రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలపై సీపీఐ(ఎం) కార్యకర్తలు దాడి చేశారు.
కన్నూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలపై సీపీఐ(ఎం) కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ లో గురువారం చోటు చేసుకుంది. దీంతో కన్నూర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొదట ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న సజేష్(30), సంతోష్(28) పై దాడి జరిగింది. అనంతరం అరుణ్(23), దీపేష్(26) పై ఇనుప ఆయుధాలతో దాడులు చేశారని పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నెలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు బీజేపీ, సీపీఎం చెందిన కార్యకర్తలు మరణించారు.