రొటీన్‌కి భిన్నంగా వెరైటీ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? లేక్ ఆఫ్ నో రిటర్న్‌కు వెళ్లండి. ఎందుకుంటే ఇదో రహస్యాల పుట్ట. మన దేశంలో ఉన్న మిస్టీరియస్ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. మీరిప్పటి వరకు చాలా సరస్సుల గురించి వినడం, చదవడం, చూడటం జరిగి ఉండవచ్చు. కానీ ఈ మిస్టీరియస్ సరస్సుకు వెళ్లినవారు మాత్రం తిరిగి రావడం ఇప్పటివరకూ జరగలేదు. ఇది కథలో సరస్సు కాదు. ఇలలోని సరస్సే! ఎక్కడుందో తెలుసా..
మనదేశానికి, మయన్మార్‌కు మధ్య సరిహద్దు ప్రాంతంలో అంటే అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ జిల్లాలో నవాంగ్ యాంగ్ సరస్సు ఉంది. దీనిని అందరూ మిస్టీరియస్ లేక్ అని పిలుస్తారు. అనేక సంఘటనల ఆధారంగా దానికాపేరు వచ్చింది. ప్రచారంలో ఉన్న కొన్ని కథనాలు ఏంటంటే..
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీస్ సైనికులతో ఉన్న ఒక విమానం ఈ ప్రదేశంలో అత్యవసర ల్యాండ్ అయ్యిందట (వాళ్లు దారి తప్పటం వల్ల). ఐతే చాలా అనూహ్య రీతిలో విమానంతో సహా అందరూ అదృశ్యమయ్యారట. ఒక అధ్యయనం ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్న జపాన్ సైనికులందరూ మలేరియా కారణంగానే మరణించి ఉంటారని పేర్కొంది.
చదవండి: Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..!
ఐతే ఈ సరస్సు చుట్టుపక్కల గ్రామస్తుల్లో మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఒక అతనికి ఈ సరస్సులో ఓ పెద్ద చేప దొరికింది. దీంతో అతను ఆ గ్రామంలోని అందరికీ విందు ఏర్పాటు చేశాడు. కానీ ఓ వృద్ధురాలు, ఆమె మనవరాలిని మాత్రం అతను విందుకు ఆహ్వానించలేదు. దీంతో సరస్సుకు కాపలా కాస్తున్న వ్యక్తి కోపోద్రిక్తుడై వారిద్దరినీ ఊరు విడిచి వెళ్లమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ మరుసటి రోజే ఊరంతా సరస్సులో మునిగిపోయిందట. అక్కడి గ్రామస్తుల్లో ఈ విధమైన జానపద కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ఐతే ఈ మిస్టీరియస్ సరస్సు రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు.
చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట!
ఈ విధంగా అనేక పురాణాలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యాటకాన్ని పెంచాలనే ఆశతో అక్కడి గ్రామస్తులు ఈ స్థానిక బెర్ముడా ట్రయాంగిల్‌పై రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారనే నానుడి కూడా ఉంది.
చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!!
Comments
Please login to add a commentAdd a comment