ఓటీటీలో సినిమాల జాతర.. ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్! | This Weekend Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

This Weekend Ott Releases: వీకెండ్‌లో సినిమాల సందడి.. ఒక్క రోజే 8 చిత్రాలు స్ట్రీమింగ్!

Published Thu, May 2 2024 2:05 PM | Last Updated on Tue, May 7 2024 10:37 AM

This Weekend Ott Release Movies List Goes Viral

మరో వీకెండ్ రానే వచ్చింది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలో సందడి  చేసేందుకు చిన్న సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ వారంలో థియేటర్లలో సందడి చేసేందుకు అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు, సుహాస్ చిత్రం ప్రసన్నవదనం, జితేందర్ రెడ్డి. తమన్నా,రాశి ఖన్నా నటించిన బాక్‌(అరణ్మనై-4) లాంటి చిత్రాలు వచ్చేస్తున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే హిట్‌ చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారాంతంలో అజయ్‌ దేవగణ్ సైతాన్, మలయాళ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్‌ కాస్తా ఆసక్తి పెంచేస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. మరీ మీరు ఈ వీకెండ్‌లో ఏ యే సినిమా చూడాలనుకుంటున్నారో ఓ లుక్కేయండి. ఏ సినిమా ఎ‍క్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.


నెట్‌ఫ్లిక్స్

  •    సైతాన్ (హిందీ సినిమా) - మే 03

  •    ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04

 

అమెజాన్ ప్రైమ్

  •    క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03

  •    ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  •    మంజుమ్మెల్ బాయ్స్ (మలయాళ డబ్బింగ్ సినిమా) - మే 05

  •    మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్- 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05

జియో సినిమా

  •    హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03

  •    ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03

  •    వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03

జీ5

  • ది బ్రోకెన్ న్యూస్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- మే 03

లయన్స్‌ గేట్ ప్లే

  • బ్లాక్ మాఫియా ఫ్యామిలీ సీజన్-3- మే 03
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement