బ్యాంకాక్: గతేడాది తిరుబాటు చేసిని ఆంగ్ సాన్ సూకీని గృహ నిర్బంధం నుంచి సైనిక నిర్మిత జైలు కాంపౌండ్‌లోకి తరలించినట్లు మయన్మార్ జుంటా అధికార ప్రతినిధి తెలిపారు. క్రిమినల్ చట్టాల ప్రకారం ఆంగ్ సాన్ సూకీని రాజధాని నైపిడావ్‌లోని జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచామని జుంటా అధికారి జా మిన్ తున్ పేర్కొన్నారు. ఐతే ఆమె తిరుబాటు చేసినప్పటి నుంచి నేపిడావ్‌లోని ఒక అజ్ఞాత ప్రదేశంలో తన కుక్కతో కలిసి గృహ నిర్బంధంలో ఉన్నారు.
ప్రస్తుతం ఆమెను కోర్టులో విచారణకు హజరుపరచడం కోసం ఈ ప్రాంతం నుంచి తరలించారు. పైగా ఆమెకి 150 ఏళ్లకు పైనే శిక్ష విధించారు. అంతేకాదు సూకీ తరుఫున న్యాయవాదులు మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించారు. జర్నలిస్టులు సైతం ఆమెతో మాట్లాడేందుకు వీల్లేదు. ఇంతకుముందు కూడా ఆమె మయాన్మార్‌లో అతిపెద్ద నగరమైన యాంగాన్‌లోని తన ఇంటిలోనే చాలాఏళ్లు గృహనిర్బంధంలో ఉంది. ఆమె అవినీతి, మిలటరీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు, కోవిడ్-19 ప్రోటోకాల్, టెలికమ్యూనికేషన్స్ చట్టం ఉల్లంఘన తదితర ఆరోపణలతో ఆమెను దోషిగా నిర్థారించారు. పైగా కోర్టు సూకీకి ఇప్పటివరకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
(చదవండి: రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వద్దని హెచ్చరించిన యూఎన్)
Comments
Please login to add a commentAdd a comment