prision
-
ఖైదీలు వండే కమ్మని బిర్యానీ
ఉత్తర కేరళ రాష్ట్రంలోని కన్నూర్ బిర్యానీ వంటకానికి హాట్‌స్పాట్‌గా ఉంది. ఇక్కడ ప్రసిద్ధ వయనాదన్ కైమా లేదా జీరకసాల అన్నం, మలబారి బిర్యానీని వివిద కాంబినేషన్లో వండుతారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా కేవలం రెండు గంటల ప్రయాణంలో కన్నూర్‌కి చేరుకోవచ్చు. ఇది కేరళలోని అత్యంత మనోహరమైన పట్టణాలలో ఒకటిగా పేరుగాంచింది. 2010లో కేరళ ప్రభుత్వం చొరవతో తిరువనంతపురం జైలులో ఖైదీలతో వంటకాలు చేయించడం \ప్రారంభమయ్యింది. ఆ ఖైదీలు చేసిన వంటకాలను ఫ్రీడం కోసం ఆహారంగా అభివర్ణించారు. జైళ్లను దిద్దుబాటు కేంద్రాలుగా మర్చాలనే ఆలోచనకు అంకురారప్పణ చేసి, వారికి వండటంలో శిక్షణ ఇచ్చారు అదికారులు. అలాగే వాళ్లు తయారు చేసిన వంటకాలన్నీ సాధారణ ప్రజలకు విక్రయిస్తారు. అందుకు గానూ ఖైదీలకు పరిహారం కూడా చెల్లిస్తారు. అంతేగాదు జైలుని ఆధునికరించి, ఖైదీలకు చపాతీ, వెజిటబుల్ కర్రీ, చికెన్ కర్రీ, ఎగ్‌కర్రి తదితర వంటకాలను కూడా నేర్పించారు. సరిగ్గా చెప్పాలంటే ఈ వినూత్న కార్యక్రమం 2012లో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ కిచెన్ జస్ట్ ఐదేళ్లలోనే రూ. 8.5 కోట్లకు పైగా ఆర్జించిందని ప్రభుత్వం ప్రకటించింది. ఖైదీలు చేసిన ప్రధాన వంటకాల్లో ఈ బిర్యానీ కూడా ఒకటి.(చదవండి: ప్రేమంటే ఇదేరా: సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!) -
ఇదేం వింత చట్టం! భార్య పుట్టినరోజు మర్చిపోవడమే నేరమా..!
పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన రోజు. ఎంతలా అంటే వాళ్ళకి ఉన్నంతలో బాగా జరుపుకోవాలి అనుకుంటారు. అయితే భార్యలకు బయటవాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ కంటే మనసుకి నచ్చిన వాళ్ళు ఇచ్చే కామెంట్ ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. తాను పుట్టినరోజుని తన భర్త గుర్తుపెట్టుకుని విష్ చేస్తే వచ్చే ఆనందమే వేరు. ఎవరు ఎన్ని ఖరీదైన బహుమతులు ఇచ్చిన భర్త ఇచ్చే బహుమతి కోసం ఎదురు చూస్తుంటుంది. భార్య ఎప్పుడు భర్త ఇచ్చే బహుమతిలో ఖరీదు చూడదు. అందులోని ప్రేమనే చూస్తుంది. అయితే భార్యలకి ఉన్న అదృష్టం ప్రతేకత ఉన్న రోజులని గుర్తు పెట్టుకోవడం. అందుకే భార్యలు భర్త పుట్టినరోజుని, పిల్లల పుట్టిన రోజుని, పెళ్లి రోజుని, అనుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళ పుట్టినరోజులు కూడా గుర్తుపెట్టుకోగలదు. కానీ భర్త తన భార్య పుట్టిన రోజుని గుర్తు పెట్టుకోవాలి అనుకున్నా.. పని హడావిడిలో మరిచిపోతుంటాడు.ఇలా భార్య పుటిన రోజుని మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది అని మీకు తెలుసా..? అది కూడా ఏకంగా ఐదేళ్లు. అవును ఇది నిజం. పసిఫిక్ మహాసముద్రంలోని పాలినేషియన్ ప్రాంతంలో సమోవా అనే అందమైన ద్వీపం ఉంది. ఇక్కడ ఎవరైన పెళ్ళైన వ్యక్తి తన భార్య పుట్టిన రోజుని పొరపాటున మర్చిపోతే జైలు శిక్ష పడుతుంది. తన భర్త తన పుట్టిన రోజుని మర్చిపోయారని భార్య గనుక ఫిర్యాదు చేస్తే.. తప్పనిసరిగా శిక్ష పడుతుంది. ఇక్కడ భార్య పుట్టిన రోజును మరిచిపోతే మాత్రం.. తప్పకుడా అది నేరం కింద లెక్క.ఇక్కడి రూల్ ప్రకారం.. అనుకుని మరిచిపోయాడా.. లేదంటే.. అనుకోకుండా మరిచిపోయాడా అనేది చూడరు. మరిచిపోయాడు అంతే.. దీనితో న్యాయపరమైన చిక్కుల్లో పడతాడు భర్త. అయితే ఈ చట్టంలో కాస్త వెసులుబాటు ఉంది. మెుదటిసారి భార్య పుట్టినరోజును మరిచిపోతే.. కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు. మరోసారి అలా చేయోద్దని.. పోలీసులు హెచ్చరిస్తారు. మళ్లీ అదే రిపీట్ చేశారనుకో.. తప్పు అవుతుంది. జైలు రూపంలో శిక్ష పడుతుంది. మన దేశంలో ఇలాంటి చట్టాలు అమలులో ఉంటే.. చాలా మంది భర్తలు జైలుకే వెళ్తారేమో.(చదవండి: పచ్చి జామకాయ కంటే కాల్చిందే బెటర్! ఎన్ని ప్రయోజనాలంటే..!) -
రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు
ఇంతవరకు మనం ఎంతోమంది మట్టిలో మాణక్యలాంటి సింగర్ల గురించి విన్నాం. అదీ కూడా పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన సాధారణ మహిళలు, పురుషులు సింగర్ మాదిరి అద్భుతంగా పాడి ప్రశంసలందుకున్నారు. వారిలో కొందరైతే సినిమాల్లో పాడే అవకాశాన్ని కూడా కొట్టేశారు కూడా. అవన్నీ ఒకతైతే ఇక్కడొక ఖైదీ ఏకంగా ఒక పాటతో స్థార్ సింగర్‌గా పేరు సంపాదించేసుకున్నాడు. పైగా అవకాశాలు కూడా వెల్లువలా వచ్చేయడమే కాకుండా ఆ వ్యక్తిని విడుదలయ్యేలా చేస్తామని ఓ ఎమ్మెల్యే చెప్పడం విశేషం. వివారాల్లోకెళ్తే...కంగయ్య కుమార్ అనే వ్యక్తి బిహార్ జైలులో ఉండే ఖైదీ. ఐతే ఒక రోజు భోజ్‌పురికి సంబంధించిన ఫేమస్ పాట పాడాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక్కసారిగా నెటిజన్లంతా అతడి వాయిస్‌కి అతను పాడిన విధానానికి ఫిదా అయ్యారు. దీంతో అతన్ని బయటకు తీసుకువచ్చి పాటలు పాడే అవకాశం ఇవ్వాలనుకున్నారు బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అంకిత్ తివారీ. అతన్ని టాలెంట్ నాలుగు గోడలకే పరిమితకాకుండా అతన్ని బయట వచ్చేలా చట్టపరమైన సాయం అందించి పునరావాసం కల్పించాలనుకున్నారు ఒక యూపీ ఎమ్మెల్యే. ఏది ఏమైతే ఒక పాటతో కంగయ్య అందరీ మనసులను దోచుకున్నాడు. ఏకంగా విడుదలయ్యే అవకాశం తోపాటు పాటలు పాడే అవకాశం ఇచ్చేందుకు బాలీవుడ్ ప్రముఖ గాయకులు ముందకు వచ్చారు. వాస్తవానికి కంగయ్య బిహార్‌లోని కైమూర్ జిల్లా నివాసి. అతను పని కోసం ఉత్తప్రదేశ్ సరిహద్దు జిల్లాకు వెళ్లి మద్యం సేవించి వచ్చాడు. ఐతే బిహార్‌లో మద్యం చట్టాలను కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిహార్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడంతో అతను జైల్లో ఉన్నాడు. కంగయ్య జైల్లో దరోగజీ హో... సోచి-సోచి జియా హమ్రో కహే గబ్రతా..." అనే ప్రసిద్ధ భోజ్‌పురి పాటను పాడాడు. వాస్తవానికి కంగయ్య లాకప్‌లో ఉండగా ఎవరో ఒక వ్యక్తి ఆపాటను తప్పుగా పాడటంతో..అది కరెక్ట్ కాదని చెప్పేందుకు పాడాడు. అది సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకోవడంతో అద్భుతమైన అవకాశాన్ని కొట్టేశాడు. TV के पूर्व सहयोगी @cmohan_pat के माध्यम से संपर्क करने पर पता चला कि ये कैमूर का गरीब युवक कन्हैया है,नशे में मिलने पर बिहार पुलिस ने इसे जेल भेजा,इनकी कानूनी मदद के उपरांत इन्हें सुधारने का प्रयास होगा,साथ ही UP के मशहूर त्रिनेत्र स्टूडियो में गाने का अवसर भी उपलब्ध कराया जाएगा pic.twitter.com/Id8HrJV2HZ — Dr. Shalabh Mani Tripathi (@shalabhmani) January 8, 2023 (చదవండి: ఎయిర్ ఇండియా ఘటన: పశ్చాత్తాపం లేకుండా ఆరోపణలా!) -
ఆంగ్‌సాన్ సూకీకి గృహ నిర్బంధం నుంచి జైలు నిర్బంధం
బ్యాంకాక్: గతేడాది తిరుబాటు చేసిని ఆంగ్ సాన్ సూకీని గృహ నిర్బంధం నుంచి సైనిక నిర్మిత జైలు కాంపౌండ్‌లోకి తరలించినట్లు మయన్మార్ జుంటా అధికార ప్రతినిధి తెలిపారు. క్రిమినల్ చట్టాల ప్రకారం ఆంగ్ సాన్ సూకీని రాజధాని నైపిడావ్లోని జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచామని జుంటా అధికారి జా మిన్ తున్ పేర్కొన్నారు. ఐతే ఆమె తిరుబాటు చేసినప్పటి నుంచి నేపిడావ్‌లోని ఒక అజ్ఞాత ప్రదేశంలో తన కుక్కతో కలిసి గృహ నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను కోర్టులో విచారణకు హజరుపరచడం కోసం ఈ ప్రాంతం నుంచి తరలించారు. పైగా ఆమెకి 150 ఏళ్లకు పైనే శిక్ష విధించారు. అంతేకాదు సూకీ తరుఫున న్యాయవాదులు మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించారు. జర్నలిస్టులు సైతం ఆమెతో మాట్లాడేందుకు వీల్లేదు. ఇంతకుముందు కూడా ఆమె మయాన్మార్లో అతిపెద్ద నగరమైన యాంగాన్‌లోని తన ఇంటిలోనే చాలాఏళ్లు గృహనిర్బంధంలో ఉంది. ఆమె అవినీతి, మిలటరీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు, కోవిడ్-19 ప్రోటోకాల్, టెలికమ్యూనికేషన్స్ చట్టం ఉల్లంఘన తదితర ఆరోపణలతో ఆమెను దోషిగా నిర్థారించారు. పైగా కోర్టు సూకీకి ఇప్పటివరకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వద్దని హెచ్చరించిన యూఎన్) -
జైలు భోజనం ఎప్పుడైనా రుచి చూశారా?.. ఈ ఫొటోలు చూస్తే వెళ్లకుండా ఉండరేమో.!
నిజామాబాద్ : కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొత్త కొత్త థీమ్‌లతో తమ బిజినెస్‌లను ప్రారంభిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో నూతనంగా ఓ మండీ హోటల్‌ను ప్రారంభించారు. నిర్వాహకులు జైలు థీమ్‌తో ఈ హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఇనుప చువ్వలతో కూడిన గదులు, బొమ్మ తుపాకులు, బేడీలు ఏర్పాటు చేశారు. అలాగే ఆహారం సప్లయ్ చేసే వారికి ఖైదీ దుస్తులును ఏర్పాటు చేశారు. మండీలోకి వెళ్లగానే ముందుగా ఒక పోలీస్, మరో పక్క ఖైదీ దుస్తులతో స్వాగత ప్రతిమలను ఏర్పాటు చేశారు. జైలు గదుల్లా ఏర్పాటు చేసి అందులో ఆహార ప్రియులకు వడ్డిస్తున్నారు. వినూత్నంగా ఏర్పాటు చేసిన ఈ మండీ నగరవాసులను ఆకట్టుకుంటోంది. -
ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!
ఏవో ఏవో కారణాలతో లేక సామాజిక మాధ్యమాల కారణంగానో లేక టెక్నాలజీ కారణంగానో తెలియదు కానీ యువత పెడదోవ పడుతోందంటూ రకరకాల కథనాలను మనం టీవిల్లోనూ, పేపర్లలోనూ చూస్తున్నాం. కానీ కొంతమంది మాత్రమే ఏదో ఒక దశలో తాము మారాలని గట్టిగా నిర్ణయించుకోవటమే కాక మంచి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి చూపిస్తున్నారు. అదే కోవకు చెందిన వారు బెంగళూరుకి చెందిన ఆటో రాజా(థామస్ రాజా). అసలెవరా వ్యక్తి ? అతను ఏం చేశాడో కదా! బెంగళూరు: ఈ ఆటో రాజా అసలు పేరు థామస్ రాజా. ఇతను చిన్నతనంలో దొంగతనాలు, చిన్న చిన్న నేరాలు చేస్తుండేవాడు. తన ప్రవర్తన కారణంగా థామస్ తండ్రి అతన్ని 16 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి గెట్టేశాడు. అయితే ఈ నేర ప్రవృత్తి కారణంగానే అతను కొన్నాళ్లూ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అక్కడి జైలు వాతావరణం, నేరస్తుల పట్ల పోలీసుల కఠిన వ్యవహార శైలి తనలో కొత్త జీవన గమ్యానికి నాంది పలికింది. ఆ తర్వాత అతనూ ఇంకెప్పుడూ ఎవర్నీ మోసం చేయడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. (చదవండి: నేను గిటారు వాయిస్తాను... మీరు పాట పాడండి ప్లీజ్!) ఆ తర్వాత ధామస్ బెంగళూరు వెళ్లి ఒక ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆటో నడుపుకుంటూ వెళ్తున్నప్పుడూ మార్గమధ్యలో చెత్తకుప్పల వద్ద ఉండే నిరుపేదలు, అభ్యాగ్యులు తరచుగా తనకు తారసపడుతుండే వారు. ఇక అతను తినడానికి కూడా వెళ్లకుండా ఇలాంటి అభ్యాగుల్నీ సుమారు 13 మందిని చేరదీసి వారి కోసం ఒక ఇల్లును అద్దెకు తీసుకుని వారికి ఆశ్రయం ఇస్తున్నాడు. ఈ మేరకు న్యూ ఆర్క్ మిషన్ ఆఫ్ ఇండియా అనే ఫౌండేషన్ సాయంతో "హోమ్ ఆఫ్‌హోప్" అనే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ పునరావాస కేంద్రంలో దాదాపు 750 మందికి ఆశ్రయం ఇచ్చాడు, 19 వేల మంది అనాథలను రక్షించాడు. అంతేకాదు అతను అక్కడితో ఆగిపోలేదు. అభాగ్యుల కనీస భోజనం, తాగునీరు లేక ఖైదీల్లా జీవిస్తున్నారంటూ... థామస్ ఇనుపగొలుసలను ధరించి విన్నూతన రీతిలో వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడు. అయితే అనుకోకుండా అది కాస్త పేపర్లలోనూ, టీవిల్లోనూ బాగా వైరల్ అయ్యింది. ఏదీఏమైనప్పటికీ ఒక చెడు మార్గంనుంచి మంచి మార్గం వైపుకి మళ్లడమే కాక ఒక ఆదర్శవంతమైన గమ్యాన్ని ఏర్పరుచుకుని దాని కోసం పోరాడుతున్న ఆటో రాజా(థామస్ రాజా)ను "శభాష్" అని అభినందించకుండా ఉండలేం కదా. (చదవండి: మిస్ వరల్డ్ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్) -
జైలు ప్రాంగణమే పెళ్లి మండపం..
