
మయాన్మార్‌లోని రామ్రీ దీవిలో అడుగుపెట్టాలంటే ఇప్పటికీ జనాలకు హడలే! ఆ దీవిలో ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా మొసళ్లు సంచరిస్తుంటాయి. ఉప్పునీటిలో బతికే ఈ మొసళ్లకు చిక్కితే వాటికి పలారమైపోవడం తప్ప బతికి బట్టకట్టడం అసాధ్యం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీవుల్లో ఒకటిగా పేరుమోసిన ఈ రామ్రీ దీవికి ఒక చరిత్ర ఉంది.
రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఇక్కడ మోహరించిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ బలగాలపై దాడి చేసేందుకు జపాన్ సైన్యం ఈ దీవికి చేరుకునే ప్రయత్నం చేసినప్పుడు వందలాది మంది జపాన్ సైనికులు ఈ దీవిలోని మొసళ్లకు పలారమైపోయారు. యుద్ధ సమయంలో అత్యధికులు జంతు దాడిలో మరణించిన సంఘటనగా ఇది గిన్నిస్‌బుక్‌లో చోటు పొందింది.
(చదవండి: అక్కడ అడుగుపెడితే ప్రమాదమే!)
Comments
Please login to add a commentAdd a comment