
యాంగాన్ : పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఏడుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 89 మంది ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన మయన్మార్‌లోని మాండలే అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానంలో సాంకేతికలోపంతో ముందు భాగంలోని టైరు తెరచుకోలేదు. దీంతో రన్ వేపై పైలట్ ఆ విమానాన్ని దింపుతున్న సమయంలో ముందు భాగం రోడ్డును తాకింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులతోపాటు సిబ్బందికి గాయాలు కాలేదు.
యూబీ 103 విమానంలో ఆదివారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ముందు భాగంలోని టైరు తెరుచుకోకపోవడంతో వెనకవైపున ఉండే టైర్ల సాయంతో మాత్రమే విమానాన్ని దించాల్సి వచ్చింది. పైలట్ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విమానాన్ని సురక్షితంగా దించారు’ అని ఓ అధికారి తెలిపారు.
#MNA (Embraer 190) #Yangon-#Mandalay this morning, landing at the #Mandalay airport - Nose Lansing Gear failure on landing. Flight Capt. has done the amazing job. #Myanmar pic.twitter.com/7dDzSIs13V
— Cape Diamond (@cape_diamond) May 12, 2019
Comments
Please login to add a commentAdd a comment