
‘ఇనుములో ఓ హృదయం మొలిచెనే..’ అన్నట్లు ఇప్పుడు ఇనుములో ఓ మనిషే మెులిచాడు. అమెరికన్ కంపెనీ ‘క్లోన్ రోబోటిక్స్’ మనిషిని పోలిన శరీరంతో ‘ప్రోటోక్లోన్’ పేరుతో రోబోను రూపొందించింది. ఇతర రోబోల మాదిరి కాకుండా ఇది వెయ్యి కృత్రిమ కండరాలు, 206 ఎముకలు, చర్మం, కీళ్లు వంటి ఇతర భాగాలతో నిజమైన మానవుడిలా పనిచేసే శరీరంతో ఉంటుంది.
ఇందులో అమర్చిన 500పైగా సెన్సర్ల సాయంతో ఈ రోబో శ్వాస తీసుకోటం, వదలడం, చెమటలు పట్టడం, వణకడం, భయపడటం, నవ్వడం, ఏడ్వటం ఇలా మరెన్నో భావాలను వ్యక్తపరచగలదు.
(చదవండి: ఏకంగా ఆన్‌లైన్‌లో మట్టిని అమ్మేస్తున్నారు..! ఎందుకో తెలుసా..?)