ఓటీటీకి వచ్చేస్తోన్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ! | Malayalam Actor Mammootty Movie Kannur Squad Ott Release Date Lock | Sakshi
Sakshi News home page

Mammootty: బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్.. ఓటీటీ రిలీజ్‌కు రెడీ!

Published Mon, Nov 6 2023 9:10 PM | Last Updated on Tue, Nov 7 2023 10:57 AM

Malayalam Actor Mammootty Movie Kannur Squad Ott Release Date Lock - Sakshi

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే అఖిల్ ఏజెంట్‌ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ ఏడాది మలయాళంలో ఆయన నటించిన తాజా చిత్రం 'కన్నూర్ స్క్వాడ్'. సెప్టెంబ‌ర్ 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ‍తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్‌ వచ్చేసింది.

బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచిన కన్నూర్ స్క్వాడ్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ 10 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. అయితే దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంగా వచ్చిన ఈ చిత్రానికి  రాబీ వ‌ర్గీస్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాను త‌న స్వీయ నిర్మాణ సంస్థ మ‌మ్ముట్టి కంపెనీ ప‌తాకంపై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. 

(ఇది చదవండి: ఆ ఓటీటీకి వరుణ్- లావణ్య పెళ్లి వేడుక!!)


కథ ఏంటంటే..

కేర‌ళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో క‌న్నూర్ స్క్వాడ్‌ టీమ్ నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంత‌టి క్లిష్ట‌త‌ర‌మైన కేసునైనా త‌మ ధైర్య‌సాహ‌సాల‌తో సాల్వ్ చేస్తుంటారు. అలాంటి టీమ్‌కు సవాల్‌గా పొలిటిషియ‌న్ దారుణ హ‌త్య‌కు సంబంధించిన కేసు వస్తుంది. ఈ కేసును ప‌ది రోజుల్లో సాల్వ్ చేయాల‌ని పోలీసుల‌ను హోమ్ మినిస్ట‌ర్ ఆదేశిస్తాడు.

ఎలాంటి ఆధారాలు లేని ఈ క్రైమ్‌ను క‌న్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది? ఈ మ‌ర్డ‌ర్ చేసింది ఎవ‌రు? ఆ క్రిమిన‌ల్స్‌ను ప‌ట్టుకోవ‌డానికి కేర‌ళ నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ‌ర‌కు క‌న్నూర్ స్క్వాడ్‌ టీమ్ ఎలా ప్ర‌యాణం చేసింది? నిజాయితీకి మారుపేరైన క‌న్నూర్ స్క్వాడ్‌ టీమ్‌పై లంచ‌గొండిగా ఎందుకు ముద్ర‌ప‌డింది? యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన క‌న్నూర్ స్వ్కాడ్ టీమ్ త‌మ ప్రాణాల‌ను ద‌క్కించుకోవ‌డానికి ఎలాంటి పోరాటం చేశారు అన్న‌దే ఈ సినిమా.. క‌న్నూర్ స్క్వాడ్‌ సినిమా చాలా వ‌ర‌కు కార్తీ 'ఖాకీ' సినిమాను గుర్తుకు తెస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement