ఉత్తర కేరళ రాష్ట్రంలోని కన్నూర్ బిర్యానీ వంటకానికి హాట్‌స్పాట్‌గా ఉంది. ఇక్కడ ప్రసిద్ధ వయనాదన్ కైమా లేదా జీరకసాల అన్నం, మలబారి బిర్యానీని వివిద కాంబినేషన్‌లో వండుతారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా కేవలం రెండు గంటల ప్రయాణంలో కన్నూర్‌కి చేరుకోవచ్చు. ఇది కేరళలోని అత్యంత మనోహరమైన పట్టణాలలో ఒకటిగా పేరుగాంచింది. 2010లో కేరళ ప్రభుత్వం చొరవతో తిరువనంతపురం జైలులో ఖైదీలతో వంటకాలు చేయించడం \ప్రారంభమయ్యింది.
ఆ ఖైదీలు చేసిన వంటకాలను ఫ్రీడం కోసం ఆహారంగా అభివర్ణించారు. జైళ్లను దిద్దుబాటు కేంద్రాలుగా మర్చాలనే ఆలోచనకు అంకురారప్పణ చేసి, వారికి వండటంలో శిక్షణ ఇచ్చారు అదికారులు. అలాగే వాళ్లు తయారు చేసిన వంటకాలన్నీ సాధారణ ప్రజలకు విక్రయిస్తారు. అందుకు గానూ ఖైదీలకు పరిహారం కూడా చెల్లిస్తారు. అంతేగాదు జైలుని ఆధునికరించి, ఖైదీలకు చపాతీ, వెజిటబుల్ కర్రీ, చికెన్ కర్రీ, ఎగ్‌కర్రి తదితర వంటకాలను కూడా నేర్పించారు. సరిగ్గా చెప్పాలంటే ఈ వినూత్న కార్యక్రమం 2012లో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ కిచెన్ జస్ట్ ఐదేళ్లలోనే రూ. 8.5 కోట్లకు పైగా ఆర్జించిందని ప్రభుత్వం ప్రకటించింది. ఖైదీలు చేసిన ప్రధాన వంటకాల్లో ఈ బిర్యానీ కూడా ఒకటి.
(చదవండి: ప్రేమంటే ఇదేరా: సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!)
Comments
Please login to add a commentAdd a comment