భువనేశ్వర్/చౌద్వార్: జైలు ప్రాంగణం పెళ్లి మంత్రాలతో మారుమోగింది. అత్యాచార ఆరోపణపై శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. తనపై ఆరోపణలు చేసిన యువతిని వివాహం చేసుకున్నాడు. కటక్ చౌద్వార్ సర్కిల్ జైలులో శుక్రవారం ఈ పెళ్లి వేడుక జరిగింది. స్థానిక ఉద్ధార్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. కటక్ జిల్లా సాలేపూర్ గ్రామానికి చెందిన అంశుమాన్ మల్లిక్ నిశ్చింతకొయిలి గ్రామానికి చెందిన చిన్నయి సెఠిని వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో ఆ యువతి మల్లిక్‌పై మోసం చేశాడంటూ కేసు పెట్టింది. అయితే ఇరువురి కుటుంబాలు పరస్పరం వారి పెళ్లికి అంగీకరించడంతో జైలు ఆవరణంలోనే జడ్జి అనుమతి మేరకు వివాహం చేసుకున్నారు. జైలు అధికారులు, వధూవరుల కుటుంబ సభ్యులు, కొద్ది సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వివాహం జరిపించినట్లు జైలు వార్డెన్ సత్యప్రకాష్ స్వంయి, జైలరు బిభేందు భుంయ్యా, ఉద్ధార్ ఫౌండేషన్ అధ్యక్షుడు నరోత్తమ దాస్ తెలిపారు. -
దేవుడే దిక్కు.. నిత్యపూజలు, ప్రార్థనలు
సాక్షి, చెన్నై: జైలు జీవితం నుంచి ముందుగానే విముక్తి పొందాలని శశికళ చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ బెడిసికొట్టాయి. ససేమిరా అని కర్ణాటక జైళ్లశాఖ చెప్పేసింది. దీంతో మనుషులను నమ్మి ప్రయోజనం లేదు.. దేవుడే దిక్కు అని శశికళ భావించారో ఏమో ఆధ్యాత్మిక జీవనంలో మునిగిపోయారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరిలోని శశికళ విడుదలపై ఆసక్తి నెలకొంది. జయలలిత హయాంలోనే అన్నాడీఎంకేలో చక్రం తిప్పిన శశికళ ఆ తరువాత పార్టీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచుకున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు అన్న చందంగా సీఎం కావాల్సింది జైలుపక్షిగా మారిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలు అనుభవిస్తున్న నాలుగేళ్ల జైలు శిక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంతో పూర్తయి విడుదల కావాల్సి ఉంది. చదవండి: (మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..) ముందస్తు విడుదలపై ముందుకూ, వెనక్కి... కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి నెలరోజుల జైలు జీవితానికి మూడు సెలవు రోజుల చొప్పున మొత్తం 129 రోజుల సెలవులను బేరీజు వేసుకుని నవంబరులోనే విడుదల చేయాలని శశికళ తరఫున్యాయవాది గతంలో బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు. ఇక అప్పటి నుంచి శశికళ ముందుస్తు విడుదల వ్యవహారం నిత్యం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు విడుదల అడ్డంకిగా ఉండిన రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు చెల్లించి ఆశగా ఎదురుచూడడం ప్రారంభించారు. (శశికళ ఆశలు అడియాశలు..!) నరసింహమూర్తి అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని జైలు సూపరింటెండెంట్ బదులిచ్చారు. అవినీతినిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. అయితే అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టయిన కొందరిని సత్ప్రవర్తన పరిధిలో చేర్చిన కర్ణాటక ప్రభుత్వం ముందుగానే విడుదల చేసిన దాఖలాలు ఉన్నందున శశికళను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిమానా చెల్లింపు, కోర్టు ఆమోదం పూర్తయినందున సత్ప్రవర్తన కింద ముందే విడుదల చేయాలని కోరుతూ జైళ్లశాఖకు ఈనెల 17న శశికళ న్యాయవాదులు మరోసారి వినతిపత్రం సమర్పించారు. శశికళ చెన్నై జైల్లో ఉన్న రోజులు, పెరోల్ రోజులు, సెలవు దినాలు పరిగణనలోకి తీసుకోవాలని అందులో కోరారు. అయితే ఈ వినతిని జైళ్లశాఖ నిరాకరించడంతో శశికళకు మళ్లీ నిరాశే మిగిలింది. చదవండి: (పవన్ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు) దైవ పూజల్లో నిమగ్నం.. ముందస్తు విడుదల వ్యవహారం మూడడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనకలా మారడంతో శశికళ దైవపూజల్లో గడుపుతున్నారు. జైల్లోని తనగదిలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు పెట్టుకుని రోజుకు నాలుగు గంటలపాటు పూజలు చేస్తున్నారు. తలపెట్టిన కార్యాలు నెరవేరాలని పార్థసారథి స్వామికి పదేపదే ప్రార్థనలు చేస్తున్నారు. జయలలితలా ఆంజనేయస్వామిని సైతం ప్రత్యేకంగా ఆరాధించడం ప్రారంభించారు. మాంసాహారం మానివేసి పూర్తిగా శాఖాహారాన్ని అలవాటు చేసుకున్నారు. ఆరునెలలుగా ఎవ్వరికీ ములాఖత్ ఇవ్వలేదు. శశికళ న్యాయవాదులు బెంగళూరులోనే తిష్టవేసి ముందస్తు విడుదలపై కృషి చేస్తున్నారు. -
జైల్లో ఏటీఎం.. ఎక్కడంటే..!
పట్నా: ఏటీఎంలు వచ్చాక బ్యాంకులకు వెళ్లే పని సగం తగ్గిపోయింది. లేదంటే బ్యాంకు టైమ్ లోపల వెళ్లి ఓచర్ రాసి డబ్బులు డ్రా చేయాలంటే ఓ రోజంతా పట్టేది. డబ్బులు అత్యవసరం ఉండి.. అదే రోజు బ్యాంకుకు సెలవు ఉంటే ఇక చెప్పలేం. ఈ కష్టాలన్నింటికి ఏటీఎంతో ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. చేతిలో కార్డు ఉంటే చాలు.. నిమిషాల వ్యవధిలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా ఖైదీల కోసం జైల్లో కూడా ఏంటీఎం ఏర్పాటు చేయబోతున్నారు. బిహార్‌లోని పూర్నియా సెంట్రల్ జైలు అధికారులు ఖైదీల కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావించారు. ఖైదీలకు తమ అవసరాల నిమిత్తం డబ్బు కావాలంటే కుటుంబ సభ్యులు వచ్చి ఇవ్వాల్సిందే. దీని వల్ల గేటు దగ్గర ఎక్కువ మంది గుమిగుడుతున్నారు. దీన్ని నివారించడం కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!) ఈ సందర్భంగా పూర్నియా సెంట్రల్ జైలు సూపరిండెంట్ మాట్లాడుతూ.. ‘జైలు ప్రాగణంలో ఏటీఎం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఎస్బీఐకి లేఖ రాశాము. మరో రెండు వారాల్లో ఏటీఎం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం’ అన్నారు. ప్రస్తుతం జైలులో 750 మంది ఖైదీలు ఉన్నారని.. అందులో 600 వందల మందికి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 400 మందికి సంబంధింత బ్యాంకుల నుంచి ఏటీఎం కార్డులు ఇప్పించాం. త్వరలోనే మిగతా వారికి కూడా అందిస్తాం అని తెలిపారు. ఇక జైలులో ఖైదీలు ప్రతి రోజు 4-8 గంటలు పని చేస్తుంటారు. ఇందుకు గాను వీరికి 52-103 రూపాయల వేతనం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ఖైదీల చేతికి ఇవ్వకుండా అకౌంట్లో జమ చేస్తారు. ఇక జైలులో లోపల కొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకవేళ అవి అమల్లోకి వస్తే ఖైదీల వేతనం 112-156 రూపాయలకు పెరగనుంది. ఇక జైలులో ఖైదీలు తమ చేతిలో 500 రూపాయలు వరకు ఉంచుకోవచ్చు. (చదవండి: వామ్మో.. ఏటిఎం?) జనవరి 2019 వరకు, ఖైదీల వేతనాలను చెక్కుల ద్వారా చెల్లించేవారు. ప్రస్తుతం డబ్బును వారి ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. జైలు గేటు వద్ద ఏటీఎం ఏర్పాటు చేస్తే.. ఖైదీలకు డబ్బులు ఇవ్వడానికి వచ్చే వారిని సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చు. ఏటీఎం ఏర్పాటు చేయడం ద్వారా ఖైదీలు జైలులో పని చేసినందుకు లభించే వేతనం నుంచి తమకు అవసరమైన నూనె, సబ్బులు, పండ్లు, స్నాక్స్ వంటి రోజువారీ వినియోగ వస్తువులను కొనుగోలు చేయడానికి కార్డు ఉపయోగించి డబ్బు డ్రా చేసుకుంటారు అని అధికారులు తెలిపారు. -
శశికళ ఆశలు అడియాశలు..!
సాక్షి, చెన్నై: బాహ్యప్రపంచంలోకి ఎప్పుడెప్పుడు అడుగుపెడదామాని ఉవ్విళ్లూరుతున్న శశికళ ఆశలు అడియాశలయ్యాయి. గడువు కంటే ముందుగా విడుదల చేసే అవకాశం లేదని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ శుక్రవారం స్పష్టం చేయడంతో ఆమె అభిమానులు డీలా పడిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానాకు గురైన శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ సైతం అదే జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో నాలుగేళ్ల శిక్షాకాలం ముగుస్తుంది. (మహిళా ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం) అయితే సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సమాచార హక్కు చట్టం కింద పంపిన ఉత్తరానికి “ 2021 జనవరిలో శశికళ విడుదలవుతారని’ జైలు సూపరింటెండెంట్ బదులిచ్చారు. రూ.10. కోట్ల జరిమానా కూడా కోర్టుకు ఇటీవలే ఆమె చెల్లించారు. కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి శశికళకు మొత్తం 129 రోజుల సెలవులనుగా విడుదల చేయాలని శశికళ తరఫు న్యాయవాది ఇటీవల బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు. ఈనేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బెంగళూరులోని విధానసౌధలో మీడియా ప్రతినిధులు శుక్రవారం అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ఈనేరాలకు సత్ప్రవర్తన వర్తించదు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. చట్టాన్ని అనుసరించే శిక్షకాలం ఉంటుంది, ఇందులో రాజకీయ ప్రమేయానికి ఎంతమాత్రం చోటులేదని పేర్కొన్నారు. వెంటనే విడుదలకు కోర్టులో పిటిషన్.. ముందస్తు విడుదలకు అవకాశం లేదని కర్ణాటక మంత్రి స్పష్టం చేయడంతో బెంగళూరు కోర్టులో శుక్రవారం పిటిషన్ వేయాలని శశికళ న్యాయవాదులు నిర్ణయించారు. జరిమానా చెల్లింపు కూడా పూర్తయినందున శశికళను వెంటనే విడుదల చేయా లని కోరుతూ పిటిషన్ ధాఖలు చేయనున్నారు. -
చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లు
సాక్షి,చెన్నై: చిన్నమ్మ శశికళ రాక కోసం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురుచూపులు పెరిగాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కోర్టు విధించిన రూ.10 కోట్ల 10 లక్షల జరిమానాను చిన్నమ్మ తరఫు న్యాయవాదులు చెల్లించిన విషయం తెలిసిందే. ఈ చెల్లింపునకు తగ్గ రశీదులు, చిన్నమ్మ జైలు జీవితం, విడుదలకు తగ్గ విజ్ఞప్తితో కూడిన ఓ పిటిషన్‌ను ఆమె తరఫు న్యాయవాదులు గురువారం బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వర్గాలకు సమర్పించారు. దీంతో చిన్నమ్మ ఒకటి రెండు రోజుల్లో జైలు నుంచి బయటకు రావచ్చన్న ఎదురుచూపుల్లో న్యాయవాదులు ఉన్నారు. ముందుగానే చిన్నమ్మ వచ్చేస్తున్నారని ఆమె న్యాయవాది రాజాచెందూర్ పాండియన్ చెబుతుండడంతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల్లో ఎదురు చూపులు పెరిగాయి. చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. కళగం ముఖ్యనేతలు మాత్రమే బెంగళూరుకు పయనం కావడం, మిగిలిన నేతలందరూ తమిళనాడు– కర్ణాటక సరిహద్దుల్లో ఉండి, చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు తగ్గట్టుగా కార్యాచరణ సిద్ధం చేసి ఉండడం గమనార్హం. హొసూరు నుంచి చెన్నై వరకు జాతీయరహదారిలోని కొన్ని ఎంపిక చేసిన పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద చిన్నమ్మకు ఆహ్వానం పలికేందుకు తగ్గట్టుగా పార్టీ వర్గాలు ఏకమయ్యేందుకు నిర్ణయించారు. 60 చోట్ల బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై అమ్మ శిబిరం పరుగులు తీస్తుండడం చూస్తే, మరికొద్ది రోజుల్లో చిన్నమ్మ బయటకు వచ్చేస్తారేమో అన్న ఎదురుచూపులు పెరిగాయి. (కొత్త పార్టీ స్థాపన దిశగా అళగిరి) -
దేశ చరిత్రలోనే గొప్ప నిర్ణయం..
సాక్షి, విజయవాడ: మహిళా ఖైదీల విషయంలో దేశ చరిత్రలోనే సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఖైదీల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 5 ఏళ్ల పాటు శిక్ష పూర్తి చేసుకున్న వారిని విడుదల చేయాలని నిర్ణయించారు. జైల్లో ఉన్న మహిళా ఖైదీలకు వివిధ వృత్తులపై శిక్షణ ఇస్తున్నాము. వారు బయటకు వచ్చిన తరువాత వాళ్ల కాళ్ళపై వారు నిలిచేలా శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 137 మంది ఖైదీలలో 55 మంది విడుదలకు అర్హత కలిగి ఉన్నారు. పూర్తి పరివర్తనతో బయటకు వచ్చిన ఖైదీలు కుటుంబాలతో సంతోషంగా ఉంటారని భావిస్తున్నాము. పురుష ఖైదీల విడుదలకు సంబంధించి జనవరి 26 సందర్బంగా నిర్ణయం తీసుకుంటాము. డిగ్రీ చదివిన, చదువుతున్న ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. కుట్టు, ఎంబ్రాయిడరీ, అల్లికలు వంటి చేతి వృత్తులు కూడా శిక్షణ ఇస్తున్నాము. (నడి రోడ్డు మీద లంచావతారం..) నేరంలో వారి పాత్ర ఎంత అనే విషయంపై కూడా విచారణ చేసి నిర్ణయించాం. మహిళా ఖైదీల విడుదల ఒకేసారి జరగడం చారిత్రాత్మకం. కడప, విశాఖ జైళ్ళను సందర్శించినపుడు అక్కడి మహిళ ఖైదీల అభ్యర్ధన మేరకు విడుదలకు సిద్ధం చేశాం. ఒక వారం లోపు వీరందరినీ విడుదల చేయడం జరుగుతుంది. జనవరి 26న మరలా నిర్ణయం తీసుకుంటాం. కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే విడుదల చేస్తున్నాం' అని మంత్రి సుచరిత పేర్కొన్నారు. (అబ్బెబ్బే... ప్యాకేజి మాటే ఎత్తలేదు) ఏపీ జైళ్ల శాఖ డీజీ అహసన్ రెజా మాట్లాడుతూ.. ఏపీలో నాలుగు జైళ్ళ నుంచి మహిళా ఖైదీలను విడుదల చేస్తున్నాం. ఓ మహిళ ఖైదు కావడంతో ఓ కుటుంబం ఇబ్బంది పడుతుంది. సీఎం జగన్ నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఖైదు, శిక్షా కాలం ఐదు సంవత్సరాలకు తగ్గించాం అని ఆయన వివరించారు. -
మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష
కౌలాలంపూర్ : మలేషియా డెవలప్మెంట్ బెర్హాద్(వన్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి ఆరోపణలపై మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ దోషిగా తేలారు. దీంతో మాజీ ప్రధానికి కౌలాలంపూర్‌లోని హైకోర్టు 12 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 2009 నుంచి 2018 వరకు నజీబ్ మలేషియా ప్రధానిగా చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన అవినీతి బయటపడటంతో అధికారాన్ని కోల్పోయారు. మలేసియాలో ఓ మాజీ ప్రధానిని దోషిగా కోర్టు నిర్ధారించడం ఇదే మొదటిసారి. అధికార దుర్వినియోగం, మనీలాండరింగ్, నమ్మక ద్రోహంకు పాల్పడ్డారని నజీబ్ పై అభియోగాలున్నాయి. కాగా.. మలేషియాలో ఎన్ఆర్సీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి 9.8 మిలియన్ డాలర్లను, అలాగే తన హయాంలో 4 నుంచి 5 బిలియన్ డాలర్లను తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి ఆయన మళ్లించుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధిపై పూర్తి నియంత్రణ ప్రధానికే ఉంటుంది. ఈ కుంభకోణం కూడా ఆయన హయాంలోనే జరగడంతో పాటు, ఢిఫెన్స్ వాదనలు కూడా ఆయన నిర్ధోషిత్వాన్ని నిరూపించేలా లేవని హైకోర్టు పేర్కొంది. దీంతోపాటు నజీబ్‌పై అభియోగాలు రుజువు కావడంతో కౌలాలంపూర్ హైకోర్టు ఆయనకు ఏకకాలంలో మూడు శిక్షలు అమలయ్యేలా 12 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. (దుర్గమ్మతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!) -
ఖైదీ నంబర్ 3077 : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వరంగల్ జైలులో తాను గడిపిన రోజులకు సంబంధించిన ఓ ‘ఖైదీ గుర్తింపు కార్డు’ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘దీక్షా దివస్ రోజున కేసీఆర్, ప్రొ. జయశంకర్ అరెస్టయ్యారు. ఆ సందర్భంలో నన్ను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.’అని కేటీఆర్ ట్వీట్లో రాసుకొచ్చారు. గుర్తింపు కార్డులో ఉన్న వివరాల ప్రకారం.. 2009 నవంబర్ 29న హన్మకొండ పోలీసులు 447/2009 కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయగా వరంగల్ ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రిమాండు విధించారు. వరంగల్ సెంట్రల్ జైలులో కేటీఆర్‌కు 3077 నంబరును కేటాయించారు. -
అత్యాచారయత్నం కేసులో పదేళ్ల జైలు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోనే ఐదేళ్లు రూ. 2 వేలు జరిమానా రాజోలు/రాజమహేంద్రవరం క్రైం : దళిత మైనర్ బాలికపై అత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు, జరిమానా విధించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి చెందిన పోతుల శ్రీనివాసరావు అలియాస్ శ్రీనుకు బాలికల అత్యాచార నిరోధక చట్టం(పీఓసీఎస్ఓ) ద్వారా ఐదేళ్లు జైలు శిక్ష, రూ.1000 జరినామా, దళిత బాలిక కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా మరో ఐదేళ్లు, రూ. 1000లు జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం ఫస్ట్‌క్లాస్ అడిషనల్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎ.వి.రవీంద్రబాబు బుధవారం తీర్పు చెప్పారు. రాజోలు ఎస్సై లక్ష్మణరావు తెలిపిన వివరాల మేరకు 2014 జనవరి 31వ తేదీన పొన్నమండ గ్రామానికి చెందిన నల్లి మోహన్‌దాస్ మైనర్కుమార్తెపై వృత్తి రీత్యా పంగిడి నుంచి పొన్నమండ వచ్చిన లారీ డ్రైవర్ శ్రీనివాసరావు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్సై అప్పన్న కేసు నమోదు చేయగా అమలాపురం డీఎస్పీ వీరారెడ్డి కేసు విచారణ పూర్తి చేసి బాలికల అత్యాచార నిరోధక, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి డ్రైవర్ శ్రీనివాసరావును అరెస్ట్ చేసి రాజమండ్రి ప్రత్యేక కోర్టుకు తరలించారు. రెండు కేసులు రుజువు కావడంతో శ్రీనివాసరావుకు శిక్ష విధించారని ఎస్సై తెలిపారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ హసీనా బాధితురాలి తరుఫున కేసు వాదించారన్నారు. -
కటకటాల్లోకి కేటుగాడు
మెడికల్ సీట్ ఇప్పిస్తానని దగా నిందితుడి అరెస్ట్ బంజారాహిల్స్: తాను ఓ మంత్రి పీఏనని, మెడికల్ సీటు ఇప్పిస్తానని డబ్బు తీసుకుని మోసం చేసిన కేటుగాడిని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా చెర్కుపల్లి గ్రామానికి చెందిన మేకల రఘురాంరెడ్డి అలియాస్ రఘుమారెడ్డి తాను ఓ మంత్రి పీఏనని బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని అమృతా ఎన్‌క్లేవ్‌లో నివసించే సయ్యద్ అతర్ హుస్సేన్(20)ను పరిచయం చేసుకున్నాడు. తనకు మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో సంబంధాలున్నాయని, గతంలో చాలా మందికి ఎంబీబీఎస్ సీట్లు ఇప్పించానని నమ్మబలికాడు.అతర్ హుస్సేన్‌కు మెడికల్ సీటు ఇప్పిస్తానని రూ. 85 లక్షలు వసూలు చేశాడు. సీటు రాకపోవడంతో బాధితుడు నిలదీయగా అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ చివరకు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితు అతర్ హుస్సేన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రఘురాంరెడ్డిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
జైళ్లలో ఖైదీల మధ్య వివక్ష
- ‘సంకెళ్ల సవ్వడి’ పుస్తకావిష్కరణలో జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి - జైళ్లలో పరిస్థితులపై వక్తల ఆవేదన హైదరాబాద్: జైళ్లలో ఖైదీల మధ్య పోలీసులు చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. మలుపు సంస్థ ఆధ్వర్యంలో హక్కుల ఉద్యమ కార్యకర్త, పుస్తక రచయిత అరుణ్ ఫరేరా రచించిన ‘సంకెళ్ల సవ్వడి’ పుస్తకావిష్కరణ సభ శనివారం హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వతపరిషత్ ఆడిటోరియంలో జరిగింది. కార్యక్రమానికి సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రచయిత అరుఫ్ ఫరేరా జైళ్లలో తన అనుభవాలను పుస్తకంలో రాశారని చెప్పారు. రాజకీయ ఖైదీలు, సమాజాన్ని దోచుకునే ఖైదీల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని వివరించారని పేర్కొన్నారు. అతి క్రూరమైన నేరాలు చేసినవారికి ములాఖాత్‌లో ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, కానీ సాధారణ ఖైదీలను మాత్రం పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వసతులు లేక ఖైదీలు ఎంతగానో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి జైళ్లలో ఉంటుందన్నారు. అరుణ్ ఫరేరా మానవ హక్కులకు భంగం కలుగుతుందని విశ్వసిస్తేనే ఆయనపై పెట్టారని తెలిపారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... జైళ్లలో ఉన్న పరిస్థితులను రచయిత అరుణ్ ఫరేరా ఎంతో సహనంతో రాశారన్నారు. జైళ్లలో అండా సెల్ పెట్టడం మానవత్వానికి విరుద్ధమన్నారు. ఇప్పుడున్న పార్టీలకు రాజ్యాంగ విలువలు లేవని, రాజ్యం అమానుషంగా తయారైందని రచయిత తన పుస్తకంలో చెప్పారన్నారు. సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం మాట్లాడుతూ.... జైళ్లలో ఉన్న సంఘటనలు కళ్లకు కట్టినట్లు రచయిత రాశారని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో రచయిత అరుణ్ ఫరేరా, సామాజిక, రాజ కీయ పత్రిక దస్తక్ సంపాదకులు సీమా ఆజాద్, వీక్ష ణం ప్రధాన సంపాదకులు ఎస్.వేణుగోపాల్, బాల్‌రెడ్డి, విరసంనేత వరవరరావు పాల్గొన్నారు.