రవ్యోల్బణం, డాలర్ మారకం విలువలో తేడాల కారణంగా బడ్జెట్‌ను పెంచినట్టు యూఎన్ దౌత్యవేత్తలు వెల్లడించారు. యెమన్‌లో పరిశీలకుల బృందం, హైతిలో రాజకీయ బృందాల ఏర్పాటు, సిరియా అంతర్యుద్ధం, మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన దాడులకు సంబంధించిన నేరాలపై విచారణకు ఈ బడ్జెట్లో నిధుల్ని వినియోగించనున్నారు. ఇలా యుద్ధ నేరాల విచారణకు ఐక్యరాజ్య సమితి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. గతంలో యూఎన్ స్వచ్ఛందంగా ఈ నేరాల విచారణకు ఆర్థిక సాయాన్ని అందించేది. జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన కోసం 600 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రకటించింది. ఇప్పుడు కొత్త సంవత్సరం వేళ ప్రత్యేకంగా మరో బడ్జెట్‌ను ప్రకటించింది. కొత్త సైబర్ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు అధికమవుతుండడంతో వాటిని నిరోధించడానికి ఒక కొత్త అంతర్జాతీయ ఒప్పందాన్ని ఐరాస రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని శుక్రవారం ఐరాస సర్వ ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని యూరోపియన్ యూనియన్, అమెరికా, మరికొన్ని దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూఎన్‌లో ఈ తీర్మానం 79–60 ఓట్ల తేడాతో గట్టెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన నిపుణులతో ఒక కమిటీ వేసి సైబర్ నేరాలు నిరోధించడానికి కసరత్తు జరుగుతుంది.