kannur
-
వాట్సాప్‌లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. ప్లాట్‌ఫాం మధ్యలో పడిన యువతి
తిరువనంతపురం: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నం చేసిన యువతి.. అదుపుతప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో పడిపోయారు. ఈ ప్రమాదం కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రమదంలో 19 ఏళ్ల యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పుదుచ్చేరి-మంగళూరు వీక్లీ రైలులో ఇరిట్టికి చెందిన యువతి.. తలస్సేరి నుంచి మంగళూరుకు వెళుతోంది. అయితే.. మధ్యలో కన్నూర్ రైల్వే స్టేషన్లో రైలు కాసేపు ఆగటంతో.. సదరు యువతి స్టేషన్లో ఉన్న షాప్‌లో స్నాక్స్ కొనుగోలు చేయడానికి దిగారు. కొనుగోలు చేస్తున్న సమయంలోనే రైలు కదటం గమనించిన యువతి.. పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా రైలు, ప్లాట్ఫారం మధ్య పడిపోయారు. ప్రయాణికులు, రైల్వే పోలీసులు, క్యాటరింగ్ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే డ్రైవర్‌కు సమాచారం అందించడంతో ఆమెను రక్షించేందుకు రైలును నిలిపివేశారు. ఆ యువతికి స్వల్ప గాయాలకు అవ్వటంతో.. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం రైల్వే అధికారులు.. ఆమె మరోక రైలులో ఎక్కించి మంగళూరుకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.கேரளா, கண்ணூர் ரயில் நிலையத்தில் ஓடும் ரயிலில் ஏற முயன்றபோது தடுமாறி நடைமேடைக்கும் ரயிலுக்கும் இடையில் விழுந்த இளம் பெண். உடனடியாக ரயில் நிறுத்தப்பட்டு பத்திரமாக மீட்டனர். Platform க்கும் train க்கும் இடைவெளி அதிகமா இருந்ததால் சிறு காயங்களுடன் அந்த பெண் உயிர் தப்பினார் pic.twitter.com/Qb7bVUHOBb— admin media (@adminmedia1) November 4, 2024 -
ఖైదీలు వండే కమ్మని బిర్యానీ
ఉత్తర కేరళ రాష్ట్రంలోని కన్నూర్ బిర్యానీ వంటకానికి హాట్‌స్పాట్‌గా ఉంది. ఇక్కడ ప్రసిద్ధ వయనాదన్ కైమా లేదా జీరకసాల అన్నం, మలబారి బిర్యానీని వివిద కాంబినేషన్లో వండుతారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా కేవలం రెండు గంటల ప్రయాణంలో కన్నూర్‌కి చేరుకోవచ్చు. ఇది కేరళలోని అత్యంత మనోహరమైన పట్టణాలలో ఒకటిగా పేరుగాంచింది. 2010లో కేరళ ప్రభుత్వం చొరవతో తిరువనంతపురం జైలులో ఖైదీలతో వంటకాలు చేయించడం \ప్రారంభమయ్యింది. ఆ ఖైదీలు చేసిన వంటకాలను ఫ్రీడం కోసం ఆహారంగా అభివర్ణించారు. జైళ్లను దిద్దుబాటు కేంద్రాలుగా మర్చాలనే ఆలోచనకు అంకురారప్పణ చేసి, వారికి వండటంలో శిక్షణ ఇచ్చారు అదికారులు. అలాగే వాళ్లు తయారు చేసిన వంటకాలన్నీ సాధారణ ప్రజలకు విక్రయిస్తారు. అందుకు గానూ ఖైదీలకు పరిహారం కూడా చెల్లిస్తారు. అంతేగాదు జైలుని ఆధునికరించి, ఖైదీలకు చపాతీ, వెజిటబుల్ కర్రీ, చికెన్ కర్రీ, ఎగ్‌కర్రి తదితర వంటకాలను కూడా నేర్పించారు. సరిగ్గా చెప్పాలంటే ఈ వినూత్న కార్యక్రమం 2012లో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ కిచెన్ జస్ట్ ఐదేళ్లలోనే రూ. 8.5 కోట్లకు పైగా ఆర్జించిందని ప్రభుత్వం ప్రకటించింది. ఖైదీలు చేసిన ప్రధాన వంటకాల్లో ఈ బిర్యానీ కూడా ఒకటి.(చదవండి: ప్రేమంటే ఇదేరా: సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!) -
‘మా ఊరికి రావద్దు.. అన్ని ఓట్లూ నోటాకు వేసేస్తాం’
ఎన్నికల ప్రచారం ఎక్కడికక్కడే ఊపందుకుంటోంది కానీ కేరళ రాష్ట్రం కన్నూర్‌లోని నడువిల్ గ్రామ వాసులు మాత్రం ప్రచారానికి నో చెబుతున్నారు. కారణం అధ్వాన్నమైన రోడ్లు. మెరుగైన రోడ్లు వేయనందుకు నిరసనగా తమ గ్రామంలో ఎలాంటి ఎన్నికల ప్రచారానికి అనుమతించబోమని ఆ గ్రామస్తులు ప్రకటించారు. తమ ప్రాంతానికి ఓట్లు అడగడానికి అభ్యర్థులెవరూ రాకూడదంటూ వివిధ చోట్ల ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేశారు. నడువిల్లి పంచాయతీ పరిధిలోని 9, 10, 11, 12 వార్డుల్లోని నాలుగు ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి. రోడ్ల మరమ్మతులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లు అధ్వానంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో తమ గ్రామానికి డ్రైవర్లు ఎవరూ రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహిస్తున్నారు. "ఎన్నో ఏళ్లుగా ఈ బూటకపు వాగ్దానాలు వింటూనే ఉన్నాం. వారి మాటలను ఇకపై విశ్వసించం. ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వక హామీ ఇస్తేనే ఈ ఎన్నికల్లో పాల్గొంటాం. లేకపోతే అన్ని ఓట్లు నోటా వేసేస్తాం" అని నడువిల్లి గ్రామస్తులు తెగేసి చెప్పేస్తున్నారు. కాగా ఇటీవలే రెండు రోడ్లకు నిధులు కేటాయించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపడతామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. -
ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్!
దీపావళి పండుగ సందర్భంగా థియేటర్లలో రిలీజైన జపాన్, జిగర్తండ డబుల్ ఎక్స్, టైగర్-3 వచ్చిన సినిమాల సందడి అయిపోయింది. మరోవైపు ఓటీటీల్లోనూ కొన్ని చిత్రాలు సందడి చేస్తున్నాయి. అలాగే ఈ వారంలోనూ థియేటర్లలోకి వచ్చేందుకు సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో మంగళవారం, మై నేమ్ ఇజ్ శృతి, స్పార్క్: ది లైఫ్, సప్తసాగరాలు దాటి సైడ్-బి, అన్వేషి లాంటి టాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. అలాగే థియేటర్లతో పాటు ఓటీటీలోనూ అలరించేందుకు మరిన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీకెండ్స్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేందుకు వస్తోన్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. అమెజాన్ ప్రైమ్ కంగ్రాట్స్ మై ఎక్స్! (థాయ్ సినిమా) - నవంబరు 16 మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 నెట్‌ఫ్లిక్స్ బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 16 ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ సినిమా) - నవంబరు 16 లియో (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 16 ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 16 సుకీ- (హిందీ సినిమా)నవంబరు 17 రస్టిన్-(ఇంగ్లీష్ సినిమా) నవంబరు 17 ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ చిత్రం) - నవంబరు 17 బిలీవర్ 2 (కొరియన్ సినిమా) - నవంబరు 17 కోకమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 రస్టిన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 సుఖీ (హిందీ చిత్రం) - నవంబరు 17 ద డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్) - నవంబరు 17 ద క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 ద రైల్వే మెన్ (హిందీ సిరీస్) - నవంబరు 18 వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం) - నవంబరు 17 కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబరు 17 షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబరు 17 బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్: బిలీవర్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబరు 17 జీ5 ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబరు 17 ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబరు 17 -
ఓటీటీకి వచ్చేస్తోన్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే అఖిల్ ఏజెంట్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది మలయాళంలో ఆయన నటించిన తాజా చిత్రం 'కన్నూర్ స్క్వాడ్'. సెప్టెంబర్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన కన్నూర్ స్క్వాడ్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా వచ్చిన ఈ చిత్రానికి రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తన స్వీయ నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. (ఇది చదవండి: ఆ ఓటీటీకి వరుణ్- లావణ్య పెళ్లి వేడుక!!) కథ ఏంటంటే.. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్లో కన్నూర్ స్క్వాడ్ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టతరమైన కేసునైనా తమ ధైర్యసాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్‌కు సవాల్‌గా పొలిటిషియన్ దారుణ హత్యకు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును పది రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఎలాంటి ఆధారాలు లేని ఈ క్రైమ్‌ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మర్డర్ చేసింది ఎవరు? ఆ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి కేరళ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు కన్నూర్ స్క్వాడ్ టీమ్ ఎలా ప్రయాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీమ్‌పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్వ్కాడ్ టీమ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అన్నదే ఈ సినిమా.. కన్నూర్ స్క్వాడ్ సినిమా చాలా వరకు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకు తెస్తుంది. -
తప్పతాగి.. రైల్వే ట్రాక్‌పై కారు నడిపి..
తిరువనంతపురం: పీకలదాక తాగి రైల్వే ట్రాక్‌పై కారును నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని జయప్రకాశ్‌గా గుర్తించారు. కేరళ, కన్నూర్ సమీపంలోని అంచరకండిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా చొవ్వ రైల్వే క్రాస్ దగ్గర ట్రాక్‌పై ఉన్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. జయప్రకాశ్ మద్యం మత్తులో ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌పైకి కారును పోనిచ్చాడు. మత్తులో ఉన్న కారణంగా ట్రాక్‌ను నిందితుడు రోడ్డుగా భ్రమపడినట్లు తెలుస్తోంది. దాదాపు 15 మీటర్ల దూరం పోగానే ట్రాక్‌పై కారు ఇరుక్కుని నిల్చిపోయింది. ఈ విషయాన్ని గమనించిన గేట్ కీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో కారును ట్రాక్‌పై నుంచి బయటకు తీశారు. జయప్రకాశ్‌ను అరెస్టు చేశారు. ఆ సయమంలో ఎలాంటి రైలు రానుందున ముప్పు తప్పిందని తెలిపారు. ఇదీ చదవండి: Where Snakes Given As Dowry: వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు.. -
కారులో చెలరేగిన మంటలు.. నిండు గర్భిణీ, భర్త సజీవదహనం
కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగడంతో పురుటి నొప్పులతో బాధపడుతోన్న ఓ గర్భిణి, ఆమె భర్త సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో వెనక సీట్లలో కూర్చున్నవారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా.. కారు ముందు భాగంలో ఉన్న దంపతులు మాత్రం కళ్ల ముందే అగ్నికి ఆహుతయ్యారు. మరో కొన్ని నిమిషాల్లో ఆస్పత్రికి చేరుకుంటారనే సమయంలో ఈ దుర్ఘటన జరగడం మరింత విషాదం. మృతులను కే రీషా(26).. ఆమె భర్త ప్రజిత్(32)గా గుర్తించారు. వివరాలు.. కన్నూరు జిల్లాకు చెందిన రీషా, ప్రజిత్ దంపుతులకు పెళ్లై.. 8 ఏళ్ల కూతురు శ్రీపార్వతి ఉంది. కుట్టియత్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్నారు. ప్రజిత్ సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండగా.. రీషా ప్రస్తుతం నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంతా కలిసి ఇంటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నూరు జిల్లా ఆసుపత్రికి మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో కారులో బయల్దేరారు. కారులో ప్రజిత్, తన భార్య, కూతురు, తల్లి, అత్త, మామ సహా మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. కన్నూర్ ఆస్పత్రికి సమీపంలోకి రాగానే కారులో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కారు బానెట్ కింద మంటలు రావడం గమనించి డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రజిత్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే అతను కారుని ఆపి డోర్లు తెరిచేందుకు ప్రయత్నించాడు. కానీ ముందు తలుపులు లాక్ పడిపోవడంతో రీషా, ఆమె భర్త తప్పించుకునే అవకాశం లేకపోయింది. అయితే ప్రజిత్ వెనక డోర్లు తెరిచి అందులో ఉన్న వారిని బయటకు తోసేశాడు. ఇంతలో మంటలు కారు ముందు భాగంతో ఉవ్వెత్తున వ్యాపించాయి. A couple was charred to death when the car in which they were travelling caught fire near the District Govt Hospital #Kannur, #Kerala on Thursday. Police said 6 persons were travelling in the car & 4 of them who were sitting in the rear seat escaped when the car caught fire. pic.twitter.com/afBMTxaU5p — Hate Detector 🔍 (@HateDetectors) February 2, 2023 బయటకు దిగిన కుటుంబ సభ్యులు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఇది గమనించిన స్థానికులు వాహనం దగ్గరకు పరుగెత్తారు. బయటనుంచి కారు డోరును తెరిచేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరూ చూస్తుండగానే మంటల్లో దంపతులిద్దరూ సజీవదహనమయ్యారు. వాహనం ముందు భాగంలో మంటలు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో పెట్రోల్ ట్యాంకు పేలుతుందనే భయంతో దూరంగా జరిగామని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియలేదని.. నిపుణులు పరిశీలించిన అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
చిందులేసిన 60 ఏళ్లు పైబడిన బామ్మలు..
-
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బాలుడిపై గ్రామ సింహం దాడి!
వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. తన మట్టుకు తాను ఆడుకుంటుడగా ఓ బాలుడిపై వీధి కుక్క దాడికి చేసి తీవ్రంగా గాయపరించింది. బాలుడిపై కక్ష గట్టిందా అన్న రేంజ్లో దాడి చేసి గాయపరిచింది. కాగా, ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. కోజికోడ్ జిల్లాలోని అరక్కినార్లో సైకిల్ వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు. కాగా, బాలుడిపై కక్ష కట్టిందా అన్న రేంజ్లో కుక్కు దాడి చేసింది. ఇక, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ ఆధారంగా దాడి జరిగిన ఘటన బయటకు వచ్చింది. Dogs Own Country? Over 100,000 humans suffered stray dog bites in Kerala in 2022. Record rabies deaths reported. Vaccines didn’t work for many. Millions of harmless birds, pigs, buffaloes, cows are killed daily. Why not dogs? ‘Dog Activists’ also should be punished! pic.twitter.com/OI0gjqKrYe — Porinju Veliyath (@porinju) September 12, 2022 అలాగే, కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధి కుక్కలు తరిమిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో విద్యార్థులు పరిగెత్తుకుని వచ్చి.. ఓ ఇంట్లో గేటు వేసి దాడి నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. కేరళను డాగ్స్ ఓన్ కంట్రీ అని కామెంట్స్ చేస్తున్నారు. #WATCH | Kerala: Students in Kannur manage to escape unharmed as stray dogs chase them in the locality (12.09) pic.twitter.com/HPV27btmix — ANI (@ANI) September 13, 2022 -
డొక్కు స్కూటర్‌పై తిరుగుతూ భలే షాకిచ్చాడే!
యూపీ వ్యాపారి పీయూష్ జైన్ వ్యవహారం దేశం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. కాన్పూర్‌లో అత్తరు బిజినెస్ చేసే పీయూష్‌ను వెయ్యి కోట్ల పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతని ఇంటి, ఆఫీసు బీరువాల్లో మూలుగుతున్న నోట్ల కట్టల్ని లెక్కించేందుకు దాదాపు నాలుగు రోజులు పట్టింది అధికారులకు!. నాలుగు రోజుల తనిఖీల అనంతరం.. పీయూష్జైన్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో అతన్ని హాజరుపర్చగా.. 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. పీయూష్ జైన్ ఇల్లు, కార్యాలయాల్లో కేంద్ర ఏజెన్సీలు ఇటీవల సోదాల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. కన్నౌజ్‌లోని అతని ఇల్లు, ఫ్యాక్టరీల నుంచి సుమారు 194 కోట్ల విలువైన కరెన్సీ, 23 కిలోల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక అతనిపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు అహ్మదాబాద్ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ యాక్ట్ సెక్షన్ 69 కింద పన్నుల ఎగవేత ఆరోపణలపై పీయూష్ జైన్‌ను అరెస్ట్ చేశారు. డిసెంబరు 22 నుంచి నాలుగు రోజులపాటు పీయూష్ జైన్ సంబందిత ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరగడం విశేషం. డొక్కు స్కూటర్.. పీయూష్ జైన్ కన్నౌజ్‌లో తిరిగినప్పుడు ఓ డొక్కు స్కూటర్ ఉపయోగించేవాడట. ఇంటి బయట ఓ క్వాలిస్, మారుతీ కార్లు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో పని మనిషి లేదు. ఏడాదికో వాచ్‌మన్‌ను మార్చేవాడబు. నకిలీ ఇన్వాయిస్లు, ఇ-వే బిల్లులు లేకుండా వస్తువులను రవాణా చేసే వ్యక్తి ద్వారా సరుకులను పంపడానికి సంబంధించిన డబ్బు అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పీయూష్, కెమిస్ట్ అయిన తండ్రి నుంచి పర్ఫ్యూమ్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. గత పదిహేనేళ్లలో వ్యాపారాన్ని విస్తరించాడు. ముంబై, గుజరాత్లో ఇప్పుడతని వ్యాపారం అద్భుతంగా నడుస్తోంది. ఈ దెబ్బతో జైన్, అతని సోదరుడు అంబరీష్ తమ ఇంటిని 700 స్క్వేర్ యార్డ్‌లో ఒక మాన్షన్లా మార్చేశారు. అయితే ఊళ్లో చూసేవాళ్లంతా అతను డొక్కు స్కూటర్ మీద వస్తుండడంతో సింప్లిసిటీగా భావించేవాళ్లట. తాజా పరిణామంతో వాళ్లంతా షాక్‌లో ఉన్నారు. ఇక జైన్ ఇంట్లో, ఫ్యాక్టరీలో డబ్బు, నగలతో పాటు శాండల్‌వుడ్ ఆయిల్, కోట్లు విలువ చేసే పర్ఫ్యూమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
Arya Dhayal: డిజిటల్ మ్యూజిక్ సెన్సేషన్
ఎన్ని రోజులు చీకట్లో కూర్చుంటావు? ఎన్ని రోజులు నీ ఒంటరి ప్రపంచంలో ఉంటావు? కదలాలి... కదనరంగంలోకి దూకాలి కాలంతో పోటీ పడాలి. ‘కాలం మారి... కోలం మారి’ అంటోంది ఆర్యా దయాళ్. దేశీయ సంగీతానికి వెస్ట్రన్ ఫ్లేవర్ జోడించి యుకెలేలితో అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్యా. తన పాటకు పునాది సామాజిక స్పృహ అని చెబుతుంది... తాను పాడిన పాటను బిగ్‌బి అమితాబ్‌కు పంపించాలనుకుంది ఆర్యా దయాళ్. అంతే..అప్పటికప్పుడు తన గదిలో కూర్చొని ఎడ్ షీరన్ పాపులర్ సాంగ్ ‘షెడ్ ఆఫ్ యూ’ పాడి సెల్ఫోన్లో రికార్డ్ చేసి పంపించింది. కోవిడ్ చికిత్సలో భాగంగా ఆ సమయంలో ‘బిగ్ బి’ హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి అటు నుంచి స్పందన వస్తుందని అనుకోలేదు ఆర్యా. కాని ఊహించని విధంగా పెద్దాయన నుంచి పెద్ద స్పందన వచ్చింది. ‘మీరేవరో నాకు తెలియదు. కాని నాకు బాగా తెలుసు... మీలో గొప్ప ప్రతిభ ఉందని. కర్నాటక, వెస్ట్రన్ మ్యూజిక్‌ను మిక్స్ చేయడం సులువు కాదు. కాని ఆ పని మీరు చాలా సులువుగా చేశారు. మిక్సింగ్‌లో వాటి సహజత్వం మిస్ కాకుండా చూశారు. ఈరోజు మీ పాట వినడం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది’ అని ట్విట్టర్లో ఆశీర్వదించారు బిగ్ బి. హరిహరన్లాంటి ప్రసిద్ధ గాయకుల నుంచి కూడా ఆర్యాకు ప్రశంసలు లభించాయి. ‘పెద్దల ప్రశంసలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి’ అని సంబరపడిపోతుంది ఆర్యా. కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన ఆర్యా దయాళ్ 2016లో రాసిన ఒక కవిత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరువాత సాహిత్యంలోనే కాదు సంగీతంలోనూ తన టాలెంట్ చాటుకుంది ఆర్యా. ‘కాలం మారి–కోలమ్ మారి–ఎన్జన్గళుమ్ అంగ్ మారి’ (కాలం మారింది. చూసే దృష్టికోణం మారింది. కాబట్టి మనం కూడా మారాలి) పాటతో డిజిటల్ మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్యాకు 140,000 ఫాలోవర్స్ ఉన్నారు. తన పాటలను ఎప్పటికప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది. ఆమె లెటెస్ట్ రిలీజ్ ‘అంగనే వేనమ్’ ట్రెండింగ్ అయింది. మాస్, మసాల పాటలు కాకుండా స్త్రీలను చైతన్యపరిచే పాటలు, లింగవివక్షతను ఖండించే పాటలు పాడడం అంటే ఆర్యాకు ఎంతో ఇష్టం. ఇక తనకు ఇష్టమైన సంగీతవాయిద్యం యుకెలేలి. పచ్చటి ప్రకృతి ఒడిలో, నిశ్శబ్దం దట్టంగా ఆవరించిన ఏకాంతదేశంలో యుకెలేలి స్వరాలు ఆర్యాను కొత్త లోకాల్లోకి తీసుకువెళతాయి. ‘రా వాయిస్’ ఆమె ప్రత్యేకత. కొందరైతే ‘యుకెలేలిలాగే ఆమె స్వరం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్’ అని ప్రశంసిస్తుంటారు! -
బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు
సాక్షి, తిరువనంతపురం: పదేళ్ల క్రితం జరిగిన బీజేపీ నేత దారుణ హత్య కేసులో కేరళ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చుతూ.. జీవితఖైదు శిక్షను విధించింది. వివరాలు.. కేరళలోని కాన్నూర్ జిల్లాలో తలసిరై వద్ద 2008లో బీజేపీ నేత కేవీ సురేంద్రన్ స్థానిక సీపీఎం కార్యకర్తల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య కళ్లముందే ఆయనను వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఐదుగురికి సంబంధించిన సాక్ష్యాలను మాత్రమే కోర్టు స్వీకరించడంతో.. ఇద్దరికి కేసు నుంచి విముక్తి లభించింది. పదేళ్లకు పైగా సాగిన కేసు విచారణలో న్యాయమూర్తి శుక్రవారం తుది తీర్పును వెలువరించారు. బీజేపీ నేతను హత్య చేసిందుకు ఐదుగురికి జీవిత ఖైదుతో పాటు.. ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించారు. ఈ డబ్బంతా సురేంద్రన్ భార్య ఖాతాలో జమచేయాలని కోర్టు ఆదేశించింది. కాగా ఘటన జరిగే ముందు కాన్నూర్ ప్రాంతంలో బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చేటుచేసుకున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే ఆయనను హత్య చేసినట్లు స్థానికులు చెపుతున్నారు. తాజా తీర్పు పట్ల ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
చెప్పుల్లో దాచాడు.. చిక్కుల్లో పడ్డాడు
తిరువనంతపురం : సుమారు ఏడు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కన్నూరు అంతర్జాతీయ విమాన్రాశయ అధికారులు అరెస్ట్ చేశారు. వివరాలు.. కన్నూరు జిల్లా థాయథేరు ప్రాంతానికి చెందిన అజయ్ వలియబల్లథ్ అనే వ్యక్తి దోహా ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన చెప్పుల్లో గంజాయి దాచి రహస్యంగా తరలించే ప్రయత్నం చేశాడు. కానీ అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేయడంతో రూ. 7 లక్షల విలువ చేసే గంజాయి బయటపడింది. అజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యల కోసం అతన్ని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగానికి అప్పగించారు. -
ఆసక్తి, పట్టుదలే అతని విజయ రహస్యం...
తిరువనంతపురం, కేరళ : అందరికి తల్లిదండ్రులు పేరు పెడితే అతనికి మాత్రం కంప్యూటరే పేరు పెట్టింది. కేవలం నామకరణతోనే ఆగక ఆ యువకుడి జీవిత చిత్రాన్నే మార్చేసింది. సొంత ఇల్లు, ఖరీదైన బీఎండబ్ల్యూ కారుతో పాటు సంవత్సరానికి 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కంపెనికి యజమాని అయ్యేలా చేసింది. కంప్యూటర్ పట్ల ఆ యువకుడికి ఉన్న ఆసక్తి వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. ఆసక్తి ఉన్న రంగాన్ని ఎన్నుకుంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మరోసారి రుజువు చేసాడు కేరళ కన్నూర్‌కు చెందిన 21 ఏళ్ల జవాద్. కంప్యూటర్ను మంచికి వినియోగిస్తే కలిగే ప్రయోజనాలకు సజీవ ఉదాహరణగా నిలిచాడు జవాద్. ఎవరీ జాదవ్...ఏమిటితని కథ...? కేరళ ఉన్నార్‌కు చెందిన జవాద్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. జవాద్ తండ్రి దుబాయిలో బ్యాంక్ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో ఓ సారి ఇండియా వచ్చినప్పుడు జవాద్‌కు కంప్యూటర్ను బహుమతిగా ఇవ్వడమే కాక దానికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను కూడా పెట్టించాడు. అదే జవాద్ జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. అనాటి నుంచి కంప్యూటర్‌తో ప్రేమలో పడిపోయాడు జవాద్. ఇక ఆరోజు నుంచి కంప్యూటర్‌కు బానిసయ్యాడు(మంచి వ్యసమే..). ఒక సారి తన పేరుతో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసే క్రమంలో కంప్యూటర్ జవాద్ పేరును ‘టీఎన్ఎమ్ జవాద్’గా సజెస్ట్ చేసింది. ఆ పేరే నేడు ఎన్నో ప్రభంజనాలు సృష్టిస్తోంది. జవాద్ పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే కంప్యూటర్‌తో ప్రయోగాలు ప్రారంభించాడు. అంత చిన్న వయసులోనే వెబ్సైట్లు రూపొందించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి చిన్న కంపెనీని ప్రారంభించాడు. అలా పదో తరగతిలోనే 2,500 రూపాయల తొలి సంపాదనను అందుకున్నాడు జవాద్. ఒక్కసారిగా జవాద్ దగ్గర అంత సొమ్ము చూసిన అతని తల్లిదండ్రులకు భయమేసింది. తమ కుమారుడు ఏదైనా చెడ్డ పనులు చేస్తున్నాడేమోనని భయపడ్డారు. కానీ జవాద్ వారికి తాను ప్రారంభించిన వ్యాపారం గురించి వివరించాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మద్దతుతో వెబ్ డిజైనింగ్‌ను మరింత బాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూట్లో చేరాడు. కోర్సు అయిపోయిన తర్వాత తనకు వెబ్‌డిజైనింగ్ పాఠాలు చెప్పిన టీచర్లను తాను ప్రారంభించబోయే కంపెనీలో ఉద్యోగులుగా చేరమని కోరాడు. అందుకు వారు అంగీకరించడంతో వారిద్దరిని ఉద్యోగులుగా నియమించుకుని ‘టీఎన్ఎమ్ ఆన్లైన్ సొల్యూషన్న్’అనే వెబ్‌డిజైనింగ్ సంస్థను స్థాపించాడు. ప్రారంభంలో కేవలం వెయ్యి రూపాయల తక్కువ ధరకే వెబ్సైట్లను రూపొందించేవారు. అయినా కూడా నెలకు కేవలం 2,3 ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. ఒకానొక సమయంలో ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి జవాద్ తన అమ్మగారి బంగారు గాజులను కూడా కుదవపెట్టాడు. క్లైంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ..రెండేళ్ల నాటికి 100 వరకూ చిన్నా చితకా కంపెనీలు జవాద్ క్లయింట లిస్ట్‌లో చేరాయి. సరిగా ఇదే సమయంలో నూతన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు ఏర్పాటు చేసిన యస్ కేరళ సమ్మిట్‌లో జవాద్ పాల్గొన్నాడు. ఈ సమ్మిట్‌లో పాల్గొనడం జవాద్‌కు కలిసి వచ్చింది. ఈ కార్యక్రమం వల్ల జవాద్ కంపెనీ గురించి చాలామందికి తెలియడమే కాక మరిన్ని ఆఫర్లు రావడం ప్రారంభమయ్యింది. కంపెనీ బాగా నడవడంతో లాభాలు కూడా ఆశించిన రీతిలోనే వచ్చాయి. దాంతో జవాద్ తన సొంత ఇంటి కలను నిజం చేసుకోవడమే కాక చాలా ఖరీదైన బీఎమ్‌డబ్ల్యూ కార్‌ను కూడా కొన్నాడు. మరో కీలక మలుపు... వీటన్నిటి తర్వాత వెబ్ ప్రపంచానికి కీలకమైన ‘సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్’(ఎస్ఈవో) రంగంలోకి తన సేవలను విస్తరించాడు జవాద్. అక్కడ కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యువ కెరటం. ఇతని ప్రతిభకు గుర్తుగా యూఏఈ, బిస్టౌడ్ సంయుక్తంగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘డా. రామ్ బుక్సానీ’ అవార్డును జవాద్‌కు ప్రదానం చేసారు. ప్రస్తుతం జవాద్ వెబ్ డిజైనింగ్, ఆప్ డెవలప్మెంట్, ఈ కామర్స్ రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచవ్యాప్తంగా క్లైంట్లను ఏర్పర్చుకున్నాడు. ఇవేకాక జవాద్ ప్రస్తుతం ‘టీఎన్ఎమ్ అకాడమీ’ని స్థాపించి ఆసక్తి ఉన్న వారికి వయసుతో సంబంధం లేకుండా వెబ్‌డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నాడు. ఆసక్తి ఉన్న రంగంలో పట్టుదలగా ప్రయత్నిస్తే ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది జావేద్ జీవితం. -
సీపీఎం నాయకుని హత్య
తిరువనంతపురం: వామపక్షాలకు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలకు కేంద్రంగా ఉన్న కేరళలోని కాన్నూర్‌లో మరో హత్య జరిగింది. కాన్నూర్ జిల్లాల్లో మహే వద్ద స్థానిక సీపీఎం నాయకుడిని సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. హత్యకు గురైన వ్యక్తిని బాబుగా గుర్తించిన పోలీసులు, రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంతో హత్య జరింగిందని తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులే బాబుని హత్యచేశారని స్థానిక సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. సీపీఎం నాయకుని హత్యకు నిరసనగా రేపు కాన్నూర్ జిల్లా బంద్‌కు సీపీఎం పిలుపునిచ్చింది. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సొంత నియోజకవర్గమైన కాన్నూర్‌లో గత కొంతకాలంగా వామపక్షాలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య దాడులు, హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
పాస్టర్ ను కాపాడేందుకే..
కన్నూర్: చర్చి పాస్టర్ రాబిన్ ను కాపాడేందుకే నేరాన్ని తనపై వేసుకున్నానని రేప్ బాధితురాలి తండ్రి వెల్లడించాడు. రాబిన్ జైలుకు వెళ్లకుండా చూసేందుకే సొంత కూతురిపై తానే అఘాయిత్యానికి పాల్పడినట్టు అంగీకరించానని చెప్పాడు. కేరళలోని కన్నూరులో 17 ఏళ్ల విద్యార్థినిపై చర్చి పాస్టర్ అత్యాచారం చేయడంతో ఫిబ్రవరిలో బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అజ్ఞాత వ్యక్తి అందించిన సమాచారం ఆధారంగా రాబిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట్లో తన సొంత తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. రాబిన్ తాను చేసిన నేరాన్ని బాధితురాలి తండ్రిపై మోపాడని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ వెల్లడించింది. చర్చి పట్ల అమిత విశ్వాసం ఉన్నందునే రాబిన్ ఆదేశాలను తన భర్త పాటించాడని బాధితురాలి తల్లి తెలిపింది. అయితే తమ కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాస్తవాలు బయటపెట్టామని చెప్పింది. నిందితుడు ఫాదర్ రాబిన్‌పై కేలకం పోలీసు స్టేషన్లో పోస్కో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. -
కన్నూర్ రక్తచరిత్ర
-
జయ ఒక్క అడుగుతో ఆ ఆలయం ఫుల్లు ఫేమస్
కన్నూర్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జ్యోతిష్యంపై నమ్మకం కాస్తంత ఎక్కువే. ఆమె దైవాన్ని కూడా నమ్ముతారు. ఓ సందర్భంలో ప్రముఖ జ్యోతిష్యుడు పరప్పనాంగడి ఉన్నికృష్ణ పనిక్కర్ ఆమెను రాజరాజేశ్వర ఆలయ దర్శనానికి వెళితే మంచి జరుగుతుందని చెప్పారు. దీంతో 2001లో ముఖ్యమంత్రి జయలలిత ఆమె సన్నిహితురాలు శశికళ కన్నూర్ లోని తాలిపరాంబలోగల రాజరాజేశ్వర ఆలయానికి వెళ్లారు. వాస్తవానికి ఆలయ అధికారులు అత్తజ పూజకు ముందు మహిళలను ఆలయంలోకి అనుమతించరు. ఆమె సాయంత్రం పూట ఆలస్యంగా చేరుకున్నారు. అయితే, ఆలయ నిబంధనలు పక్కకు పెట్టి ఆరోజు ఆమె కోసం ఆలయాన్ని ప్రత్యేకంగా రాత్రి 9.30గంటలవరకు తెరిచి ఉంచారు. అంతేకాదు, ఆ ఆలయం లోపలికి వెళ్లే దారిలో ఉన్న చెక్క మెట్టు ప్రవేశానికి ఇబ్బందిగా ఉందని కొంతభాగం తొలగించారు. ఇది అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. ఆలయ దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్లే దారిలో డిన్నర్ కోసం ఆమె కాన్వాయ్ పప్పినిస్సెరీ వద్ద జాతీయ రహదారిపై ఓ గంటపాటు ఆగింది. దీంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆమె దర్శనం తర్వాత ఆ ఆలయం చాలా ఖ్యాతిని పొందింది. పెద్ద మొత్తంలో భక్తులు రావడమే కాకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం దర్శనానికి క్యూలు కట్టారు. తమిళనాడు మాత్రమే కాకుండా కర్ణాటక నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
త్రివేండ్రంలో స్తంబించిన ప్రజాజీవనం
-
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడి..
కన్నూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలపై సీపీఐ(ఎం) కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ లో గురువారం చోటు చేసుకుంది. దీంతో కన్నూర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొదట ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న సజేష్(30), సంతోష్(28) పై దాడి జరిగింది. అనంతరం అరుణ్(23), దీపేష్(26) పై ఇనుప ఆయుధాలతో దాడులు చేశారని పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నెలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు బీజేపీ, సీపీఎం చెందిన కార్యకర్తలు మరణించారు. -
కుటుంబ సభ్యుల కళ్లెదుటే కిరాతకంగా...
కన్నూర్: కేరళలో హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజాగా కన్నూర్ జిల్లాలో జరిగిన ఘటనల్లో సీపీఎం, బీజేపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. పయానుర్ ప్రాంతంలో సీపీఎం కార్యకర్త ధనరాజ్(32)ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు. మంగళవారం రాత్రి ధనరాజ్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే అతడిని కిరాతకంగా హత్య చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్న ఆటోడ్రైవర్ సీకే రామచంద్రన్ కూడా ఇదేవిధంగా హత్యకు గురైయ్యాడు. హత్యారాజకీయాలపై సీపీఎం, బీజేపీ పరస్పరం నిందించుకున్నాయి. నేడు పయానూర్ బంద్ కు రెండు పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హత్యారాజకీయాలకు గత రెండు దశాబ్దాల్లో కన్నూర్ జిల్లాలో కనీసం 200 మంది సీపీఎం, బీజేపీ కార్యకర్తలు బలైయ్యారు. -
కమ్యూనిస్టు నేత ఎంవీ రాఘవన్ కన్నుమూత
కన్నూర్(కేరళ): ప్రముఖ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ మంత్రి ఎం.వీ. రాఘవన్(81)ఆదివారం కన్నూర్ జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందారు. రాఘవన్ మృత దేహానికి సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిప్రాయ భేదాల కారణంగా సీపీఎం ఆయనను 1985లో బహిష్కరించింది. 1986లో ఆయన కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీని స్థాపించారు. అప్పట్నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్‌లో భాగస్వామిగా కొనసాగుతోంది. చేనేత కార్మికుడైన రాఘవన్ తొలుత ట్రేడ్‌యూనియన్ నాయకుడుగా, ఆ తరువాత శక్తిమంతమైన నేతగా ఎదిగారు. రాఘవన్ ఏడు సార్లు శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా ఉన్నారు. **