భారీ కీటకం.. దాంతోనే వంటకం..! | Giant Sea Bug Species Discovered In Vietnam As Part Of Restaurant Dishes | Sakshi
Sakshi News home page

భారీ కీటకం.. దాంతోనే వంటకం..! ఎక్కడంటే..?

Published Sun, Mar 9 2025 11:51 AM | Last Updated on Sun, Mar 9 2025 11:51 AM

Giant Sea Bug Species Discovered In Vietnam As Part Of Restaurant Dishes

చిన్న బొద్దింకను చూస్తేనే చాలామంది భయపడుతుంటారు. అలాంటిది పెద్ద బొద్దింకను చూస్తే ఇక పరుగులే! కాని, ఫొటోలో పెద్దసైజు బొద్దింకలా కనిపిస్తున్నది కీటకమే గాని, వియత్నాం ప్రజలు మాత్రం దీంతో రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకుని ఆరగిస్తారు. 

దీని అతిపెద్ద ఆకారం, తలను చూసి, వియత్నాంలో అందరూ, దీనిని ‘స్టార్‌ వార్స్‌’ సినిమాల్లో విలన్‌ అయిన ‘డార్త్‌ వాడర్‌’గా పిలుచుకుంటారు. దాదాపు 30 నుంచి 35 సెంటీమీటర్లు పొడవు, ఒకటి నుంచి రెండు కిలోల బరువుతో ఉంటుంది ఈ కీటకం. 

వియత్నాం ఫుడ్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న దీనిని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ‘బాతినోమాస్‌’ జాతికి చెందిన జెయింట్‌ ఐసోపాడ్‌ అనే సముద్ర కీటకంగా నిర్ధారించారు. ఈ సముద్ర కీటకానికి సంబంధించిన మరో రెండు నమూనాలను పరిశోధకులు విశ్లేషణ కోసం సేకరించారు. మరిన్ని విషయాలను అధ్యయనం చేశాకనే వెల్లడించగలమని తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement