
తిరువనంతపురం: వామపక్షాలకు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల హత్యలకు కేంద్రంగా ఉన్న కేరళలోని కాన్నూర్‌లో మరో హత్య జరిగింది. కాన్నూర్ జిల్లాల్లో మహే వద్ద స్థానిక సీపీఎం నాయకుడిని సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేశారు. హత్యకు గురైన వ్యక్తిని బాబుగా గుర్తించిన పోలీసులు, రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంతో హత్య జరింగిందని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులే బాబుని హత్యచేశారని స్థానిక సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు.
సీపీఎం నాయకుని హత్యకు నిరసనగా రేపు కాన్నూర్ జిల్లా బంద్‌కు సీపీఎం పిలుపునిచ్చింది. కాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సొంత నియోజకవర్గమైన కాన్నూర్‌లో గత కొంతకాలంగా వామపక్షాలు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల మధ్య దాడులు, హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment