మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం మలైకోట్టై వాలిబన్. జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ తక్కువ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లిజో దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోను స్ట్రీమింగ్ చేయనున్నారు.
దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్‌లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటించింది. మోహన్ లాల్ కెరీర్‌లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే రిలీజైంది.
కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
An epic tale of a warrior overcoming every challenge thrown his way - Malaikottai Vaaliban streaming from 23rd Feb in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada.
https://t.co/zHnUR7TwM4
— Disney+ Hotstar (@DisneyPlusHS) February 19, 2024
Comments
Please login to add a commentAdd a comment