ఇటీవల మనుషులు మహా అయితే 60 లేదా 70కి మించి బతకడం కష్టంగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చామంది 30 లేదా 40కే టపా కట్టేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సుదీర్థకాలం జీవించి ఔరా అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ వృద్ధ మహిళ కూడా. వయసు పరంగా సెంచరీ కొట్టిన ఈ వృద్ధ మహిళ తన సుదీర్ఘకాల జీవిత రహస్యాన్ని షేర్ చేసుకుంది. ఆ వృద్ధురాలి ప్రకారం..సుదీర్థకాలం జీవించడం ఎలా అనే దాని గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
అమెరికాలో అత్యంత వృద్ధురాలు ఎలిజబెత్ ఫ్రాన్సిస్ ఇటీవల తన 115వ పుట్టిన రోజును జరుపుకుంది. ఆమె ముఖంతో సంతృప్తికరంగా జీవిస్తున్నానే ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు కనిపిస్తుంది. యూఎస్‌లో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు కూడా ఆమెనే. ఈ నేపథ్యంలో ఎలిజబెత్ తన సుదీర్ఘ ఆరోగ్య రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె సుదీర్ఘ ఆరోగ్య రహస్యం ఏంటంటే..
ఎలిజబెత్ చిన్న వయసులోనే తన తోడబుట్టిన వాళ్ల నుంచి విడిపోయి అత్త వద్ద పెరిగింది. చిన్నతనంలో కొద్దిపాటి సవాలును ఎదుర్కొన్న ఎలిజబెత్ పెద్ద కుటుంబాన్ని నిర్మించుకుని ఆనందకరంగా జీవించింది. ప్రస్తుతం ఆమె ముగ్గురు మనవళ్లు, ఐదుగురు మనవరాళ్లు, నలుగురు మునిమనవళ్లతో సంతోషంగా ఉంది. ఆమె సుదీర్ఘ జీవిత రహస్యానికి కారణం తన కుటుంబమే అంటోంది. తన కుటుంబ సభ్యుల పట్ల ఉన్న బలమైన బంధం, ప్రేమానురాగాలే ఇంత కాలం బతికేలా చేశాయని చెబుతోంది.
ఇక ఆమె దీర్ఘాయువుకి దోహదపడిన జీవనశైలి వద్దకు వస్తే..ఎలిజబెత్ డ్రైవింగ్ నేర్చుకోకపోవడంతో ఎక్కడికి వెళ్లిన నడుచుకునే వెళ్లేది. ఈ శారీరక శ్రమ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నివారించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. పైగా ఆమె ఆయుర్దాయాన్ని పెంచింది. ఇక రోజులో కాసేపే ఏకాంతంగా గడిపే అలవాటు మానసిక భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా చేసి మానసికంగా స్థైరంగా ఉండేలా చేసింది. ఒత్తిడిని ఎదుర్కొనే సామార్థ్యాన్ని పెంపొందడమే కాకుండా మెరుగైన సంబంధాలను ఏర్పరుచుకునేలా చేసింది.
అలాగే ఎలిజబెత్‌కు ఉన్న ఆశావాహ దృక్పథం ఆరోగ్యకరమైన జీవితానికి దోహదం చేసింది. అలా అని ఆమె జీవితం ఏమీ పూలబాట కాదు. చిన్నతనంలో తల్లిని కోల్పోయి మరోకరి వద్ద పెరగడం దగ్గర నుంచి ఒంటరి తల్లిగా తన పిల్లలను పెంచాల్సిన కష్టాలను కూడా ఫేస్ చేసింది. అయితే ఆమె కష్ట సమయంలో ధైర్యంగా ప్రతికూల పరిస్థితులతో పోరాడి తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేలా కృషి చేసింది.
ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు, సవాళ్లు బలంగా ఎదిగేందుకు, సుదీర్ఘకాలం జీవించేందుకు ఉపకరించింది. ఇక్కడ ఎలిజబెత్ జీవితం కాలానుగుణంగా వచ్చే కష్టాలు, కన్నీళ్లతో పోరాడుతూ.. మంచి ఆరోగ్యపు అలావాట్లతో సుదీర్ఘకాలం జీవించొచ్చని చాటి చెప్పింది. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ల కంటే కష్టాల కడలిని ఎదుర్కొని వచ్చే విజేతలకే ఎక్కువ ఆత్మబలం ఉంటుందని ఎలిజబెత్ గాథ చెబుతోంది.
(చదవండి: నాన్‌స్టిక్ పాన్‌తో పెరుగుతున్న టెఫ్లాన్ ఫ్లూ కేసులు!)
Comments
Please login to add a commentAdd a comment