నైపిడా(మయన్మార్): పులిమీద పుట్రలా కరోనాతో వ్యాప్తి నియంత్రణా చర్యల్లో మునిగిన మయన్మార్ ప్రభుత్వంపై డెంగీ రూపంలో అదనపు భారం పడింది. వర్షాకాలం మొదలవడంతో తాజాగా కరోనా వైరస్‌కు డెంగ్యూ తోడయ్యింది. దేశం వ్యాప్తంగా జూన్ 27 నాటికి డెంగ్యూతో 20 మరణాలు సంభవించినట్టు స్థానిక మీడియా తెలిపింది. మొత్తం 2862 మంది డెంగ్యూ బారినపడ్డారని వెల్లడించింది. దీంతో మయన్మార్ ఆరోగ్య, క్రీడా మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. దోమ కాటు బారినపడకుంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.
(చదవండి: లైవ్ న్యూస్: పన్ను ఊడినా.. పట్టు వదలని యాంకర్)
ముఖ్యంగా దేశంలోని 20 పట్టణాల్లో 1069 డెంగ్యూ కేసులు నమోదు కాగా, 12 మంది మరణించడంతో ఆయా పట్టణాలపై ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టిందని తెలిపింది. ఇక దేశంలో గతేడాది 24,345 మంది డెంగ్యూ బారినపడగా, వంద మంది మృతిచెందారు. డెంగ్యూ జ్వరం ఈడెస్ దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందన్నది తెలిసిందే. వార్షా కాలంలో డెంగ్యూ వ్యాప్తి సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. ఇదిలాఉండగా కరోనా విషయంలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అక్కడ ఇప్పటివరకు కేవలం 339 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆరుగురు మరణించారు. 271 మంది కోలుకున్నారు. 62 మంది వైరస్ బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
(మయన్మార్‌లో గని వద్ద ఘోర ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment