పాస్టర్ ను కాపాడేందుకే.. | Kerala priest rape scandal: Victim's father says he lied about raping his own child to protect priest, Church | Sakshi

పాస్టర్ ను కాపాడేందుకే..

Mar 13 2017 9:49 AM | Updated on Apr 6 2019 8:55 PM

పాస్టర్ ను కాపాడేందుకే.. - Sakshi

పాస్టర్ ను కాపాడేందుకే..

చర్చి పాస్టర్ రాబిన్ ను కాపాడేందుకే నేరాన్ని తనపై వేసుకున్నానని రేప్ బాధితురాలి తండ్రి వెల్లడించాడు.

కన్నూర్: చర్చి పాస్టర్ రాబిన్ ను కాపాడేందుకే నేరాన్ని తనపై వేసుకున్నానని రేప్ బాధితురాలి తండ్రి వెల్లడించాడు. రాబిన్ జైలుకు వెళ్లకుండా చూసేందుకే సొంత కూతురిపై తానే అఘాయిత్యానికి పాల్పడినట్టు అంగీకరించానని చెప్పాడు. కేరళలోని కన్నూరులో 17 ఏళ్ల విద్యార్థినిపై చర్చి పాస్టర్ అత్యాచారం చేయడంతో ఫిబ్రవరిలో బాధితురాలు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అజ్ఞాత వ్యక్తి అందించిన సమాచారం ఆధారంగా రాబిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట్లో తన సొంత తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.

రాబిన్ తాను చేసిన నేరాన్ని బాధితురాలి తండ్రిపై మోపాడని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్‌’ వెల్లడించింది. చర్చి పట్ల అమిత విశ్వాసం ఉన్నందునే రాబిన్ ఆదేశాలను తన భర్త పాటించాడని బాధితురాలి తల్లి తెలిపింది. అయితే తమ కూతురి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాస్తవాలు బయటపెట్టామని చెప్పింది. నిందితుడు ఫాదర్ రాబిన్‌పై కేలకం పోలీసు స్టేషన్‌లో పోస్కో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement